‘ఎలక్ట్రిక్ వెహికల్స్’రంగంలో...భారీగా ఉద్యోగాలు
Sakshi Education
అంతకంతకూ పెరుగుతున్న కాలుష్యం.. క్షీణిస్తున్న సంప్రదాయ ఇంధన వనరులు.. తడిసిమోపెడవుతున్న చమురు దిగుమతి ఖర్చులు.. ఇవీ నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లు..! దీనికి ఎలక్ట్రిక్ వెహికల్స్(ఈవీ) మాత్రమే సమాధానమన్నది ప్రభుత్వాల భావన. దాంతో రాబోయేకాలంలో ఎలక్ట్రిక్ వెహికల్ ఇండస్ట్రీ ఎమర్జింగ్ సెక్టార్‌గా మారనుంది. ఈ నేపథ్యంలో.. ఈవీ రంగంలో వస్తున్న మార్పులు, కెరీర్ అవకాశాల గురించి
తెలుసుకుందాం...
ఎన్‌ఈఎమ్‌ఎమ్‌పీ :
భారత ప్రభుత్వం హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించే లక్ష్యంతో 2013లో ద నేషనల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మిషన్ ప్లాన్(ఎన్‌ఈఎమ్‌ఎమ్‌పీ)-2020ను తీసుకొచ్చింది. అనంతరం 2015-16 బడ్జెట్‌లో ఎన్‌ఈఎమ్‌ఎమ్‌పీ కింద ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఫేమ్) 2020 పథకాన్ని ప్రారంభించింది. దీని కింద ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వెహికల్ టెక్నాలజీలకు మార్కెట్ సృష్టించడం, పెంపొందించడం వంటి లక్ష్యాలను నిర్దేశించారు. కొంతకాలం క్రితం కేంద్ర ప్రభుత్వం ఫేమ్ 2 పథకాన్ని ప్రారంభించింది.
ఫేమ్ 2.. ముఖ్యాంశాలు
కేంద్ర మంత్రివర్గం ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫేమ్ 2 పథకానికి ఆమోదముద్ర వేసింది.
దీని ముఖ్యాంశాలు ఇవే...
పెట్టుబడులు పెరుగుతున్నాయ్..
ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల్లో చైనా, అమెరికా, ఐరోపాలు తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. మిగిలిన దేశాల్లో చెప్పకోదగ్గ స్థాయిలో అమ్మకాలు జరగట్లేదు. అయినప్పటికీ ఎలక్ట్రిక్ వెహికల్ రంగంలో పెట్టుబడులు పెరుగుతున్నాయి. ప్రముఖ వాహన తయారీ సంస్థ ఫోర్డ్ ఎలక్ట్రిక్ వాహనాలపై పెట్టుబడిని రెండింతలు చేసింది. సుజుకి, హోండా, టొయాటా వంటి కంపెనీలు పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ విధానం కంటే హైబ్రిడ్ అప్రోచ్‌లో ముందుకెళ్తున్నాయి. అదే సమయంలో హ్యుందాయ్, మహింద్రా వంటి సంస్థలు పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టిపెట్టాయి.
కొలువులు:
భారత ప్రభుత్వం ఎలక్ట్రిక్ మొబిలిటీ మిషన్ కింద స్కిల్డ్ మ్యాన్‌పవర్‌ను తయారుచేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ మేరకు 10 మిలియన్ ఉద్యోగాలను అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. దీనికోసం స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంట్రప్రెన్యూర్ మంత్రిత్వ శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది.
ఉద్యోగ విభాగాలు :
భారత్-ఎలక్ట్రిక్ కార్లు..

- పథకం ప్రారంభం... 2019, ఏప్రిల్ 1
- 2019-20 నుంచి 2021-22 మధ్యకాలంలో రూ.10,000 కోట్లతో పథకం అమలు చేస్తారు.
- పథకం కింద ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోలు, ఛార్జింగ్ వ్యవస్థల ఏర్పాటుకు సంబంధించి ప్రోత్సాహకాలు అందిస్తారు.
- త్రిచక్ర, నాలుగు చక్రాల వాహనాల్లో ప్రజా రవాణా, వాణిజ్య అవసరాలకు ఉద్దేశించిన ఎలక్ట్రిక్ వెహికల్స్‌కు ప్రోత్సాహకాలు లభిస్తాయి.
- ద్విచక్ర వాహనాలకు సంబంధించి ప్రైవేటు రంగానికి ప్రాధాన్యం ఉంటుంది.
- ఫేమ్ 2 పథకం ద్వారా ప్రభుత్వం పది లక్షల ద్విచక్ర వాహనాలు, ఐదు లక్షల త్రిచక్ర వాహనాలు, 55,000నాలుగు చక్రాల వాహనాలు, 7000 బస్సుల(ఎలక్ట్రిక్) కొనుగోలుకు సహాయం అందించనుంది.
- జీఎస్‌టీ కౌన్సిల్ తాజాగా ఎలక్ట్రిక్ వెహికల్స్‌పై జీఎస్‌టీని 12 నుంచి 5 శాతానికి, ఛార్జింగ్ స్టేషన్స్ జీఎస్‌టీని 18 నుంచి 5 శాతానికి తగ్గించింది. దీంతో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇండస్ట్రీ రానున్న రోజుల్లో పుంజుకొనే అవకాశముంది.
పెట్టుబడులు పెరుగుతున్నాయ్..
ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల్లో చైనా, అమెరికా, ఐరోపాలు తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. మిగిలిన దేశాల్లో చెప్పకోదగ్గ స్థాయిలో అమ్మకాలు జరగట్లేదు. అయినప్పటికీ ఎలక్ట్రిక్ వెహికల్ రంగంలో పెట్టుబడులు పెరుగుతున్నాయి. ప్రముఖ వాహన తయారీ సంస్థ ఫోర్డ్ ఎలక్ట్రిక్ వాహనాలపై పెట్టుబడిని రెండింతలు చేసింది. సుజుకి, హోండా, టొయాటా వంటి కంపెనీలు పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ విధానం కంటే హైబ్రిడ్ అప్రోచ్‌లో ముందుకెళ్తున్నాయి. అదే సమయంలో హ్యుందాయ్, మహింద్రా వంటి సంస్థలు పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టిపెట్టాయి.
కొలువులు:
భారత ప్రభుత్వం ఎలక్ట్రిక్ మొబిలిటీ మిషన్ కింద స్కిల్డ్ మ్యాన్‌పవర్‌ను తయారుచేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ మేరకు 10 మిలియన్ ఉద్యోగాలను అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. దీనికోసం స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంట్రప్రెన్యూర్ మంత్రిత్వ శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది.
ఉద్యోగ విభాగాలు :
- డిజైన్ అండ్ టెస్టింగ్
- బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్
- మేనేజ్‌మెంట్ సేల్స్
- సర్వీసెస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్.
భారత్-ఎలక్ట్రిక్ కార్లు..
- అజంతా గ్రూప్: ఈ గ్రూపు టెక్స్‌టైల్, ట్రాన్స్‌పోర్ట్, కనస్ట్రక్షన్ ఎక్విప్‌మెంట్ అండ్ మెషినరీ కార్యకలాపాల్లో నిమగ్నమై ఉంది. ప్రస్తుతం భారత్‌లో గడియారాలతోపాటు తక్కువ ధరల్లో ఎలక్ట్రిక్ వాహనాలు విక్రయిస్తోంది. ఈ దిశగా ఇప్పటికే ఓరెవా సూపర్ పేరుతో ఎలక్ట్రిక్ కారును, ఓరెవా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అందుబాటులోకి తెచ్చింది.
- హీరో మోటో కార్ప్: ఎలక్ట్రిక్ స్కూటర్స్ తయారు చేసే స్టార్టప్ కంపెనీ ఏథర్ ఎనర్జీలో 2016లో 30.5 మిలియన్ డాలర్లు, 2018లో 19 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టింది.
- తారా ఇంటర్నేషనల్: ముంబైలోని తారా ఇంటర్నేషనల్ తారా గ్రీన్ ఆటో తయారుచేసే బ్యాటరీ ఆధారిత ద్విచక్ర, త్రిచక్ర, నాలుగు చక్రాల ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్ చేస్తోంది.
- టాటా మోటార్స్: టాటా మోటర్స్ ఇప్పటికే టాటా ఇండియా, టాటా ఏస్ వేరియంట్లలో ఎలక్ట్రిక్ వెర్షన్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీంతోపాటు యూరోపియన్ నార్వేకి చెందిన ఎలక్ట్రిక్ టెక్నాలజీ సంస్థలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టింది.
- మహీంద్రా: మహీంద్రా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ ఎలక్ట్రిక్ వాహనాల రూపకల్పన, తయారీ కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఈ కంపెనీ తొలి ఎలక్ట్రిక్ వెహికల్ రెవాఐ(ఎలక్ట్రిక్ కారు)ను 2011, మార్చిలో అందుబాటులోకి తెచ్చింది. తర్వాత 2013లో ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ ఇ2ఓ పేరుతో ఎలక్ట్రిక్ కారును మార్కెట్‌లోకి తెచ్చింది. భవిష్యత్‌లో ఎలక్ట్రిక్ వాహన రంగంలో మరిన్ని ఆవిష్కరణలకు మహీంద్ర సిద్ధమవుతోంది.
Published date : 04 Nov 2019 04:50PM