అవకాశాల వేదిక.. ఆప్టోమెట్రీ
Sakshi Education
హెల్త్ కేర్ రంగంలో విస్తృత అవకాశాలు కల్పిస్తున్న మరో రంగం ఆప్టోమెట్రీ. కళ్లలో ఏర్పడే సమస్యలను గుర్తించడం, సంబంధిత పరీక్షలను నిర్వహించడం, తగిన చికిత్సను సూచించడం వంటి అంశాలను అధ్యయనం చేసే శాస్త్రమే ఆప్టోమెట్రీ. కంటి ఆసుపత్రుల్లో నేత్ర వైద్యులకు అనుబంధంగా సేవలు అందించటంలో ఆప్టోమెట్రీషియన్ల పాత్ర ఎంతో కీలకం. అవసరాలకు సరిపడ మానవవనరులు లేకపోవడంతో ఇటీవలి కాలంలో ఈ కోర్సుకు చాలా డిమాండ్ ఏర్పడింది. దాంతో కోర్సు పూర్తయిన వెంటనే జాబ్ గ్యారంటీ అని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఆప్టోమెట్రీ కెరీర్‌పై ఫోకస్..
ఆప్టోమెట్రీ అనే పదం గ్రీకు భాష నుంచి వచ్చింది. ‘ఆప్టోస్’ అంటే కళ్లు లేదా చూపు, ‘మెటీరియా’ అంటే కొలత అని అర్థం. కంటి ఆసుపత్రుల్లో నేత్ర వైద్యులకు అనుబంధంగా సేవలు అందించే వృత్తి నిపుణులను ఆప్టోమెట్రీస్ట్స్‌గా వ్యవహరిస్తారు. ఒక అంచనా మేరకు దేశంలో ప్రతి రెండులక్షల జనాభాకు ఒక ఆప్టోమెట్రీషియన్ ఉన్నాడు. అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే ఇది చాలా స్వల్పం. అమెరికా, యూరోపియన్ దేశాల్లో ప్రతి 10 వేల మంది జనాభాకు ఒక ఆప్టోమెట్రీషియన్ ఉన్నాడు. పెరుగుతున్న జనాభా, అవసరాల దృష్ట్యా దేశంలో నేడు రెండు లక్షల మంది క్వాలిఫైడ్ ఆప్టోమెట్రీషియన్ల అవసరం ఉంది. అంతేకాకుండా ప్రతి సంవత్సరం ఆప్టోమెట్రీ రంగం 20 శాతం మేర విస్తరిస్తోంది. దాంతో ఆమేరకు అవకాశాలు అధికమవుతున్నాయి.
పవేశం ఇలా:
ఆప్టోమెట్రిక్ రంగానికి సంబంధించి విభిన్న కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వాటిని అభ్యసించడం ద్వారా ఈ రంగంలోకి ప్రవేశించవచ్చు. దేశంలో ఆప్టోమెట్రీకి సంబంధించి అందుబాటులో ఉన్న కోర్సులు.. బీఎస్సీ ఆనర్స్ ఇన్ ఆఫ్తాల్మిక్ టెక్నిక్స్, డిప్లొమా ఇన్ ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్, బ్యాచిలర్ ఇన్ క్లినికల్ ఆప్టోమెట్రీ, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఆప్టోమెట్రీ. వీటికి అర్హత 10వ తరగతి/ఇంటర్మీడియెట్ (సెన్సైస్). ఉన్నత విద్య విషయానికొస్తే..ఆప్టోమెట్రీలో బ్యాచిలర్ కోర్సు తర్వాత పీజీ చేయవచ్చు. ఇందుకు సంబంధించి ఎంఆప్ట్, ఎంఫిల్, ఎంఎస్, పీహెచ్‌డీ కోర్సులను ఎంచుకోవచ్చు. అమెరికాలో ఓడీ (డాక్టర్ ఆఫ్ ఆప్టోమెట్రీ) కోర్సు చేయవచ్చు.
ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ:
ఇగ్నో... ఫెడరేషన్ ఆఫ్ ఆఫ్తాల్మిక్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ సెంటర్స్ సహకారంతో బీఎస్సీ (ఆనర్స్) ఇన్ ఆప్టోమెట్రీ అండ్ ఆఫ్తాల్మిక్ టెక్నిక్స్ కోర్సును నిర్వహిస్తుంది. అర్హత: 45 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్(ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ). ప్రతి ఏడాది జూన్ నుంచి అకడెమిక్ సెషన్ ప్రారంభమవుతుంది. ఇందుకోసం డిసెంబర్ నుంచి మే 31 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అర్హత కోర్సులో సాధించిన మార్కులు (90 శాతం వెయిటేజీ), ఇంటర్వ్యూ(10 శాతం వెయిటేజీ) ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. థియరీ క్లాసులను ఇగ్నో నిర్వహిస్తుంది. ప్రాక్టికల్స్ మాత్రం సంబంధిత ఐ హాస్పిటల్స్/ఐ రీసెర్చ్ సెంటర్స్/ ఐ ఇన్‌స్టిట్యూట్‌లలో ఉంటాయి.
వివరాలకు: www.ignou.ac.in
మన రాష్ట్రంలో:
మన రాష్ట్రంలో ఆప్టోమెట్రీకి సంబంధించి డిప్లొమా ఇన్ ఆప్టోమెట్రీ టెక్నీషియన్ (డీఓఎం), డిప్లొమా ఇన్ ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్ (డీఓఏ), బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఆప్టోమెట్రీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వివరాలు..
మన రాష్ట్రంలో ఈ కోర్సును బిట్స్-పిలానీ సహకారంతో ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్‌కు చెందిన బాస్క్ అండ్ లాంబ్ స్కూల్ అందిస్తోంది. వ్యవధి: నాలుగేళ్లు. అర్హత: 60 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ (బైపీసీ/ఎంపీసీ). అడ్మిషన్ ప్రక్రియ జూలైలో ఉంటుంది. ఈ ఇన్‌స్టిట్యూట్ ఆఫర్ చేస్తున్న ఇతర కోర్సులు..
ఒక్క భారతదేశంలోనే దాదాపు కోటిమందికి అంధత్వమున్నట్లు అంచనా. వీటిలో దాదాపు 80 శాతం అంధత్వ సమస్యలను శిక్షణ పొందిన నిపుణుల సేవలు, ప్రాథమిక వసతులు కల్పించడం ద్వారా ప్రారంభస్థాయిలోనే నివారించవచ్చు. ఈ నేపథ్యంలో ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్ సేవలు ఎంతో కీలకమైనవి. కాబట్టి ఆప్టోమెట్రీ రంగంలో కోర్సులు పూర్తి చేసిన వారికి వెంటనే ఉపాధి ఖాయమని చెప్పొచ్చు. ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్‌లో ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్‌గా కెరీర్ మొదలు పెట్టొచ్చు. తర్వాత అర్హత, అనుభవం ఆధారంగా సొంతంగా క్లినిక్ ప్రారంభించవచ్చు. ఐ హాస్పిటల్స్, ఐ బ్యాంక్స్, కంటాక్ట్ లెన్స్-ఆఫ్తాల్మిక్ పరిశ్రమలు, ఆప్టికల్ షో రూమ్స్, ఐ-కేర్ సంబంధిత ప్రొడక్ట్స్‌ను తయారు చేసే సంస్థలు వీరికి కెరీర్ అవెన్యూస్‌గా నిలుస్తున్నాయి. ఆసక్తి ఉంటే సంబంధిత కోర్సులను ఆఫర్ చేసే ఇన్‌స్టిట్యూట్‌లలో ఫ్యాకల్టీగా కూడా స్థిరపడొచ్చు. ఒకప్పటిలా కేవలం పట్టణాలకే పరిమితం కాకుండా మండల కేంద్రాల్లోను ఐ హాస్పిటల్స్ విస్తరిస్తున్నాయి. అంతేకాకుండా ఈ రంగంలోకి ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలు కూడా ప్రవేశించడం.. సదరు అభ్యర్థులకు డిమాండ్‌ను మరింత పెంచింది. ఈ నేపథ్యంలో సంబంధిత వైద్యులకు సహాయం చేసే ఆప్టోమెట్రీషియన్ల అవసరం కూడా అనివార్యమైంది. ఈ నేపథ్యంలో కూడా విస్తృత అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రభుత్వ రంగంలో కూడా ఆప్టోమెట్రిక్ అభ్యర్థులకు అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వం ఆరోగ్య రంగానికి పెద్ద పీట వేస్తోన్న క్రమంలో కొత్తగా మెడికల్ కాలేజీలు, ఆస్పత్రులను నెలకొల్పుతుండడం, ఖాళీగా ఉన్న పారా మెడికల్ పోస్టులను భర్తీ చేస్తుండడం కూడా ఆప్టోమెట్రీ అభ్యర్థులకు కలిసొచ్చే అంశం. అంతేకాకుండా ఈఎస్‌ఐ, ఆర్మ్‌డ్ ఫోర్సెస్ వంటి ప్రభుత్వ విభాగాలు కూడా వీరిని నియమించుకుంటాయి.
వేతనాలు:
కెరీర్ ప్రారంభంలో సంబంధిత ఫిజిషియన్స్, ఇన్‌స్టిట్యూట్, క్లినిక్స్‌లో అసిస్టెంట్‌గా పని చేయాలి. ఈ సమయంలో వీరికి నెలకు రూ. 12 వేల నుంచి రూ. 15 వేల వరకు లభిస్తుంది. తర్వాత ఈ రంగంలోని ఉన్నత విద్య పూర్తి చేయడం ద్వారా డాక్టర్‌కు సమానమైన హోదాకు చేరుకోవచ్చు. ఈ సమయంలో నెలకు రూ. 30 వేల నుంచి రూ. 60 వేల వరకు సంపాదించవచ్చు.
అనుకూలతలు:

- డిప్లొమా ఇన్ ఆప్టోమెట్రీ టెక్నీషియన్:
ఈ కోర్సుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో కలిపి 614 సీట్లు ఉన్నాయి.
- డిప్లొమా ఇన్ ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్:
ఈ కోర్సుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో కలిపి 1,781 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
అర్హత: ఇంటర్మీడియెట్(బైపీసీ). సీట్లకు సరిపడ విద్యార్థులు లేని పక్షంలో ఎంపీసీ విద్యార్థులకు అవకాశం కల్పిస్తారు. అడ్మిషన్ నోటిఫికేషన్ ప్రతి సంవత్సరం సాధారణంగా జూన్/జూలై నెలలో వెలువడుతుంది. ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డు కౌన్సెలింగ్ ద్వారా ఈ కోర్సుల్లో సీట్లను భర్తీ చేస్తుంది.
వివరాలకు: www.appmb.org
మన రాష్ట్రంలో ఈ కోర్సును బిట్స్-పిలానీ సహకారంతో ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్‌కు చెందిన బాస్క్ అండ్ లాంబ్ స్కూల్ అందిస్తోంది. వ్యవధి: నాలుగేళ్లు. అర్హత: 60 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ (బైపీసీ/ఎంపీసీ). అడ్మిషన్ ప్రక్రియ జూలైలో ఉంటుంది. ఈ ఇన్‌స్టిట్యూట్ ఆఫర్ చేస్తున్న ఇతర కోర్సులు..
- ఆప్టోమెట్రీ ఇంటర్న్‌షిప్: మూడేళ్ల ఆప్టోమెట్రీ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం కల్పిస్తుంది.
- ఆప్టోమెట్రీ ఫెలోషిప్: బీఎస్సీ-ఆప్టోమెట్రీ అర్హత ఉన్న విద్యార్థులకు ఏడాది ఫెలోషిప్, డిప్లొమా ఉన్న విద్యార్థులకు రెండేళ్ల ఫెలోషిప్ అందజేస్తున్నారు. విజన్ టెక్నిషియన్ కోర్సు: అర్హత: 10+2. ఏడాదికి రెండు సార్లు.. ఫిబ్రవరి, ఆగస్ట్‌లలో అడ్మిషన్ ప్రక్రియ ఉంటుంది.
- వివరాలకు: education.lvpei.org
- భారత్ సేవక్ సమాజ్(బీఎస్‌ఎస్-కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత సంస్థ) ఒకేషనల్ ఎడ్యుకేషన్ సంస్థ ఆప్టోమెట్రీ, ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్ కోర్సులను అందిస్తోంది. ఈ కోర్సులకు 10వ తరగతి ఉత్తీర్ణత చాలు.
- సేవా దృక్ఫథం, ఓర్పు, సహనం, అంకిత భావం
- కళ్లు, లెన్సెస్‌తో పని చేయాల్సి ఉంటుంది. కాబట్టి కచ్చితత్వం, సున్నితత్వాన్ని కలిగి ఉండాలి.
- మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, సమయస్ఫూర్తి
- సమయంతో నిమిత్తం లేకుండా కష్టపడే తత్వం
- నిర్ణయాత్మక సామర్థ్యం
- జట్టుగా, సమన్వయంతో పని చేసే తత్వం
- శాస్త్రీయ వైఖరి, విశ్లేషణాత్మక సామర్థ్యం
ఒక్క భారతదేశంలోనే దాదాపు కోటిమందికి అంధత్వమున్నట్లు అంచనా. వీటిలో దాదాపు 80 శాతం అంధత్వ సమస్యలను శిక్షణ పొందిన నిపుణుల సేవలు, ప్రాథమిక వసతులు కల్పించడం ద్వారా ప్రారంభస్థాయిలోనే నివారించవచ్చు. ఈ నేపథ్యంలో ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్ సేవలు ఎంతో కీలకమైనవి. కాబట్టి ఆప్టోమెట్రీ రంగంలో కోర్సులు పూర్తి చేసిన వారికి వెంటనే ఉపాధి ఖాయమని చెప్పొచ్చు. ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్‌లో ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్‌గా కెరీర్ మొదలు పెట్టొచ్చు. తర్వాత అర్హత, అనుభవం ఆధారంగా సొంతంగా క్లినిక్ ప్రారంభించవచ్చు. ఐ హాస్పిటల్స్, ఐ బ్యాంక్స్, కంటాక్ట్ లెన్స్-ఆఫ్తాల్మిక్ పరిశ్రమలు, ఆప్టికల్ షో రూమ్స్, ఐ-కేర్ సంబంధిత ప్రొడక్ట్స్‌ను తయారు చేసే సంస్థలు వీరికి కెరీర్ అవెన్యూస్‌గా నిలుస్తున్నాయి. ఆసక్తి ఉంటే సంబంధిత కోర్సులను ఆఫర్ చేసే ఇన్‌స్టిట్యూట్‌లలో ఫ్యాకల్టీగా కూడా స్థిరపడొచ్చు. ఒకప్పటిలా కేవలం పట్టణాలకే పరిమితం కాకుండా మండల కేంద్రాల్లోను ఐ హాస్పిటల్స్ విస్తరిస్తున్నాయి. అంతేకాకుండా ఈ రంగంలోకి ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలు కూడా ప్రవేశించడం.. సదరు అభ్యర్థులకు డిమాండ్‌ను మరింత పెంచింది. ఈ నేపథ్యంలో సంబంధిత వైద్యులకు సహాయం చేసే ఆప్టోమెట్రీషియన్ల అవసరం కూడా అనివార్యమైంది. ఈ నేపథ్యంలో కూడా విస్తృత అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రభుత్వ రంగంలో కూడా ఆప్టోమెట్రిక్ అభ్యర్థులకు అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వం ఆరోగ్య రంగానికి పెద్ద పీట వేస్తోన్న క్రమంలో కొత్తగా మెడికల్ కాలేజీలు, ఆస్పత్రులను నెలకొల్పుతుండడం, ఖాళీగా ఉన్న పారా మెడికల్ పోస్టులను భర్తీ చేస్తుండడం కూడా ఆప్టోమెట్రీ అభ్యర్థులకు కలిసొచ్చే అంశం. అంతేకాకుండా ఈఎస్‌ఐ, ఆర్మ్‌డ్ ఫోర్సెస్ వంటి ప్రభుత్వ విభాగాలు కూడా వీరిని నియమించుకుంటాయి.
వేతనాలు:
కెరీర్ ప్రారంభంలో సంబంధిత ఫిజిషియన్స్, ఇన్‌స్టిట్యూట్, క్లినిక్స్‌లో అసిస్టెంట్‌గా పని చేయాలి. ఈ సమయంలో వీరికి నెలకు రూ. 12 వేల నుంచి రూ. 15 వేల వరకు లభిస్తుంది. తర్వాత ఈ రంగంలోని ఉన్నత విద్య పూర్తి చేయడం ద్వారా డాక్టర్‌కు సమానమైన హోదాకు చేరుకోవచ్చు. ఈ సమయంలో నెలకు రూ. 30 వేల నుంచి రూ. 60 వేల వరకు సంపాదించవచ్చు.
అనుకూలతలు:
- చక్కని హోదా-ఆకర్షణీయమైన వేతనం
- మాంద్యం సోకని ఎవర్ గ్రీన్ ప్రొఫెషన్
- ఉన్నత విద్యనభ్యసిస్తున్న సమయంలో పార్ట్ టైమ్ జాబ్ చేసుకోవచ్చు
- ప్రతి ఏటా విస్తరిస్తోన్న రంగం
- టాప్ మెడికల్ ప్రొఫెషన్‌లలో ఒకటి
- ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ -న్యూఢిల్లీ
- ఆంధ్రా మెడికల్ కాలేజీ-విశాఖపట్నం
- భారతీ విద్యాపీఠ్ యూనివర్సిటీ-పుణే
- ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్-హైదరాబాద్
- సరోజినీ దేవి ఐ హాస్పిటల్-హైదరాబాద్
- బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్-పిలానీ
- మణిపాల్ యూనివర్సిటీ-మణిపాల్
Published date : 03 Apr 2014 03:07PM