ఎవర్‌గ్రీన్ ఎకనామిక్స్
Sakshi Education
మనదేశంలో ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టాక కార్పొరేట్ ప్రపంచం భారీ మార్పులకు లోనైంది. బ్యాంకింగ్, స్టాక్ మార్కెట్లు, ఫైనాన్స్, ఇన్సూరెన్స్, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ తదితర రంగాలు విస్తరించాయి. దీంతో ఎకనామిక్స్ పట్టభద్రులకు జాబ్ మార్కెట్‌లో డిమాండ్ పెరిగింది. ఎకనామిక్స్‌లో డిగ్రీ, పీజీ చేసిన ప్రతిభావంతులకు కార్పొరేట్ కంపెనీలు రెట్‌కార్పెట్ పరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎకనామిక్స్ కోర్సులు, ఉన్నత విద్య, కెరీర్ స్కోప్ వివరాలు...
మన దేశం ఆర్థికంగా, పారిశ్రామికంగా, వాణిజ్యపరంగా శరవేగంతో పురోగమిస్తోంది. అనేక రంగాలు అభివృద్ధి చెందుతూ నిపుణులైన ఆర్థికవేత్తలకు అవకాశాలను కల్పిస్తున్నాయి. అర్థశాస్త్రంలో డిగ్రీ పూర్తిచేసినవారికి ఫైనాన్స్ సెక్టార్, పట్టణ, గ్రామీణ అభివృద్ధి, విదేశీ వాణిజ్యం, కాలేజీలు, యూనివర్సిటీలు, ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు పుష్కలం. వీటితోపాటు ప్రభుత్వ, ప్రైవేట్, విదేశీ బ్యాంకుల్లో బ్రాంచ్ మేనేజర్లు, క్లర్కులు, ఆర్థిక సలహాదారులు, డెవలప్‌మెంట్ ఆఫీసర్లు, ఇన్సూరెన్స్ కంపెనీల్లో మేనేజర్లు, అసిస్టెంట్ మేనేజర్లు, కన్సల్టెంట్లు, ఏజెంట్లు, పాలసీ మేకర్లుగా స్థిరపడొచ్చు. ఆర్థిక నిపుణులు, ఎకనామిక్ అనలిస్ట్, ఫైనాన్స్ ఎకనామిస్ట్, ఎకనామిక్ అడ్వైజర్లుగా పని చేయొచ్చు.
ఉన్నత ఉద్యోగాలు
ఆర్థికశాస్త్రం చదివినవారు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగం సాధించాలనుకుంటే యూపీఎస్సీ నిర్వహించే ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ (ఐఈఎస్) పరీక్ష ద్వారా మినిస్ట్రీ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్, నేషనల్ శాంపిల్ సర్వే తదితర విభాగాల్లో గ్రూప్-ఎ ఆఫీసర్లుగా ఉన్నతోద్యోగాలు పొందొచ్చు. ప్రైవేట్ సంస్థల్లో సైతం ఎకనామిక్ కన్సల్టింగ్స్‌లో అవకాశాలను అందుకోవచ్చు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ (న్యూఢిల్లీ), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ లాంటి రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్లలో అవకాశాలు పుష్కలం.
వేతనాలు
ప్రభుత్వ రంగ సంస్థలతోపాటు కార్పొరేట్ సెక్టార్, ప్రైవేట్ కంపెనీలు ఎకనామిస్టులకు ఆకర్షణీయ వేతనాలను అందిస్తున్నాయి. ప్రభుత్వ రంగంలో ప్రారంభంలోనే నెలకు రూ.20-25 వేల వరకు, సీనియర్లు రూ.35-40 వేలకు పైగా ఆర్జిస్తున్నారు. బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు నెలకు రూ.25 వేలు -50 వేలు చెల్లిస్తున్నాయి. క్లయింట్ల సంఖ్యను బట్టి ఎకనామిక్ కన్సల్టెంట్లు కూడా బాగానే సంపాదిస్తున్నారు.
ఎకనామిక్స్‌లో కోర్సులు
ఇంటర్‌లో ఎకనామిక్స్ చదివినవారికి డిగ్రీలో చాలా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. బీఏ ఎకనామిక్స్, బీఏ హానర్స్ ఎకనామిక్స్, బీఎస్సీ ఎకనామిక్స్, బీఎస్సీ హానర్స్ ఎకనామిక్స్, బీఏ బిజినెస్ ఎకనామిక్స్, బీఏ డెవలప్‌మెంటల్ ఎకనామిక్స్ తదితర కోర్సుల్లో చేరొచ్చు. డిగ్రీ పూర్తయిన తర్వాత ఎంఏలో అనలిటికల్ అండ్ అప్లైడ్ ఎకనామిక్స్, అప్లైడ్ ఎకనామిక్స్, బిజినెస్ ఎకనామిక్స్, క్వాంటిటేటివ్ ఎకనామిక్స్, ఎంబీఏ బిజినెస్ ఎకనామిక్స్, ఎంబీఈ (మాస్టర్ ఆఫ్ బిజినెస్ ఎకనామిక్స్), ఎమ్సెస్సీలో అప్లైడ్ ఎకనామిక్స్, మ్యాథమెటికల్ ఎకనామిక్స్ తదితర పీజీ కోర్సులు చేయొచ్చు. ఉన్నత విద్యపై ఆసక్తి ఉన్నవారికి ఎకనామిక్స్, అప్లైడ్ ఎకనామిక్స్‌లలో ఎంఫిల్; ఎకనామిక్స్, బిజినెస్ ఎకనామిక్స్‌లలో పీహెచ్‌డీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఫైనాన్స్, బ్యాంకింగ్, పబ్లిక్ పాలసీ, డెవలప్‌మెంట్ సెక్టార్, సోషల్ వర్క్, జర్నలిజం, టీచింగ్, రీసెర్చ్, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్‌లో ఎకనామిక్స్ చేసిన అభ్యర్థులకు చక్కని అవకాశాలు లభిస్తున్నాయి. ఇందులో పీహెచ్‌డీ చేయడం ద్వారా ఉన్నతస్థాయికి ఎదగొచ్చు. ఇండియన్ ఎకనామిక్/స్టాటిస్టికల్ సర్వీసెస్ ఎగ్జామ్‌కు కూడా హాజరుకావచ్చు.
మంచి సంస్థల్లో చేరాలి
మన దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో చాలా యూనివర్సిటీలు ఎకనామిక్స్‌లో డిగ్రీ, పీజీ, ఎంఫిల్, పీహెచ్‌డీ కోర్సులను అందిస్తున్నాయి. వీటి పరిధిలో డిగ్రీ కాలేజీలు కూడా చాలా ఉన్నాయి. విద్యార్థుల ఆసక్తితోపాటు ఉత్తమ సంస్థలను ఎంచుకుంటే ఎకనామిక్స్‌లో ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది.
ఎకనామిక్స్ కోర్సులను అందిస్తున్న దేశంలోని ప్రముఖ కాలేజీలు

- జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ, ఢిల్లీ
వెబ్‌సైట్: www.jnu.ac.in
- మద్రాస్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, చెన్నై
వెబ్‌సైట్: www.mse.ac.in
- ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్, కోల్‌కతా
వెబ్‌సైట్: www.isical.ac.in
- యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (హెచ్‌సీయూ)
వెబ్‌సైట్: www.uohyd.ac.in
- ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నం
వెబ్‌సైట్: www.andhrauniversity.edu.in
- ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్
వెబ్‌సైట్: www.osmania.ac.in
- అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ, అలీగఢ్
వెబ్‌సైట్: www.amu.ac.in
Published date : 04 Jul 2016 02:51PM