కార్పొరేట్ రంగంలో.. కొలువుల జోరు
Sakshi Education
కార్పొరేట్ రంగం... నేటి యువత కలల కెరీర్‌కు సరైన వేదికగా నిలుస్తోంది. గత ఆర్నెల్ల కాలంలో అన్ని పరిశ్రమల్లోనూ నియామకాల సరళి ఆశాజనకంగా ఉంది. మున్ముందు ఇదే ధోరణి కొనసాగేందుకు అనువైన వాతావరణం కనిపిస్తోంది. వ్యాపార వృద్ధి, విస్తృతి దిశగా కదులుతున్న అన్ని రంగాలూ భారీ నియామకాలు చేపట్టనున్నట్లు కంపెనీల ప్రతినిధులు, ప్లేస్‌మెంట్ ఆఫీసర్లు చెబుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఎండమావిగా మారిన నేటి పరిస్థితుల్లో విద్యార్థులకు అవకాశాలు అందించే ప్రైవేటు రంగంలో నియామకాలపై విశ్లేషణ...
ఏఏ రంగాల్లో...
వచ్చే ఆర్నెల్లలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హెల్త్‌కేర్ అండ్ ఫార్మా, రిటైల్ రంగాలు నియామకాల పరంగా ముందంజలో ఉండనున్నాయి. టెలికం, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ డ్యూరబుల్స్ (ఎఫ్‌ఎంసీజీ), ఫైనాన్షియల్, ఇన్సూరెన్స్, ఈ-కామర్స్ రంగాలు కూడా భారీ సంఖ్యలో ఉద్యోగులను నియమించుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
వివిధ సంస్థలు, రిక్రూటింగ్ కన్సల్టెన్సీల అభిప్రాయం ప్రకారం 2015-16 ద్వితీయార్ధంలో అన్ని రంగాల్లో కలిపి ఐదు లక్షల ఉద్యోగాల భర్తీ జరగనుంది. వీటిలో అధిక శాతం ఐటీ, ఐటీఈఎస్, ఎఫ్‌ఎంసీజీ సంస్థలే ఎక్కువ.
ఐటీదే హవా
2015లో నియామకాల పరంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగం హవా కొనసాగనుంది. వాస్తవానికి గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే రిక్రూట్‌మెంట్స్‌లో 13 శాతం తగ్గుదల ఉన్నప్పటికీ, మొత్తంమీద 2.3 లక్షల మందికి ఉద్యోగాలు లభించనున్నట్లు నాస్‌కామ్ అంచనా. ఇన్ఫోసిస్ సంస్థ 30 వేల ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదట్లోనే ప్రకటించింది. ఐటీ దిగ్గజాలుగా పేరొందిన టీసీఎస్, విప్రో తదితర సంస్థలు కూడా దాదాపు ఇదే స్థాయిలో రిక్రూట్‌మెంట్ జరపనున్నాయి.
ఉత్పత్తి రంగంలో ఊపు
ఉత్పత్తి రంగంలో 2015-16 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 2.2 లక్షల ఉద్యోగాల భర్తీ జరగనున్నట్లు అంచనా. వీటిలో ఇప్పటివరకు 30 శాతం నియామకాలు జరిగాయని, మిగిలిన వాటి భర్తీ చివరి ఆర్నెల్లలో ఉంటుందని రిక్రూటింగ్ ఏజెన్సీలు పేర్కొంటున్నాయి. ఐటీ, ఐటీఈఎస్, బీఎఫ్‌ఎస్‌ఐ, టెలికం వంటి రంగాలే కాకుండా సూక్ష్మ, మధ్య, చిన్న తరహా సంస్థలు (ఎంఎస్‌ఎంఈ) రంగంలోనూ ఈ ఏడాది లక్షల సంఖ్యలో నియామకాలు జరగనున్నాయి. ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో దాదాపు పది లక్షల ఉద్యోగాలు లభించనున్నాయి. విభాగాలు, విధుల వారీగా వచ్చే ఆర్నెల్ల కాలంలో ప్రొడక్ట్/ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, న్యూ సోషల్ మీడియా మేనేజ్‌మెంట్, బిగ్ డేటా అనలిటిక్స్ ప్రొఫైల్స్‌లో మంచి అవకాశాలు లభించనున్నాయి. ప్రొడక్ట్ డిజైనింగ్ విభాగంలో నిష్ణాతులకు కంపెనీలు మరింత ప్రాధాన్యం ఇవ్వనున్నాయి. ఉద్యోగాల పరంగా గత ఆరు నెలల కాలంలో ఫ్రెషర్స్‌కు పెద్దపీట వేసినట్లు ఆయా సర్వేల గణాంకాలు తెలియజేస్తున్నాయి. మొత్తం నియామకాల్లో 0-3 ఏళ్ల పని అనుభవం ఉన్నవారి శాతం మే చివరి నాటికి 32 శాతంగా నిలిచింది. 4-7 ఏళ్ల పని అనుభవం ఉన్నవారి శాతం 38గా ఉంది.
జీతభత్యాలు
వివిధ రంగాల్లో వేతనాలు 12 శాతం నుంచి 25 శాతం మేర పెరిగాయి. ఫ్రెషర్స్‌కు వారు చదివిన సంస్థలనుబట్టి కనీస వేతనం రూ.4 లక్షలు, గరిష్ట వేతనం రూ.15 లక్షలు లభించాయి. ట్రిపుల్ ఐటీ హైదరాబాద్‌లో కోడ్ నేషన్ రూ.22 లక్షలు, అమెజాన్ రూ.29 లక్షలు, గూగుల్ రూ.24 లక్షల వార్షిక వేతనాలను ఆఫర్ చేశాయి.
నిపుణుల అభిప్రాయం ప్రకారం టైర్-1 పట్టణాల్లో సగటున రూ.4 లక్షలు, టైర్-2 పట్టణాల్లో సగటున రూ.3 లక్షల కనీస వేతనం లభిస్తుంది. గరిష్ట వేతనాలు రూ.6లక్షల నుంచి రూ.8 లక్షల వరకు ఉండనున్నాయి.
ఇప్పుడు టైర్-2 పట్టణాల్లో సైతం కంపెనీలు నియామక ప్రక్రియలు చేపడుతున్నాయి. ఏపీలో విశాఖపట్నం, హిందూపూర్ వంటి పట్టణాలకు సైతం కార్పొరేట్ సంస్థలు నియామకాల కోసం వెళ్తున్నాయి. ఆయా ప్రాంతాల్లో పారిశ్రామిక విస్తరణ జరుగుతుండటమే దీనికి కారణమని నిపుణులు అంటున్నారు.
క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్
కార్పొరేట్ కొలువులు అంటే టక్కున గుర్తొచ్చేది క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్! ఇవి కూడా ఈ ఏడాది విద్యార్థులకు చక్కటి అవకాశాలు కల్పించనున్నాయి. జూలై రెండు లేదా మూడో వారం నుంచి ప్రారంభం కానున్న క్యాంపస్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో పాల్గొనేందుకు ఇప్పటికే కంపెనీలు ఆయా ఇన్‌స్టిట్యూట్‌లకు ప్రతిపాదనలు పంపించాయి.
‘క్యాంపస్’ కొలువులు చేజిక్కించుకునేందుకు ఐటీ రంగం ఔత్సాహికులు డేటా అనలిటిక్స్, డేటా విజువలైజేషన్, కోడింగ్, డీకోడింగ్ నైపుణ్యాలు పెంచుకోవాలి.
టెలికం రంగం ఔత్సాహికులు ఆండ్రాయిడ్ టెక్నాలజీస్, ఐఓఎస్, మొబైల్ ఫ్రేమ్‌వర్క్స్ విభాగాల్లో నైపుణ్యాలు సొంతం చేసుకోవాలి. ఉత్పత్తి రంగం లక్ష్యమైతే 3-డి డిజైనింగ్, ఎంబెడెడ్ సిస్టమ్స్‌లో నైపుణ్యాలు అవసరం.
కోర్ నాలెడ్జ్‌తోపాటు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడం తప్పనిసరి.
2015-16 ప్రధాన రిక్రూటర్స్
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
ఈ-కామర్స్
బీఎఫ్‌ఎస్‌ఐ
ఫార్మా అండ్ హెల్త్‌కేర్
రిటైల్ సెక్టార్
ఎఫ్‌ఎంసీజీ అండ్ ఎఫ్‌ఎంసీడీ
టాప్ డెస్టినేషన్స్
హైదరాబాద్
బెంగళూరు
చెన్నై
పుణె
ముంబై

జూనియర్ లెవల్‌లో ఎక్కువ వచ్చే అయిదు నెలల్లో అన్ని రంగాల్లో జూనియర్ (ఎంట్రీ) లెవల్‌లో ఎక్కువ అవకాశాలు ఉండనున్నాయి. గతేడాదితో పోల్చితే ఇది నాలుగు శాతం మేర పెరగనుంది. - కునాల్ సేన్,సీనియర్ వైస్ ప్రెసిడెంట్, టీమ్ లీజ్ సర్వీసెస్. |
ఈ-కామర్స్ పైచేయి ఈ-కామర్స్ రంగం... ముఖ్యంగా డేటా మేనేజ్‌మెంట్, డేటా అనలిటిక్స్ ప్రొఫైల్స్‌లో ఉద్యోగాలు భారీగా లభించనున్నాయి. అందుకే పీహెచ్‌పీ, హెచ్‌టీఎంఎల్, వెబ్‌ఫ్రేమ్‌వర్క్స్ తదితర నైపుణ్యాలు ఉండటం లాభదాయకం. - టి.వి.దేవీప్రసాద్, ప్లేస్‌మెంట్ హెడ్, ట్రిపుల్ ఐటీ-హైదరాబాద్. |
ఆర్ అండ్ డీ రంగంలో... ఈ ఏడాది పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ) రంగంలో అవకాశాలు పెరగనున్నాయి. ముఖ్యంగా ఉత్పత్తి రంగంలో ఇవి ఎక్కువ. రక్షణలోనూ ఎఫ్‌డీఐలకు అనుమతుల నేపథ్యంలో ఆర్ అండ్ డీ కార్యకలాపాలు పెరగనున్నాయి. - ప్రొఫెసర్ వెంకటేశం,ప్లేస్‌మెంట్ ఆఫీసర్, ఐఐటీ-హైదరాబాద్. |
సమస్య అదే... నియామకాలు ఆశాజనకంగా ఉన్నాయన్న అంచనాలు వాస్తవమే అయినా స్కిల్ గ్యాప్ సమస్యను ఐటీతో పాటు అన్ని విభాగాలూ ఎదుర్కొంటున్నాయి. కాబట్టి విద్యార్థులు కమ్యూనికేషన్ స్కిల్స్, కోర్ అంశాల్లో ప్రాక్టికల్ నైపుణ్యాలు సొంతం చేసుకోవాలి. - బిపిన్ చంద్ర, వైస్ ప్రెసిడెంట్, సీఏ ఇండియా టెక్నాలజీ సెంటర్. |
Published date : 10 Jul 2015 10:57AM