ఇంటర్న్‌షిప్స్...కెరీర్‌కు తొలిమెట్టు
Sakshi Education
దేశంలో విద్యార్థులు వృత్తివిద్య కోర్సుల్లో పెద్ద సంఖ్యలో చేరుతున్నారు. నాలుగేళ్లు కష్టపడి ఇంజనీరింగ్ పట్టా సంపాదిస్తున్నారు. కానీ, ఇండస్ట్రీ అవసరాల మేరకు నైపుణ్యాలు ఉండటం లేదు. ఎంట్రీ లెవల్ ఉద్యోగాల్లో రాణించలేక సతమతమవుతున్నారు. ఇది విద్యార్థులనే కాదు, కంపెనీలకూ ఆందోళనకు గురిచేస్తుంది.
అందుకే కరిక్యులంలో ప్రాక్టికల్ లెర్నింగ్‌కు పెద్దపీట వేస్తూ.. నాలుగేళ్ల ఇంజనీరింగ్ కోర్సులో ఇంటర్న్‌షిప్స్ తప్పనిసరిగా చేయాలని ఏఐసీటీఈ (ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్) గతేడాది కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది. ఇంటర్న్‌షిప్ తప్పనిసరి చేయడం వల్ల విద్యార్థులు కాలేజీ నుంచి బయటికొచ్చే నాటికి ఇండస్ట్రీకి అవసరమైన సబ్జెక్ట్ పరిజ్ఞానంతోపాటు ప్రాక్టికల్ నైపుణ్యాలను సొంతంచేసుకునే వీలు కలుగుతుంది. ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్ కోర్సుల్లో ఇంటర్న్‌షిప్స్ ఆవశ్యకత.. వాటిని అందుకునేందుకు మార్గాల గురించి తెలుసుకుందాం...
నేటి పోటీ ప్రపంచంలో వినూత్న ఆలోచనలు, వాస్తవ పరిజ్ఞానం కలిగిన ప్రతిభావంతులను నియమించుకునేందుకే సంస్థలు ప్రాధాన్యమిస్తున్నాయి. కానీ, దేశంలో ఇంజనీరింగ్ కోర్సులు పూర్తి చేసుకుంటున్న విద్యార్థుల్లో మూడోవంతు మందికి ఉద్యోగ నైపుణ్యాలు ఉండటం లేదు. మరోవైపు జాబ్‌రెడీ స్కిల్స్, ప్రాక్టికల్ ఎక్స్‌పోజర్, రియల్ టైం ఎక్స్‌పీరియన్స్ పొందితేనే కొలువులు లభించే పరిస్థితి ప్రస్తుతం జాబ్‌మార్కెట్‌లో నెలకొంది. ఆయా నైపుణ్యాలను అందిపుచ్చుకునేందుకు దోహదపడేదే ఇంటర్న్‌షిప్. అకడమిక్స్ పరంగా తరగతిగదిలో నేర్చుకున్న అంశాలను వాస్తవ పరిస్థితుల్లో అన్వయించే అవకాశం కల్పించేవే ఇంటర్న్‌షిప్స్!
ఇంటర్న్‌షిప్ తప్పనిసరి...
ఇంజనీరింగ్ కోర్సుల్లో ఇంతకాలం నామమాత్రంగా సాగిన ఇంటర్న్‌షిప్స్‌ను ఏఐసీటీఈ తప్పనిసరి చేయడంతో బీటెక్ పూర్తయ్యేనాటికి విద్యార్థులు జాబ్‌స్కిల్స్‌తో బయటికి వచ్చే అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంటర్న్‌షిప్స్ ద్వారా విద్యార్థులకు ప్రొఫెషనల్ నాలెడ్జ్‌తోపాటు కంపెనీల సమస్యలకు పరిష్కారం కూడా లభిస్తుంది. ఇంటర్న్‌షిప్ ప్రధాన ఉద్దేశం.. కోర్సు సమయంలో ఏదైనా ఒక సంస్థలో నిర్ణీత కాలం పనిచేయడం. ఈ సమయంలో కంపెనీలు విద్యార్థుల అకడమిక్ నేపథ్యానికి అనుగుణంగా ఏదైనా ఒక విభాగంలో నియమించుకుంటున్నాయి. సదరు విభాగంలోని టీమ్‌లో ఇంటర్న్ ట్రైనీగా అవకాశం కల్పిస్తాయి. ఆ టీమ్‌కు కంపెనీ ఇచ్చిన అసైన్‌మెంట్‌లో పాల్పంచుకునే అవకాశం ఇంటర్న్ ట్రైనీలకు లభిస్తుంది. కొన్నిసార్లు వీరికి కొత్త ప్రాజెక్టులు సైతం ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. సామ్‌సంగ్ వంటి ప్రముఖ సంస్థలు ఐఐటీ-బాంబే, ఐఐటీ-ఢిల్లీ, ఐఐటీ-కాన్పూరు వంటి ప్రముఖ విద్యా సంస్థల నుంచి కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ విద్యార్థులను ఇంటర్న్‌గా నియమించుకున్నాయి. వీరిని ఉద్యోగులుగానే పరిగణిస్తూ ప్రత్యేకంగా ప్రాజెక్టులు సైతం కేటాయిస్తుండటం విశేషం.
ఇక్కడ కష్టమే!
ప్రముఖ టాప్ కాలేజీల్లో చదివే విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ అవకాశాల పరంగా ఎలాంటి ఢోకా లేదు. ప్రముఖ కంపెనీలు వీరికోసం క్యూకడుతున్నాయి. ఉస్మానియా, జేఎన్‌టీయూ వంటి పేరున్న క్యాంపస్ కాలేజీల్లోనూ ఇంటర్న్‌షిప్స్ పరంగా పెద్దగా ఇబ్బంది లేదు. కానీ, దేశంలోని సుమారు ఆరువేలకుపైగా ఉన్న ద్వితీయ శ్రేణి ఇంజనీరింగ్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు మాత్రం ఇంటర్న్‌షిప్స్ అందుకోవడం పెద్ద సవాలుగా మారిందంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. కంపెనీలు ఇంటర్న్‌షిప్ ఆఫర్స్ ఇచ్చేముందు తమవైన విధానాలు, నియామక ప్రక్రియను అనుసరిస్తున్నాయి. విద్యార్థుల్లో పరిజ్ఞానం ఉంటేనే అవకాశం కల్పిస్తున్నాయి. కాబట్టి ద్వితీయ శ్రేణి కాలేజీల విద్యార్థులకు ఇంటర్న్‌షిప్స్ ఆఫర్లు అంత తేలిగ్గా వచ్చే పరిస్థితి కనిపించడంలేదంటున్నారు. హైదరాబాద్ నగర శివార్లల్లోని ఓ ప్రైవేటు కాలేజీ ప్లేస్‌మెంట్స్ ఆఫీసర్ మాట్లాడుతూ.. విద్యార్థులకు ఇంటర్న్‌షిప్స్ ఆఫర్స్ ఇవ్వడానికి కంపెనీలు అంత త్వరగా ముందుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ద్వితీయ శ్రేణి ఇంజనీరింగ్ కాలేజీల్లో ఇంజనీరింగ్ విద్యార్థుల ఉత్తీర్ణత శాతం కూడా చాలా తక్కువగా ఉంటోంది. తొలి ఏడాది విద్యార్థులు 21-29 శాతానికి మించి ఉత్తీర్ణులవ్వడం లేదు. ఫైనల్ ఇయర్ చేరే వరకు కూడా వీరు సప్లీలతో కుస్తీ పడుతున్నారు. ఇలాంటి విద్యార్థులకు ఇంటర్న్‌షిప్స్, ప్లేస్‌మెంట్స్ అవకాశాలు దక్కడం కష్టంగా ఉంది.
అందిపుచ్చుకోవాలి :
ఇంజనీరింగ్ కోర్సులో మూడో ఏడాదిలో ఇంటర్న్ ట్రైనీ నియామకాలను కంపెనీలు చేపడుతున్నాయి. ఈ ఇంటర్న్‌షిప్స్‌ను ఆరు వారాల నుంచి ఎనిమిది వారాల కాలవ్యవధితో చేయొచ్చు. విద్యార్థులు అవకాశాల కోసం ఎదురు చూసే బదులు సొంతంగా అన్వేషించుకోవడం మేలు. ముఖ్యంగా ఇంటర్న్‌శాల, వివిధ జాబ్‌పోర్టల్స్ వంటి వెబ్‌సైట్ల ద్వారా అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. అలానే సీనియర్లు, తెలిసిన వారెవరైనా కంపెనీల్లో పనిచేస్తుంటే.. వారిద్వారా అవకాశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. కాలేజీలో ప్లేస్‌మెంట్ ఆఫీసర్ నుంచి ఎప్పటికప్పుడు వివరాలు సేకరించుకుంటూ ఉండాలి. సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్ల ద్వారా తమ సీనియర్లు, ఆ రంగంలోని అనుభవజ్ఞులను సంప్రదిస్తూ.. ఇంటర్న్‌షిప్ అవకాశాల గురించి అన్వేషణ సాగించాలి. పలు కంపెనీలు తమ వెబ్‌సైట్‌లు, జాబ్ పోర్టల్స్, లింక్డ్‌ఇన్ వంటి ప్రొఫెషనల్ సైట్లల్లో అవకాశాలను పోస్టు చేస్తున్నాయి. విద్యార్థులు తమ నేపథ్యానికి సరితూగే కంపెనీలు/విభాగాలకు సంబంధించి ఇంటర్న్‌షిప్ నియామకాల గురించి నిరంతరం తెలుసుకోవాలి. ఇంటర్న్‌నెట్‌ను సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఇంటర్న్‌షిప్ అవకాశాల గురించి తెలుసుకోవచ్చు.
లాభాలెన్నో..!
ఇంటర్న్‌షిప్ వల్ల విద్యార్థులకు కలిగే ప్రయోజనాలు అనేకం. ముఖ్యంగా వారి కెరీర్‌లో ప్రధాన ఘట్టమైన ఉద్యోగసాధనకు ఇంటర్న్‌షిప్ తొలిమెట్టని చెప్పవచ్చు. నిర్దేశిత రంగంలో వాస్తవ పరిస్థితులపై ఒక అంచనాకు రావచ్చు. అకడమిక్ నైపుణ్యాలను ప్రాక్టికల్‌గా అన్వయించే అవకాశం లభిస్తుంది. సంస్థలు ఆశిస్తున్న నైపుణ్యాలు, మెరుగుపెట్టుకోవాల్సిన స్కిల్స్‌పై విద్యార్థులకు అవగాహన కలుగుతుంది. కార్పొరేట్ వర్క్ కల్చర్‌ను అర్థం చేసుకుంటూ.. ఇంటర్‌పర్సనల్ స్కిల్స్ పెంచుకునేందుకు అవకాశం లభిస్తుంది. ప్రధానంగా సదరు రంగంలోని సీనియర్లతో కలిసి పనిచేసే వీలు ఉంటుంది. ఇంటర్న్‌షిప్ అనేది ప్రాక్టికల్ నాలెడ్జ్‌కు నిదర్శనం. కాబట్టి వీరికి భవిష్యతలో మెరుగైన అవకాశాలు లభించడం ఖాయం. ఇంటర్న్‌గా చేరిన సంస్థే పనితీరు నచ్చితే అపాయింట్‌మెంట్ లెటర్ అందిస్తుంది.
ఉద్యోగానికి రాజమార్గం...
ఇంటర్న్‌షిప్‌తో రియల్ టైం ఎక్స్‌పోజర్, ప్రాక్టికల్ నాలెడ్జ్ సొంతమవుతుంది. అంతే కాకుండా.. ఇంటర్న్‌షిప్ సమయంలో విద్యార్థులు చూపిన పనితీరు, వ్యవహారశైలి కూడా వారి కెరీర్ దిశగా చక్కటి మార్గం వేస్తుంది. ఇంటర్న్‌షిప్ సమయంలో బృంద సభ్యుడిగా వ్యవహరించే తీరు ఉద్యోగ అవకాశాలను నిర్ణయిస్తుంది. చొరవ, అంకితభావం, లెర్నింగ్ ఆటిట్యూడ్, బృంద నైపుణ్యాలను పరిగణనలోని తీసుకొని కంపెనీలు పూర్తిస్థాయి ఉద్యోగ ఆఫర్ ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఐఐటీల్లో ప్రీ ప్లేస్‌మెంట్ ఆఫర్స్ పేరిట ఇలాంటి విధానం అమల్లో ఉంది. వీరికి బీటెక్ మూడో సంవత్సరంలోనే ఇంటర్న్‌గా అవకాశమిచ్చి.. ఇంటర్నెషిప్ సమయంలో చూపిన ప్రతిభ ఆధారంగా ఫైనల్ ప్లేస్‌మెంట్ ఖాయం చేయడం జరుగుతోంది.
ఎప్పుడైనా చేయొచ్చు..
ఇంటర్న్‌షిప్‌ను నిర్ణీత సమయంలో చేయాలనే నిబంధన ఉన్నప్పటికీ.. ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం నుంచి కూడా అవకాశాలు వెతుక్కోవచ్చు. ఇక్కడ చేసే ఇంటర్న్‌షిప్స్ భవిష్యత్తులో మంచి సంస్థల్లో ఇంటర్న్‌గా చేరేందుకు వీలు కల్పిస్తుంది. ఇంటర్న్‌గా చేరితే ఆయా సంస్థలు కొంత మొతాన్ని విద్యార్థులకు స్టైఫండ్‌గా ఇచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని సంస్థలు నెలకు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు ఇస్తున్నాయి. కొన్ని సంస్థల్లో ఉచితంగా చేసినా.. వారిచ్చే సర్టిఫికెట్ ఉపయోగపడుతుంది. కాబట్టి స్టైపెండ్ అనే అంశానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకుండా.. కంపెనీకి, పని అనుభవానికి ప్రాధాన్యమివ్వాలి.
నేర్చుకునే అవకాశం :
ఇంటర్న్‌షిప్ విద్యార్థి కెరీర్‌లో తొలిమెట్టు. ఇంటర్న్‌షిప్స్‌తో మెరుగైన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. నేను ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ తర్వాత సెలవుల్లో బెంగళూరులో ఇంటర్న్‌షిప్ చేశాను. బీటెక్ మూడో సంవత్సరం తర్వాత సామ్‌సంగ్ దక్షిణ కొరియాలో రెండు నెలల పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం లభించింది. ఇండియా నుంచి ఎంపికైన పది మందిని ఉద్యోగులుగానే పరిగణించి ప్రత్యేక ప్రాజెక్టు కేటాయించారు. ప్రస్తుతం ఉద్యోగిగా నియమించుకున్నారు. మనం తరగతిగదిలో నేర్చుకున్న పాఠాలను ప్రాక్టికల్‌గా అనువర్తించి నేర్చుకునే అవకాశం ఇంటర్న్‌షిప్ ద్వారా లభిస్తుంది.
- ఆహ్వాన్ రెడ్డి, ఐఐటీ-బాంబే, ఫైనలియర్, సామ్‌సంగ్, దక్షిణ కొరియా, ఇంటర్న్ విద్యార్థి.

Published date : 22 Nov 2018 06:06PM