Skip to main content

సైన్స్‌ పరిశోధనలకు దీటైన మార్గం...కేవీపీవై ఫెలోషిప్స్‌

కిశోర్‌ వైజ్ఞానిక్‌ ప్రోత్సాహన్‌ యోజన (కేవీపీవై).. విద్యార్థులను సైన్స్‌ పరిశోధన వైపు ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం.
 కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ 1999 నుంచి కేవీపీవై పథకం ద్వారా ప్రతిభావంతులకు ప్రోత్సాహకాలను అందిస్తోంది. కేవీపీవై ఫెలోషిప్స్‌కి దేశవ్యాప్త గుర్తింపు ఉంది. తాజాగా కేవీపీవై 2019కు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో కేవీపీవైతో విద్యార్థులకు ప్రయోజనాలు... అర్హతలు... ఎంపిక విధానం గురించి తెలుసుకుందాం...

ఎంపిక విధానం :
కేవీపీవై ఫెలోషిప్‌లకు ఆన్‌లైన్‌ టెస్టు, ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక జరుగుతుంది. కేవీపీవై ఆప్టిట్యూడ్‌ టెస్టు సైన్స్, మ్యాథ్స్‌ సబ్జెక్టుల్లో ఆన్‌లైన్‌ విధానంలో ఉంటుంది. జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ పరీక్షలో ప్రతిభ చూపిన వారికి ఇంటర్వ్యూలు నిర్వహించి ఫెలోషిప్‌ ఖరారు చేస్తారు.

అర్హతలు :
ఎస్‌ఏ స్ట్రీమ్‌: ప్రస్తుత విద్యాసంవత్సరంలో(2019–20) సైన్స్‌ సబ్జెక్టుల్లో (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయాలజీ) ఇంటర్‌ మొదటి సంవత్సరం విద్యార్థులు అర్హులు. పదో తరగతిలో మ్యాథ్స్, సైన్స్‌లో కనీసం 70 శాతం మార్కులు సాధించి ఉండాలి (ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ విద్యార్థులకు 65 శాతం మార్కులు). వీరు స్కాలర్‌షిప్‌ పొందేందుకు ఇంటర్‌లో కనీసం 60 శాతం మార్కులతో (ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూడీ విద్యార్థులకు 50 శాతం మార్కులు) ఉత్తీర్ణత సాధించాలి. అదేవిధంగా 2021–22 విద్యాసంవత్సరంలో బేసిక్‌ సైన్స్‌ కోర్సులు(బీఎస్సీ/బీఎస్‌/బీస్టాట్‌/బీ మ్యాథ్స్‌/ఇంటిగ్రేటెడ్‌ ఎంఎస్సీ/ఇంటిగ్రేటెడ్‌ ఎంఎస్‌)ల్లో ప్రవేశం పొందాలి.

ఎస్‌ఎక్స్‌ స్ట్రీమ్‌: 2019–20 విద్యా సంవత్సరంలో సైన్స్‌ కోర్సుల్లో(ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయాలజీ) ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఈ స్ట్రీమ్‌కు అర్హులు. వీరు పదో తరగతిలో మ్యాథ్స్, సైన్స్‌ సబ్జెక్టుల్లో కనీసం 75 శాతం(ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీలు 65 శాతం మార్కులు) మార్కులు పొందాలి. అలాగే సైన్స్‌ సబ్జెక్టుల్లో కనీసం 60 శాతం మార్కులతో(ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీలు 50 శాతం మార్కులు) ఇంటర్‌ పూర్తిచేయాలి. అదేవిధంగా 2020–21 విద్యాసంవత్సరంలో బీఎస్సీ/బీఎస్‌/బీస్టాట్‌/బీ మ్యాథ్స్‌/ఇంటిగ్రేటెడ్‌ ఎంఎస్సీ/ఇంటిగ్రేటెడ్‌ ఎంఎస్‌ కోర్సుల్లో చేరితేనే స్కాలర్‌షిప్‌ లభిస్తుంది.

ఎస్‌బీ స్ట్రీమ్‌: 2019–20 విద్యా సంవత్సరంలో బీఎస్సీ/బీఎస్‌/బీస్టాట్‌/బీ మ్యాథ్స్‌/ఇంటిగ్రేటెడ్‌ ఎంఎస్సీ/ఇంటిగ్రేటెడ్‌ ఎంఎస్‌ కోర్సుల ప్రథమ సంవత్సరంలో చేరిన విద్యార్థులు ఎస్‌బీ స్ట్రీమ్‌కు అర్హులు. వీరు సైన్స్‌ సబ్జెక్టుల్లో కనీసం 60 శాతం(ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులు 50 శాతం మార్కులు) మార్కులతో ఇంటర్‌ ఉత్తీర్ణత సాధించాలి.

కేవీపీవైతో ప్రయోజనాలు...

  • కేవీపీవై ఎంపిక ప్రక్రియలో విజయం సాధించిన విద్యార్థులకు సైన్స్‌ కోర్సులు అభ్యసించేందుకు ఐదేళ్లపాటు ఫెలోషిప్‌ సదుపాయం అందుబాటులో ఉంటుంది. దీంతోపాటు ఏడాదికోసారి కాంటింజెన్సీ గ్రాంట్‌ కూడా లభిస్తుంది.
  • ఎస్‌ఏ, ఎస్‌ఎక్స్, ఎస్‌బీ స్ట్రీమ్స్‌లో బీఎస్సీ, బ్యాచిలర్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్స్, బ్యాచిలర్‌ ఆఫ్‌ మ్యాథమెటిక్స్, ఇంటిగ్రేటెడ్‌ ఎంఎస్సీ, ఎంఎస్‌ కోర్సుల్లో ప్రవేశించిన విద్యార్థులకు మొదటి మూడేళ్లు నెలకు రూ.5వేలు చొప్పున ఫెలోషిప్‌ అందుతుంది. దీంతోపాటు ఏటా రూ.20 వేల కాంటింజెన్సీ గ్రాంట్‌ లభిస్తుంది.
  • మూడు స్ట్రీమ్స్‌లోని చివరి రెండేళ్లు(పీజీ, ఇంటిగ్రేటెడ్‌ పీజీ స్థాయిలో) నెలకు రూ.7వేల ఫెలోషిప్‌తోపాటు రూ.28వేల వార్షిక కాంటింజెన్సీ గ్రాంట్‌ అందుతుంది.
  • పుస్తకాల కొనుగోలు; వర్క్‌షాప్‌లు, ఇతర సైన్స్‌ సదస్సులకు హాజరుకు సంబంధించిన రవాణా ఖర్చులకు కాంటింజెన్సీ గ్రాంట్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది.
విలువైన అర్హత :
  • కేవీపీవై ద్వారా ఫెలోషిప్‌ లభించడంతోపాటు విద్యార్థుల రెజ్యుమెలో అదనపు అర్హతగా చేరుతుంది. హార్వర్డ్‌; మిట్‌ వంటి ప్రముఖ విదేశీ యూనివర్సిటీలతోపాటు; పలు జాతీయ స్థాయి ఇన్‌స్టిట్యూట్స్‌ల్లోనూ ప్రవేశాల్లో కేవీపీవై విద్యార్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
  • కేవీపీవై స్కాలర్స్‌కి జాతీయ పరిశోధనా సంస్థల్లో జరిగే ప్రోగ్రామ్స్‌లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. ఆ సమయంలో సైన్స్‌; రీసెర్చ్‌ రంగంలోని నిష్ణాతులైన అధ్యాపకుల లెక్చర్లు వినే వీలుంటుంది. దీంతోపాటు తరచూ సమీపంలోని సైన్స్, రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ను సందర్శించడం వల్ల శాస్త్రవేత్తల పరిశోధనలు, పనితీరుపై అవగాహన ఏర్పడుతుంది. వారితో అభిప్రాయాలను పంచుకొనే అవకాశం దక్కుతుంది. కేవీపీవై ఫెలోషిప్‌కి ఎంపికైన వారికి ప్రత్యేక ఐడీ కార్డులు జారీ చేస్తారు. ఈ ఐడీ కార్డు ఆధారంగా జాతీయ స్థాయి లేబొరేటరీలు; విశ్వవిద్యాలయాలు; ఇన్‌స్టిట్యూట్స్‌ తమ ల్యాబ్స్, లైబ్రరీలను వినియోగించుకునే సౌలభ్యం కల్పిస్తున్నాయి. దీంతోపాటు కేవీపీవై ఫెలోషిప్‌ ద్వారా సైన్స్‌ పరిశోధనల్లో టాప్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఐఐఎస్సీ; ఐఐఎస్‌ఈఆర్‌లలో నేరుగా ప్రవేశం పొందే అవకాశం సైతం ఉంది.
ఆప్టిట్యూడ్‌ టెస్టు విధానం :
ఎస్‌ఏ స్ట్రీమ్‌:
పేపర్‌ రెండు విభాగాలుగా (పార్ట్‌1, పార్ట్‌ 2) ఉంటుంది.
  • పార్ట్‌ 1లో.. మ్యాథమెటిక్స్‌ 15 ప్రశ్నలు–15 మార్కులు; ఫిజిక్స్‌ 15 ప్రశ్నలు–15 మార్కులు; కెమిస్ట్రీ 15 ప్రశ్నలు–15 మార్కులు; బయాలజీ 15 ప్రశ్నలు–15 మార్కులు ఉంటాయి.
  • పార్ట్‌ 2లో.. మ్యాథమెటిక్స్‌ 5 ప్రశ్నలు–10 మార్కులు; ఫిజిక్స్‌ 5 ప్రశ్నలు–10 మార్కులు; కెమిస్ట్రీ 5 ప్రశ్నలు–10 మార్కులు; బయాలజీ 5 ప్రశ్నలు–10 మార్కులు ఉంటాయి.
  • ఎస్‌ఏ స్ట్రీమ్‌కి హాజరయ్యే వారు అన్ని విభాగాలను తప్పనిసరిగా అటెంప్ట్‌ చేయాల్సి ఉంటుంది. పార్ట్‌1లో ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కు కోత విధిస్తారు.
ఎస్‌ఎక్స్, ఎస్‌బీ స్ట్రీమ్‌: ఈ స్ట్రీమ్స్‌లో పేపర్‌ రెండు విభాగాలు (పార్ట్‌ 1, పార్ట్‌ 2)గా ఉంటుంది. పార్ట్‌ 1లో మ్యాథ్స్‌; ఫిజిక్స్‌; కెమిస్ట్రీ; బయాలజీ నుంచి 20 ప్రశ్నల చొప్పున అడుగుతారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది.
  • పార్ట్‌ 2లో ప్రతి విభాగం నుంచి 10 ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నకు రెండు మార్కులు కేటాయించారు. పార్ట్‌ 1లో ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల చొప్పున; పార్ట్‌ 2లో ప్రతి తప్పు సమాధానానికి 0.50 మార్కుల చొప్పున కోత విధిస్తారు.
  • ఎస్‌ఎక్స్, ఎస్‌బీ స్ట్రీమ్‌లో పార్ట్‌ 1 నుంచి ఏవైనా మూడు; పార్ట్‌ 2 నుంచి ఏవైనా రెండు సబ్జెక్టులను అటెంప్ట్‌ చేసే వెసులుబాటు ఉంది. అన్ని విభాగాలను అటెంప్ట్‌ చేస్తే బెస్ట్‌ ఆఫ్‌ 3ని; బెస్ట్‌ ఆఫ్‌ 2ను పరిగణలోకి తీసుకుంటారు.

ముఖ్య సమాచారం :
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 20, 2019
అడ్మిట్‌ కార్డుల జారీ: అక్టోబర్‌ రెండోవారం.
పరీక్ష తేదీ: 2019 నవంబర్‌ 3.
ఎస్‌ఏ స్ట్రీమ్‌: ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు. 
ఎస్‌ఎక్స్‌/ఎస్‌బీ స్ట్రీమ్స్‌: మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు.
 ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.kvpy.iisc.ernet.in

Edu newsసన్నద్ధతకు వ్యూహాలు:
ఎస్‌ఏ స్ట్రీమ్‌ :
మ్యాథ్స్‌:
స్టాటిస్టిక్స్‌ అండ్‌ ప్రాబబిలిటీ; లిమిట్స్‌ అండ్‌ డెరివేషన్స్‌; 3 డీ–జామెట్రీ; కోనిక్‌ సెక్షన్‌; పెర్ముటేషన్స్‌ అండ్‌ కాంబినేషన్స్‌; సీక్వెన్సెస్‌ అండ్‌ సిరీస్‌ చాప్టర్లకు అధిక వెయిటేజీ దక్కుతుంది. కాబట్టి మ్యాథ్స్‌ ప్రిపరేషన్‌ పరంగా ఈ చాప్టర్లకు ఎక్కువ సమయం కేటాయించాలి.
స్ట్రైట్‌ లైన్స్‌; బైనామియల్‌ థీరమ్‌; కాంప్లెక్స్‌ నంబర్స్‌ అండ్‌ క్వాట్రాడిక్స్‌; లీనియర్‌ ఇనీక్వాలిటీస్‌; రిలేషన్స్‌ అండ్‌ ఫంక్షన్స్‌ అంశాలను ఒక స్థాయిలో చదివితే సరిపోతుంది.
ట్రిగనోమెట్రీ; మ్యాథమెటికల్‌ రీజనింగ్‌ చాప్టర్లను ప్రాథమిక స్థాయిలో ప్రిపేరవ్వాలి. ట్రిగనోమెట్రీ ప్రిపరేషన్‌కి ఎక్కువ సమయం పడుతుంది. కానీ, పరీక్షలో దాన్నుంచి తక్కువ ప్రశ్నలు వస్తున్నాయి.
ఫిజిక్స్‌: ఆసిలేషన్స్‌ అండ్‌ వేవ్స్‌; థర్మోడైనమిక్స్‌; మెకానికల్‌ప్రాపర్టీస్‌ ఆఫ్‌ ఫ్లూయిడ్స్‌; గ్రావిటేషన్‌; వర్క్, ఎనర్జీ అండ్‌ పవర్‌ చాప్టర్లకు ఎక్కువ వెయిటేజీ లభిస్తుంది.
కైనటిక్‌ థియరీ; థర్మల్‌ ప్రాపర్టీస్‌; మెకానికల్‌ ప్రాపర్టీస్‌ ఆఫ్‌ సాలిడ్స్‌; రొటేషనల్‌ మోషన్‌; మోషన్‌ ఇన్‌ ప్లేన్‌ చాప్టర్లకు మధ్యస్థ ప్రాధాన్యం దక్కుతోంది.
లా ఆఫ్‌ మోషన్‌; మోషన్‌ ఇన్‌ స్ట్రైట్‌ లైన్‌; యూనిట్స్‌ అండ్‌ మెజర్‌మెంట్స్‌; ఫిజికల్‌ వరల్డ్‌ చాప్టర్లకు తక్కువ వెయిటేజీ దక్కుతోంది. ఫిజికల్‌ వరల్డ్‌ చాప్టర్‌ను పూర్తిగా విస్మరించినా పర్వాలేదు.
కెమిస్ట్రీ: హైడ్రోకార్బన్స్‌; ఆర్గానిక్‌ కెమిస్ట్రీ; ఎస్‌ అండ్‌ పీ బ్లాక్‌ ఎలిమెంట్స్‌; ఈక్విలిబ్రియమ్‌; కెమికల్‌ బాండింగ్‌ అంశాలకు అధిక వెయిటేజీ లభిస్తుంది. కాబట్టి ఈ చాప్టర్లకు అధిక సమయం వెచ్చించాలి.
ఎన్విరాన్‌మెంటల్‌ కెమిస్ట్రీ; హైడ్రోజన్‌; స్ట్రక్చర్‌ ఆఫ్‌ ఆటమ్స్‌; థర్మోడైనమిక్స్‌; క్లాసిఫికేషన్‌ ఆఫ్‌ ఎలిమెంట్స్‌ చాప్టర్ల నుంచి చెప్పకోదగ్గ స్థాయిలో ప్రశ్నలు వస్తున్నాయి. కానీ, స్టేట్‌ ఆఫ్‌ మేటర్‌; బేసిక్‌ కాన్సెప్ట్స్‌ ఆఫ్‌ కెమిస్ట్రీ; రిడాక్స్‌ రియాక్షన్స్‌ టాపిక్స్‌ నుంచి చాలా తక్కువ స్థాయిలో ప్రశ్నలు అడుగుతున్నారు.
బయాలజీ: కంట్రోల్‌ అండ్‌ కోఆర్డినేషన్‌ ఇన్‌ యానిమల్స్‌ అండ్‌ ప్లాంట్స్‌; హెరిడిటీ అండ్‌ ఎవల్యూషన్‌; రీప్రొడక్షన్‌; లైఫ్‌ ప్రాసెస్‌; అవర్‌ ఎనన్విరాన్‌మెంట్‌ చాప్టర్లను సమగ్రంగా చదవాలి. బయాలజీ ప్రిపరేషన్‌ పరంగా ఎస్‌ఎస్‌సీ బయాలజీలోని ప్రాథమిక కాన్సెప్ట్‌లపై పట్టు సాధిస్తే మెరుగైన ఫలితాల సాధించొచ్చు.

ఎస్‌ఎక్స్, ఎస్‌బీ స్ట్రీమ్స్‌ :
ఈ రెండు స్ట్రీమ్స్‌లో విజయం సాధించాలంటే... ఎస్‌ఏ స్ట్రీమ్‌లోని అంశాలకు అదనంగా కింది అంశాలను చదవాల్సి ఉంటుది.
మ్యాథ్స్‌: ప్రాబబిలిటీ; వెక్టార్‌ ఆల్‌జీబ్రా అండ్‌ 3డీ; కంటిన్యుటీ అండ్‌ డిఫ్రెన్షియబిలిటీ; అప్లికేషన్స్‌ ఆఫ్‌ డెరివేషన్స్‌; అప్లికేషన్స్‌ ఆఫ్‌ ఇంటెగ్రల్స్‌;  డిఫరెన్షియల్‌ ఈక్వేషన్స్‌ అంశాల నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తుజున్నాయి.
ఇన్వెర్స్‌ ట్రిగనోమెట్రి; మాట్రిసెస్‌ అండ్‌ డిటర్మినెంట్స్‌; ఇంటెగ్రల్స్‌; రిలేషన్స్‌ అండ్‌ ఫంక్షన్స్‌ నుంచి ప్రశ్నలు మోస్తరుగా వస్తున్నాయి. లీనియర్‌ ప్రోగ్రామింగ్‌ నుంచి తక్కువ ప్రశ్నలు వస్తున్నాయి.
ఫిజిక్స్‌: సెమీ కండక్టర్స్‌; డ్యూయల్‌ నేచుర్‌ ఆఫ్‌ మ్యాటర్‌ అండ్‌ రేడియేషన్‌; ఈఎంఐ అండ్‌ ఏసీ; మూవింగ్‌ ఛార్జెస్‌; మాగ్నటిజం అండ్‌ మేటర్‌; రే ఆప్టిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ చాప్టర్ల నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి. కాబట్టి ఈ చాప్టర్లలోని ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేయాలి.
వేవ్‌ ఆప్టిక్స్‌; ఆటమ్స్‌ అండ్‌ న్యూక్లిౖయె; ఈఎండబ్ల్యూ; ఎలక్ట్రోస్టాటిస్టిక్స్‌ చాప్టర్లకు మధ్యస్థ ప్రాధాన్యం దక్కుతుంది. ఆటమ్స్‌ అండ్‌ న్యూక్లిౖయె చాప్టర్‌ నుంచి డైరెక్ట్‌ ప్రశ్నలు అడుగుతున్నారు. కమ్యూనికేషన్‌ సిస్టమ్స్‌ చాప్టర్‌ను ప్రాథమిక స్థాయిలో ప్రిపేరయితే సరిపోతుంది.
కెమిస్ట్రీ: బయోమాలిక్యూల్స్‌ అండ్‌ పాలిమర్స్‌ చాప్టర్‌ నుంచి ఏటా క్రమం తప్పకుండా ప్రశ్నలు అడుగుతున్నారు. కాబట్టి ఈ చాప్టర్‌పై అధిక దృష్టి పెట్టాలి. దీంతోపాటు అమైన్స్‌ ఆల్కహాల్స్‌; ఫీనాల్స్‌ అండ్‌ ఈథర్స్‌; కోఆర్డినేషన్‌ కాంపౌండ్స్‌; పీ బ్లాక్‌; సర్ఫేస్‌ కెమిస్ట్రీ చాప్టర్లకు అధిక వెయిటేజీ దక్కుతుంది.
ఆల్కలైడ్స్‌; కీటోన్స్‌ అండ్‌ యాసిడ్స్‌; డీ అండ్‌ ఎఫ్‌ బ్లాక్‌ ఎలిమెంట్స్‌; ఎలక్ట్రోకెమిస్ట్రీ, కెమికల్‌ కైనటిక్స్‌; సాలిడ్‌ స్టేట్‌ అండ్‌ సొల్యూషన్‌ అంశాల నుంచి చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రశ్నలు వస్తున్నాయి.
ఐసోలేషన్‌ ఆఫ్‌ ఎలిమెంట్స్‌; హాలోఆల్కేన్స్‌; హాలోఎరీన్స్‌; కెమిస్ట్రీ ఇన్‌ ఎవ్రీడే లైఫ్‌ చాప్టర్లకు తక్కువ వెయిటేజీ లభిస్తోంది.
బయాలజీ: డైవర్సిటీ ఆఫ్‌ లివింగ్‌ ఆర్గానిజమ్స్‌; జెనిటిక్స్‌ అండ్‌ ఎవల్యూషన్‌; కంట్రోల్‌ అండ్‌ కోఆర్డినేషన్‌ ఇన్‌ యానిమల్‌ అండ్‌ ప్లాంట్స్‌ చాప్టర్లకు అధిక వెయిటేజీ లభిస్తుంది. సెల్‌ స్ట్రక్చర్‌ అండ్‌ ఫంక్షన్స్‌; జెనిటిక్స్‌; ఎకాలజీ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌; బయాలజీ అండ్‌ హ్యూమన్‌ వెల్ఫేర్‌ చాప్టర్ల ప్రిపరేషన్‌కు అధిక సమయం కేటాయించాలి.

Published date : 25 Jul 2019 02:25PM

Photo Stories