ఇంటర్న్‌షిప్.. ఇష్టపడే కెరీర్‌కు ప్రాక్టికల్ అప్రోచ్!
Sakshi Education
కార్పొరేట్ కొలువుల్ని సొంతం చేసుకోవాలని ప్రతి ఒక్కరూ కలలుకంటారు. ఆ కలలు నిజం కావాలంటే జాబ్ మార్కెట్ కోరుకునే నైపుణ్యాలను సొంతం చేసుకోవాలి. పోటీ ప్రపంచంలో మంచి ఉద్యోగాన్ని చేజిక్కించుకోవాలంటే కేవలం అకడమిక్ నైపుణ్యాలు సరిపోవు. కాలేజీలో చదువుతున్నప్పుడే తరగతి గదిలో నేర్చుకున్న అంశాలను ప్రాక్టికల్ రూపంలోకి మార్చగలగాలి. ఇది ఇంటర్న్‌షిప్ వల్ల సాధ్యపడుతుంది.
ప్రస్తుత పోటీ ప్రపంచంలో మంచి కొలువును సొంతం చేసుకునే ఉద్దేశంతో ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్, జర్నలిజం,అడ్వర్టైజింగ్, మార్కెటింగ్ వంటి కోర్సుల్లో యువత అడుగుపెడుతోంది. వీరు కాలేజీలో పుస్తకాల్లో చదువుకున్న అంశాలను ప్రాక్టికల్‌గా అన్వయించేందుకు ఇంటర్న్‌షిప్ ఉపయోగపడుతుంది. ఇందులో భాగంగా కాలేజీ నుంచి బయటకు రాకముందే కొంతకాలంపాటు క్షేత్రస్థాయి కార్యకలాపాల్లో విద్యార్థులు పాల్గొంటారు. అనుభవజ్ఞుల పర్యవేక్షణలో పని అనుభవం సంపాదిస్తారు. అకడమిక్ నైపుణ్యాలతో పాటు పని అనుభవం (Work Experience) ఉన్న వారికి కంపెనీలు రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏఐసీటీఈ.. ఇంజనీరింగ్ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేసేందుకు ప్రయత్నిస్తోంది.
విద్యార్థులకు అనేక ప్రయోజనాలు:
కోర్సు పూర్తిచేసిన తర్వాత కెరీర్‌లోకి కాలు పెట్టేందుకు ఇంటర్న్‌షిప్ సోపానంగా ఉపయోగపడుతుంది.

- కాలేజీలో నేర్చుకున్న అంశాల స్థాయిని అంచనా వేసేందుకు ఇంటర్న్‌షిప్ ఉపయోగపడుతుంది. వాటిని ప్రాక్టికల్స్‌గా చేయడానికి ఉన్న అవకాశాలపై అవగాహన ఏర్పడుతుంది.
- తమకు ఏ మేర నైపుణ్యాలు ఉన్నాయి? వాటిని ఇంకా ఎలా మెరుగుపరుచుకోవాలి? వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన ఏర్పడుతుంది.
- విద్యార్థులు తాము ఎంచుకున్న కెరీర్ మార్గం సరైనదా.. కాదా? ఇంకా ఉన్నత కెరీర్‌కు ఎలాంటి బాటలు వేసుకోవచ్చు? తదితర విషయాలపై నిర్ణయానికి రాగలుగుతారు.
- ఇంటర్న్‌షిప్ చేస్తున్నప్పుడు విద్యార్థులు కంపెనీలోని సీనియర్లతో నిరంతరం సంప్రదిస్తూ కెరీర్‌కు కావాల్సిన నైపుణ్యాలను సంపాదించడానికి వీలుపడుతుంది. ప్రాజెక్టుల్లో భాగస్వాములయ్యేందుకు సహకరిస్తుంది.
- బృంద స్ఫూర్తి, కమ్యూనికేషన్ స్కిల్స్, సమయపాలన, ఒత్తిడిని జయించడం, ఆత్మవిశ్వాసం వంటి సాఫ్ట్‌స్కిల్స్‌ను పెంపొందించుకునేందుకు ఇంటర్న్‌షిప్ వేదికగా నిలుస్తుంది.
- కొత్త తరం ఆలోచనల్ని తెలుసుకునేందుకు, వాటికి అనుగుణంగా తమ పనితీరును, ప్రమాణాలను మార్చుకునేందుకు కంపెనీలకు అవకాశముంటుంది.
- ఇంటర్న్‌షిప్ చేస్తున్న విద్యార్థుల్లోని నైపుణ్యాలను, నిత్యనూతన ఆలోచనల్ని వెలికితీసి, వాటిని పారిశ్రామిక రంగానికి ఉపయోగించుకునే వీలుంటుంది.
- నిపుణులైన ఉద్యోగుల ఎంపికకు ఇంటర్న్‌షిప్ కంపెనీలకు అద్భుత వేదికగా నిలుస్తోంది.
ఇంటర్న్‌షిప్‌నకుఇంటర్వ్యూ:
కొన్ని కంపెనీలు క్యాంపస్‌కు వచ్చి ఇంటర్వ్యూలు నిర్వహించి విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ అవకాశాలు ఇస్తున్నా యి. మరికొన్ని విద్యార్థులు ఇంటర్న్‌షిప్‌నకు దరఖాస్తు చేసుకోవాలంటూ మీడియాలో ప్రకటనలు ఇస్తున్నాయి. విద్యార్థులు తాము చదువుతున్న విద్యాసంస్థల పూర్వ విద్యార్థి సంఘాల సహాయంతో కూడా ఇంటర్న్‌షిప్ అవకాశం పొందొచ్చు.
జర జాగ్రత్త:
అవకాశం దొరికింది కదాని ఏదో ఒక కంపెనీలో ఇంటర్న్‌షిప్ చేయడం వల్ల ప్రయోజనం ఉండదు. ఇంటర్న్‌షిప్‌కు వెళ్లే ముందు కొన్ని విషయాలపై ఆలోచించాలి. మార్కెట్లో కంపెనీకి ఉన్నపేరు,అవి చేపడుతున్న ప్రాజెక్టులు, మౌలిక వసతులు, పని అనుభవం సంపాదించుకునేందుకు అనువైన వాతావరణం తదితర విషయాలు తెలుసుకోవాలి. ముఖ్యంగా ఇంటర్న్‌షిప్ లక్ష్యాలు పూర్తిస్థాయిలో నెరవేరే అవకాశముందా..లేదా? అనే విషయాన్ని తెలుసుకోవాలి.
వేసవి విజ్ఞానం:
వేసవి సెలవులు వస్తున్నాయంటే చాలు.. విహార యాత్ర లు, సరదా కార్యక్రమాలు గుర్తొస్తాయి. చాలా మంది విద్యార్థులు ఈ సెలవుల్ని ఇంటర్న్‌షిప్ చేయడానికి కేటాయించి ఉన్నత కెరీర్‌కు మార్గాన్ని సుగమం చేసుకుంటున్నారు.
బలమైన రెజ్యూమె:
ఇంటర్న్‌షిప్ చేశాక దాన్ని ఉద్యోగ ప్రయత్నాల్లో మంచి వనరుగా ఉపయోగించుకోవాలి. ఓ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే సమయంలో రెజ్యూమెలో ఇంటర్న్‌షిప్ చేసినట్లు పేర్కొనాలి. ఇంటర్న్‌షిప్‌లో నిర్వర్తించిన బాధ్యతలను, నేర్చుకున్న అంశాలను క్లుప్తంగా ప్రస్తావించాలి. అప్పుడే రెజ్యూమె బలంగా ఉంటుంది. ఉద్యోగానికి ఎందరు దరఖాస్తు చేసుకున్నా రిక్రూటర్స్‌కు మీరు ప్రత్యేకంగా కనిపిస్తారు.

- కళాశాలల్లో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ జరుగుతున్నప్పుడు ఇంటర్న్‌షిప్ సర్టిఫికెట్ ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుంది. ఇంటర్వ్యూ సమయంలో ఇంటర్న్‌షిప్‌లో నిర్వర్తించిన విధులను వివరించడం ద్వారా కొలువును సులువుగా సొంతం చేసుకోవచ్చు.
- చాలా కంపెనీలు తమ వద్ద ఇంటర్న్‌షిప్ చేసిన వారిలో ప్రతిభావంతులను పూర్తిస్థాయి ఉద్యోగులుగా నియమించుకుంటున్నాయి.
- గూగుల్, ఇన్ఫోసిస్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలు సైతం ఇంటర్న్‌షిప్ ద్వారా ఎ-గ్రేడ్ ప్రతిభావంతులను గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నాయి.
---------------------------------------------------------------------------------------------------
ఇంటర్న్‌షిప్‌తో ప్రాక్టికల్ అనుభవం
ఓ విద్యార్థి తాను చేస్తున్న కోర్సుకు సంబంధించి కాలేజీలో నేర్చుకున్న అంశాలను ప్రాక్టికల్స్‌గా అన్వయించడానికి ఇంటర్న్‌షిప్ ఉపయోగపడుతుంది. మంచి కొలువులకు మార్గాన్ని సుగమం చేస్తుంది. రెండు, మూడు నెలల పాటు ఓ కంపెనీలో ఉంటూ సొంతం చేసుకున్న పని అనుభవం పటిష్టమైన కెరీర్‌కు పునాది వేస్తుంది. కంపెనీల యాజమాన్యాలు.. అభ్యర్థులు అకడమిక్‌గా సాధించిన మార్కులకు కాకుండా వారి నైపుణ్యాలకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇంటర్వ్యూ సమయంలో అభ్యర్థి నైపుణ్యాలను అంచనా వేసేలా ప్రశ్నలు అడుగుతున్నాయి. అందువల్ల చదువుతున్న సమయంలో పరిశ్రమల అవసరాలకు తగ్గట్టు నైపుణ్యాలను అలవరచుకోవడం ముఖ్యం. ఇంజనీరింగ్ కరిక్యులంలో ఇంటర్న్‌షిప్ భాగంగా లేనప్పటికీ ప్రొఫెషనల్ స్కిల్స్‌ను పెంపొందించుకోవడంలో దాన్ని విస్మరించలేం.ఈ నేపథ్యంలో కొందరు వేసవి సెలవుల్లో ఇంటర్న్‌షిప్‌కు వెళ్తూ ప్రాక్టికల్ అనుభవాన్ని సొంతం చేసుకుంటున్నారు.
- ఎన్.ఎల్.ఎన్.రెడ్డి,
హెడ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్, సీబీఐటీ.
------------------------------------------------------------------------------------------------
అప్రెంటీస్‌షిప్‌తో అనుభవ సారం!
‘‘దేశంలో 61 శాతం కంపెనీలు తమ అవసరాలకు సరిపడే నైపుణ్యాలున్న అభ్యర్థులు దొరక్క ఇబ్బందులు పడుతున్నాయి’’. ఉద్యోగ సేవల సంస్థ ‘మ్యాన్ పవర్ గ్రూప్’ సర్వేలో నిగ్గుతేలిన విషయమిది. కాలేజీ క్యాంపస్‌ల నుంచి బయటకు వస్తున్న చాలా మందిలో వృత్తిగత నైపుణ్యాలు పారిశ్రామిక అవసరాలకు తగ్గట్లు లేకపోవడమే ఈ పరిస్థితికి కారణం.
క్యాంపస్‌ల నుంచి బయటకు వస్తున్న చాలా మందిలో పరిశ్రమల అవసరాలకు సరిపడా స్కిల్స్ లేవంటూ కంపెనీల యాజమానులు తలలు పట్టుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అప్పుడప్పుడే కోర్సులు పూర్తిచేసిన యువత కాసింత పని అనుభవం సంపాదించుకుంటే నచ్చిన కొలువును సొంతం చేసుకునేందుకు మార్గం సుగమమవుతుంది. ఇలాంటి పని అనుభవాన్ని సొంతం చేసుకోవడానికి ‘అప్రెంటీస్‌షిప్’ చక్కని మార్గం.
అకడమిక్‌కు కొండంత అండ:
చేసిన కోర్సు ఏదైనా నేర్చుకున్న అంశాలకు ప్రాక్టికల్ రూపమివ్వగలిగితేనే దానికి విలువ ఉంటుంది. తరగతి గదిలో నేర్చుకున్న అంశాలను నిర్దిష్ట సమయంలో ప్రాక్టికల్‌గా అన్వయించడం ముఖ్యం. అప్పుడే మంచి ఉద్యోగం సొంతమవుతుంది. ఓ విద్యా సంస్థలో కోర్సు పూర్తిచేసిన తర్వాత పరిశ్రమ లేదా సంస్థలో కొంతకాలం పాటు శిక్షణ పొందడాన్ని అప్రెంటీస్‌షిప్ అంటారు. ఇది అకడమిక్ నైపుణ్యాలను ప్రొఫెషనల్ స్కిల్స్‌గా మార్చుకోవడానికి ఉపయోగపడుతుంది. అప్రెంటీస్ కోసం ఓ కంపెనీలో చేరిన అభ్యర్థులకు అప్రెంటీస్ అడ్వయిజర్ చేదోడువాదోడుగా ఉంటారు.
అప్రెంటీస్‌ను దిగ్విజయంగా పూర్తిచేయడం అంత సులువేమీ కాదు. అయినా కష్టపడి పనిచేసే తత్వం, పట్టుదలతో అప్రెంటీస్‌ను పూర్తిచేస్తే తగిన ప్రతిఫలం ఉంటుంది.
అప్రెంటీస్ అందుబాటులో ఉన్న కోర్సులు:

- అప్రెంటీస్ ప్రాధాన్యాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 1961లో అప్రెంటీస్ చట్టాన్ని తెచ్చింది. ఇది 1962 నుంచి పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చింది. ఈ చట్టానికి 1973, 1986లో సవరణలు తెచ్చారు. ఈ చట్టం ప్రకారం ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (ఐటీఐ) కోర్సులు చేసిన వారికి, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీకి సంబంధించి గ్రాడ్యుయేషన్, డిప్లొమా పూర్తిచేసిన వారికి కూడా అప్రెంటీస్‌షిప్ అవసరం.
- అప్రెంటీస్ చట్టంలోని అంశాలను అమలు చేసేందుకు డెరైక్టర్ జనరల్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్, బోర్డ్ ఆఫ్ అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్(బోట్) వంటి ప్రభుత్వ విభాగాలు చర్యలు తీసుకుంటున్నాయి. బోట్ అనేది కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ (హెచ్‌ఆర్‌డీ) పరిధిలో స్వయంప్రతిపత్తితో పనిచేస్తోంది.
- భారత్ డైనమిక్స్ లిమిటెడ్(బీడీఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్), రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్‌ఐఎన్‌ఎల్), బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్(బార్క్) తదితర సంస్థలు అవసరాలకు అనుగుణంగా అప్రెంటీస్‌షిప్‌లను ఆఫర్ చేస్తున్నాయి.
- ప్రైవేటు రంగంలోని పరిశ్రమల రంగంలోని యాజమాన్యాలు విద్యార్థులకు అప్రెంటీస్ అవకాశం ఇచ్చేలా ప్రభుత్వం కృషి చేస్తోంది.
ఆర్నెల్ల నుంచి మొదలు:
అప్రెంటీస్ కాలపరిమితి అనేది విద్యార్థి చేసిన కోర్సు, కంపెనీ పనితీరు, అవసరాలనుబట్టి ఉంటుంది. కనిష్టంగా ఆర్నెల్లు ఉంటుంది. నిర్దేశ కాలపరిమితిలో అప్రెంటీస్‌కు ఎంపికైన వారిని ట్రైనీలుగా వ్యవహరిస్తారు. అప్రెంటీస్‌షిప్ సమయంలో అభ్యర్థులకు నిర్దేశ అంశాలపై శిక్షణ ఇస్తారు. ఈ అంశాలేంటనే విషయంలో సంబంధిత ట్రేడ్ కమిటీలు, పరిశ్రమలో ట్రేడ్ నిపుణులు కలిసి నిర్ణయం తీసుకుంటారు.
శిక్షణలో వేతనం.. స్టైపెండ్:
అప్రెంటీస్ చేస్తున్న వారికి ఆయా సంస్థల యాజమాన్యాల నిర్ణయం మేరకు వేతనాలు అందజేస్తారు. గ్రాడ్యుయేట్ అప్రెంటీస్‌కు నెలకు కనీసం రూ.3,560; టెక్నికల్ అప్రెంటీస్‌కు రూ.2,530; డిప్లొమా కోర్సులు చేసిన వారు అప్రెంటీస్‌లో చేరితే రూ.2,070, టెక్నికల్ (ఒకేషనల్) అప్రెంటీస్ చేస్తున్న వారికి రూ.1,970 ఉంటుంది.
నాన్ టెక్నికల్‌లోనూ:
అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ కేవలం టెక్నికల్ కోర్సులకే పరిమితం కాలేదు. ఫ్యాషన్ టెక్నాలజీ, హోటల్ మేనేజ్‌మెంట్, టూరిజం వంటి నాన్ టెక్నికల్ కోర్సుల్లోనూ ట్రైనింగ్ కోర్సులను ప్రభుత్వ పరంగా డెరైక్టర్ జనరల్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్ (DGE&T) నిర్వహిస్తోంది.
కాలేజీలో వివిధ సంస్థలు నిర్వహించే క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ప్రతికూల ఫలితాలు వచ్చిన వారికి అప్రెంటీస్ మంచి మార్గం. దీని ద్వారా నైపుణ్యాలను పెంచుకొని మంచి కెరీర్‌లో స్థిరపడొచ్చు.
శాశ్వత కొలువుకు కేరాఫ్ అడ్రస్
ఏదైనా సంస్థలో అప్రెంటిస్‌షిప్ ట్రైనీలుగా చేరిన అభ్యర్థులు నిర్దేశ కాలపరిమితిలో మంచి ప్రతిభ కనబరిచి, యాజమాన్యం దృష్టిలోపడితే అదే సంస్థలో శాశ్వత ఉద్యోగం పొందే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి అవకాశం పొందాలంటే అప్రెంటీస్‌లో చేరిన రోజు నుంచే పనిపట్ల అంకితభావం, స్కిల్స్ పెంచుకునేందుకు ఉత్సాహం ఉండాలి. కంపెనీలో పూర్తిస్థాయి ఉద్యోగాన్ని సుస్థిరం చేసుకునేందుకు అందుబాటులో ఉన్న అన్ని వనరులనూ సమర్థంగా ఉపయోగించుకోవాలి.

Published date : 09 Aug 2013 03:56PM