బెల్ ద క్యాట్...కోచింగ్ లేకుండానే
Sakshi Education
కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్).. దేశంలోని ప్రతిష్టాత్మక బీస్కూల్స్.. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)లో పీజీ మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష. క్యాట్ 2018కు నోటిఫికేషన్ జూలై చివరి వారంలో వెలువడనుంది.
నవంబర్ 25న క్యాట్-2018 ఆన్‌లైన్ (కంప్యూటర్ ఆధారిత) విధానంలో జరగనుంది. దేశ వ్యాప్తంగా ఉన్న 20 ఐఐఎంలతోపాటు మరో వంద వరకూ బీస్కూల్స్ క్యాట్ స్కోర్‌ను ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. అందుకే ఎంబీఏ/మేనేజ్‌మెంట్ పీజీ కోర్సుల్లో చేరాలనుకునే లక్షల మంది ప్రతిభావంతుల లక్ష్యం క్యాట్. ఈ ఏడాది క్యాట్ పరీక్షను ఐఐఎం కలకత్తా నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో ఔత్సాహికులకు ఉపయోగడేలా క్యాట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు అర్హతలు, పరీక్ష విధానం, సిలబస్ విశ్లేషణ, దీర్ఘకాలిక ప్రిపరేషన్ ప్రణాళిక...
అర్హతలు :
గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా కాలేజీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. డిగ్రీలో జనరల్, ఓబీసీ-ఎన్‌సీ అభ్యర్థులకు కనీసం 50 శాతం మార్కులు, ఇతర రిజర్వేషన్ కేటగిరీ విద్యార్థులకు కనీసం 45 శాతం మార్కులు రావాలి. ఫైనలియర్ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. క్యాట్ పరీక్షకు ఎలాంటి గరిష్ట వయోపరిమితి నిబంధన లేదు.
పరీక్షా విధానం :
క్యాట్-2018 గతేడాది విధానంలోనే జరిగే అవకాశముంది. క్యాట్ పరీక్ష.. 100 ప్రశ్నలు, మూడు గంటల వ్యవధిలో ఆన్‌లైన్ విధానంలో ఆబ్జెక్టివ్ తరహాలో జరగనుంది. మొత్తం 300 మార్కులకు పరీక్ష ఉంటుంది. ప్రతి సరైన సమాధానానికి 3 మార్కులు లభిస్తాయి. తప్పు సమాధానానికి 1 నెగిటివ్ మార్కు ఉంటుంది. నాన్ ఎంసీక్యూ తరహా ప్రశ్నలకు నెగిటివ్ మార్కింగ్ విధానం లేదు. పరీక్షలో క్వాంటిటేటివ్ ఎబిలిటీ, వెర్బల్ ఎబిలిటీ అండ్ రీడింగ్ కాంప్రెహెన్షన్; డేటాఇంటర్‌ప్రిటేషన్ అండ్ లాజికల్ రీజనింగ్ విభాగాలు ఉంటాయి.
సిలబస్.. ప్రిపరేషన్
డీఐఎల్‌ఆర్ :
డేటాఇంటర్‌ప్రిటేషన్, లాజికల్ రీజనింగ్ విభాగం (డీఐఎల్‌ఆర్).. 32 ప్రశ్నలు 96 మార్కులకు ఉంటుంది. ఇందులో బార్‌గ్రాఫ్స్, కేస్‌లెట్స్, కాలమ్‌గ్రాఫ్స్, టేబుల్స్, లైన్‌ఛార్‌ట్స, వెన్ డయాగ్రామ్స్, పై ఛార్‌ట్స, కాంబినేషన్ ఆఫ్ టు ఆర్ మోర్ టైప్స్ లింక్డ్ టు ఈచ్ అదర్, బ్లడ్ రిలేషన్‌స, క్యాలెండర్స్, క్యూబ్స్, క్లాక్స్, నంబర్ అండ్ లెటర్ సిరీస్, బైనరీ లాజిక్, సీటింగ్ అరేంజ్‌మెంట్, లాజికల్, మ్యాచింగ్, లాజికల్ సీక్వెన్‌స, కనెక్టివ్‌స, బ్లడ్ రిలేషన్‌స తదితర అంశాలపై ప్రశ్నలు వస్తాయి. క్యాట్ ఔత్సహికులు డీఐఎల్‌ఆర్ విషయలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి. మొత్తంగా క్యాట్‌లో మంచి పర్సంటైల్ సాధించినప్పటికీ.. డీఐఎల్‌ఆర్‌లో కటాఫ్ మార్కులు అందుకోలేకపోవడంతో అనేక మందికి గతంలో ఐఐఎంల నుంచి పిలుపురాలేదు. దీన్నిబట్టి ఐఐఎంలు తాము పెట్టుకున్న డీఐఎల్‌ఆర్ కటాఫ్ విషయంలో ఎంత కచ్చితంగా ఉంటున్నాయో అర్థమవుతుంది. కాబట్టి అభ్యర్థులు సెక్షనల్ కటాఫ్‌ను పరిగణనలోకి తీసుకొని ప్రిపరేషన్ సాగించాలి.
వెర్బల్ ఎబిలిటీ (వీఏఆర్‌సీ) :
వెర్బల్‌ఎబిలిటీ, రీడింగ్ కాంప్రెహెన్షన్ విభాగంలో 34 ప్రశ్నలు, 102 మార్కులకు ఎదురవుతాయి. గతేడాది క్యాట్‌లో వీఏఆర్‌సీ విభాగంలో 33 శాతం ప్రశ్నలు వెర్బల్ ఎబిలిటీ నుంచి వచ్చాయి. వెర్బల్ ఎబిలిటీ ప్రశ్నలు గ్రామర్, వొకాబ్యులరీ ఆధారితంగా ఉంటాయి. 2015లో ఐఐఎం అహ్మదాబాద్ క్యాట్ పరీక్షా విధానాన్ని సమూలంగా మార్చినప్పటి నుంచి.. పేపర్‌లో వెర్బల్ ఎబిలిటీ అండ్ రీడింగ్ కాంప్రెహెన్షన్ మొదటి విభాగంగా ఉంటోంది. వెర్బల్ ఎబిలిటీ ప్రశ్నల శైలికి సంబంధించి గత రెండేళ్లలో ఎలాంటి మార్పు లేదు. ఈ సంవత్సరం కూడా ఇదే సరళి కొనసాగే అవకాశముంది. వెర్బల్‌ఎబిలిటీ ద్వారా అభ్యర్థుల్లోని భాషా (ఇంగ్లిష్) పొందిక, వినియోగంలో నైపుణ్యాన్ని పరీక్షిస్తారు. వెర్బల్ ఎబిలిటీలో మంచి మార్కులు సాధించాలంటే.. పేరాసమ్మరీ, జంబుల్డ్ పేరాగ్రాఫ్, పికింగ్ ఆడ్ సెంటెన్‌స ఔట్ ఆఫ్ జంబుల్డ్ పేరాగ్రాఫ్ వంటి అంశాలపై అధికంగా దృష్టిపెట్టాలి. దాంతోపాటు సినానిమ్స్, ఆంటోనిమ్స్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, గ్రామర్, ఫిల్ ఇన్ ద బ్లాంక్, అనాలజీస్, రివర్స్ అనాలజీస్, వెర్బల్ రీజనింగ్, రీడింగ్ కాంప్రెహెన్షన్ అంశాలపై దృష్టిపెట్టాలి. క్యాట్‌కి ప్రిపేరయ్యే అభ్యర్థుల్లో ఎక్కువ మంది ఈ విభాగాన్ని క్లిష్టంగా భావిస్తుంటారు. ఆర్‌సీలో అడిగే ప్రశ్నలన్నీ మల్టిపుల్‌ఛాయిస్ విధానంలో నెగిటివ్ మార్కింగ్‌తో ఉంటాయి. వీఏ, ఆర్‌సీ ప్రశ్నల మధ్య ప్రధాన వ్యత్యాసం ఇదే. ఆన్‌లైన్ ప్రాక్టీస్, ప్యాసేజ్ భావాన్ని అర్థంచేసుకోవడం ద్వారా అభ్యుర్థులు ఆర్‌సీ ప్రిపరేషన్ కొనసాగించాలి. ఎక్కువ శాతం ఆర్‌సీ ప్రశ్నలు వొకాబ్యులరీతో ముడిపడి ఉంటున్నాయి. కాబట్టి వొకాబ్యులరీపై పట్టు పెంచుకోవడం ద్వారా ఈ విభాగంలో మంచి స్కోరు చేయొచ్చు. ఈ విభాగం నుంచి రీజనింగ్, ట్రూ ఆర్ ఫాల్స్ కోణంలోనూ ప్రశ్నలు వస్తున్నాయి.
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ :
క్యాట్‌లో మరో కీలకమైన, క్లిష్టమైన విభాగం... క్వాంటిటేటివ్ ఎబిలిటీ. ఈ విభాగం.. 34 ప్రశ్నలు, 102 మార్కులకు ఉంటుంది. ఇందులో ట్రిగనోమెట్రీ, కోఆర్డినేట్ జామెట్రీ, నంబర్ సిరీస్, ప్రాఫిట్ అండ్ లాస్, పర్సంటేజెస్, స్పీడ్, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, రేషియో ప్రపోరన్‌స, యావరేజెస్, సీక్వెన్‌స, సిరీస్, ప్రాబబిలిటీ నుంచి ప్రశ్నలు వచ్చే అవకాశముంది. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌కు సంబంధించి మంచి పుస్తకాలు చదవడం ద్వారా అభ్యర్థులకు కాన్సెప్ట్యుల్ అవగాహన ఏర్పడుతుంది. బేసిక్స్‌పై పట్టుసాధించడం ద్వారా క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌లో మంచి మార్కులు సాధించొచ్చు.
రిఫరెన్స్ బుక్స్
ఎగ్జామ్ టిప్స్...
ప్రతి మార్కూ కీలకం..
క్యాట్.. విస్తృత అంశాలను పరీక్షించే ఆప్టిట్యూడ్ టెస్ట్. దీనిద్వారా ముఖ్యంగా ప్రాథమిక అంశాలకు సంబంధించిన అప్లికేషన్‌సపై అభ్యర్థుల పరిజ్ఞానాన్ని అంచనావేస్తారు. కాన్సె ప్ట్యువల్ అవగాహన-అప్లికేషన్లపై పట్టుసాధించడం వంటి వాటిని క్యాట్ విజయ వ్యూహాలుగా చెప్పొచ్చు. ఔత్సాహికులకు స్మార్ట్ క్వశ్చన్ సెలక్షన్/ జడ్జిమెంట్‌తోపాటు మూడు గంటలపాటు ఫోకస్డ్‌గా కూర్చోగలిగే సామర్థ్యం ఉండాలి. క్యాట్ 2018లో అడిగే 100 ప్రశ్నలు (అంచనా) 2 లక్షల మంది భవిష్యత్‌ను నిర్ణయిస్తాయి. దీన్నిబట్టి ప్రతిప్రశ్నా 2000 ర్యాంకులను ప్రభావితం చేస్తుంది. ప్రతి మార్కు.. ఫలితాలను తారుమారు చేస్తుంది. కాబట్టి పూర్తిసామర్థ్యంతో ప్రిపరేషన్ సాగించిన అభ్యర్థులే విజయం సాధించగలరు. అత్యున్నత ప్రమాణాలతో కూడిన ప్రిపరేషన్ ద్వారా అభ్యర్థులు డిగ్రీ కాలేజీ నుంచి నేరుగా బీస్కూల్లో ప్రవేశం పొందే అవకాశం సొంతం చేసుకోవచ్చు. డిగ్రీ ఫైనలియర్‌లో క్యాట్‌కు హాజరవ్వాలనుకునే అభ్యర్థులు ఏడాదిన్నర ముందు నుంచే ప్రిపరేషన్ మొదలెట్టాలి. ముందస్తు ప్రిపరేషన్‌తో అకడమిక్ స్టడీస్ (కాలేజ్ పరీక్షలు, ఇంటర్నల్స్, ప్రాక్టికల్స్..)తోపాటు క్యాట్ ప్రిపరేషన్‌ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. వెర్బల్ ఎబిలిటీ, జనరల్ అవేర్‌నెస్ విభాగాల(క్యూఏ/డీఐ/ఎల్‌ఆర్‌లతో పోల్పితే) ప్రిపరేషన్‌కు ఎక్కువ సమయం పడుతుంది. ప్రిపరేషన్‌ను త్వరగా ప్రారంభిస్తే ఆయా విభాగాలకు ఎక్కువ సమయం కేటాయించొచ్చు.
- కె.రామనాథం, క్యాట్ కోర్సు డెరైక్టర్, టైమ్.

- అరుణ్ శర్మ క్యాట్ బుక్స్, అరిహంత్ రీజనింగ్ బుక్స్.
ఎగ్జామ్ టిప్స్...
- క్యాట్ ప్రిపరేషన్ పరంగా ఆన్‌లైన్ మాక్ టెస్టులు అత్యంత కీలకం. మాక్ టెస్టుల ద్వారా సబ్జెక్టుపై ఏ మేరకు పట్టు సాధించారనేదానిపైనే అభ్యర్థులకు అవగాహన వస్తుంది. ఇది తుది ఫలితాలను ప్రభావితం చేస్తుంది. కంప్యూటర్ ఆధారిత మాక్‌టెస్ట్‌లకు హాజరవడం వల్ల అభ్యర్థులకు వాస్తవ పరీక్షా పరిస్థితులపై అవగాహన ఏర్పడుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని అభ్యర్థులు సాధ్యమైనన్ని ఆన్‌లైన్ క్యాట్ మాక్ టెస్టులకు హాజరవ్వాలి. దీంతోపాటు గత ప్రశ్నపత్రాలను సాధన చేయడం ద్వారా స్వీయ సామర్థ్యంపై ఒక అంచనాకు రావొచ్చు.
- మాక్ టెస్టుకు హాజరైన వెంటనే అభ్యర్థులు పరీక్షలో చూపిన ప్రదర్శనను విశ్లేషించుకోవాలి. క్యాట్ పరీక్షా విధానాన్ని దృష్టిలో పెట్టుకొని విభాగాల వారీగా స్కోరింగ్ విభాగాలపై ఒక నిర్ణయానికి రావాలి. సహజంగా అభ్యర్థులు కేవలం తప్పుగా రాసిన సమాధానాలనే విశ్లేషిస్తూ ఉంటారు. అలాకాకుండా సరిగా రాసిన సమాధానాలను సైతం విశ్లేషించడం చేస్తే సబ్జెక్ట్‌పై మరింత పట్టు చిక్కుతుంది.
- క్యాట్‌కి ప్రిపేరయ్యే అభ్యర్థులు ప్రశ్నకు సమాధానం గుర్తించే క్రమంలో కోర్ కాన్సెప్ట్‌పై అవగాహనతో ముందుకెళ్తున్నామా!లేదా? అనే విషయాన్ని గుర్తించాలి. కాన్సెప్ట్యువల్ అవగాహన లేమితో సమాధానాలు గుర్తించలేకపోయిన ప్రశ్నలను నోట్ చేసుకొని.. వెంటనే పాఠ్యపుస్తకం లేదా క్యాట్ మెటీరియల్‌ను రిఫర్ చేయాలి. పరీక్ష కోణంలో ఆయా విభాగాల్లో కాన్సెప్ట్యువల్ అవగాహన పెంచుకోవాలి.
- క్యాట్‌లో ఎక్కువగా బేసిక్ కాన్సెప్ట్ అప్లికేషన్స్‌పై ప్రశ్నలు వస్తున్నాయి. క్యాట్ 2018కి హాజరయ్యే అభ్యర్థులు ఈ దశలో కాన్సెప్టులు, అప్లికేషన్స్‌పై ఒకేసారి దృష్టిపెట్టడం సరికాదు. అభ్యర్థులు ముందుగా ఏయే విభాగాల్లో బలంగా ఉన్నారో వాటిపై మరింత దృష్టిపెట్టడం ఉపయుక్తంగా ఉంటుంది. ప్రాక్టీస్ ఎంత ఎక్కువగా చేస్తే పరీక్ష రోజు ప్రశ్నలతో అంత త్వరగా కనెక్ట్ అవగలుగుతారు. షెడ్యూల్ ప్రకారం-ప్రాక్టీస్ చేయడం ద్వారా ప్రశ్నలను వేగంగా పరిష్కరించగలిగే నేర్పు, కూర్చుని ఏకధాటిగా 3 గంటలపాటు చదవగలిగే సామర్థ్యం అలవడుతాయి. క్యాట్‌కు హాజరయ్యే అభ్యర్థులు సాధారణంగా ప్రశ్నల అటెంప్ట్‌కు సంబంధించి గరిష్ట, కనిష్ట లక్ష్యాలు పెట్టుకుంటూ ఉంటారు. కానీ, నిపుణులు మాత్రం ఈ విషయంలో ఓపెన్‌గా ఉండమని సూచిస్తున్నారు. ముఖ్యంగా బలంగా ఉన్న విభాగాల్లోని అన్ని ప్రశ్నలను అటెంప్ట్ చేసేందుకు ప్రయత్నించాలి. అలాగే ప్రతి విభాగంలో 20 వరకు ప్రశ్నలకు సమాధానాలు రాయగలిగేలా ప్రిపేరయితే మంచి పర్సంటైల్ సాధించొచ్చు.
- టైం మేనేజ్‌మెంట్ : వేగంగా ప్రశ్నలను సాధించే నైపుణ్యాన్ని అలవరచుకోవాలి. చూడగానే సమాధానం గుర్తించలేని ప్రశ్నలను తొలి విడతలో విడిచిపెట్టి..ఆయా ప్రశ్నలకు రెండో రౌండ్‌లో సమాధానాలు గుర్తించేందుకు ప్రయత్నించాలి. ఎందుకంటే.. పరీక్ష ప్రారంభించిన వెంటనే వేగంగా కొన్ని ప్రశ్నలను సాల్వ్ చేయడం ద్వారా ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. అదే ఉత్సాహంతో రెండో రౌండ్‌లో క్లిష్టమైన ప్రశ్నలను సాల్వ్ చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. సెకండ్ రౌండ్‌లో సైతం క్లిష్టంగా అనిపించే ప్రశ్నల విషయంలో..ప్రత్యామ్నాయ వ్యూహాన్ని అమలుచేయాలి. ఇందులో భాగంగా ముందు ఆప్షన్లను స్కానన్ చేయాలి. కొన్నిసార్లు ప్రశ్న కింద ఇచ్చిన ఆప్షన్లు..ప్రశ్న సాధనకు కావాల్సిన ఆలోచనను రేకిత్తిస్తాయి. ఈ దిశగా ముందు అన్‌రిలేటెడ్ ఆప్షన్లను ఎలిమినేట్ చేయాలి. తద్వారా ఆప్షన్ల సంఖ్య తగ్గి.. సరైన సమాధానం ఎంచుకొనే అవకాశాలు మెరుగవుతాయి.
ప్రతి మార్కూ కీలకం..
క్యాట్.. విస్తృత అంశాలను పరీక్షించే ఆప్టిట్యూడ్ టెస్ట్. దీనిద్వారా ముఖ్యంగా ప్రాథమిక అంశాలకు సంబంధించిన అప్లికేషన్‌సపై అభ్యర్థుల పరిజ్ఞానాన్ని అంచనావేస్తారు. కాన్సె ప్ట్యువల్ అవగాహన-అప్లికేషన్లపై పట్టుసాధించడం వంటి వాటిని క్యాట్ విజయ వ్యూహాలుగా చెప్పొచ్చు. ఔత్సాహికులకు స్మార్ట్ క్వశ్చన్ సెలక్షన్/ జడ్జిమెంట్‌తోపాటు మూడు గంటలపాటు ఫోకస్డ్‌గా కూర్చోగలిగే సామర్థ్యం ఉండాలి. క్యాట్ 2018లో అడిగే 100 ప్రశ్నలు (అంచనా) 2 లక్షల మంది భవిష్యత్‌ను నిర్ణయిస్తాయి. దీన్నిబట్టి ప్రతిప్రశ్నా 2000 ర్యాంకులను ప్రభావితం చేస్తుంది. ప్రతి మార్కు.. ఫలితాలను తారుమారు చేస్తుంది. కాబట్టి పూర్తిసామర్థ్యంతో ప్రిపరేషన్ సాగించిన అభ్యర్థులే విజయం సాధించగలరు. అత్యున్నత ప్రమాణాలతో కూడిన ప్రిపరేషన్ ద్వారా అభ్యర్థులు డిగ్రీ కాలేజీ నుంచి నేరుగా బీస్కూల్లో ప్రవేశం పొందే అవకాశం సొంతం చేసుకోవచ్చు. డిగ్రీ ఫైనలియర్‌లో క్యాట్‌కు హాజరవ్వాలనుకునే అభ్యర్థులు ఏడాదిన్నర ముందు నుంచే ప్రిపరేషన్ మొదలెట్టాలి. ముందస్తు ప్రిపరేషన్‌తో అకడమిక్ స్టడీస్ (కాలేజ్ పరీక్షలు, ఇంటర్నల్స్, ప్రాక్టికల్స్..)తోపాటు క్యాట్ ప్రిపరేషన్‌ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. వెర్బల్ ఎబిలిటీ, జనరల్ అవేర్‌నెస్ విభాగాల(క్యూఏ/డీఐ/ఎల్‌ఆర్‌లతో పోల్పితే) ప్రిపరేషన్‌కు ఎక్కువ సమయం పడుతుంది. ప్రిపరేషన్‌ను త్వరగా ప్రారంభిస్తే ఆయా విభాగాలకు ఎక్కువ సమయం కేటాయించొచ్చు.
- కె.రామనాథం, క్యాట్ కోర్సు డెరైక్టర్, టైమ్.
Published date : 06 Jul 2018 12:43PM