Skip to main content

జాబ్‌ను బట్టి రెజ్యూమె ప్రిపరేషన్ చేసుకోవాలి.. వాటికి టిప్స్ ఇవిగో..

రెజ్యూమె రూపకల్పనలో పలు అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. ప్రస్తుతం కొవిడ్-19 నేపథ్యంలో సామాజిక దూరం అమలవుతోంది. రెండు రకాల ఉద్యోగ విధానాలు అందుబాటులోకి వస్తున్నాయి. వీటిలో తప్పనిసరిగా కంపెనీలకు హాజరు కావాల్సిన కొలువులు కొన్నైతే.. మరికొన్ని వర్క్ ఫ్రమ్ హోంకు సంబంధించినవి. కాబట్టి అభ్యర్థులు దరఖాస్తు చేస్తున్న కొలువు ఏ విధానానికి చెందిందో తెలుసుకొని.. దానికి అనుగుణంగా రెజ్యూమెను రూపొందించుకోవాలి. అలాగే దరఖాస్తు చేస్తున్న జాబ్ ప్రొఫైల్, నిర్వర్తించాల్సిన విధులు, అవసరమైన నైపుణ్యాలు, కంపెనీ తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని.. రెజ్యూమె రూపకల్పన/మార్పులు చేర్పులు చేయాలి.
ఏది అనుకూలం..
ఇప్పటికే రెజ్యూమె కలిగున్న వారు క్రొనలాజికల్ ఫార్మాట్‌ను అనుసరించడం లాభిస్తుంది. మూడు నుంచి ఐదేళ్లుగా ఒకే జాబ్/ఒకే పరిశ్రమలో పనిచేస్తున్న వారు ఈ పద్ధతిని అనుసరించాలి. ఇప్పటివరకు చేయని జాబ్/కంపెనీలో కొలువు కోసం ప్రయ త్నిస్తున్నప్పుడు ఫంక్షనల్ లేదా కాంబినేషన్ ఫార్మట్‌లో రెజ్యూమెను రూపొందిం చుకోవాలి. ఈ రకమైన రెజ్యూమె ఫార్మాట్‌లు అభ్యర్థి అనుభవం కంటే నైపుణ్యాలను హైలెట్ చేస్తాయి. కాబట్టి రిక్రూటర్‌కు మీ నైపుణ్యాలను తెలపడంలో ఈ పద్ధతి బాగా పనిచేస్తుంది.

సమ్మరీ/ఆబ్జెక్టివ్..
రెజ్యూమె సమ్మరీ, లేదా ఆబ్జెక్టివ్ అనేవి అభ్యర్థి నేపథ్యాన్ని గురించి పేర్కొంటాయి. కనీసం ఏడాది ప్రొఫెషనల్ అనుభవం కలిగిన అభ్యర్థులు.. స్వీయ నైపుణ్యాలు, అచీవ్‌మెంట్స్ తదితరాలను పేర్కొనేందుకు సమ్మరీ మంచి అవకాశంగా చెప్పొచ్చు. ఆబ్జెక్టివ్ అనేది స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలకు సంబంధించిన స్టేట్‌మెంట్. ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్, జాబ్ లేదా ఇండస్ట్రీ మారాలనుకొనే అభ్యర్థులకు ఇది సరి తూగుతుంది.

జాబ్ డిస్క్రిప్షన్..
కొత్త కొలువుకు దరఖాస్తు చేసుకునే వారు ఈ విషయంలో నిశితంగా ఉండాలి. జాబ్ డిస్క్రిప్షన్‌ను రివ్యూ ద్వారా రిక్రూటర్ ఎలాంటి అభ్యర్థి కోసం చూస్తున్నాడో అర్థమవుతుంది. కాబట్టి తదనుగుణంగా సంబంధిత నైపుణ్యాలు, అర్హతలు, అను భవాన్ని హైలెట్ చేస్తూ రె జ్యూమెను రూపొందించుకోవచ్చు. అలాగే రిక్రూటర్ల జాబ్ డిస్క్రిప్షన్‌లో పేర్కొనే రిక్వైర్‌మెంట్స్, విద్యార్హతలు, కీస్కిల్స్ వంటి కీ వర్డ్స్’ను పరిశీలించాలి. దానికి అనుగుణంగా రెజ్యూమె పైభాగం(బ్యాగ్రౌండ్)లో ఆయా కీ వర్డ్స్‌కు సంబంధించిన స్కిల్స్‌ను పేర్కొనాలి. ఇలా చేస్తే రిక్రూటర్ సులభంగా ఆయా నైపుణ్యాలు, అర్హతలను గుర్తించే వీలుంటుంది. అలాగే ఇతర కీ వర్డ్స్ ప్రొఫెషనల్ ఎక్స్‌పీరియెన్స్, ఎడ్యుకేషన్, స్కిల్స్ విభాగంలో పేర్కొనడం లాభిస్తుంది.
 
Published date : 25 Dec 2020 02:37PM

Photo Stories