ఇంటర్‌నషిప్ @ ఎంబీఏ...
Sakshi Education
విద్యార్థి కోణంలో ఉద్యోగ కెరీర్‌కు పునాది.. కంపెనీల దృక్కోణంలో ప్రతిభను గుర్తించే మార్గం.. ఇంటర్న్‌షిప్. మేనేజ్‌మెంట్ కోర్సులు అభ్యసిస్తున్నవారికి ఇది ఎంతో ముఖ్యం. కొద్ది రోజుల పాటు వాస్తవ పని వాతావరణం.. పరిస్థితుల గురించి అనుభవ పూర్వకంగా తెలుసుకోవడం.. అవసరమైన నైపుణ్యాలపై అవగాహన పొందడం.. వాటిని పెంపొందించుకునేందుకు కృషి చేయడం.. ఇటు విద్యార్థులు, అటు కంపెనీలకూ మేలే! అందుకే ఇప్పుడు ఇంటర్న్‌షిప్ అనే మాట ప్రాధాన్యం సంతరించుకుంది. ఎంబీఏ ఫైనల్ విద్యార్థులు నవంబర్, డిసెంబర్‌లలో ఇంటర్న్‌షిప్స్ ప్రారంభించనున్న నేపథ్యంలో విశ్లేషణ..
ప్రొఫెషనల్ కోర్సులకు తప్పనిసరి...
ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్ వంటి ప్రొఫెషనల్ కోర్సుల్లో తప్పనిసరిగా మారిన జాబ్ రెడీ స్కిల్స్, ప్రాక్టికల్ ఎక్స్‌పోజర్, రియల్ టైం ఎక్స్‌పీరియన్స్‌ను అందించేదే ఇంటర్న్‌షిప్. ముఖ్యంగా మేనేజ్‌మెంట్ నిపుణులకు తరగతి గదుల్లో బోధించిన అంశాలను వాస్తవ పరిస్థితులకు అన్వయించగలిగే అవకాశం కల్పిస్తుంది. ఎంబీఏ విద్యార్థులు మార్కెటింగ్, ఫైనాన్స్, హెచ్‌ఆర్, ఆపరేషన్స్ వంటి విభాగాల్లో ఇంటర్న్‌షిప్స్ అవకాశాలు అందిపుచ్చుకోవాల్సి ఉంటుంది.
ఉద్యోగం కల్పించే అవకాశం...
ఒక అభ్యర్థి ఇంటర్న్‌గా చేరిన తర్వాత వారి పనితీరు, దృక్పథం ఆధారంగా ఉద్యోగం కల్పించే వెసులుబాటు కంపెనీలకు లభిస్తుంది. పని, వాతావరణం, సంస్థ విధానాలు అన్నీ కుదిరితేనే ఉద్యోగంలో చేరే అవకాశం అభ్యర్థులకు ఉంటుంది. ఉద్యోగికి కావాల్సిన అర్హతలు, లక్షణాలు పెంపొందించుకోవడంతో పాటు, ప్రాక్టికల్ నైపుణ్యాలు సొంతం చేసుకోవడం, వాస్తవ పరిస్థితులపై అవగాహన పెంచుకోవడానికి ఇంటర్న్‌షిప్ ఉపకరిస్తుంది అనేది నిపుణుల మాట. ఒక విధంగా కెరీర్ గమనాన్ని నిర్ణయించుకునే అవకాశం ఇంటర్న్‌షిప్ ఇస్తుంది.
ఇంటర్న్ ట్రైనీగా విధులు...
ఎంబీఏ విద్యార్థి ఒక సంస్థలోని విభాగంలో ఇంటర్న్‌షిప్ చేసే సమయంలో ఇంటర్న్ ట్రైనీగా వ్యవహరిస్తారు. ఈ సందర్భంగా బృందం అసైన్‌మెంట్‌లో పాల్పంచుకునే అవకాశం దొరుకుతుంది. విద్యార్థులు తమ అకడమిక్ నేపథ్యానికి సరితూగే ప్రాక్టికల్ నైపుణ్యాలు సొంతం చేసుకునే వీలు లభిస్తుంది. ఇంటర్న్‌షిప్స్ కేవలం చివరి సంవత్సరంలోనే కాక.. కళాశాలలో అడుగుపెట్టిన రోజు నుంచి కూడా చేసుకోవచ్చు.
తేడా ఎక్కడ..?
ఓ వైపు విద్యార్థులకు అసలు నైపుణ్యాలు ఉండడం లేదు..వృత్తి పరిజ్ఞానం శూన్యం అనే నివేదికలు.. మరోవైపు రూ.40 లక్షలు, రూ.70 లక్షలు, రూ.2 కోట్ల ప్యాకేజీలతో వరించిన కొలువులు..! మరి తేడా ఎక్కడ ఉంటోంది..? దీనికి సమాధానం విద్యార్థి ఎంచుకునే కళాశాలలోనే అంటున్నారు నిపుణులు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) లాంటి ప్రతిష్టాత్మక సంస్థల విద్యార్థులు భారీ వేతనాలతో కేరీర్ ప్రారంభిస్తుంటే.. సాధారణ స్థానిక కళాశాలల నుంచి వచ్చినవారు ఉద్యోగాల కోసం తిరగాల్సిన పరిస్థితి. ఫేస్‌బుక్, గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి సంస్థలు పేరున్న కళాశాలల విద్యార్థులను ఎంపిక చేసుకుంటున్నాయి. కొందరికి ఇంటర్న్‌షిప్ పేరుతో ఆఫర్ లెటర్లు ఇచ్చి, పనితీరు నచ్చితే స్వల్ప కాలవ్యవధిలో భారీ ఆఫర్లు ఇస్తున్నాయి. మరికొందరికి నేరుగా ఆఫర్ లెటర్లు జారీ చేస్తున్నాయి. అంటే.. పెద్ద కంపెనీలు తమతో టచ్‌లో ఉండే ఇన్‌స్టిట్యూట్లకు వెళ్లి అవసరమైన, మెరుగైన మానవ వనరులను ఎంచుకుంటున్నాయని తెలుస్తోంది.
ఇంటర్నెట్‌నే వేదికగా చేసుకుని...
పేరున్న విద్యాసంస్థలకు పెద్ద సంస్థలు రిక్రూట్‌మెంట్ కోసం వస్తున్నాయి.. సరే మిగతా కళాశాలల్లో చదివే విద్యార్థుల పరిస్థితి ఏమిటి? వీరికి సైతం ఆ స్థాయి అవకాశాలు రావా? ఇది కొంత మేర కష్టమే అయినా అసాధ్యం కాదంటున్నారు నిపుణులు. సంబంధిత కంపెనీల వెబ్‌సైట్‌ను ఎప్పటికప్పుడు చూస్తూ ఖాళీలు ఏర్పడినప్పుడు దరఖాస్తు చేసుకంటే ఇంటర్న్‌షిప్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో అప్‌డేటెడ్ రెజ్యుమోతో దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇంటర్న్‌షిప్స్ అవకాశాలు అందిపుచ్చుకోవడానికి ఇంటర్నెట్టే సరైన మార్గం. నెట్‌సౌకర్యంతో టాప్ కంపెనీలు మొదలు స్టార్టప్‌లలోని ఖాళీల గురించి తెలుసుకోవచ్చు. ముఖ్యంగా జాబ్ పోర్టల్స్ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్స్ చూసి పెట్టడంలో ముందుంటున్నాయి.
డెసిషన్ మేకింగ్ స్కిల్స్...
మేనేజ్‌మెంట్ విద్యార్థులు తమ స్పెషలైజేషన్ ఆధారంగా, దాని నేపథ్యానికి సరితూగే సంస్థలు, విభాగాల్లో ఇంటర్న్‌షిప్ కోసం ప్రయత్నించాలి. ఫలితంగా రియల్ టైం నాలెడ్జ్, ప్రాక్టికల్ ఎక్స్‌పోజర్‌తో పాటు నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, విశ్లేషణా నైపుణ్యాలు సొంతం చేసుకోవచ్చు. కంపెనీలకు ఎదురవుతున్న సమస్యలు, ఆ రంగంలోని నిపుణులు సూచిస్తున్న పరిష్కారాలు తెలుసుకునే వీలు లభిస్తుంది. ఇలాంటివారితో పనిచేయడం వల్ల నెట్‌వర్క్ ఏర్పడడంతో పాటు, ఇతర విషయాలూ నేర్చుకోవచ్చు.
ఇంటర్న్‌షిప్‌లో ఇలా...
ఇంటర్న్‌షిప్ సమయంలో విద్యార్థుల పనితీరు కూడా కెరీర్‌కు చక్కటి మార్గం వేస్తుంది. బృంద సభ్యుడిగా చొరవ, అంకితభావం, నేర్చుకోవాలనే తత్వం, కలిసి పనిచేసే స్వభావంతో ఆకట్టుకుంటే సంస్థ యాజమాన్యం నుంచి ఆఫర్ లెటర్ అందుకునే అవకాశం కూడా ఉంటుంది. ఐఐఎంలు, ప్రముఖ బి-స్కూల్స్‌లో ప్రి ప్లేస్‌మెంట్ ఆఫర్స్ పేరిట ఈ పద్ధతి ఇప్పటికే ఉంది.
కొద్ది రోజులే అయినా.. కెరీర్‌కు పునాది :
ఇంటర్న్‌షిప్ వ్యవధి కొద్ది రోజులే ఉన్నప్పటికీ విద్యార్థులకు భవిష్యత్తు కెరీర్‌కు బలమైన పునాది. ఇంటర్న్ ట్రైనీగా అభ్యర్థులను కంపెనీ ప్రతినిధులు నిత్యం గమనిస్తూనే ఉంటారు. అవసరమైన ఆర్థిక సహకారం కూడా అందిస్తారు. కొన్ని కంపెనీలు ఇంటర్న్‌షిప్ తర్వాత ఉద్యోగం ఆఫర్ ఇవ్వకపోయినా రికమెండ్ చేస్తూ సర్టిఫికెట్లు ఇచ్చే వీలుంది. ఇవి భవిష్యత్తు ఉద్యోగా న్వేషణలో కీలకంగా మారతాయనడంలో సందేహం లేదు.
ప్రాధాన్యం పెరుగుతోంది :
నేటి జాబ్ మార్కెట్‌లో ఇంటర్న్‌షిప్స్‌కు ప్రాధాన్యం పెరుగుతుంది. కంపెనీలు అవసరాల మేరకు కళాశాలలకు వెళ్లి విద్యార్థులను ఎంపిక చేసుకుంటున్నాయి. ఇంటర్న్‌షిప్ అనంతరం ప్లేస్‌మెంట్స్ ఇవ్వడమనేది వారి విధానాలు, విద్యార్థి పనితీరు మీద ఆధారపడి ఉంటుంది. ఇంటర్న్‌షిప్స్ పట్ల ఆసక్తి ఉన్నవారు కంపెనీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి రెజ్యుమె అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఎంబీఏ విద్యార్థులకు మార్కెటింగ్ విభాగంలో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సంస్థలు వ్యాపార విస్తరణకు ఉపక్రమించినప్పుడు మార్కెటింగ్ నిపుణులకే ప్రాధాన్యం ఇస్తున్నాయి.
-ప్రొ॥ఎస్. శ్రీనివాసమూర్తి,
డీన్ అండ్ హెడ్ ప్లేస్‌మెంట్స్, ఐపీఈ
కళాశాలల పాత్ర కీలకం..
మేనేజ్‌మెంట్ విద్యార్థులు కోర్సులో చేరినప్పటి నుంచే తమకు నచ్చే రంగంలో ఇంటర్న్‌షిప్‌కు ప్రయత్నిం చాలి. ఇంటర్న్‌షిప్స్ తీసుకురావడంలో కళాశాలల పాత్ర కీలకం. ఇండస్ట్రీ రిలేషన్‌షిప్స్‌తో కంపెనీలు కళాశాలలకు వెళ్లి విద్యార్థులను ఎంపిక చేసుకుంటున్నాయి. చివరి సంవత్సర విద్యార్థులు నవంబర్, డిసెంబర్ కల్లా దరఖాస్తు చేసుకోవాలి. పెరిగిన సంఖ్య దృష్ట్యా అవకాశాలు తక్కువ అవుతున్నాయి. సీరియస్‌గా ప్రయత్నించే వారే వాటిని అందిపుచ్చుకోగలరు. ప్రస్తుతం బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, రిటైల్ ఇండస్ట్రీల్లో మెరుగైన అవకాశాలు ఉన్నాయి.
- ప్రొ.ఎన్.సాంబశివ రావు,
ప్లేస్‌మెంట్ ఆఫీసర్, కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్, ఆంధ్రా యూనివర్సిటీ

Published date : 14 Sep 2017 02:01PM