డిజిటల్ మీడియా...ఉపాధి అవకాశాలకు మార్గాలు !
Sakshi Education
జర్నలిజం.. మీడియా.. అనగానే అందరికీ గుర్తొచ్చేవి.. వార్తా పత్రికలు, టీవీ ఛానల్స్..! కాని గత కొంత కాలంగా మీడియా రంగం ఆధునిక రూపు సంతరించుకుంటోంది. సాంకేతిక హంగులు అద్దుకుంటూ.. ‘న్యూ మీడియా’(డిజిటల్ మీడియా)గా తెరపైకి వస్తోంది.
ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతోపాటు.. కొత్తగా డిజిటల్ మీడియా రంగం శరవేగంగా విస్తరిస్తోంది. యువతకు సరికొత్త అవకాశాలు అందిస్తూ.. సంపాదనకు వేదికగా మారుతోంది. ఈ నేపథ్యంలో.. డిజిటల్ మీడియాలో లభిస్తున్న ఉపాధి అవకాశాలు, అందుకునేందుకు మార్గాల గురించి తెలుసుకుందాం...
రెండు, మూడేళ్ల క్రితం వరకు జర్నలిజం అంటే.. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మాత్రమే. ముఖ్యంగా దినపత్రికలు, టీవీ చానళ్లల్లో ఎడిటోరియల్ డెస్క్ ఉద్యోగాలు(ఎడిటింగ్), రిపోర్టింగ్ జాబ్స్ గురించి మాత్రమే తెలుసు!! కానీ.. ప్రస్తుతం అన్ని రంగాల్లో మాదిరిగానే మీడియా రంగంలోనూ డిజిటలైజేషన్ పెరుగుతోంది. టెక్నాలజీ కారణంగా డిజిటల్ మీడియా రంగం విస్తరిస్తోంది. న్యూస్ వెబ్‌సైట్స్, యూట్యూబ్ చానల్స్, బ్లాగ్స్, ప్రత్యేక పోర్టల్స్, సోషల్ మీడియా(ఫేస్‌బుక్, ట్విటర్ వంటివి)... వీటన్నింటినీ డిజిటల్ మీడియా లేదా న్యూమీడియాగా పేర్కొంటున్నారు. ఈ న్యూ మీడియా ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ) ఆధారంగా పనిచేస్తోంది. డిజిటల్ మీడియా విస్తరణతో బ్లాగర్స్, వెబ్ డెవలపర్స్, కంటెంట్ డవలపర్స్, కంటెంట్ రైటర్స్, మీడియా మేనేజ్‌మెంట్ ఎక్స్‌పర్ట్స్, అప్‌లోడర్స్, డిజిటల్ మీడియా మార్కెటింగ్, డిజిటల్ మీడియా అడ్వర్‌టైజర్స్.. ఇలా... పలు రకాల ఉద్యోగాలు యువతకు అందుబాటులోకి వస్తున్నాయి. ఏదైనా ఒక అంశంపై అవగాహన కలిగి ఉండటంతోపాటు, ఆకట్టుకునేలా రాయగలిగే నేర్పు, కొద్దిపాటు టెక్నికల్ స్కిల్స్ ఉంటే చాలు.. సంపాదనకు మార్గం వేసుకోవచ్చు!
2020 నాటికి మూడురెట్ల వృద్ధి...
పలు సర్వేల ప్రకారం-గతేడాది మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ రంగం 13 శాతం వృద్ధి నమోదు చేసుకుంది. ఇందులో అధిక శాతం డిజిటల్ మీడి యా విభాగాలు ఉండటమే న్యూ మీడియా విస్తృతికి నిదర్శమని నిపుణులు పేర్కొంటున్నారు. డిజిటల్ మీడియా 2020 నాటికి మూడు రెట్లు వృద్ధి సాధించనుందని అంచనా. గతేడాది సీఐఐ-బీసీజీ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన సర్వే ప్రకారం- మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ రంగం రానున్న అయి దేళ్లలో దాదాపు 8 లక్షల మందికి ఉపాధి కల్పించనుంది. ఇందులో 40 శాతం ఉద్యోగాలు డిజిటల్, వెబ్ మీడియాలోనే లభించనుండటం విశేషం.
కంటెంట్ రైటరు్ల :
విలువైన, అవసరమైన సమాచారాన్ని సంక్షిప్తంగా,ఆకట్టుకునేలా పొందికైన పదాల్లో రాయగలిగే నైపుణ్యం ఉంటే న్యూమీడియా కంటెంట్ రైటర్‌గా రాణించొచ్చు. తేలిగ్గా చదివి అర్థం చేసుకునేలా సరళంగా రాయగలగాలి. పేరాలకు పేరాలు రాస్తే చదివే సమయం డిజిటల్ మీడియా రీడర్‌కు ఉండదు. కాబట్టి ఒక్కో పేరాకు మూడు లైన్లకు మించకుండా..ఎంత పెద్ద విషయమైనా మూడు నాలుగు పేరాలకు మించకుండా ప్రభావవంతంగా రాయగలగాలి. రైటింగ్ స్టైల్ కూడా దినపత్రికకు రాసినట్లు కాకుండా... ఎదురుగా నిలుచున్న వ్యక్తితో సంభాషిస్తున్నట్లు సూటిగా, సంక్షిప్తంగా రాయాలని నిపుణులు సూచిస్తున్నారు. కంటెంట్ రైటర్‌కు రాయ డంతోపాటు తన కంటెంట్‌ను తనే సమయోచితంగా ప్రజెంట్ చేయగలిగే నైపుణ్యాలు సైతం ఉండాలి.
డిజిటల్ అడ్వర్టయిజింగ్ కోఆర్డినేటర్ :
న్యూ మీడియా కెరీర్స్ పరంగా.. సంస్థలకు, వ్యక్తులకు మంచి అవకాశాలు కల్పిస్తున్న విభాగం.. న్యూమీడియా అడ్వర్టయిజింగ్. అడ్వర్టయిజ్‌మెంట్ విభాగం అంటే వ్యక్తిగతంగా క్లయింట్లను సంప్రదిం చి.. ప్రకటనలు సేకరించడం అని భావిస్తుంటారు! కానీ.. టెక్నాలజీ వినియోగం పెరుగుతున్న నేపథ్యం లో ఆన్‌లైన్ విధానంలో ప్రకటనలు సేకరించే వారిని డిజిటల్ అడ్వర్టయిజింగ్ కోఆర్డినేటర్లుగా పేర్కొంటున్నారు. ఈ అవకాశాలు ప్రధానంగా డిజిటల్ మీడియా(వెబ్‌సైట్స్, ఆన్‌లైన్ న్యూస్ పోర్టల్స్)లో లభి స్తున్నాయి.
వెబ్ డెవలపర్స్:
మీడియా రంగం డిజిటల్ హంగులు అద్దుకుం టున్న పరిస్థితుల్లో కెరీర్ పరంగా విస్తృత అవకాశాలు కల్పిస్తున్న మరో జాబ్ ప్రొఫైల్... వెబ్ డెవలపర్స్. న్యూస్, ఈకామర్స్ తదితర వెబ్‌సైట్స్‌ను వీక్షకులను ఆకట్టుకునే రీతిలో రూపొందించడం, సంస్థల్లో విని యోగిస్తున్న సాఫ్ట్‌వేర్ ఆధారంగా వెబ్‌సైట్స్ డెవలప్ చేయడం వెబ్ డెవలపర్స్ ప్రధాన విధి. ఈ ఉద్యోగాలకు టెక్నికల్ నైపుణ్యాలతోపాటు వెబ్ డెవలప్‌మెంట్‌లో సర్టిఫికేషన్ ఉన్న వారికి ప్రాధాన్యం లభిస్తోంది. సంస్థల్లో శాశ్వత ప్రాతిపదికన నెలకు రూ.20వేల వరకు వేతనం పొందొచ్చు. ఫ్రీలాన్సింగ్ విధానంలోనూ పని చేసే అవకాశముంది.
సోషల్ మీడియా మేనేజర్ :
సోషల్ మీడియా.. ప్రస్తుతం దీనికి ఉన్న ప్రాధా న్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మీడియా సంస్థలు ఇప్పుడు సోషల్ మీడియా లింక్స్ ఆధారం గానూ వార్తలను అందిస్తున్నాయి. దాంతో సోషల్ మీడియా మేనేజర్ అనే సరికొత్త జాబ్ ప్రొఫైల్ తెరపైకి వచ్చింది. వీరు చేయాల్సిందల్లా.. సంబంధిత వార్తలను సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో ప్రాధాన్యత క్రమంలో ముందుగా కనిపించేలా చూడటమే. ఎస్‌ఈఓ, ఎస్‌ఈఎం నైపుణ్యాలున్న వారు సోషల్ మీడియా మేనేజర్లుగా రాణించే వీలుంది. జర్నలిజం లేదా పబ్లిక్ రిలేషన్స్‌లో డిగ్రీ ఉండి.. సదరు వార్త ప్రాధాన్యతను గుర్తించి.. తక్కువ పదాల్లో ఆకట్టుకునే రీతిలో ప్రజెంట్ చేయగలిగే నైపుణ్యం ఉంటే సోషల్ మీడియా మేనేజర్‌గా రాణించేందుకు ఆస్కారం లభిస్తుంది.
ఎస్‌ఈవో స్పెషలిస్ట్ :
డిజిటల్ మీడియా విస్తృతి రోజురోజుకూ పెరుగుతోంది. వెబ్‌సైట్స్, బ్లాగ్స్ అనేకం తెరపైకి వస్తున్నాయి. తాజా వార్తలను వేగంగా అందిస్తున్నాయి. సదరు వెబ్‌సైట్స్, బ్లాగ్స్‌కు ఆదరణ లభించాలంటే.. సెర్చ్ ఇంజన్‌లో తొలి రెండు, మూడు పేజీల్లో కనిపించడం ఒక్కటే మార్గం. అందుకే ఇటీవల కాలంలో సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ స్పెషలిస్ట్(ఎస్‌ఈవో) నిపుణులకు ప్రాధాన్యం పెరుగుతోంది. సదరు వెబ్‌సైట్ ద్వారా లభించే సేవలు, సదుపాయాలు, ప్రత్యేకతలు తెలియజేస్తూ.. ఆకట్టుకునే రీతిలో కంటెంట్ రూపొందించడం, ఒక వార్తకు సంబంధించి కీ వర్డ్స్‌ను, ట్యాగ్స్‌ను విభిన్నంగా రాసి.. సదరు వార్తను సెర్చ్ చేసే క్రమంలో ముందంజలో నిలిపేలా చేయడం ఎస్‌ఈఓ స్పెషలిస్ట్‌ల ముఖ్య బాధ్యత.
సరికొత్త ట్రెండ్.. సిటిజన్ జర్నలిజం
నేటి టెక్నాలజీ యుగంలో న్యూమీడియా జర్నలిజంలో మరో కొత్త కోణం.. సిటిజన్ జర్నలిజం. జర్నలిజంలో ఎలాంటి నేపథ్యం లేకున్నా.. పౌరులు తమ కళ్లముందు కనిపిస్తున్న సమస్య గురించి కలం పట్టి రాయడం, లేదా కెమెరా కళ్లతో ఒక సంఘటనను బంధించి సదరు పత్రికలు, ఛానల్స్‌కు అందించడమే సిటిజన్ జర్నలిజం!ట్విటర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ తదితర సోషిల్ మీడియా వేదికలుగా పలువురు సమస్యలను పోస్ట్ చేస్తున్నారు. మరికొందరు సదరు ఫీడ్‌ను పత్రికలకు, ఛానల్స్‌కు అందిస్తున్నారు. సంబంధిత సంఘటన ప్రాధాన్యం ఆధారంగా సదరు పత్రికలు, ఛానల్స్.. వాటిని అందించిన వ్యక్తులకు పారితోషికం అందిస్తున్నాయి. మన దేశంలో ఈ సంస్కృతి ఇప్పుడిప్పుడే విస్తరిస్తుండగా.. అమెరికా, ఇతర దేశాల్లో ఎన్నో ఏళ్ల నుంచి కనిపిస్తోంది. న్యూయార్క్ టైమ్స్, గార్డియన్, టైమ్స్, సీఎన్‌ఎన్ వంటి సంస్థలు.. తమ సిబ్బందిని సంఘటనా స్థలానికి పంపించలేని పరిస్థితుల్లో అక్కడి స్థానిక వ్యక్తుల నుంచి ఫీడ్‌ను స్వీకరించిన సందర్భాలు అనేకం. ఆ విధంగా సిటిజన్ జర్నలిజం సైతం నేటి యువతకు ఉపాధి మార్గంగా మారుతోంది.
ఈ అర్హతలు ఉంటే...
న్యూ మీడియా కెరీర్స్ పరంగా డిజిటల్ మీడియా రంగంలో స్థిరపడాలనుకునే ఔత్సా హికులకు కొన్ని అర్హతలు అవసరం.
అవి..
1. కంప్యూటర్ లాంగ్వేజ్ స్కిల్స్
2. కంటెంట్ రైటింగ్
3. గ్రాఫిక్ డిజైనింగ్
4. హెచ్‌టీఎంఎల్ టెక్నాలజీలపై అవగాహన
5. విజువలైజేషన్ టెక్నిక్స్
6. కమ్యూనికేషన్, లాంగ్వేజ్ స్కిల్స్
న్యూ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ విభాగం..
ముఖ్యాంశాలు:

- 2022 నాటికి మీడియా రంగంలో ఏడు నుంచి ఎనిమిది లక్షల ఉద్యోగాలు.
- వీటిలో 40 శాతం మేరకు డిజిటల్ మీడియాలోనే.
- ఎస్‌ఈఓ, ఆన్‌లైన్ అడ్వర్టయిజింగ్ ఎగ్జిక్యూటివ్స్, వెబ్ డెవలపర్స్‌కు పెరుగుతున్న డిమాండ్
- ప్రారంభంలో సగటున నెలకు రూ.18 వేల నుంచి రూ.20 వేల వేతనం.
Published date : 13 Nov 2018 04:26PM