ఐటీఐ..తక్షణ ఉపాధికి సరైన దారి...
Sakshi Education
ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్.. ఐటీఐలుగా సుపరిచితం! పదోతరగతి పూర్తవుతూనే ప్రాక్టికల్ నైపుణ్యాలు అందించే చదువులకు కేరాఫ్.. ఐటీఐలు. పదోతరగతి తర్వాత ఐటీఐలో చేరడం ద్వారా ఒకటి లేదా రెండేళ్లలోనే ఉద్యోగం సొంతం చేసుకోవచ్చు. ఐటీఐ శిక్షణతో నేరుగా పరిశ్రమల్లో కొలువు లేదా స్వయం ఉపాధి పొందొచ్చు. పరిశ్రమలకు శిక్షణపొందిన మానవ వనరులను అందించడం.. మరోవైపు యువతలో నిరుద్యోగితను తగ్గించే లక్ష్యంతో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్‌ను ఏర్పాటు చేశారు. డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్, స్కిల్ ఇండియా ఆధ్వర్యంలో ఐటీఐలు నడుస్తున్నాయి. పదో తరగతి తర్వాత స్వల్పకాలంలోనే ఉపాధి పొందాలనుకునే విద్యార్థులకు ఉపయోగపడే ఐటీఐ కోర్సుల వివరాలు...
దేశంలోని పరిశ్రమల ఉత్పాదకత, అవి తయారుచేసే వస్తువులు.. అందించే సేవల నాణ్యతను పెంపొందించడంలో ఐటీఐల పాత్ర విస్మరించలేనిది. ఐటీఐలు యువతలో నిరుద్యోగాన్ని తగ్గించి.. సాంకేతికత, పారిశ్రామిక దృక్పథాలను పెంపొందేలా విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాయి. నైపుణ్యవంతమైన మానవ వనరులను అందించడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాయి. పరిశ్రమలకు వివిధ ట్రేడ్ల(విభాగాలు)ల్లో అవసరమైన మానవ వనరులను అందిస్తూ వృద్ధికి ఊతంగా నిలుస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో..
అర్హతలు..
శిక్షణ :
ఐటీఐ శిక్షణ వ్యవధిలో 70 శాతాన్ని ప్రాక్టికల్ ట్రైనింగ్‌కు కేటాయిస్తారు. మిగిలిన 30 శాతం సమయాన్ని ట్రేడ్ థియరీ, వర్క్‌షాప్ క్యాలిక్యులేషన్ అండ్ సైన్స్, ఇంజనీరింగ్ డ్రాయింగ్, ఎంప్లాయిబిలిటీ స్కిల్స్, లైబ్రరీ అండ్ ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌కు కేటాయిస్తారు.
దరఖాస్తు విధానం :
ఐటీఐలు, ట్రేడ్ల కేటాయింపు :
ఆన్‌లైన్ దరఖాస్తును పూర్తిచేసుకున్న అభ్యర్థులు.. ఐటీఐలు, ట్రేడ్ ఆప్షన్లను ఎంపిక చేసుకోవచ్చు. ఆప్షన్ల ఎంపికకు సంబంధించి ఎలాంటి పరిమితి లేదు. అనంతరం వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించి.. మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా ఐటీఐ, ట్రేడ్లను ఖరారు చేస్తారు. అనంతరం అభ్యర్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్ సెంటర్‌కు హాజరై.. సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తిచేసుకోవాల్సి ఉంటుంది.
అవసరమైన సర్టిఫికెట్‌లు..
విద్యార్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కేంద్రాలకు కింది ఒరిజినల్ సర్టిఫికెట్‌లతోపాటు రెండు సెట్ల జిరాక్స్ కాపీలను తీసుకెళ్లాల్సి ఉంటుంది.
సీట్ల కేటాయింపు :
ఐటీఐల్లో 15 శాతం సీట్లు ఓపెన్ కేటగిరీలో ఉంటాయి. స్థానిక, స్థానికేతర విద్యార్థులు వీటికి పోటీపడొచ్చు. మిగిలిన 85 శాతం సీట్లను స్థానిక విద్యార్థులతో భర్తీ చేస్తారు. నాన్‌మైనారిటీ, స్పెషల్ కేటగిరీ ఐఐటీలు మినహా..మిగిలిన వాటిలో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం, బీసీ-ఎ కేటగిరీకి 7 శాతం, బీసీ-బీ కేటగిరీకి 10 శాతం, బీసీ-సీ కేటగిరీకి 1 శాతం, బీసీ-డీ కేటగిరీకి 7 శాతం, బీసీ-ఈ కేటగిరీకి 4 శాతం సీట్లను రిజర్వ్ చేస్తారు.
ఇంజనీరింగ్ ట్రేడ్లు :
డ్రాఫ్ట్స్‌మెన్ (సివిల్), డ్రాఫ్ట్స్‌మెన్ (మెకానికల్), ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఫిట్టర్, ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్, టెక్నాలజీ సిస్టమ్-మెయింటెనెన్స్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, లేబొరేటరీ అసిస్టెంట్ (కెమికల్ ప్లాంట్), ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్ (కెమికల్ ప్లాంట్), మెషినిస్టు, మెషినిస్టు (గ్రైండర్), మెకానిక్ (రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్), మెకానిక్ కంప్యూటర్ హార్డ్‌వేర్, మెకానిక్ మోటార్ వెహికల్, వైర్‌మెన్, ఫౌండ్రీమ్యాన్, మెకానిక్ డీజిల్, ప్లాస్టిక్ ప్రాసెసింగ్ ఆపరేటర్, ప్లంబర్, కార్పెంటర్, షీట్ మెటల్ వర్కర్, వెల్డర్.
నాన్ ఇంజనీరింగ్ ట్రేడ్లు :
డెంటల్ లేబొరేటరీ టెక్నీషియన్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, డ్రెస్ మేకింగ్, హెల్త్ శానిటరీ ఇన్‌స్పెక్టర్, హాస్పిటల్ హౌజ్‌కీపింగ్, లిథో ఆఫ్‌సెట్ మెషీన్ మిండర్, సీవింగ్ టెక్నాలజీ, ప్రీ స్కూల్ మేనేజ్‌మెంట్ (అసిస్టెంట్), స్టెనోగ్రాఫర్/సెక్రటేరియల్ అసిస్టెంట్ (ఇంగ్లిష్), డ్రైవర్ కమ్ మెకానిక్ (లైట్ మోటార్ వెహికల్).
అప్రెంటీస్‌కు మార్గం :
ఐటీఐ కోర్సు పూర్తయ్యాక.. ఏదైనా పరిశ్రమలో నిర్దిష్ట కాలవ్యవధిలో అప్రెంటీస్ శిక్షణ పొందాల్సి ఉంటుంది. భారత ప్రభుత్వం 2016లో అమల్లోకి తెచ్చిన నేషనల్ అప్రెంటీస్‌షిప్ ప్రమోషన్ స్కీమ్ ద్వారా అప్రెంటీస్‌షిప్ అవకాశాలు మరింత విస్తృతం అవుతున్నాయి. ఈ స్కీమ్ ద్వారా 2020 నాటికి 50 లక్షల మందికి అప్రెంటీస్ శిక్షణ ఇప్పించాలని కేంద్రం భావిస్తోంది. అందుకోసం 40 మంది లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులున్న సంస్థలు విద్యార్థులకు తప్పనిసరిగా అప్రెంటీస్‌షిప్ శిక్షణ ఇవ్వాలని సూచించింది. ఫలితంగా ఐటీఐ వంటి కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులు ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల్లో సత్వరమే అప్రెంటీస్‌లో చేరేందుకు వీలు కలుగుతోంది.
ఉన్నత విద్య :
ఐటీఐ పూర్తయ్యాక ఉన్నత విద్యపై ఆసక్తి ఉంటే... డిప్లొమా కోర్సుల్లో చేరొచ్చు. డిప్లొమా ఉత్తీర్ణతతో ఈసెట్ రాసి బీటెక్‌లో ప్రవేశం పొందొచ్చు. నాన్ ఇంజనీరింగ్ ట్రేడ్‌ల అభ్యర్థులు డిగ్రీ కోర్సులను అభ్యసించొచ్చు.
ఉద్యోగ అవకాశాలు...
తెలుగు రాష్ట్రాల్లో..
- నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్(ఎన్‌సీవీటీ)కు అనుబంధంగా తెలంగాణలో 54 ప్రభుత్వ, 215 ప్రైవేటు ఐటీఐలు వివిధ ట్రేడ్లలో శిక్షణ ఇస్తున్నాయి. అదేవిధంగా ఎన్‌సీవీటీకి అనుబంధంగా ఉన్న స్టేట్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్(ఎస్‌సీవీటీ) విధానంలో 11 ప్రభుత్వ ఐటీఐలు యువతకు శిక్షణ ఇస్తున్నాయి.
- తెలంగాణలోని ఐటీఐల్లో 23 ఇంజనీరింగ్, 7 నాన్ ఇంజనీరింగ్ స్ట్రీముల్లో రెండు సంవత్సరాలు, ఏడాది వ్యవధిలో శిక్షణ సాగుతోంది.
- ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే స్థాయిలో ఐటీఐ విద్య అందుబాటులో ఉంది. ఏపీలో 81 ప్రభుత్వ ఐటీఐలు, 454 ప్రైవేటు ఐటీఐలు ప్రవేశాలు కల్పిస్తున్నాయి.
అర్హతలు..
- స్టేట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నుంచి ఎస్‌ఎస్‌సీ లేదా తత్సమాన ఉత్తీర్ణత.
- ఎస్‌ఎస్‌సీ ఉత్తీర్ణులు లేదా ఫెయిల్ అయిన విద్యార్థులు అందుబాటులో లేనట్లయితే.. ఎనిమిదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు పెయింటర్ జనరల్, వైర్‌మ్యాన్, కార్పేంటర్, మాసన్(బిల్డిండ్ కన్‌స్ట్రక్టర్), షీట్ మెటల్ వర్కర్ అండ్ వెల్డర్ ట్రేడుల్లో అవకాశం కల్పిస్తారు.
- నిర్దేశిత తేదీ నాటికి అభ్యర్థులకు 14 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ట వయోపరిమితికి సంబంధించి ఎలాంటి నిబంధన లేదు.
శిక్షణ :
ఐటీఐ శిక్షణ వ్యవధిలో 70 శాతాన్ని ప్రాక్టికల్ ట్రైనింగ్‌కు కేటాయిస్తారు. మిగిలిన 30 శాతం సమయాన్ని ట్రేడ్ థియరీ, వర్క్‌షాప్ క్యాలిక్యులేషన్ అండ్ సైన్స్, ఇంజనీరింగ్ డ్రాయింగ్, ఎంప్లాయిబిలిటీ స్కిల్స్, లైబ్రరీ అండ్ ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌కు కేటాయిస్తారు.
దరఖాస్తు విధానం :
- ప్రైవేటు, గవర్నమెంట్ ఐటీఐల్లో ఆన్‌లైన్ విధానంలో ప్రవేశాలు చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది.
- ఎన్‌సీవీటీ విధానంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల్లో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను డెరైక్టరేట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ విడుదల చేస్తుంది. ఎస్‌సీవీటీ విధానంలో బోధన సాగే 11 ప్రభుత్వ ఐటీఐల్లో ప్రవేశాలకు ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేస్తారు.
- ఆంధ్రప్రదేశ్‌లోనూ ఐటీఐల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్ దరఖాస్తు విధానాన్ని అమలుచేస్తున్నారు.
- ఐటీఐ ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ అన్ని తెలుగు, ఇంగ్లిష్ దినపత్రికల్లో ప్రచురితమవుతుంది.
ఐటీఐలు, ట్రేడ్ల కేటాయింపు :
ఆన్‌లైన్ దరఖాస్తును పూర్తిచేసుకున్న అభ్యర్థులు.. ఐటీఐలు, ట్రేడ్ ఆప్షన్లను ఎంపిక చేసుకోవచ్చు. ఆప్షన్ల ఎంపికకు సంబంధించి ఎలాంటి పరిమితి లేదు. అనంతరం వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించి.. మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా ఐటీఐ, ట్రేడ్లను ఖరారు చేస్తారు. అనంతరం అభ్యర్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్ సెంటర్‌కు హాజరై.. సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తిచేసుకోవాల్సి ఉంటుంది.
అవసరమైన సర్టిఫికెట్‌లు..
విద్యార్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కేంద్రాలకు కింది ఒరిజినల్ సర్టిఫికెట్‌లతోపాటు రెండు సెట్ల జిరాక్స్ కాపీలను తీసుకెళ్లాల్సి ఉంటుంది.
- ఎస్‌ఎస్‌సీ మార్కుల మెమో
- కుల ధ్రువీకరణ పత్రం
- జనన ధ్రువీకరణ పత్రం (ఎస్‌ఎస్‌సీ ఉత్తీర్ణులు కాని విద్యార్థులు).
- బోనఫైడ్ సర్టిఫికెట్
- నివాస ధ్రువీకరణ ప్రతం
- ఫిజికల్ హ్యాండీక్యాప్డ్ సర్టిఫికెట్ (సదరు విద్యార్థులకు).
- ఆదాయ ధ్రువీకరణ పత్రం
- కండాక్ట్ సర్టిఫికెట్
సీట్ల కేటాయింపు :
ఐటీఐల్లో 15 శాతం సీట్లు ఓపెన్ కేటగిరీలో ఉంటాయి. స్థానిక, స్థానికేతర విద్యార్థులు వీటికి పోటీపడొచ్చు. మిగిలిన 85 శాతం సీట్లను స్థానిక విద్యార్థులతో భర్తీ చేస్తారు. నాన్‌మైనారిటీ, స్పెషల్ కేటగిరీ ఐఐటీలు మినహా..మిగిలిన వాటిలో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం, బీసీ-ఎ కేటగిరీకి 7 శాతం, బీసీ-బీ కేటగిరీకి 10 శాతం, బీసీ-సీ కేటగిరీకి 1 శాతం, బీసీ-డీ కేటగిరీకి 7 శాతం, బీసీ-ఈ కేటగిరీకి 4 శాతం సీట్లను రిజర్వ్ చేస్తారు.
ఇంజనీరింగ్ ట్రేడ్లు :
డ్రాఫ్ట్స్‌మెన్ (సివిల్), డ్రాఫ్ట్స్‌మెన్ (మెకానికల్), ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఫిట్టర్, ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్, టెక్నాలజీ సిస్టమ్-మెయింటెనెన్స్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, లేబొరేటరీ అసిస్టెంట్ (కెమికల్ ప్లాంట్), ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్ (కెమికల్ ప్లాంట్), మెషినిస్టు, మెషినిస్టు (గ్రైండర్), మెకానిక్ (రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్), మెకానిక్ కంప్యూటర్ హార్డ్‌వేర్, మెకానిక్ మోటార్ వెహికల్, వైర్‌మెన్, ఫౌండ్రీమ్యాన్, మెకానిక్ డీజిల్, ప్లాస్టిక్ ప్రాసెసింగ్ ఆపరేటర్, ప్లంబర్, కార్పెంటర్, షీట్ మెటల్ వర్కర్, వెల్డర్.
నాన్ ఇంజనీరింగ్ ట్రేడ్లు :
డెంటల్ లేబొరేటరీ టెక్నీషియన్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, డ్రెస్ మేకింగ్, హెల్త్ శానిటరీ ఇన్‌స్పెక్టర్, హాస్పిటల్ హౌజ్‌కీపింగ్, లిథో ఆఫ్‌సెట్ మెషీన్ మిండర్, సీవింగ్ టెక్నాలజీ, ప్రీ స్కూల్ మేనేజ్‌మెంట్ (అసిస్టెంట్), స్టెనోగ్రాఫర్/సెక్రటేరియల్ అసిస్టెంట్ (ఇంగ్లిష్), డ్రైవర్ కమ్ మెకానిక్ (లైట్ మోటార్ వెహికల్).
అప్రెంటీస్‌కు మార్గం :
ఐటీఐ కోర్సు పూర్తయ్యాక.. ఏదైనా పరిశ్రమలో నిర్దిష్ట కాలవ్యవధిలో అప్రెంటీస్ శిక్షణ పొందాల్సి ఉంటుంది. భారత ప్రభుత్వం 2016లో అమల్లోకి తెచ్చిన నేషనల్ అప్రెంటీస్‌షిప్ ప్రమోషన్ స్కీమ్ ద్వారా అప్రెంటీస్‌షిప్ అవకాశాలు మరింత విస్తృతం అవుతున్నాయి. ఈ స్కీమ్ ద్వారా 2020 నాటికి 50 లక్షల మందికి అప్రెంటీస్ శిక్షణ ఇప్పించాలని కేంద్రం భావిస్తోంది. అందుకోసం 40 మంది లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులున్న సంస్థలు విద్యార్థులకు తప్పనిసరిగా అప్రెంటీస్‌షిప్ శిక్షణ ఇవ్వాలని సూచించింది. ఫలితంగా ఐటీఐ వంటి కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులు ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల్లో సత్వరమే అప్రెంటీస్‌లో చేరేందుకు వీలు కలుగుతోంది.
- ఐటీఐ ఉత్తీర్ణత సాధించాక https://apprenticeshipindia.org వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేసుకోవడం ద్వారా అప్రెంటీస్ అవకాశాలు పొందొచ్చు. ప్రభుత్వ రంగ సంస్థలతోపాటు భారత రైల్వే ఐటీఐ అభ్యర్థులకు ఎక్కువ సంఖ్యలో అప్రెంటీస్‌షిప్ ఖాళీలను ఏటా ప్రకటిస్తోంది. ఇలా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో శిక్షణలో చేరిన ఐటీఐ అభ్యర్థులకు నిబంధనల మేరకు స్టైపెండ్ కూడా లభిస్తుంది. అంతేకాకుండా శిక్షణ కాలంలో బేసిక్ ట్రైనింగ్, ఆన్ జాబ్ ట్రైనింగ్ పూర్తిచేసుకోవడం ద్వారా పరిశ్రమకు అవసరమైన ప్రాక్టికల్ నైపుణ్యాలు లభిస్తాయి.
ఉన్నత విద్య :
ఐటీఐ పూర్తయ్యాక ఉన్నత విద్యపై ఆసక్తి ఉంటే... డిప్లొమా కోర్సుల్లో చేరొచ్చు. డిప్లొమా ఉత్తీర్ణతతో ఈసెట్ రాసి బీటెక్‌లో ప్రవేశం పొందొచ్చు. నాన్ ఇంజనీరింగ్ ట్రేడ్‌ల అభ్యర్థులు డిగ్రీ కోర్సులను అభ్యసించొచ్చు.
ఉద్యోగ అవకాశాలు...
- ఐటీఐ అర్హతతో ప్రభుత్వ, ప్రైవేటు రంగ పరిశ్రమల్లో ఉద్యోగాలు పొందొచ్చు.
- ముఖ్యంగా రైల్వేలో అసిస్టెంట్ లోకోపెలైట్, టెక్నీషియన్ పోస్టులకు ఐటీఐ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఆర్మీలో ఐటీఐ అర్హతతో పలు ఉద్యోగాలకు ప్రభుత్వ నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. సోల్జర్ ట్రేడ్స్‌మెన్, పారామిలిటరీ బలగాల్లో కొలువులు సొంతం చేసుకోవచ్చు.
- రాష్ట్రస్థాయిలో వెలువడే జూనియర్ లైన్‌మెన్, సర్వేయర్ పోస్టులకు కూడా సంబంధిత ట్రేడ్‌ల అభ్యర్థులు పోటీపడొచ్చు.
Published date : 29 Apr 2019 03:37PM