Skip to main content

ఆన్‌లైన్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌లు ద్వారా ఉద్యోగ నియమకాలు.. ఈ జాబ్‌ పోర్టల్స్‌ నుంచే ఎక్కువ..

ఫ్రెష్‌ రిక్రూట్‌మెంట్స్‌ అనగానే గుర్తొచ్చేవి ఐటీ కంపెనీలే. ఇప్పుడు పలు ఐటీ సంస్థలు ఆన్‌లైన్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌లు నిర్వహిస్తూ.. ఆఫ్‌–క్యాంపస్‌ విధానంలో విద్యార్థులకు అవకాశాలు కల్పిస్తున్నాయి.
టీసీఎస్‌ సంస్థ నేషనల్‌ క్వాలిఫయర్‌ టెస్ట్, విప్రో ఎలైట్‌ ఎన్‌టీహెచ్, ఇన్ఫోసిస్‌ సంస్థ ఇన్ఫీటీక్యూ పేరుతో జాతీయ స్థాయిలో ఆన్‌లైన్‌ టెస్ట్‌లను నిర్వహిస్తున్నాయి. అదే విధంగా కాగ్నిజెంట్, ఐబీఎం, హెచ్‌సీఎల్‌ సంస్థలు కూడా రిటెన్‌ టెస్ట్‌లు, హ్యాకథాన్స్, కోడథాన్స్‌ ద్వారా ఫ్రెషర్స్‌కు అవకాశాలు కల్పిస్తున్నాయి.

జాబ్‌ పోర్టల్స్, సోషల్‌ మీడియా..
  • ఆఫ్‌–క్యాంపస్‌ విధానంలో నియామకాలు కోరుకునే విద్యార్థులకున్న ముఖ్యమైన మార్గాలు.. జాబ్‌ సెర్చ్‌ పోర్టల్స్‌తోపాటు, ట్విటర్, లింక్డ్‌ఇన్, ఫేస్‌బుక్‌ వంటి సోషల్‌ మీడియా సాధనాలే. సంస్థలు తమ నియామకాల వివరాలను ఆయా జాబ్‌ పోర్టల్స్‌లో అందుబాటులో ఉంచుతాయి. కాబట్టి అభ్యర్థులు సదరు జాబ్‌ పోర్టల్స్‌లో తమ ప్రొఫైల్‌ను రిజిస్టర్‌ చేసుకోవాలి.
  • లింక్డ్‌ఇన్, ట్విటర్, ఫేస్‌బుక్‌ వంటి సోషల్‌ మీడియా వేదికల ద్వారా ఆయా రంగాల నిపుణులతో నిరంతరం సంప్రదిస్తూ.. నూతన నియామకాల గురించి తెలుసు కోవచ్చు. సోషల్‌ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో కూడా జాబ్‌ కాలమ్స్‌ అందుబాటులోకి వచ్చాయి. విద్యార్థులు తమ రెజ్యుమేలను వీటిలో అప్‌లోడ్‌ చేయడం ద్వారా అవకాశాల గురించి తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఆయా సంస్థల అధికారిక వెబ్‌సైట్స్‌ కెరీర్స్‌ కాలమ్స్‌ను కూడా నిరంతరం వీక్షిస్తూ ఉండాలి. ఇటీవల కాలంలో సంస్థలు తమ వెబ్‌సైట్స్‌లోనే ఓపెనింగ్స్‌ వివరాలను పొందుపరుస్తున్నాయి.


ఇంకా చ‌ద‌వండి: part 7: నైపుణ్యాలు ఉన్న వారిని రిక్రూట్‌ చేసుకుంటున్న టాప్‌ సెక్టార్స్‌ ఇవే..
Published date : 15 Mar 2021 03:45PM

Photo Stories