ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు రూ.10,000 స్కాలర్‌షిప్.. పొందే విధానం ఇలా..
బీఈ/బీటెక్ కోర్సుల్లో ప్రవేశం పొందిన వారికి నాలుగేళ్లు, ఇంటిగ్రేటెడ్ పీజీలు చేసే వారికి మొదటి మూడేళ్లు ఏడాదికి రూ.10,000 చొప్పున చెల్లిస్తారు. అలాగే ఇంటిగ్రేటెడ్ పీజీలోని భాగమైన పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ఏడాదికి రూ.20,000 చొప్పన రెండేళ్ల పాటు స్కాలర్‌షిప్‌ను అందిస్తారు.
రాష్ట్రాల వారీగా..
ఈ స్కాలర్‌షిప్ స్కీమ్‌ను రాష్ట్రాల వారిగా విభజించారు. జాతీయ స్థాయిలో సీబీఎస్‌ఈ విధానంలో చదివిన 12వ తరగతి (10+2) విద్యార్థులకు 5413, ఐసీఎస్‌ఈ విద్యార్థులకు 577 స్కాలర్‌షిప్‌లను కేటాయించారు. ఆయా రాష్ట్రాల్లో 18-25 ఏళ్ల వయసు జనాభానూ, సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ బోర్డుల్లో టెన్త్‌లో సాధించిన ఉత్తీర్ణత శాతాన్ని పరిగణంలోకి తీసుకున్నారు. రాష్ట్రాల వారిగా కేటాయించిన స్కాలర్‌షిప్స్‌లో సైన్స్, కామర్స్, హ్యుమానిటీస్ విద్యార్థులను 3:2:1 నిష్పత్తిలో ఎంపిక చేస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో..
రెండు తెలుగు రాష్ట్ర్రాలకు ఇంటర్మీడియట్ బోర్డుల వారిగా స్కాలర్‌షిప్‌లను కేటాయించారు. ఇందులో తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ద్వారా ఇంటర్ పూర్తిచేసిన విద్యార్థులకు-2570, అలాగే ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు ద్వారా ఇంటర్ పూర్తిచేసిన విద్యార్థులకు-3527 స్కాలర్‌షిప్‌లు లభిస్తాయి. అలాగే దేశ వ్యాప్తంగా రాష్ట్రాల వారీగా ఆయా బోర్డులకు స్కాలర్‌షిప్‌లు కేటాయించారు.
దరఖాస్తు..
ఈ స్కాలర్‌షిప్ స్కీమ్‌కు దరఖాస్తు చేయాలనుకునే విద్యార్థులు నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్‌లో లాగిన్ అయి.. అందులో తమ వివరాలు నమోదు చేసుకోవాలి. అనంతరం స్కారల్‌షిప్‌కు సంబంధించిన సమాచారాన్ని నింపి, అవసరమైన ధృవపత్రాలను వాటికి జతచేయాలి.
ధువ పత్రాలు..
అర్హత కోర్సుకు సంబంధించి ధ్రువీకరణ పత్రాలు, బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్, ఆధార్ నెంబర్ లేదా ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఐడీ, బ్యాంక్ పాస్‌బుక్ వంటి దరఖాస్తు సమయంలో దగ్గర ఉంచుకోవాలి.
ముఖ్యమైన సమాచారం..
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తులకు చివరి తేదీ: 31.10.2020
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://scholarship.gov.in