ఐఐటీల్లోనూ సోషల్ సైన్సెస్
Sakshi Education
దేశంలో ఇంజనీరింగ్ విద్యకు ప్రతిష్టాత్మక సంస్థలు ఐఐటీలు(ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీలు). ఐఐటీలు అందించే ఇంజనీరింగ్ కోర్సులకు అంతర్జాతీయంగా మంచి గుర్తింపు ఉంది.
వీటిల్లో విద్యనభ్యసించిన ప్రతిభావంతులు ప్రపంచ వ్యాప్తంగా అనేక రంగాల్లో అద్భుతంగా రాణిస్తున్న సంగతి తెలిసింది. ఇటీవల కాలంలో ఐఐటీలు అందించే ఇంజనీరింగ్ కోర్సులే కాకుండా.. హుమానిటీస్, సోషల్ సైన్సెస్ కోర్సులకు క్రేజ్ పెరుగుతోంది. అందుకే పలు ఐఐటీలు సరికొత్త సోషల్‌సైన్స్ కోర్సులను ప్రవేశ పెడుతున్నాయి.
తాజాగా ఐఐటీ ఢిల్లీ(ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) 2020 సంవత్సరం వేసవిలో రెండు సరికొత్త కోర్సులను ప్రారంభించనుంది. అవి ఎంఎస్సీ ఎకానమీ, ఎంఎస్సీ కాగ్నిటివ్ సైన్స్ కోర్సులు. ఒక్కో కోర్సులో 25 మంది విద్యార్థులను తీసుకుంటారు. ఈ రెండు కోర్సులను హ్యుమానిటీస్, సోషల్ సైన్స్ విభాగాలు అందిస్తాయి.
2005లో ఐఐటీ ఖరగ్‌పూర్, ఐఐటీ కాన్పూర్ ఎకనామిక్స్‌లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ (బ్యాచిలర్స్‌తో పాటు మాస్టర్స్) కోర్సులను ప్రారంభించాయి. 2011లో ఈ కోర్సులో మార్పులు చేసి... నాలుగు సంవత్సరాల బ్యాచిలర్, ఒక సంవత్సరం మాస్టర్స్‌గా మార్చాయి.
2006లో ఐఐటీ మద్రాస్ ఇంగ్లిష్ స్టడీస్, డవలప్‌మెంట్ స్టడీస్‌లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టింది. 2009లో ఐఐటీ గువహతి డెవలప్‌మెంట్ స్టడీస్‌లో మాస్టర్స్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది.
2017లో ఐఐటీ బాంబే ఎకనామిక్స్‌లో నాలుగు సంవత్సరాల బ్యాచిలర్ కోర్సును ప్రారంభించింది. మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్‌లో గట్టి పట్టు లభించేలా ఈ కోర్సును రూపొందించారు. ఐఐటీæ మద్రాస్‌లో ఇంటిగ్రెటెడ్ ఎంఎ కోర్సులో చేరిన విద్యార్థులు మొదటి రెండు సంవత్సరాలు అన్ని సబ్జెక్టులను చదువుతారు. మూడో సంవత్సరంలో విద్యార్థులు తమకు ఇష్టమైన, ఆసక్తి కలిగిన సబ్జెక్టుని ఎంచుకుంటారు. ఇది విద్యార్థులకు వారి ఆసక్తులు గురించి తెలుసుకునే అవకాశం కల్పిస్తుంది. దీంతోపాటు ఆర్థిక శాస్త్ర సూత్రాలు,సామాజిక, రాజకీయ ఆలోచన పునాదులు, చలన చిత్ర సిద్ధాంతం, భాషా శాస్త్రం, పారిశ్రామిక సంస్థ, చైనా అధ్యయనాలు వంటి అంశాలపై ఈ కోర్సు విద్యార్థులకు అవగాహన లభిస్తుంది. ఐఐటీల్లో హుమానిటీస్, సోషల్ సైన్సెస్ విభాగాలు ఎంఫిల్, పీహెచ్‌డీ కోర్సులను సైతం అందిస్తున్నాయి.
ఫీజులు
ఐఐటీ గువహతిలో ఎంఏ కోర్సుకు సెమిస్టర్‌కు రూ.50,000 ఫీజు ఉంటుంది. ఐఐటీ మద్రాస్‌లో ఎంఏ కోర్సు సెమిస్టర్ ఫీజు రూ.11,400 నిర్దేశించారు.
ప్రవేశాలు
ఈ కోర్సుల్లో ప్రవేశ ప్రక్రియ ఆయా ఐఐటీల్లో భిన్నంగా ఉంటుంది. వీటిల్లో ప్రవేశాలకు సంబంధించి ప్రవేశాల పరీక్ష వివరాలను ఏటా మార్చిలో ప్రకటిస్తారు. ప్రవేశ పరీక్షను జూన్‌లో నిర్వహిస్తారు. మల్టిపుల్ ఛాయిస్, డిస్క్రిప్టివ్ విధానంలో పరీక్ష ఉంటుంది. జూలై చివరి వారంలో ప్రవేశాలు ప్రారంభం అవుతాయి. పూర్తి వివరాలకు ఆయా ఐఐటీల వెబ్‌సైట్‌లను చూడొచ్చు.

Published date : 01 Apr 2020 03:37PM