ఎన్‌ఎస్‌డీసీ...ఉపాధి అవకాశాలకు తోడ్పాటు
Sakshi Education
స్కిల్స్.. రియల్ టైం నాలెడ్జ్.. అప్‌డేటెడ్ లెర్నింగ్.. ఇవి ప్రస్తుతం విద్యార్థులు, ఉద్యోగార్థులకు ఎదురవుతున్న సవాళ్లు! వీటిని సమకూర్చుకుంటేనే కోరుకున్న కెరీర్ సొంతమవుతుంది. మరి.. వీటిని అందుకోవడమెలా? అనే ప్రశ్నకు సరైన సమాధానం.. నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఎస్‌డీసీ), ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ). ఇవి జాతీయస్థాయిలో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూ.. యువతకు ఉపాధి అవకాశాల సాధనలో తోడ్పడుతున్నాయి. వీటిపై ప్రత్యేక కథనం.
ఎన్‌ఎస్‌డీసీ :
ఇంజనీరింగ్, ఇతర ప్రొఫెషనల్ కోర్సుల విద్యార్థులకు క్షేత్రస్థాయి నైపుణ్యాలు అందించేందుకు దాదాపు పదేళ్ల కిందట నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(ఎన్‌ఎస్‌డీసీ) ఏర్పాటైంది. ఇది కేవలం టెక్నికల్ విభాగాల్లోనే కాకుండా.. నాన్-టెక్నికల్ విభాగాల్లోనూ శిక్షణ అందిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం విధానంలో జాతీయస్థాయిలో అన్ని రాష్ట్రాలు, జిల్లాల్లో ప్రత్యేక కేంద్రాల ద్వారా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
ఎన్‌ఎస్‌డీసీ పరిధిలో అమలవుతున్న ప్రధాన శిక్షణ పథకాల వివరాలు..
పీఎంకేవీవై :
ఎన్‌ఎస్‌డీసీ అందిస్తున్న శిక్షణ పథకాల్లో ముఖ్యమైంది ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన(పీఎంకేవీవై). దీనిద్వారా పాఠశాల స్థాయి నుంచి ప్రొఫెషనల్ కోర్సుల వరకూ.. విద్యార్థులకు సాఫ్ట్‌స్కిల్స్, ఎంటర్ ప్రెన్యూర్‌షిప్, డిజిటల్ లిటరసీ తదితర అంశాల్లో శిక్షణ కార్యక్రమాలు అందుబాటులో ఉంటాయి. నిర్ణీత వ్యవధిలో శిక్షణ పూర్తిచేసుకున్న వారికి పరీక్ష నిర్వహించి, నైపుణ్యాలను మూల్యాంకన చేస్తారు. ఆ తర్వాత ప్లేస్‌మెంట్ సహకారం కూడా అందిస్తారు. దీనికోసం పలు సంస్థలతో ఒప్పందాలు కూడా కుదిరాయి. 2020 నాటికి దేశంలో కోటి మంది యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని అమలుచేస్తున్నారు. ఔత్సాహికులు ఎన్‌ఎస్‌డీసీ వెబ్‌సైట్ లేదా పీఎంకేవీవై వెబ్‌సైట్ (pmkvyofficial.org) ద్వారా శిక్షణ కార్యక్రమాలు, కేంద్రాల వివరాలు తెలుసుకొని, పేర్లు నమోదు చేసుకోవాలి.
వృత్తి శిక్షణకు పీఎంకేకే :
వృత్తి విద్యా కోర్సుల శిక్షణకు సంబంధించి ఎన్‌ఎస్‌డీసీ పరిధిలోని మరో పథకం.. ప్రధానమంత్రి కౌశల్ కేంద్ర(పీఎంకేకే). ఇందులో భాగంగా అవసరమైన శిక్షణ కేంద్రాలను గుర్తిస్తారు. వీటికి ఆర్థిక సహకారం అందించి, వివిధ విభాగాల్లో శిక్షణ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తారు.
అంతర్జాతీయ నైపుణ్య శిక్షణ :
ఎన్‌ఎస్‌డీసీ అందిస్తున్న శిక్షణ కార్యక్రమాల్లో ప్రత్యేకమైంది.. ఇంటర్నేషనల్ స్కిల్ ట్రైనింగ్(ఐఎస్‌టీ). దీనిద్వారా విదేశాల్లో ఉద్యోగాలు కోరుకుంటున్న వారికి ఆయా దేశాల్లో పరిశ్రమల్లో రాణించేందుకు అవసరమైన శిక్షణ ఇస్తారు. శిక్షణను విజయవంతంగా పూర్తిచేసుకున్న అభ్యర్థులు అంతర్జాతీయ అవకాశాలను అందిపుచ్చుకోవడంలో ముందంజలో నిలిచేందుకు అవకాశం ఉంటుంది. అంతేకాకుండా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో ఒప్పందం చేసుకున్న అంతర్జాతీయ రిక్రూట్‌మెంట్ ఏజెంట్లు లేదా రిక్రూటర్లకు అభ్యర్థుల జాబితా అందిస్తారు. శిక్షణ ద్వారా విదేశాల్లో ఉద్యోగాన్ని ఖరారు చేసుకున్నవారికి ప్రీ-డిపార్చర్ ఓరియెంటేషన్ ట్రైనింగ్ పేరుతో డిజిటల్ లిటరసీ, లాంగ్వేజ్ స్కిల్స్ తదితర అంశాల్లోనూ శిక్షణ ఇస్తారు.
వెబ్‌సైట్లో పేరు నమోదు: ఎన్‌ఎస్‌డీసీ శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకునేవారు తొలుత సంస్థ వెబ్‌సైట్‌ను సందర్శించాలి. హోంపేజీలో కనిపించే ‘స్కీమ్స్’ లింక్‌లోని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్‌పై అవగాహన ఏర్పరచుకోవాలి. తర్వాత తమ వివరాలు, శిక్షణ తీసుకోవాలనుకుంటున్న విభాగం వంటి అంశాలను ఎంపిక చేసుకోవాలి.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.nsdcindia.org
ఏఐసీటీఈ :
దేశంలో సాంకేతిక విద్య ఔత్సాహికులు, పట్టభద్రులు ఏటా లక్షల్లో పెరుగుతున్నారు. వీరిలో ప్రధానంగా స్కిల్ గ్యాప్ సమస్య కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. దీనిపై ప్రత్యేకంగా దృష్టిసారించిన అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ) తాజాగా వివిధ ఉపాధి, ఉద్యోగ శిక్షణ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన-టెక్నికల్ ఇన్‌స్టిట్యూషన్స్(పీఎంకేవీవై-టీఐ); ఎంప్లాయబిలిటీ ఎన్‌హ్యాన్స్‌మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్(ఈఈటీపీ); నేషనల్ ఎంప్లాయబిలిటీ ఎన్‌హ్యాన్స్‌మెంట్ మిషన్(ఎన్‌ఈఈఎం); లీడర్‌షిప్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్‌ను అమలు చేస్తోంది.
వీటి వివరాలు..
పీఎంకేవీవై-టీఐ: జాతీయస్థాయిలో ఏఐసీటీఈ పరిధిలోని ఐటీఐ, పాలిటెక్నిక్స్, ఇంజనీరింగ్ ఇన్‌స్టిట్యూట్స్‌లో డ్రాపవుట్ స్టూడెంట్స్‌కు ఇంజనీరింగ్ స్కిల్స్ అందించడం, ఆ తర్వాత ప్లేస్‌మెంట్ పరంగా సహాయం చేయడం లక్ష్యంగా ఈ ప్రోగ్రామ్‌ను ఏఐసీటీఈ అమలు చేస్తోంది. విద్యార్థులకు తమ సమీపంలోని కళాశాలల్లో 250 గంటల వ్యవధిలో శిక్షణ ఇస్తారు. ఇది పూర్తయ్యాక అభ్యర్థులకు పరీక్ష నిర్వహించి సర్టిఫికెట్ ప్రదానం చేస్తారు.
ఈఈటీపీ: ఏఐసీటీఈ అందిస్తున్న శిక్షణ కార్యక్రమాల్లో ఎంప్లాయబిలిటీ ఎన్‌హ్యాన్స్‌మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్(ఈఈటీపీ) వినూత్నమైంది. దీన్ని విజయవంతంగా అమలుచేసే ఉద్దేశంతో లింక్డ్ ఇన్, ఐసీటీ అకాడమీ, మాన్‌స్టర్ డాట్ కామ్ తదితర సంస్థలతో ఏఐసీటీఈ ఒప్పందం కుదుర్చుకుంది. శిక్షణ పూర్తిచేసుకున్న విద్యార్థుల వివరాలను ఏఐసీటీఈ.. ఈ సంస్థలకు అందిస్తుంది. తర్వాత దశలో అభ్యర్థులు నైపుణ్యం పొందిన విభాగం ఆధారంగా వారి ప్రొఫైల్స్‌ను సదరు వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచుతారు.
ఎన్‌ఈఈఎం: డిప్లొమా కోర్సులు చదువుతున్న లేదా పూర్తిచేసిన విద్యార్థులకు వారి డొమైన్ ఆధారంగా సంబంధిత పరిశ్రమల్లోని ఉద్యోగాలకు సరితూగేలా ఎన్‌ఈఈఎం ద్వారా శిక్షణ ఇస్తారు. దీనిద్వారా విద్యార్థులకు వారికి సంబంధించిన విభాగాల్లో ప్రస్తుతం అమలవుతున్న విధానాలు, వాటికి సంబంధించిన నైపుణ్యాలపై శిక్షణ లభిస్తుంది. దీనికోసం నీమ్ ఫెసిలిటేటర్ పేరుతో జాతీయస్థాయిలో ప్రైవేటు ఏజెన్సీలను నియమిస్తారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 12 ఏజెన్సీల ద్వారా ఏఐసీటీఈ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
ఏఐసీటీఈ స్టార్టప్ పాలసీ: టెక్నికల్ విద్యను అభ్యసిస్తూ.. భవిష్యత్తులో స్వయం ఉపాధిని లక్ష్యంగా నిర్దేశించుకున్న విద్యార్థులకు సంబంధిత శిక్షణ ఇచ్చేందుకు రూపొందించిన పథకం.. ఏఐసీటీఈ స్టార్టప్ పాలసీ. దీనికింద అకడమిక్‌గా ఇంజనీరిం గ్‌తోపాటు ఇన్నోవేషన్, ఐడియా జనరేషన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, బిజినెస్ మేనేజ్‌మెంట్, ఫైనాన్స్ వంటి కోర్సులను అందించేలా ఇన్‌స్టిట్యూట్‌లు, యూనివర్సిటీలకు అనుమతి ఇచ్చింది.
స్కిల్ నాలెడ్జ్ ప్రొవైడర్స్ :
సాంకేతిక విద్యార్థులకు క్షేత్రస్థాయి నైపుణ్యాలు అందించేందుకు ఏఐసీటీఈ అమలు చేస్తున్న మరో విధానం.. స్కిల్ నాలెడ్జ్ ప్రొవైడర్స్. దీని ప్రకారం- బోధన, ఇతర సదుపాయాల పరంగా ఉన్నత ప్రమాణాలు పాటిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లను ఏఐసీటీఈ శిక్షణ కేంద్రాలుగా పేర్కొంది. నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్‌వర్క్ పరిధిలోని కోర్సుల్లో చేరిన విద్యార్థులకు వీటిద్వారా వృత్తి శిక్షణ లభిస్తుంది. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ డెవలప్‌మెంట్ సెంటర్(ఏటీడీసీ); ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి ప్రముఖ సంస్థలు సహా మొత్తం 54 సంస్థలను స్కిల్ నాలెడ్జ్ ప్రొవైడర్స్(ఎస్‌కేపీ)గా గుర్తించింది.
అప్రెంటీస్‌షిప్, ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్స్ :
విద్యార్థులకు క్షేత్రస్థాయి నైపుణ్యాలు అందించే క్రమంలో ప్రత్యేకంగా పలు కార్యక్రమాలను అమలు చేస్తున్న ఏఐసీటీఈ.. అకడమిక్‌గానే వీటిని అందించాలనే ఉద్దేశంతోనూ చర్యలు తీసుకుంటోంది. తాజాగా ఐటీఐ, పాలిటెక్నిక్ స్థాయిలో అప్రెంటీస్‌షిప్; బీటెక్ స్థాయిలో ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్స్‌ను అకడమిక్స్‌లో భాగం చేసింది.
ఎన్‌ఎస్‌డీసీ, ఏఐసీటీఈ స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్ ముఖ్యాంశాలు...

- ఈ పథకం ద్వారా 2025 నాటికి లక్ష టెక్నాలజీ ఆధారిత స్టూడెంట్ స్టార్టప్స్ నెలకొల్పేలా చేయడం, వాటిద్వారా కనీసం పది లక్షల మందికి ఉపాధి కల్పించడం లక్ష్యంగా నిర్దేశించుకుంది. శిక్షణ ఇచ్చేందుకు ఇప్పటికే ఇంక్యుబేషన్ సెంటర్స్ అందుబాటులో ఉన్న ఇన్‌స్టిట్యూట్స్‌ను మెంటార్స్‌గా గుర్తించింది. అందువల్ల స్టార్టప్ ఔత్సాహికులు తమ సమీపంలోని ఇన్‌క్యుబేషన్ కేంద్రాల్లో సంప్రదించాలి.
స్కిల్ నాలెడ్జ్ ప్రొవైడర్స్ :
సాంకేతిక విద్యార్థులకు క్షేత్రస్థాయి నైపుణ్యాలు అందించేందుకు ఏఐసీటీఈ అమలు చేస్తున్న మరో విధానం.. స్కిల్ నాలెడ్జ్ ప్రొవైడర్స్. దీని ప్రకారం- బోధన, ఇతర సదుపాయాల పరంగా ఉన్నత ప్రమాణాలు పాటిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లను ఏఐసీటీఈ శిక్షణ కేంద్రాలుగా పేర్కొంది. నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్‌వర్క్ పరిధిలోని కోర్సుల్లో చేరిన విద్యార్థులకు వీటిద్వారా వృత్తి శిక్షణ లభిస్తుంది. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ డెవలప్‌మెంట్ సెంటర్(ఏటీడీసీ); ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి ప్రముఖ సంస్థలు సహా మొత్తం 54 సంస్థలను స్కిల్ నాలెడ్జ్ ప్రొవైడర్స్(ఎస్‌కేపీ)గా గుర్తించింది.
అప్రెంటీస్‌షిప్, ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్స్ :
విద్యార్థులకు క్షేత్రస్థాయి నైపుణ్యాలు అందించే క్రమంలో ప్రత్యేకంగా పలు కార్యక్రమాలను అమలు చేస్తున్న ఏఐసీటీఈ.. అకడమిక్‌గానే వీటిని అందించాలనే ఉద్దేశంతోనూ చర్యలు తీసుకుంటోంది. తాజాగా ఐటీఐ, పాలిటెక్నిక్ స్థాయిలో అప్రెంటీస్‌షిప్; బీటెక్ స్థాయిలో ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్స్‌ను అకడమిక్స్‌లో భాగం చేసింది.
ఎన్‌ఎస్‌డీసీ, ఏఐసీటీఈ స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్ ముఖ్యాంశాలు...
- పీఎంకేవీవై ద్వారా ఇప్పటివరకు 50 లక్షల మందికి శిక్షణ.
- దాదాపు 7.5 లక్షల మందికి లభించిన ఉపాధి.
- 2020 నాటికి కోటి మందికి శిక్షణ ఇవ్వాలనేది పీఎంకేవీవై లక్ష్యం.
- డిజిటల్ లిటరసీ సంబంధిత శిక్షణలో భాగంగా ఫేస్‌బుక్ సంస్థతో ఎన్‌ఎస్‌డీసీ ఒప్పందం.
- ఏఐసీటీఈ పరిధిలోనూ పలు ప్రోగ్రామ్‌లు.
- ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్‌కు ప్రాధాన్యం.
ఎంపికలో జాగ్రత్తగా... ఎన్‌ఎస్‌డీసీ వివిధ విభాగాల్లో శిక్షణ ఇచ్చేందుకు అన్ని ప్రాంతాల అభ్యర్థులకు అందుబాటులో ఉండేలా జాతీయస్థాయిలో పలు సంస్థలను ట్రైనింగ్ పార్ట్‌నర్స్‌గా నియమించింది. విద్యార్థులు తమ సమీపంలోని ట్రైనింగ్ పార్ట్‌నర్‌ను ఎంపిక చేసుకునే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. అప్పటివరకు ఆ ఏజెన్సీ ద్వారా శిక్షణ పొందిన, ఉద్యోగాలకు సిఫార్సులు అందుకున్న వారి సంఖ్య, మెంటార్స్ వివరాలు తెలుసుకోవాలి. అవన్నీ సరిగా ఉన్నాయనుకుంటేనే సదరు సంస్థలో పేరు నమోదు చేసుకోవాలి. - టి.మురళీధరన్, సీఈఓ, టీఎంఐ నెట్‌వర్క్ |
Published date : 01 Aug 2018 06:23PM