వైద్య పరికరాల తయారి రంగంలో.. భారీగా ఉద్యోగాలు
Sakshi Education
బయో సెన్సైస్‌లో డిగ్రీ, పీజీ చదువుతున్నారా..ఫార్మసీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుంటున్నారా..భవిష్యత్తు కెరీర్ అవకాశాల గురించి ఆలోచిస్తున్నారా..ఉపాధి మార్గాలు తెలియక ఆందోళన చెందుతున్నారా?! అయితే.. వీటన్నింటికీ ఇప్పుడు ఫుల్ స్టాప్ పెట్టేయొచ్చు!!
ఎందుకంటే.. ఇప్పుడో సరికొత్త కెరీర్ వేదిక మీకు స్వాగతం పలుకుతోంది! ఆకర్షణీయ వేతనాలు సైతం సొంతం చేసుకునే అవకాశం కల్పిస్తోంది! అదే... వైద్య పరికరాల ఉత్పత్తి విభాగం (మెడికల్ ఎక్విప్‌మెంట్ సెక్టార్)!! ఈ నేపథ్యంలో.. వైద్య పరికరాల తయారి విభాగంలో.. లభించే కొలువులు, అర్హతలు, అవసరమైన నైపుణ్యాల గురించి తెలుసుకుందాం... వైద్య పరికరాల విభాగం (మెడికల్ ఎక్విప్‌మెంట్ సెగ్మెంట్) అభివృద్ధికి.. జాతీయ స్థాయిలో ప్రభుత్వం చేపడుతున్న చర్యలు..అనుసరిస్తున్న విధానాలు, భవిష్యత్తు ప్రణాళికలతో.. దేశంలో వైద్య పరికరాల తయారీ సంస్థల సంఖ్య పెరుగుతోంది. అదేసమయంలో సంస్థలు నిపుణులైన మానవ వనరుల కోసం అన్వేషణ సాగిస్తున్నాయి. దీంతో బయో సెన్సైస్, ఫార్మాసెన్సైస్, ఎలక్ట్రానిక్స్, బయోటెక్నాలజీ వంటి కోర్సులు చదువుతున్న అభ్యర్థులకు వైద్య పరికరాల తయారీ రంగం సరికొత్త వేదికగా నిలవనుంది. ఆయా కోర్సులు చదువుతున్న విద్యార్థులు.. ఇప్పటినుంచే ఈ దిశగా దృష్టిసారించి, తమ నైపుణ్యాలకు పదును పెట్టుకుంటే.. చక్కటి కొలువులు ఖాయం చేసుకోవచ్చనేది నిపుణులు చెబుతున్న మాట. ఏదైనా చికిత్స కోసం ఆస్పత్రికి వెళితే.. చికిత్స క్రమంలో వాడే ఇంజక్షన్ సిరంజి మొదలు సీటీ స్కానర్స్ వరకు.. రకరకాల పరికరాలు తప్పనిసరి. వైద్య రంగం అవసరాలకు అనుగుణంగా మెడికల్ పరికరాలు తయారి తప్పనిసరిగా మారుతోంది. ఆ మేరకు రానున్న అయిదేళ్లలో మెడికల్ డివెసైస్ సెగ్మెంట్ ఉద్యోగావకాశాలకు వేదికగా మారనుందని అంచనా.
నూతన విధానాలు :
వైద్య పరికరాల ఉత్పత్తికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నూతన విధానాలు, ప్రణాళికలు రూపొందిస్తోంది. వైద్య పరికరాల కోసం దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని భావిస్తోంది. సదరు మెడికల్ డివెసైస్‌ను దేశీయంగానే తయారు చేసేలా చర్యలు తీసుకుంటోంది. అందుకోసం మేక్ ఇన్ ఇండియా పథకం దోహదపడుతోంది. వైద్య పరికరాలు తయారు చేసే సంస్థలకు 25శాతం మేరకు క్యాపిటల్ సబ్సిడీతోపాటు రీసెర్చ్, ఉత్పత్తికి అయ్యే వ్యయంలో కొంత మేర నిధులు సమకూర్చడం వంటి విధానాలను సైతం అనుసరించనుంది. దీంతో రానున్న రోజుల్లో దేశీయంగా వైద్య పరికరాల తయారీ సంస్థల సంఖ్య పెరిగే అవకాశముంది. ఫలితంగా కొత్తగా ఉద్యోగావకాశాలు లభిస్తాయని, బయోసెన్సైస్, ఫార్మా, బయోటెక్ విద్యార్థులకు ఇది ప్రధాన ఉపాధి మార్గంగా నిలుస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.
2025 నాటికి రెట్టింపు :
ప్రస్తుతం దేశంలో ఎంఎస్‌ఎంఈ నుంచి ఎంఎన్‌సీ స్థాయి వరకు.. వైద్య పరికరాలు ఉత్పత్తి చేసే సంస్థలు ఎనిమిది వందల వరకు ఉన్నాయి. నీతి ఆయోగ్ సిఫార్సులకు అనుగుణంగా చర్యలు తీసుకుంటే.. 2025 నాటికి ఈ సంస్థల సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు ఉద్యోగావకాశాలు కూడా పెరుగుతాయి. పలు సంస్థల అంచనాల ప్రకారం-ప్రస్తుతం మెడికల్ డివెసైస్ విభాగంలో దేశ వ్యాప్తంగా దాదాపు లక్షన్నర మంది పని చేస్తున్నారు. దీనికి అదనంగా నిర్వహణ, మరమ్మత్తుల విభాగంలో మరో 5 లక్షల మంది వరకు ఉపాధి పొందుతున్నారు. తాజా ప్రణాళికల నేపథ్యంలో 2025 నాటికి పది లక్షల మంది వరకు అవసరం ఉంటుందని అంచనా.
పరిశోధన టు నిర్వహరణ :
వైద్య పరికరాల తయారీ రంగంలో వివిధ రకాల జాబ్ ప్రొఫైల్స్ ఉన్నాయి. ఒక వైద్య పరికరం రూపొందించే క్రమంలో.. రీసెర్చ్, డిజైన్ మొదలు.. వాటి తయారీ, క్షేత్ర స్థాయిలో నిర్వహణ వరకు.. రకరకాల నైపుణ్యాలున్న మానవ వనరుల అవసరం ఉంటోంది.
ఫార్మసిస్టులకు అనుకూలం..
ఫార్మసీ గ్రాడ్యుయేట్లకు ఔషధ తయారీ సంస్థల్లోనే అవకాశాలు లభిస్తాయనే అభిప్రాయం ఉంది. కాని ఇటీవల కాలంలో వైద్య పరికరాల తయారీ కంపెనీలు సైతం ఫార్మసీ అభ్యర్థులకు ఉద్యోగాలు అందిస్తున్నాయి. ముఖ్యంగా ల్యాబొరేటరీ డయాగ్నస్టిక్స్ పరికరాల తయారీ సంస్థల్లో అవకాశాలు లభిస్తున్నాయి.
ఎంబీఏ, బీబీఏ :
వైద్య పరికరాల తయారీ సంస్థల్లో కోర్ ప్రొడక్షన్ విభాగాలు, వాటికి సంబంధించి బయోమెడికల్ ఇంజనీరింగ్, ఫార్మసీ, బయోటెక్నాలజీ తదితర లైఫ్ సెన్సైస్ అభ్యర్థులకే కాకుండా... ఎంబీఏ, బీబీఏ పూర్తిచేసిన వారికి కూడా ఉద్యోగాలు లభిస్తున్నాయి. ముఖ్యంగా బ మెడికల్ డివైజ్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, బ లైజనింగ్ ఆఫీసర్స్, బ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్స్ వంటి కొలువులు దక్కించుకునే అవకాశం ఉంది.
పెరుగుతున్న నియామకాలు..
వైద్య పరికరాల తయారీ సంస్థల్లో నియామకాల సంఖ్య పెరుగుతోంది. కీళ్ల మార్పిడి, హార్ట్ ఇంప్లాంట్స్, సీటీ స్కానింగ్ తదితర పరికరాలు తయారు చేస్తున్న జాన్సన్ అండ్ జాన్సన్, జీఈ హెల్త్‌కేర్, సీమెన్స్ హెల్త్‌కేర్, ఫిలిప్స్, మెడ్‌ట్రానిక్ వంటి సంస్థలు ఐఐఎస్‌ఈఆర్,నైపర్ వంటి ఇన్‌స్టిట్యూట్‌లలో క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్ సైతం నిర్వహిస్తున్నాయి. దీంతోపాటు సంబంధిత కోర్సుల అభ్యర్థులు ఉద్యోగ ప్రయత్నాల్లో జాబ్ పోర్టల్స్‌ను మార్గంగా ఎంచుకోవచ్చు. ఆయా జాబ్ పోర్టల్స్‌లో ప్రొఫైల్‌ను క్రియేట్ చేసుకోవడం ద్వారా అర్హతకు తగిన ఉద్యోగ అన్వేషణ సాగించొచ్చు.
అర్హతకు తగిన హోదాలు :
భారత వైద్య పరికరాల పరిశ్రమ..
ముఖ్యాంశాలు..

- వైద్య పరికరాల తయారీలో బయోసైన్స్, ఫార్మసీ, బయోటెక్నాలజీ తదితర లైఫ్ సెన్సైస్ కోర్సులు పూర్తిచేసుకున్న అభ్యర్థులు.. వారి అర్హతలకు తగిన ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు.
- బయోమెడికల్ ఇంజనీరింగ్‌లో పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఆయా సంస్థల్లో డిజైన్, ప్రొడక్షన్ విభాగాల్లో కొలువులు లభిస్తాయి. వీరికి ప్రారంభంలోనే నెలకు సగటున రూ.50వేల వరకు వేతనం అందే అవకాశముంది. ఈ విభాగంలో నిలదొక్కుకోవాలంటే.. విస్తృతమైన నైపుణ్యాలు అవసరం. కోర్ స్కిల్స్‌తోపాటు టెక్నాలజీ ఆధారంగా పరికరాన్ని తయారు చేయగలిగే పరిజ్ఞానం కూడా అవసరం.
- క్వాలిటీ అష్యూరెన్స్ విభాగం: వైద్య పరికరాల తయారీ రంగంలో మరో కీలక ఉద్యోగం.. క్వాలిటీ అష్యూరెన్స్. ఒక పరికరాన్ని రూపొందించిన తర్వాత దాని నాణ్యత, పనితీరును పరీక్షించడం క్వాలిటీ అష్యూరెన్స్ విభాగం ప్రధాన విధులు. అందుకే ఈ విభాగంలోనూ బయోమెడికల్ ఇంజనీరింగ్‌లో పీజీ, పీహెచ్‌డీ చేసిన అభ్యర్థులకు అవకాశం లభిస్తోంది.
- ఐపీఆర్ విభాగం: ఒక ఉత్పత్తిని రూపొందించిన సంస్థ దానికి సంబంధించిన పేటెంట్ హక్కులను పొందే క్రమంలో ఐపీఆర్(ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్)కు అనుగుణంగా సర్టిఫికెట్ సొంతం చేసుకోవాలనుకుంటుంది. ఐపీఆర్‌కు సంబంధించిన విధానాలు, నిబంధనలపై నైపుణ్యం ఉన్న మానవ వనరుల అవసరం ఏర్పడుతోంది. ఇందుకోసం సంస్థలు ప్రధానంగా న్యాయశాస్త్ర విద్యార్థులను నియమిం చుకుంటున్నాయి. వీరికి కూడా వేతనం సగటున రూ.50వేల వరకు అందుతోంది.
- ప్రొడక్షన్ ఇంజనీర్స్: వైద్యపరికరాలు రూపొందించే క్రమంలో సాంకేతిక నైపుణ్యాలను అన్వయిస్తూ.. సదరు ఉత్పత్తికి ఓ రూపం ఇవ్వడం ప్రొడక్షన్ ఇంజనీర్స్ ప్రధాన విధులు. బయోమెడికల్ ఇంజనీరింగ్ అభ్యర్థులతోపాటు, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ ఇంజనీరింగ్‌లో బీటెక్/ఎంటెక్ పూర్తి చేసిన అభ్యర్థులు కూడా ప్రొడక్షన్ ఇంజనీర్స్‌గా అవకాశాలు అందుకునే వీలుంది. వీరికి ప్రారంభంలో నెలకు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు వేతనం లభిస్తోంది.
- ప్రొడక్షన్ సూపర్‌వైజర్స్: ఒక పరికరాన్ని తయారు చేసే క్రమంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ప్రొడక్షన్ సూపర్‌వైజర్స్ పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహిస్తుంటారు. బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీతోనే ఈ కొలువు సొంతం చేసుకోవచ్చు.
- మెయింటనెన్స్ టెక్నీషియన్స్: ఒక పరికరం వినియోగదారులకు చేరిన తర్వాత దాని పనితీరు పరంగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూసే వారే.. టెక్నీషియన్స్. వీరికి ప్రధాన ఉపాధి వేదికలు కార్పొరేట్ ఆస్పత్రులు. ఆస్పత్రులు సైతం సొంతంగా మెయింటనెన్స్ టెక్నీషియన్స్‌ను నియమించుకుంటున్నాయి.
భారత వైద్య పరికరాల పరిశ్రమ..
ముఖ్యాంశాలు..
- వైద్య పరికరాల ఉత్పత్తిలో ఆసియాలో నాలుగో పెద్ద దేశం భారత్.
- ఏటా పది బిలియన్ డాలర్ల మార్కెట్ విలువ.
- నూతన ప్రణాళికలతో 2025 నాటికి 50 బిలియన్ డాలర్లకు చేరే అవకాశం.
- జాతీయ స్థాయిలో ప్రస్తుతం 800 వరకు సంస్థలు.
- 2025 నాటికి ఆ సంఖ్య రెట్టింపయ్యే అవకాశం.
- రానున్న అయిదేళ్లలో కోర్, అనుబంధ విభాగాల్లో పది లక్షలకు పైగా ఉద్యోగాలు.
సహనం అవసరం: వైద్య పరికరాల తయారీ విభాగంలో ఉద్యోగావకాశాలు పెరుగుతున్నాయి. ఈ రంగంలో కెరీర్‌కు అకడమిక్ అర్హతలతోపాటు వ్యక్తిగత సహనం కూడా అవసరం. ఈ రంగం వృద్ధి, భవిష్యత్తు కొలువులను పరిగణనలోకి తీసుకుంటే.. లైఫ్ సెన్సెస్ విద్యార్థులకు చక్కటి ఉపాధి వేదికగా నిలుస్తుందని చెప్పొచ్చు. మధ్య తరహా సంస్థల్లో సగటున 70 నుంచి 80 మంది ఉద్యోగుల అవసరం ఉంటుంది. రీసెర్చ్ విభాగంలో బయోఇంజనీరింగ్, బయోమెడికల్ ఇంజనీరింగ్ చేసిన విద్యార్థులకు సంస్థలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. -జి.ఎస్.భువనేశ్వర్, జాయింట్ కో-ఆర్డినేటర్, అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ మెడికల్ డివైజ్ ఇండస్ట్రీ |
Published date : 08 Nov 2019 05:20PM