ఎస్‌ఎస్‌సీ-సీహెచ్‌ఎస్‌ఎల్-2020 నోటిఫికేషన్ తో..ఇంటర్‌తోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించండిలా...
Sakshi Education
కేంద్ర ప్రభుత్వ శాఖల్లో అసిస్టెంట్, డేటాఎంట్రీ ఆపరేటర్, పోస్టల్ అసిస్టెంట్, దిగువ స్థాయి క్లర్క్ ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ)... కంబైన్‌డ హయ్యర్ సెకండరీ లెవల్ ఎగ్జామినేషన్(సీహెచ్‌ఎస్‌ఎల్)-2020కు నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం ఖాయం చేసుకునే చక్కటి అవకాశం సీహెచ్‌ఎస్‌ఎల్ ద్వారా లభిస్తుంది. ఎంపికైతే ప్రారంభంలోనే నెలకు రూ.41వేల వరకూ వేతనం పొందొచ్చు. ఈ నేపథ్యంలో.. ఎస్‌ఎస్‌సీ-సీహెచ్‌ఎస్‌ఎల్-2020 నోటిఫికేషన్ వివరాలు.. ఎంపిక ప్రక్రియ.. ప్రిపరేషన్ గెడైన్స్..
అర్హత :
జనరల్ ఇంటెలిజెన్స్ :
తక్కువ సమయంలో మంచి మార్కులు పొందేందుకు వీలున్న విభాగం ఇది. ఇందులో గరిష్టంగా స్కోర్ చేసేందుకు కృషి చేయాలి. వెర్బల్, నాన్ వెర్బల్‌పై ప్రశ్నలు వస్తున్నాయి. ఇందులో సిరీస్(నంబర్/ఆల్ఫా న్యుమరిక్) విభాగం, అనాలజీస్, ఆడ్ మెన్ ఔట్, సిలాయిజమ్, మాట్రిక్స్, దిశలు, వర్డ్ ఫార్మేషన్, బ్లడ్ రిలేషన్స్, నాన్‌వెర్బల్(వాటర్ ఇమేజ్, మిర్రర్ ఇమేజ్), కోడింగ్- డీకోడింగ్ మొదలైన టాపిక్స్ మీద ప్రశ్నలు అడుగుతున్నారు. ఏదైనా ఒక ప్రామాణిక పుస్తకం తీసుకొని ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. తక్కువ సమయంలోనే ప్రిపరేషన్ పూర్తి చేసుకోవడంతోపాటు కచ్చితంగా స్కోరు చేసుకునేందుకు అవకాశం ఉన్న సెక్షన్ ఇది. బేసిక్స్ నేర్చుకోవడానికి యూట్యూబ్‌లో ఎన్నో వీడియోలు అందుబాటులో ఉన్నాయి.
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ :
ఇందులో నంబర్ సిస్టమ్స్, శాతాలు, రేషియో అండ్ ప్రపోర్షన్, స్క్వేర్ రూట్స్, యావరేజెస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, లాభ నష్టాలు, టైం అండ్ వర్క్, టైం అండ్ డిస్టెన్స్, మిక్సర్ అండ్ అలిగేషన్స్, భాగస్వామ్యాలు చాప్టర్లు నుంచి కనీసం ఒక ప్రశ్న చొప్పున వచ్చే అవకాశం ఉంది. అలాగే త్రికోణమితి, ఆల్జీబ్రా, క్షేత్రగణితం, రేఖాగణితం, డేటా ఇంటర్‌ప్రిటేషన్ సెక్షన్ల నుంచి ప్రశ్నలు ఉంటాయి. మ్యాథమెటిక్స్‌లో సర్కిల్స్, ట్రిగనోమెట్రీ, జామెట్రీ, ఆల్జీబ్రా, మెన్సురేషన్ తదితర అంశాలు చాలా కీలకం. వీటి నుంచే దాదాపు సగం ప్రశ్నలు వస్తుంటాయి. వీటిలో స్కోరు కోసం తొలుత బేసిక్స్‌పై దృష్టిసారించాలి. ఈజీ టు హార్డ్ క్రమంలో సమస్యల సాధన అలవరచుకోవాలి. ఈ సెక్షన్‌కు సంబంధించి స్కోరు చేయడానికి ఏకైక మార్గం ప్రాక్టీస్.
జనరల్ అవేర్‌నెస్ :
జనరల్ అవేర్‌నెస్‌లో తక్కువ సమయంలో ఎక్కువ స్కోరు చేయడానికి వీలుంది. బాగా ప్రిపేర్ అయితే 10 నిమిషాల లోపే ప్రశ్నలకు సమాధానాలు గుర్తించవచ్చు. ఈ విభాగంలో జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలు, జనరల్ సైన్స్, ఎకానమీ, హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ అంశాల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. ఏదైనా ఒక ప్రామాణిక పుస్తకాన్ని తీసుకొని ప్రిపరేషన్ సాగించడం మేలు.
అర్హత :
- ఎస్‌ఎస్‌సీ-సీహెచ్‌ఎస్‌ఎల్‌కు దరఖాస్తు చేసుకునేందుకు అర్హత..ఇంటర్మీడియెట్/10+2 ఉత్తీర్ణత
- కాగ్ కార్యాలయంలో డేటాఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు మాత్రం ఇంటర్మీడియెట్/10+2 స్థాయిలో మ్యాథ్స్ తప్పనిసరి సబ్జెక్టుగా సైన్స్ స్ట్రీమ్ చదివి ఉండాలి.
- లోయర్ డివిజన్ క్లర్క్(ఎల్డీసీ)/జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్:
- పోస్టల్ అసిస్టెంట్/సార్టింగ్ అసిస్టెంట్; డేటాఎంట్రీ ఆపరేటర్(డీఈవో); డేటాఎంట్రీ ఆపరేటర్(డీఈవో) గ్రేడ్ ఎ:
పేస్కేల్ 4: రూ.25,500-రూ. 81,100.
వయసు :
2020, జనవరి1 నాటికి 18-27 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వయో సడలిపంపు ఉంటుంది.
ఎంపిక విధానం :
ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్ పోస్టుల ఎంపిక ప్రక్రియలో మూడంచెల విధానంలో(టైర్-1, టైర్-2, టైర్-3) జరుగుతుంది. మొదట టైర్-1 కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో నిర్దేశిత కటాఫ్ మార్కులు సాధిస్తే.. టైర్-2కు అర్హత లభిస్తుంది. టైర్-2 డిస్క్రిప్టివ్ పరీక్ష. ఇది పెన్, పేపర్ విధానంలో 100 మార్కులకు జరుగుతుంది. ఇక తుదిగా టైర్-3లో భాగంగా టైపింగ్ టెస్ట్/స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇది అర్హత పరీక్ష మాత్రమే. టైర్-1, 2ల్లో వచ్చిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.
టైర్-1 చాలా కీలకం :
తొలి దశలో జరిగే ైటైర్-1 కంప్యూటర్ ఆధారిత పరీక్ష. ఇందులో ఇంగ్లిష్ లాంగ్వేజ్ 25 ప్రశ్నలు-50 మార్కులకు; జనరల్ ఇంటెలిజెన్స్ 25 ప్రశ్నలు-50 మార్కులకు; క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్(బేసిక్ అర్థమెటిక్ స్కిల్స్) 25 ప్రశ్నలు-50 మార్కులకు; జనరల్ అవేర్‌నెస్ 25 ప్రశ్నలు-50 మార్కులకు ఉంటాయి. మొత్తంగా టైర్-1 పరీక్ష 100 ప్రశ్నలు-200 మార్కులకు జరుగుతుంది. పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ప్రశ్న పత్రం ఇంగ్లిష్/ హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. నెగెటివ్ మార్కులు ఉంటారుు. ప్రతి తప్పు సమాధానానికి అర మార్కు కోత విధిస్తారు. ఈ పరీక్ష సమయం 60 నిమిషాలు.
టైర్-2: డిస్క్రిప్టివ్

- టైర్-2 పరీక్ష గంట వ్యవధిలో 100 మార్కులకు ఉంటుంది. 200-250 పదాల్లో ఎస్సే, 150-200 పదాల్లో లెటర్/అప్లికేషన్ రాయాలి. ఈ పరీక్షలో ఉత్తీర్ణతకు కనీసం 33శాతం మార్కులు సాధించాలి. సమాధానాలను ఇంగ్లిష్/హిందీలో మాత్రమే రాయాలి. టైర్-2 మార్కులను కూడా మెరిట్ లిస్ట్ రూపకల్పనలో పరిగణనలోకి తీసుకుంటారు.
- ఎస్సే రైటింగ్‌లో సామాజిక సమస్యలు, రాజకీయాలు, ప్రభుత్వ పథకాలు, పరిపాలన, ఫైనాన్స్, ఎకానమీ, పర్యావరణ సమస్యలు, క్రీడలు, దేశంతో ముడిపడి ఉన్న ముఖ్యమైన, వివాదాస్పదమైన సమస్యల నుంచి ప్రశ్నలు అడగవచ్చు. అప్లికేషన్, లెటర్ రైటింగ్ టాపిక్స్‌లో.. మన చుట్టూ నిత్యం ఎదురయ్యే ఏదైనా సమస్యపై ఫిర్యాదు చేయడం.. మన దగ్గరి వారికి ఏదైనా ఒక అంశంపై తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ లెటర్ రాయడం.. అవేర్‌నెస్ కల్పించే విధంగా అప్లికేషన్ రాయడం.. తదితర వాటిని ప్రాక్టీస్ చేయడం లాభిస్తుంది.
టైర్-3: ఇది అర్హత పరీక్ష మాత్రమే
ఇందులో వచ్చిన మార్కులను మెరిట్ లిస్ట్ రూపకల్పనలో పరిగణనలోకి తీసుకోరు. పోస్టల్/సార్టింగ్ అసిస్టెంట్, ఎల్‌డీసీ, కోర్టు క్లర్క్ పోస్టులకు అభ్యర్థి టైపింగ్ స్పీడ్‌ను పరీక్షిస్తారు. స్కిల్ టెస్ట్ మీడియం ‘ఇంగ్లిష్’ అని పేర్కొన్న అభ్యర్థుల టైపింగ్ స్పీడ్ నిమిషానికి 35 పదాలు; హిందీ అభ్యర్థుల టైపింగ్ స్పీడ్ నిమిషానికి 30 పదాలు ఉండాలి. ఇచ్చిన అంశాన్ని 10 నిమిషాల వ్యవధిలో కంప్యూటర్‌పై ఎంత కచ్చితంగా టైపింగ్ చేశారనే దాన్ని బట్టి టైపింగ్ స్పీడ్‌ను పరీక్షిస్తారు. డీఈవో పోస్టులకు అభ్యర్థుల డేటా ఎంట్రీ స్పీడ్‌ను పరీక్షిస్తారు.
ముఖ్య సమాచారం :
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: 2020, జనవరి 10
టైర్-1 పరీక్ష తేదీలు: 2020, మార్చి 16 నుంచి మార్చి 27 వరకు
టైర్-2 పరీక్ష తేదీ(డిస్క్రిప్టివ్ పరీక్ష తేదీ): 2020, జూన్ 28
వెబ్‌సైట్: https://ssc.nic.in
ప్రిపరేషన్.. పటిష్టంగా..
ఇంగ్లిష్ కాంప్రెహెన్షన్:

- సీహెచ్‌ఎస్‌ఎల్‌లో ఇంగ్లిష్ సబ్జెక్టుకు ప్రాధాన్యత ఎక్కువ. టైర్-1తోపాటు టైర్ 2లోనూ రైటింగ్ పార్ట్ ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు తమ ప్రిపరేషన్‌లో ఇంగ్లిష్‌పై కొంత ఎక్కువ దృష్టిపెట్టడం లాభిస్తుంది. అంతేకాకుండా ఇంగ్లిష్ ప్రిపరేషన్ భిన్నంగా ఉండాలి. సబ్జెక్టును ఆబ్జెక్టివ్ విధానంలో కాకుండా.. డిస్క్రిప్టివ్ అప్రోచ్‌తో నేర్చుకోవాలి. డిస్క్రిప్టివ్ విధానంలో ఎస్సే రైటింగ్, లెటర్ రైటింగ్ ఇంగ్లిష్‌లో రాయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రాథమిక కాన్సెప్టులను బాగా అర్థం చేసుకోవాలి. గ్రామర్‌పై పట్టు సాధించడం తప్పనిసరి.
- స్పాటింగ్ ద ఎర్రర్స్, సెంటెన్స్ ఇంప్రూవ్‌మెంట్, సెంటెన్స్ రీ అరెంజ్‌మెంట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, డెరైక్ట్/ఇన్‌డెరైక్ట్ స్పీచ్, యాక్టివ్/ప్యాసివ్ వాయిస్ మొదలైన విభాగాల్లో రాణించేలా కృషి చేయాలి. ఇంగ్లిష్‌లో పట్టుకోసం ప్రతి రోజూ ఏదో ఒక ప్రామాణిక ఇంగ్లిష్ దినపత్రిక చదువుతూ కొత్త పదాలు నేర్చుకోవాలి. ఇంగ్లిష్ పేపర్ చదివేటప్పుడు ఎడిటోరియల్స్ చదవడం వల్ల వొకాబ్యులరీ తోపాటు టైర్-2కు అవసరమైన నాలెడ్జ్‌ను కూడా పెంచుకోవచ్చు.
జనరల్ ఇంటెలిజెన్స్ :
తక్కువ సమయంలో మంచి మార్కులు పొందేందుకు వీలున్న విభాగం ఇది. ఇందులో గరిష్టంగా స్కోర్ చేసేందుకు కృషి చేయాలి. వెర్బల్, నాన్ వెర్బల్‌పై ప్రశ్నలు వస్తున్నాయి. ఇందులో సిరీస్(నంబర్/ఆల్ఫా న్యుమరిక్) విభాగం, అనాలజీస్, ఆడ్ మెన్ ఔట్, సిలాయిజమ్, మాట్రిక్స్, దిశలు, వర్డ్ ఫార్మేషన్, బ్లడ్ రిలేషన్స్, నాన్‌వెర్బల్(వాటర్ ఇమేజ్, మిర్రర్ ఇమేజ్), కోడింగ్- డీకోడింగ్ మొదలైన టాపిక్స్ మీద ప్రశ్నలు అడుగుతున్నారు. ఏదైనా ఒక ప్రామాణిక పుస్తకం తీసుకొని ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. తక్కువ సమయంలోనే ప్రిపరేషన్ పూర్తి చేసుకోవడంతోపాటు కచ్చితంగా స్కోరు చేసుకునేందుకు అవకాశం ఉన్న సెక్షన్ ఇది. బేసిక్స్ నేర్చుకోవడానికి యూట్యూబ్‌లో ఎన్నో వీడియోలు అందుబాటులో ఉన్నాయి.
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ :
ఇందులో నంబర్ సిస్టమ్స్, శాతాలు, రేషియో అండ్ ప్రపోర్షన్, స్క్వేర్ రూట్స్, యావరేజెస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, లాభ నష్టాలు, టైం అండ్ వర్క్, టైం అండ్ డిస్టెన్స్, మిక్సర్ అండ్ అలిగేషన్స్, భాగస్వామ్యాలు చాప్టర్లు నుంచి కనీసం ఒక ప్రశ్న చొప్పున వచ్చే అవకాశం ఉంది. అలాగే త్రికోణమితి, ఆల్జీబ్రా, క్షేత్రగణితం, రేఖాగణితం, డేటా ఇంటర్‌ప్రిటేషన్ సెక్షన్ల నుంచి ప్రశ్నలు ఉంటాయి. మ్యాథమెటిక్స్‌లో సర్కిల్స్, ట్రిగనోమెట్రీ, జామెట్రీ, ఆల్జీబ్రా, మెన్సురేషన్ తదితర అంశాలు చాలా కీలకం. వీటి నుంచే దాదాపు సగం ప్రశ్నలు వస్తుంటాయి. వీటిలో స్కోరు కోసం తొలుత బేసిక్స్‌పై దృష్టిసారించాలి. ఈజీ టు హార్డ్ క్రమంలో సమస్యల సాధన అలవరచుకోవాలి. ఈ సెక్షన్‌కు సంబంధించి స్కోరు చేయడానికి ఏకైక మార్గం ప్రాక్టీస్.
జనరల్ అవేర్‌నెస్ :
జనరల్ అవేర్‌నెస్‌లో తక్కువ సమయంలో ఎక్కువ స్కోరు చేయడానికి వీలుంది. బాగా ప్రిపేర్ అయితే 10 నిమిషాల లోపే ప్రశ్నలకు సమాధానాలు గుర్తించవచ్చు. ఈ విభాగంలో జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలు, జనరల్ సైన్స్, ఎకానమీ, హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ అంశాల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. ఏదైనా ఒక ప్రామాణిక పుస్తకాన్ని తీసుకొని ప్రిపరేషన్ సాగించడం మేలు.
Published date : 10 Dec 2019 01:45PM