Skip to main content

ఎఫ్‌ఎంసీజీ, రిటైల్‌లో కొలువుల జోరు...

ఆయా రంగాల్లో నియామకాలు గతేడాది 28 శాతం ఉండగా.. సెప్టెంబర్ 2019లో 29 శాతం మేర నమోదైనట్లు పేర్కొంది. రంగాల వారీగా చూసినప్పుడు-హెల్త్‌కేర్, ఫార్మాస్యూటికల్ పరిశ్రమ అత్యధికంగా 21శాతం టాలెంట్ డిమాండ్‌ను నమోదు చేసినట్లు తాజా సర్వే తెలిపింది.
లక్నో, చండీగఢ్ వంటి టైర్-2 నగరాల్లో నియామక ప్రక్రియ గరిష్టంగా ఉన్నట్లు వెల్లడించింది. పండుగల సందర్భంగా మానవ వనరుల అవసరం ఎక్కువ ఉంటుంది. కాబట్టి రీటైల్/ఎఫ్‌ఎంసీజీల్లో రెండంకెల వృద్ధి నమోదైంది. మరోవైపు ఆర్థిక మందగమనం కారణంగా ఐటీ, టెలికాం, బీఎఫ్‌ఎస్‌ఐ, బీపీఓ, ఐటీఈఎస్, ఆటోమొబైల్ లాంటి రంగాల్లో నియామకాల పరిస్థితి స్తబ్దుగా ఉంది. రాబోయే రోజుల్లో ఐటీ, టెలికాం, బీఎఫ్‌ఎస్‌ఐ, బీపీఓ, ఐటీఈఎస్, ఆటోమొబైల్ లాంటి రంగాల్లోనూ టాలెంట్‌కు డిమాండ్ పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా.

హెల్త్‌కేర్ రికార్డు :
  • హెల్త్‌కేర్, డ్యూరబుల్స్, ఎఫ్‌ఎంసీజీ, రిటైల్, హాస్పిటాలిటీ వంటి రంగాల్లో టాలెంట్‌కు డిమాండ్ నెలకొన్నట్లు సర్వే పేర్కొంది.
  • హెల్త్‌కేర్/ బయోటెక్నాలజీ/ఫార్మాస్యూటికల్-21శాతం, రిటైల్-12శాతం, ట్రావెల్, హాస్పిటాలిటీ-7శాతం వృద్ధిని నమోదు చేశాయి.
లీగల్, లా :
 లీగల్, లా ప్రొఫెషన్స్ సైతం సెప్టెంబర్ నెలలో గరిష్ట వృద్ధిని సాధించాయి. హెల్త్‌కేర్ రంగంలో డాక్టర్లు/మెడికల్ ప్రొఫెషనల్స్ నియామకాలు అధికంగానే ఉన్నాయని సర్వే తెలిపింది. లీగల్/లా-30శాతం; డాక్టర్స్/నర్సులు/మెడికల్ ప్రొఫెషనల్-29శాతం; బయోటెక్నాలజీ /ఫార్మాస్యూటికల్/ఆర్ అండ్ డీల్లో-28 శాతం మేర నియామకాల్లో వృద్ది నమోదైంది.
 
 టైర్-2 నగరాలు ముందు :
 ఆగస్టు, సెప్టెంబర్‌లో  టైర్-2 నగరాలైన చండీగఢ్ -13శాతం,  ఢిల్లీ-12శాతం, లక్నో-20శాతంగా హైరింగ్‌ను నమోదు చేశాయి. ఢిల్లీ-ఎన్‌సీఆర్, బెంగళూర్ మినహ మిగతా మెట్రో నగారాలు అన్ని నియామకాల్లో వెనుకంజలో ఉండటం గమనార్హం.
 
 జూనియర్లకు పెరిగిన డిమాండ్ :
 రెండు నుంచి ఐదు ఏళ్ల అనుభవం ఉన్న అభ్యర్థులకు ఆయా రంగాల్లో డిమాండ్ పెరిగి 1శాతం వృద్ధిని నమోదు చేసింది. సీనియర్ మేనేజ్‌మెంట్(10-15ఏళ్ల అనుభవం), లీడర్‌షిప్ రోల్స్‌కు(20 ఏళ్లు) అనుభవం కలిగిన వారికి డిమాండ్ 4 నుంచి 3 శాతానికి తగ్గినట్లు సర్వేలో వెల్లడైంది.
Published date : 24 Oct 2019 02:44PM

Photo Stories