డిగ్రీ తర్వాత..ఏ మార్గం మంచిది?
Sakshi Education
మరికొద్ది రోజుల్లో విద్యా సంవత్సరం ముగియనుంది! లక్షల మంది డిగ్రీ కోర్సుల విద్యార్థులు సర్టిఫికెట్లతో బయటికి రానున్నారు.
ఈ సందర్భంలో ప్రతి విద్యార్థికి ఎదురవుతున్న ప్రశ్న.. డిగ్రీ తర్వాత ఏం చేయాలి?! ఉద్యోగం.. ఉన్నత విద్య.. స్వయం ఉపాధి.. ఏ మార్గమైతే ఉత్తమం!! త్వరలో బీఎస్సీ, బీకామ్, బీఏ తదితర బ్యాచిలర్ డిగ్రీ కోర్సులు పూర్తిచేసుకోనున్న విద్యార్థులకు అందుబాటులో ఉన్న మార్గాలు..
ప్రస్తుత పోటీ ప్రపంచంలో రమేశ్, వికాస్, భాస్కర్ లాంటి వారు ఎంతోమంది! ఇలాంటి వారికి అందుబాటులో ఉన్న అవకాశాలేంటో చూద్దాం...
ప్రముఖ విద్యా సంస్థల్లో బీటెక్ వంటి ప్రొఫెషనల్ కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులు క్యాంపస్‌లోనే కొలువులు దక్కించుకుంటున్న పరిస్థితి. కానీ, సంప్రదాయ బ్యాచిలర్ డిగ్రీ కోర్సుల విద్యార్థులకు మాత్రం జాబ్‌మార్కెట్లో కొంత నిరాశే ఎదురవుతోంది. మరోవైపు మూడేళ్ల డిగ్రీ కోర్సు పూర్తయ్యాక.. ఉన్నత విద్య, ఉద్యోగం, స్వయం ఉపాధి... ఇలా విభిన్న మార్గాలు కనిపిస్తుంటాయి. దేన్ని ఎంపిక చేసుకోవాలో తెలియని పరిస్థితి. మంచి వేతనంతో ఉద్యోగంలో చేరితే కుటుంబం సంతోషిస్తుంది.. స్నేహితులు ఏ ఎంబీఏలోనో, లేదా సంబంధిత పీజీ కోర్సులో చేరాలంటూ సలహా ఇస్తుంటారు. తనకు మాత్రం సొంతంగా ఏదైనా చేస్తే బాగుంటుందనే ఆలోచన. ఇలాంటి పరిస్థితిలో సరైన నిర్ణయం తీసుకోవడం విద్యార్థికి కత్తిమీద సామే.
ఉన్నత విద్య :
ఉద్యోగావకాశాలు..
స్వయం ఉపాధి :
సర్కారీ కొలువులు... ముఖ్య మార్గాలు
ఆశావహ దృక్పథంతో అడుగులు..
విద్యార్థులు డిగ్రీలో చేరే సమయంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకునే క్రమంలో నిరుత్సాహ ఫలితాలు ఎదురైనా అధైర్య పడకుండా ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిసారించాలి. ప్రస్తుతం అన్ని రకాల డిగ్రీ విద్యార్థులకు ఉన్నత విద్య, ఉద్యోగం పరంగా ఎన్నో అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. వాటిని సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నించాలి..
- ప్రొఫెసర్ వి.ఆర్.పెద్దిరెడ్డి, ఐఐటీ-భువనేశ్వర్.
- ‘రమేశ్.. బీఏ పూర్తి చేశాడు. అకడమిక్ ట్రాక్ రికార్డ్ బాగానే ఉంది. కానీ.. తర్వాత భవిష్యత్తు ఏంటి?’ అనే ఆందోళన.
- వికాస్.. బీఎస్సీ (సైన్స్) ఫైనల్ ఇయర్‌లో ఉన్నాడు. వెంటనే ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదు. మరి వాట్ ఆఫ్టర్ డిగ్రీ..? అనే ఆలోచన అతన్ని వెంటాడుతోంది.
- భాస్కర్.. త్వరలో బీకామ్ పూర్తవుతుంది. తక్షణమే ఏదో ఒక జాబ్‌లో చేరాలనుకుంటున్నాడు. కానీ సరైన మార్గం ఏదో తెలియడం లేదు.
ప్రస్తుత పోటీ ప్రపంచంలో రమేశ్, వికాస్, భాస్కర్ లాంటి వారు ఎంతోమంది! ఇలాంటి వారికి అందుబాటులో ఉన్న అవకాశాలేంటో చూద్దాం...
ప్రముఖ విద్యా సంస్థల్లో బీటెక్ వంటి ప్రొఫెషనల్ కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులు క్యాంపస్‌లోనే కొలువులు దక్కించుకుంటున్న పరిస్థితి. కానీ, సంప్రదాయ బ్యాచిలర్ డిగ్రీ కోర్సుల విద్యార్థులకు మాత్రం జాబ్‌మార్కెట్లో కొంత నిరాశే ఎదురవుతోంది. మరోవైపు మూడేళ్ల డిగ్రీ కోర్సు పూర్తయ్యాక.. ఉన్నత విద్య, ఉద్యోగం, స్వయం ఉపాధి... ఇలా విభిన్న మార్గాలు కనిపిస్తుంటాయి. దేన్ని ఎంపిక చేసుకోవాలో తెలియని పరిస్థితి. మంచి వేతనంతో ఉద్యోగంలో చేరితే కుటుంబం సంతోషిస్తుంది.. స్నేహితులు ఏ ఎంబీఏలోనో, లేదా సంబంధిత పీజీ కోర్సులో చేరాలంటూ సలహా ఇస్తుంటారు. తనకు మాత్రం సొంతంగా ఏదైనా చేస్తే బాగుంటుందనే ఆలోచన. ఇలాంటి పరిస్థితిలో సరైన నిర్ణయం తీసుకోవడం విద్యార్థికి కత్తిమీద సామే.
ఉన్నత విద్య :
- దేశంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని ఉద్యోగాలకు పోటీ రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ప్రైవేటు రంగ కంపెనీల్లో మంచి హోదాతో కొలువు దక్కాలంటే.. కేవలం డిగ్రీతో సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడంలేదు. అందుకే అధికశాతం మంది విద్యార్థులు ఇప్పుడు గ్రాడ్యుయేషన్ పూర్తికాగానే పీజీ కోర్సులపై దృష్టిసారిస్తున్నారు. ఆర్ట్స్/ హ్యుమానిటీస్/సోషల్ సెన్సైస్, సెన్సైస్, కామర్స్.. ఇలా అన్ని విభాగాల విద్యార్థులకు విస్తృతమైన ఉన్నత విద్యావకాశాలు అందుబాటులో ఉన్నాయి.
- ఏ విభాగంలో డిగ్రీ పూర్తిచేసినా ఎక్కువ మంది విద్యార్థులు ఆలోచించేది ఎంబీఏ (మాస్టర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్) గురించే! దేశంలో ఎంబీఏ కోర్సులను అందించడంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)లకు మంచి పేరుంది. వీటిలో చేరేందుకు క్యాట్ స్కోర్ అవసరం. అదే విధంగా దేశవ్యాప్తంగా పలు కాలేజీల్లో ఎంబీఏ కోర్సు అందుబాటులో ఉంది. అలాగే తెలుగు రాష్ట్రాల్లోని యూనివర్సిటీలు అందించే ఎంబీఏలో చేరేందుకు ఐసెట్ (ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రెన్స్ టెస్టు) రాయాలి.
- సైన్స్ గ్రాడ్యుయేట్స్ ముందున్న ఉన్నత విద్య మార్గం.. ఎంఎస్సీ. సంబంధిత సబ్జెక్టులో ఎంఎస్సీ కోర్సు పూర్తిచేసుకోవడం ద్వారా పీహెచ్‌డీ, పరిశోధనల దిశగా ముందుకెళ్లొచ్చు. పరిశోధన సంస్థల్లో ఉద్యోగాలు, బోధన రంగంలో అవకాశాలు అందుకోవచ్చు. సైన్స్ పట్టభద్రులు ఐఐఎస్‌ఈఆర్‌లు, ఐఐఎస్‌సీ, టిఫర్, హోమీబాబా రీసెర్చ్ సెంటర్ వంటి వాటిలో ఎంఎస్ బై రీసెర్చ్ పేరుతో ఒకవైపు పీజీ చేస్తూనే.. పరిశోధనలు సాగించేందుకు అవకాశముంది. కాబట్టి సెన్సైస్ విద్యార్థులు ఐఐఎస్‌ఈఆర్, ఐఐఎస్‌సీ, నైపర్ తదితర విద్యాసంస్థల ప్రవేశ పరీక్షలకు సన్నద్ధం కావాలి. ఫలితంగా సైన్స్, ఫార్మసీ రంగాల్లో పరిశోధనలు చేసే స్థాయికి చేరుకోగలరు.
- ఐటీ రంగంలో ఉద్యోగం లక్ష్యమైతే బీఎస్సీ విద్యార్థులు ఎంసీఏ (మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్)లో చేరొచ్చు. ఇందుకోసం ఐసెట్, నిమ్‌సెట్ వంటి పరీక్షల్లో ర్యాంకు సొంతం చేసుకోవాల్సి ఉంటుంది.
- బీఏ విద్యార్థులు ఉన్నత విద్య పరంగా ఆయా సబ్జెక్టుకు సంబంధించిన ఎంఏ కోర్సుల్లో చేరొచ్చు. ఎంఏ ఎకనామిక్స్, ఎంఏ ఇంగ్లిష్, ఎంఏ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ తదితర కోర్సులకు మంచి డిమాండ్ ఉంది. ఇటీవల కాలంలో సోషల్ సెన్సైస్ అభ్యర్థులకూ డిమాండ్ నెలకొంది. దాంతో ఈ నైపుణ్యాలు అందించే పీజీ కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి వారు ఎన్‌ఐఆర్‌డీ, ఎన్‌ఐఆర్‌ఎం, టిస్ వంటి విద్యా సంస్థల్లో పీజీ+ ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ కోర్సుల్లో చేరొచ్చు.
- బీకామ్ పూర్తిచేసుకున్న విద్యా ర్థులు చార్టర్డ్ అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ, కాస్ట్ అకౌంటెన్సీ వంటి కోర్సుల దిశగా అడుగు వేయొచ్చు. పీజీ స్థాయిలో ఎంకామ్ లేదా ఎంబీఏలో చేరడం ద్వారా కెరీర్‌లో రాణించేందుకు అవకాశముంది.
- బీఎస్సీ, బీకామ్, బీఏ.. ఏ విభాగంలో డిగ్రీ పూర్తిచేసినా.. బోధనపై ఆసక్తి ఉంటే.. బీఈడీలో చేరడం ద్వారా టీచింగ్ కెరీర్‌ను ఎంపిక చేసుకోవచ్చు.
- ఉన్నతవిద్య పరంగా విదేశీ యూనివర్సిటీల్లో చేరడంపైనా మన విద్యార్థులు దృష్టిపెడుతున్నారు. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, సింగపూర్ తదితర దేశాల్లో ఎంబీఏ, ఎంఎస్ వంటి కోర్సుల్లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఆయా విదేశీ విద్య అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే.. నిర్దిష్టంగా అకడమిక్ ట్రాక్ రికార్డ్‌తోపాటు స్టాండర్డ్ టెస్ట్ స్కోర్స్ (జీఆర్‌ఈ, జీమ్యాట్, టోఫెల్, ఐఈఎల్‌టీఎస్) సాధించడం తప్పనిసరి.
ఉద్యోగావకాశాలు..
- బ్యాచిలర్ డిగ్రీ సర్టిఫికెట్లతో క్యాంపస్‌ల నుంచి బయటికి వస్తున్న వారికి అందుబాటులో ఉన్న మరో ముఖ్యమైన మార్గం.. ఉద్యోగం. ప్రభుత్వ ఉద్యోగం కోసం లక్షల మంది పోటీపడే ఆయా పోటీ పరీక్షల్లో ప్రతిభ చూపాల్సి ఉంటుంది. అలాగే ప్రైవేటు రంగంలో కొలువు కోసం సంబంధిత కంపెనీలు అనుసరించే నియామక ప్రక్రియలో సత్తా చాటాలి. ఉద్యోగాన్ని లక్ష్యంగా నిర్దేశించుకున్న విద్యార్థులు.. సంబంధిత నియామక పరీక్షలకు ముందుగానే సన్నద్ధం కావాలి.
- బీఎస్సీ, బీకాం, బీఏ తదితర కోర్సులు పూర్తిచేసిన వారు సర్కారీ కొలువుల పరంగా కేంద్ర ప్రభుత్వ స్థాయిలో సివిల్ సర్వీసెస్, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉద్యోగాలకు పోటీపడొచ్చు. యూపీఎస్సీ, ఎస్‌ఎస్‌సీ, ఐబీపీఎస్, ఆర్‌ఆర్‌బీ, ఎస్‌బీఐ, త్రివిధ దళాల్లో పోస్టుల భర్తీకి రెగ్యులర్‌గా వెలువడే నోటిఫికేషన్‌లకు దరఖాస్తు చేసుకొని, ఆయా పోటీ పరీక్షల్లో ప్రతిభ ద్వారా ఉద్యోగం సంపాదించొచ్చు.
- కేంద్ర ప్రభుత్వ తాజా గణాంకాల ప్రకారం 2016-17లో మొత్తం 1,00,933 ఉద్యోగాల భర్తీ జరిగింది. యూపీఎస్సీ (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) ద్వారా 5,735.. ఎస్‌ఎస్‌సీ (స్టాఫ్ సెలక్షన్ కమిషన్) ద్వారా 68,880.. ఆర్‌ఆర్‌బీ (రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్) ద్వారా 26,318 పోస్టులను భర్తీ చేసినట్లు పేర్కొంది. గత మూడేళ్లుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో తగ్గుదల నమోదవడం గమనార్హం. ఇటీవల రైల్వేల్లో వివిధ విభాగాల్లో దాదాపు 90వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
- తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల స్థాయిలో.. ఆంధ్రప్రదేశ్‌లో ఏపీపీఎస్సీ, తెలంగాణలో టీఎస్‌పీఎస్సీ నిర్వహించే గ్రూప్స్, పంచాయతీ సెక్రటరీ తదితర పరీక్షలు, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్‌లు నిర్వహించే ఎస్‌ఐ పోస్టులు, డీఎస్సీ ద్వారా ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టులకూ పోటీపడొచ్చు.
- ఉద్యోగాల పరంగా బ్యాచిలర్ డిగ్రీ విద్యార్థులకు ఇటీవల కాలంలో ఉత్తమ మార్గంగా నిలుస్తోంది బ్యాంకింగ్ రంగం. దేశంలో ఎస్‌బీఐ, ఇతర జాతీయ బ్యాంకుల్లో క్లరికల్, పీఓ స్థాయి పోస్ట్‌లకు ఏటా క్రమం తప్పకుండా నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి.
- ప్రైవేటు ఉద్యోగాన్ని లక్ష్యంగా చేసుకున్న విద్యార్థులు.. తమకు ఆసక్తి ఉన్న రంగంలో తాజా జాబ్ మార్కెట్ ట్రెండ్స్, ఆయా ప్రైవేటు ఉద్యోగాలు పొందేందుకు అవసరమైన అర్హతలు, నైపుణ్యాల గురించి తెలుసుకోవాలి. సంబంధిత సర్టిఫికేషన్స్, ఇంటర్న్‌షిప్స్ ద్వారా అవకాశాలు మెరుగుపరచుకోవచ్చు. ఇందుకోసం అవసరమైతే అందుబాటులో ఉన్న షార్ట్ టర్మ్ సర్టిఫికేషన్ కోర్సుల్లో శిక్షణ పొందాలి. ఎప్పటికప్పుడు మారుతున్న కంపెనీల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు సొంతం చేసుకొని.. జాబ్ పోర్టల్స్, రిఫరల్స్, ఇతర మార్గాల ద్వారా ఆయా సంస్థల్లో ఖాళీలకు దరఖాస్తు చేసుకుంటూ ఉద్యోగ ప్రయత్నాలు కొనసాగించొచ్చు.
స్వయం ఉపాధి :
- బ్యాచిలర్ డిగ్రీ విద్యార్థులకు భవిష్యత్తు పరంగా మరో ముఖ్యమైన మార్గం.. స్వయం ఉపాధి. మదిలో చక్కటి వ్యాపార ఆలోచన.. దానికి మార్కెట్ పరంగా డిమాండ్ ఉంటే చాలు.. వెన్నుతట్టి ప్రోత్సహించేందుకు ఎందరో ఏంజెల్ ఇన్వెస్టర్లు ముందుకొస్తున్నారు. ప్రభుత్వ పరంగానూ స్వయం ఉపాధి ఔత్సాహికులకు పలు ప్రోత్సాహకాలు అందుబాటులో ఉన్నాయి.
- మేకిన్ ఇండియా, స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా... వంటి పథకాల నేపథ్యంలో ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, ముద్ర పథకం వంటి వాటి ద్వారా సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ ఔత్సాహికులు ఆర్థిక ప్రోత్సాహకాలు అందుకునే ప్రయత్నం చేయొచ్చు.
సర్కారీ కొలువులు... ముఖ్య మార్గాలు
- యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్, ఐఎఫ్‌ఎస్, సీడీఎస్ తదితర పరీక్షలు.
- రాష్ట్రాల స్థాయిలో పబ్లిక్ సర్వీస్ కమిషన్లు నిర్వహించే గ్రూప్-1, 2, 3, పంచాయతీ కార్యదర్శులు.
- రెవెన్యూ డిపార్ట్‌మెంట్ నిర్వహించే వీఆర్‌ఓ/వీఆర్‌ఏ.
- పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ నిర్వహించే కానిస్టేబుల్/ఎస్‌ఐ.
- ఐబీపీఎస్, ఎస్‌బీఐ నిర్వహించే క్లరికల్, పీఓ.
- ఎస్‌ఎస్‌సీ నిర్వహించే కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్.
ఆశావహ దృక్పథంతో అడుగులు..
విద్యార్థులు డిగ్రీలో చేరే సమయంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకునే క్రమంలో నిరుత్సాహ ఫలితాలు ఎదురైనా అధైర్య పడకుండా ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిసారించాలి. ప్రస్తుతం అన్ని రకాల డిగ్రీ విద్యార్థులకు ఉన్నత విద్య, ఉద్యోగం పరంగా ఎన్నో అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. వాటిని సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నించాలి..
- ప్రొఫెసర్ వి.ఆర్.పెద్దిరెడ్డి, ఐఐటీ-భువనేశ్వర్.
Published date : 31 Mar 2018 06:24PM