ఆఫ్ క్యాంపస్‌లో విజయం సాధించాలంటే...
Sakshi Education
క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో కొలువు సాధించడమనేది ప్రతి ఒక్క విద్యార్థి కల! అందుకోసం ఇంజనీరింగ్, ఎంబీఏలో చేరినప్పటి నుంచే సిద్ధమవుతుంటారు.
కోర్సు చివరి సంవత్సరంలో జరిగే క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో విజయంసాధించి.. ఫేస్‌బుక్, గూగుల్, టీసీఎస్ వంటి ప్రముఖ కంపెనీల నుంచి ఆఫర్ లెటర్ అందుకోవాలని ఆశిస్తుంటారు. అయితే ఈ అవకాశం అందరికీ లభించకపోవచ్చు. మరి.. ఇలాంటి విద్యార్థుల భవిష్యత్తు ఏంటి? క్యాంపస్ కొలువు రాకుంటే ముందున్న మార్గమేంటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు అందించే ఆఫ్ క్యాంపస్ రిక్రూట్‌మెంట్ విధానాలు, వాటిలో విజయం సాధించడమెలాగో తెలుసుకుందాం..
ఆఫ్ క్యాంపస్ అంటే?
కంపెనీలు పోస్టుల భర్తీకి ఆన్ క్యాంపస్, ఆఫ్ క్యాంపస్ అనే రెండు రకాల విధానాలు అనుసరిస్తుంటాయి. అన్‌క్యాంపస్ పద్ధతిలో నేరుగా తమకు ఇష్టమైన కాలేజీలో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ నిర్వహిస్తాయి. దీంతోపాటు సొంతంగా ప్రకటనలు విడుదల చేయడం ద్వారా, రిఫరెన్సుల ద్వారా చేపట్టే నియామక ప్రక్రియే..ఆఫ్ క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్. ఎప్పటికప్పుడు ఏర్పడే ఖాళీల భర్తీకి సంస్థలు ఈ ఆఫ్ క్యాంపస్ విధానాన్ని అనుసరిస్తుంటాయి. ఇటీవల కాలంలో కంపెనీలు ఆఫ్ క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్‌కు ప్రాధాన్యమిస్తున్నాయి. ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ టీసీఎస్ గత రెండేళ్లుగా సగటున ఏటా నాలుగు వేల మందిని ఆఫ్ క్యాంపస్ విధానంలో నియమించుకుంటోంది.
హ్యాకథాన్స్.. నయా ట్రెండ్
ఆఫ్ క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్ కోసం కంపెనీలు.. ప్రధానంగా సాఫ్ట్‌వేర్ సంస్థలు అనుసరిస్తున్న కొత్త నియామక విధానం.. హ్యాకథాన్! దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను బృందాలుగా విభజించి కోడింగ్, ప్రోగ్రామింగ్‌కు సంబంధించి పోటీలు నిర్వహిస్తాయి. ఈ హ్యాకథాన్‌లు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రెండు విధానాల్లోనూ జరుగుతున్నాయి. బృందంగానూ, వ్యక్తిగతంగానూ వీటిని నిర్వహిస్తున్నాయి. వీటిలో విజయం సాధించిన వారికి, కంపెనీ మెచ్చేలా కోడింగ్, ప్రోగ్రామింగ్ రాసిన వారికి తదుపరి దశలో హెచ్‌ఆర్ రౌండ్, ఇంటర్వ్యూ లేకుండానే నేరుగా ఆఫర్ లెటర్లు అందిస్తున్నాయి.
రిఫరల్ ఎంట్రీ :
ఆఫ్ క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్ పరంగా కంపెనీలు అనుసరిస్తున్న మరో ముఖ్యమైన విధానం.. రిఫరల్ ఎంట్రీ. సంస్థలోని ఖాళీల గురించి ఇప్పటికే ఉన్న తమ ఉద్యోగులకు తెలిపి.. వారికి తెలిసిన అభ్యర్థులను రిఫర్ చేయమని కోరడమే రిఫరల్ ఎంట్రీ విధానం. ఈ పద్ధతిలో భర్తీ ప్రక్రియకు అయ్యే వ్యయప్రయాసల నుంచి సంస్థకు ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా అప్పటికే తమ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులు.. సంస్థ పని సంస్కృతి గురించి ఉన్న అవగాహనతో సరైన అభ్యర్థులనే సిఫార్సు చేస్తారు. అందుకే ఇప్పుడు పెద్దపెద్ద కంపెనీలు సైతం రిఫరల్ ఎంట్రీ విధానానికి ప్రాధాన్యమిస్తున్నాయి. కాబట్టి అభ్యర్థులు ఆయా సంస్థల్లో పని చేస్తున్న తమ స్నేహితులు, సన్నిహితులతో నిరంతరం సంప్రదిస్తూ అవకాశాల గురించి తెలుసుకోవచ్చు.
సోషల్ నెట్‌వర్క్ :
అభ్యర్థుల సోషల్ నెట్‌వర్క్‌ను అనుసరించి నియామకాలు చేపట్టడం ఆఫ్ క్యాంపస్ విధానంలో మరో తాజా ట్రెండ్. సోషల్ నెట్‌వర్క్‌లో అభ్యర్థి ఎంత యాక్టివ్‌గా ఉన్నాడు.. ఎలాంటి అంశాలపై అతనికి ఆసక్తి ఉంది? ఫాలోవర్స్ ప్రొఫైల్స్ ఏమిటి? తదితర అంశాలను కంపెనీలు పరిశీలిస్తున్నాయి. కాబట్టి అభ్యర్థులు తమ సబ్జెక్టుకు సంబంధించిన నిపుణు లను అనుసరించడం, వారితో సబ్జెక్టు, లేటెస్ట్ టెక్నాలజీ గురించి అడిగి తెలుసుకోవడం చేస్తుండాలి. కొత్త టెక్నాలజీని నేర్చుకోవాలనే సహజ తపన ఉన్నట్లు ఉద్యోగార్థుల వ్యవహారశైలి ఉండాలి. సోషల్ నెట్‌వర్క్‌లో ప్రొఫెషనల్‌గా వ్యవహరిస్తున్న వారికి సంస్థలు పిలిచి మరీ పెద్దపీట వేస్తున్నాయి. కాబట్టి ఆఫ్ క్యాంపస్ విధానంలో ఆఫర్ కోరుకునే అభ్యర్థులు తమ సోషల్ నెట్‌వర్క్‌లో చాటింగ్, పోస్టింగ్స్ హుందాగా ఉండేలా చూసుకో వడం మేలు చేస్తుంది.
సంస్థ వెబ్‌సైట్ :
కంపెనీలు తమ వెబ్‌సైట్‌లోనే కెరీర్ ఆప్షన్స్ లింక్‌లో తాజా ఖాళీల గురించి పేర్కొంటున్నాయి. ఆఫ్ క్యాంపస్ విధానంలో ఉద్యోగం కోరుకునే అభ్యర్థులు.. సంస్థ వెబ్‌సైట్‌ను తరచూ చూస్తూ.. ఖాళీల ప్రకటనకు అనుగుణంగా దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు తమ డొమైన్ ఏరియాకు సంబంధించిన సంస్థల వెబ్‌సైట్లను, అందులోని కెరీర్ అవకాశాల లింక్‌ను నిరంతరం గమనిస్తూ ఉండాలి. వాస్తవానికి ఎక్కువ మంది జాబ్‌సెర్చ్ పోర్టల్స్‌పైనే ఎక్కువగా ఆధారపడుతుంటారు. నేరుగా సంస్థ వెబ్‌సైట్‌ను చూడరు.
ఇంటర్న్‌షిప్స్..
క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఆశించిన ఆఫర్ లభించని అభ్యర్థులు ఇంటర్న్‌షిప్స్ మార్గాన్ని ఎంచుకోవడం మేలని నిపుణులు పేర్కొంటున్నారు. ఇంటర్న్‌షిప్ ద్వారా ఏదైనా సంస్థలో కొద్దికాలం పాటు పనిచేసి అనుభవం సంపాదించుకోవచ్చు. తద్వారా వాస్తవ నైపుణ్యాలపై అవగాహన కలుగుతుంది. ఇంటర్న్‌షిప్ సమయంలో పనితీరు బాగుంటే సదరు సంస్థలోనే శాశ్వత కొలువు లభించే అవకాశం కూడా ఉంటుంది. ఇంటర్న్‌శాల, మైఇంటర్న్ వంటి సంస్థలు తమ వెబ్‌సైట్లలో పలు సంస్థల్లోని ఇంటర్న్‌షిప్ ఖాళీల సమాచారాన్ని అందుబాటులో ఉంచుతున్నాయి.
జాబ్‌సెర్చ్ పోర్టల్స్..
ఆఫ్ క్యాంపస్ విధానంలో అభ్యర్థులకు అందుబాటులో ఉన్న మరో మార్గం.. జాబ్ సెర్చ్ పోర్టల్స్! వీటిద్వారా ఉద్యోగాన్వేషణ సాగించే అభ్యర్థులు.. రెజ్యూమె రూపొందించుకోవడం దగ్గర నుంచి దరఖాస్తు వరకూ.. ప్రత్యేకత చాటుకోవాలి. తద్వారా కంపెనీల హెచ్‌ఆర్ విభాగాల దృష్టిలో పడొచ్చు. ముఖ్యంగా తమ నైపుణ్యాలు, అనుభవం, మార్కులు, కొత్తగా పూర్తిచేసిన సర్టిఫికేషన్స్, కొత్తగా నేర్చుకున్న పాపులర్ సాఫ్ట్‌వేర్స్ తదితర అంశాలను పేర్కొంటూ రెజ్యూమెను తీర్చిదిద్ది అప్‌లోడ్ చేయాలి. వీలైనంత మేరకు రెజ్యూమె రెండు పేజీల్లో ఉండేలా చూసుకోవాలి.
ట్రెండ్‌కు తగ్గట్లు మారాలి...
క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్‌లో అవకాశం రాని విద్యార్థులు.. ట్రెండ్‌కు తగ్గట్లు తమ శైలిని మార్చుకోవాలి. రెజ్యూమెలు పంపడం, కాల్ లెటర్ కోసం వేచి చూడటం వంటి పాత పద్ధతులైపోయాయి. ఎప్పటికప్పుడు సోషల్ నెట్‌వర్క్ ద్వారా సంస్థల్లోని అవకాశాల గురించి తెలుసుకొని వాటిని అందిపుచ్చుకునే ప్రయత్నం చేయాలి.
- ఎ.రాజా సురేశ్ కుమార్, సీఈఓ, సింక్రోసర్వ్ గ్లోబల్ సొల్యూషన్స్

Published date : 21 Aug 2018 05:57PM