మెరుగైన ఉపాధి అవకాశాలకు.. పర్యాటకం
Sakshi Education
ప్రాచీన చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలు, భిన్నత్వంలో ఏకత్వం ఉన్న భారతావనిని దర్శించడానికి విదేశీయులు ఉవ్విళ్లూరుతున్నారు. హిమాలయ పర్వతాల హిమ సొగసులు, వావ్.. అనిపించే తాజ్‌మహల్ వెన్నెల వెలుగులు, మైమరపించే రాజస్థానీ కోటలు, అభయహస్తం అందించే తిరుమల శ్రీనివాసుడు, చూపు తిప్పుకోనివ్వని అరకు లోయ హోయలు.. ఇలా ఒకటేమిటి మన దేశంలో లెక్కకు మిక్కిలి పర్యాటక ప్రదేశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాలను సందర్శించే పర్యాటకులకు వివిధ సౌకర్యాలు కల్పించడానికి నిష్ణాతులైన మానవ వనరుల అవసరం ఏర్పడుతోంది. ఈ అవసరాలను తీర్చడం కోసం కేంద్ర ప్రభుత్వం ఐఐటీటీఎంను ఏర్పాటు చేసింది. ఈ సంస్థ వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసింది. వివరాలు..
ప్రపంచ పర్యాటకం ప్రతి ఏటా ఆరు శాతం వృద్ధిరేటు సాధిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 1.035 బిలియన్ల మంది పర్యాటకులతో 1.03 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల ఆదాయాన్ని అందిస్తోంది. మనదేశంలో కూడా పర్యాటక రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. 2012లో మనదేశాన్ని 6.57 మిలియన్ల మంది విదేశీ పర్యాటకులు సందర్శించారు. 2011లో ఈ సంఖ్య 6.29 మిలియన్లు. పర్యాటకం దేశానికి పెద్ద ఎత్తున విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించిపెడుతోంది. అంతేకాకుండా దేశ జనాభాలో 8.78 శాతం మందికి ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది. వరల్డ్ టూరిజం అండ్ ట్రావెల్ కౌన్సిల్ అంచనాల ప్రకారం 2020 నాటికి మన దేశంలో టూరిజం రంగంలో ఉద్యోగాల సంఖ్య 5,81,41,000కు పెరుగుతుంది.
కేంద్ర ప్రభుత్వ సంస్థ ఐఐటీటీఎం..
కేంద్ర ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని స్వతంత్ర ప్రతిపత్తి సంస్థ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్‌మెంట్ (ఐఐటీటీఎం). 1983లో ఏర్పడిన ఈ సంస్థ ట్రావెల్, టూరిజం సంబంధిత విభాగాల్లో విద్య, శిక్షణనందించడంతోపాటు పరిశోధన, కన్సల్టెన్సీ సేవలు కూడా అందిస్తోంది. ఐఐటీటీఎంకు గ్వాలియర్ ప్రధాన క్యాంపస్‌గా మొత్తం ఐదు క్యాంపస్‌లున్నాయి. అవి.. భువనేశ్వర్, నెల్లూరు, నోయిడా, గోవా.
ఐఐటీటీఎం - నెల్లూరు..
పది ఎకరాల విస్తీర్ణంలో 30 కోట్ల రూపాయల వ్యయంతో, అత్యంత ఆధునిక సౌకర్యాలతో నెల్లూరు క్యాంపస్‌ను ఏర్పాటు చేశారు. దక్షిణ భారతదేశంలో ఇక్కడ మాత్రమే క్యాంపస్ ఉంది. మే, 2014 నాటికి నిర్మాణాలు పూర్తవుతాయి. ఇక్కడ రెండేళ్ల వ్యవధి ఉన్న పీజీడీఎం టూరిజం అండ్ కార్గో మేనేజ్‌మెంట్ కోర్సును అందిస్తున్నారు.
ఐఐటీటీఎం 2014-16 సంవత్సరానికి సంబంధించి వివిధ విభాగాల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ (పీజీడీఎం) కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
కోర్సు: పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ (పీజీడీఎం)
వ్యవధి: రెండేళ్లు
విభాగాలు:

- టూరిజం అండ్ ట్రావెల్,
- టూరిజం అండ్ లీజర్,
- సర్వీసెస్,
- ఇంటర్నేషనల్ బిజినెస్ (ఇంటర్నేషనల్ టూరిజం),
- ఇంటర్నేషనల్ బిజినెస్ (టూరిజం అండ్ లాజిస్టిక్స్),
- టూరిజం అండ్ కార్గో మేనేజ్‌మెంట్
అర్హత: 50 శాతం మార్కులతో (ఎస్సీ/ఎస్టీ/శారీరక వికలాంగులకు 45 శాతం) ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత. బ్యాచిలర్ డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులూ అర్హులే.
ఎంపిక విధానం: క్యాట్-2013/మ్యాట్-సెప్టెంబర్, 2013/సీమ్యాట్-సెప్టెంబర్, 2013, ఫిబ్రవరి, 2014/ ఎక్స్‌ఏటీ-జనవరి, 2014/ జీమ్యాట్-2014/ ఏటీఎంఏ- 2014 స్కోర్ లేదా ఐఐటీటీఎం నిర్వహించే టూరిజం ఆప్టిట్యూడ్ టెస్ట్ (టీఏటీ) స్కోర్‌తోపాటు, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. రాతపరీక్ష స్కోర్‌కు 70 శాతం వెయిటేజ్, జీడీకి, పర్సనల్ ఇంటర్వ్యూలకు 15 శాతం చొప్పున వెయిటేజ్ ఉంటాయి.
టూరిజం ఆప్టిట్యూడ్ టెస్ట్ (టీఏటీ):
దేశవ్యాప్తంగా గ్వాలియర్, నోయిడా, భువనేశ్వర్, నెల్లూరు, గోవా క్యాంపస్‌ల్లో పరీక్షను నిర్వహిస్తారు. అభ్యర్థుల సంఖ్యను బట్టి మరిన్ని పరీక్ష కేంద్రాలను కేటాయిస్తారు. పరీక్షలో స్వల్ప సమాధాన ప్రశ్నలతోపాటు మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలుంటాయి. టూరిజంపై అభ్యర్థుల ఆప్టిట్యూడ్‌ను పరీక్షించేలా ప్రశ్నలడుగుతారు. ఇందులో భాగంగా చరిత్ర, సంస్కృతి, జాగ్రఫీ, పర్యాటకం, కరెంట్ ఈవెంట్స్‌పై ప్రశ్నలుంటాయి. పరీక్ష కాల వ్యవధి రెండు గంటలు.
క్యాంపస్‌లు - సీట్లు

కోర్సు | క్యాంపస్ | సీట్లు |
టూరిజం-ట్రావెల్ | గ్వాలియర్ | 93 |
టూరిజం-ట్రావెల్ | భువనేశ్వర్ | 93 |
టూరిజం - లీజర్ | నోయిడా | 93 |
సర్వీసెస్ | గ్వాలియర్ | 93 |
ఇంటర్నేషనల్ బిజినెస్ | గ్వాలియర్ | 93 |
ఇంటర్నేషనల్ బిజినెస్ | భువనేశ్వర్ | 93 |
టూరిజం అండ్ కార్గో | నెల్లూరు | 60 |
దరఖాస్తు విధానం: దరఖాస్తుతోపాటు బ్రోచర్‌ను www.iittm.org నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
టీఏటీ దరఖాస్తులకు చివరి తేదీ: జనవరి 31, 2014
టూరిజం ఆప్టిట్యూడ్ టెస్ట్ (టీఏటీ) పరీక్ష తేదీ: ఫిబ్రవరి 23
ఇతరులు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: ఏప్రిల్ 30
స్కిల్స్:
- మంచి కమ్యూనికేషన్ స్కిల్స్‌ను కలిగి ఉండాలి.
- ఎదుటి వ్యక్తులకు అర్థవంతంగా, ప్రభావవంతంగా వివరించగలగాలి.
- టూరిజం రంగానికి సంబంధించి ప్రస్తుత పరిణామాలను అవగాహన చేసుకోవాలి.
- ఇంటర్‌పర్సనల్ స్కిల్స్‌ను పెంపొందించుకోవాలి.
- ప్రయాణాలంటే ఆసక్తిని కలిగి ఉండాలి. దేశ, విదేశాల్లో పర్యటించడానికి సిద్ధంగా ఉండాలి.
అపార అవకాశాలు:
ఇంతకుముందు ఎప్పుడూ చూడని ప్రదేశాలను చూడాలని ఉవ్విళ్లూరేవారు ఎందరో. దైనందిన కార్యకలాపాల అలసటతో విసుగుచెందిన మనిషి విశ్రాంతిని కోరుకుంటు న్నాడు. ఈ తక్కువ సమయంలో అందుబాటులో ఉన్న పర్యాటక ప్రదేశాల్లో సేదతీరాలనుకుంటున్నాడు. సంబంధి త ప్రాంతాల వివరాలు, వసతి, భోజన సదుపా యం, ప్రయాణ వివరాలు తెలుసుకోవడానికి వివిధ ట్రావెల్ ఏజెన్సీలపై ఆధారపడుతున్నారు. ఈ నేపథ్యంలో టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్‌మెంట్ కోర్సులు పూర్తిచేసినవారికి అపార అవకాశాలు ఎదురుచూస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించడం కోసం పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తున్నాయి. వివిధ చారిత్రక, సాంస్కృతిక కట్టడాలను పరిరక్షించుకోవడం తోపాటు పర్యాటకులకు సౌకర్యాలను కల్పించడంలో ముందున్నాయి. ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వంతోపాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పర్యాటక మంత్రిత్వ శాఖలను ఏర్పాటు చేయడంతోపాటు స్టేట్ టూరిజం కార్పొరేషన్ లను సైతం ఏర్పాటు చేశాయి. అన్ని ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో ప్రభుత్వమే టూర్ ప్యాకేజ్‌లు నిర్వహించడంతోపాటు, హోటళ్లను నడుపుతోంది. వీటిల్లో పనిచేయడానికి పెద్దఎత్తున నిష్ణాతుల అవసరం ఏర్పడుతోంది. అంతేకాకుండా వివిధ ట్రావెల్ ఏజెన్సీలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఆన్‌లైన్ ద్వారా పర్యాటక ప్యాకేజ్‌లు అందిస్తున్నాయి. ఈ సంస్థల్లో వివిధ హోదాల్లో అవకాశాలుంటాయి. మిగిలిన రంగాలతో పోలిస్తే పీజీడీఎంలో కార్గో మేనేజ్‌మెంట్ పూర్తిచేసినవారికి మంచి అవకాశాలున్నాయి. మన దేశం అతిపొడవైన సముద్ర తీరాన్ని కలిగి ఉండటంతోపాటు భారీ సంఖ్యలో ఓడరేవులను కలిగి ఉంది. అంతేకాకుండా ఓ మాదిరి నగరాల్లో సైతం విమానాశ్రయాలు ఏర్పాటవుతున్నాయి. ఈ నేపథ్యంలో కార్గో మేనేజ్‌మెంట్ అభ్యర్థులు వివిధ ఓడరేవుల్లో, విమానాశ్రయాల్లో ఉద్యోగావకాశాలు పొందొచ్చు. వీరు ట్రావెల్ ఏజెన్సీల్లో టూర్ ఆపరేటర్లుగా, ట్రావెల్ మేనేజర్లు, హెల్త్ అండ్ మెడికల్ టూర్ కన్సల్టెంట్స్, టూరిజం మార్కెటింగ్ మేనేజర్లుగా పనిచేయొచ్చు. వివిధ హోటళ్లు, ఆతిధ్య రంగ కంపెనీల్లో వివిధ హోదాల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఎయిర్‌లైన్స్ /క్రూయిజ్‌లలో, ఫారెక్స్/ఇన్సూరెన్స్ /బ్యాంకింగ్ రంగ పరిశ్రమల్లోనూ ఉద్యోగా లు పొందొచ్చు. టూరిజం ప్రమోషన్ ఆఫీసర్లగాను అవకాశాలుంటాయి.
ఉద్యోగావకాశాలు కల్పిస్తున్న కంపెనీలు ఇవే..
టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్‌మెంట్ కోర్సులు పూర్తి చేసినవారికి ఉద్యోగావ కాశాలు కల్పిస్తున్న కంపెనీల్లో థామస్ కుక్, కాక్స్ అండ్ కింగ్స్, ఐఆర్‌సీటీసీ, మేక్ మై ట్రిప్, యాత్ర, జెట్ ఎయిర్‌వేస్, స్పైస్ జెట్, తాజ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్, ఒబెరాయ్స్, రాడిసన్, ఆర్బిట్జ్, కార్లసన్ అండ్ వాగాన్‌లిట్, సదరన్ ట్రావెల్స్, అక్బర్ ట్రావెల్స్, ఇంటర్‌సైట్, కాంటినెంటల్ కార్గో, ఏఏఐ, కేపీసీఎల్, చెన్నై పోర్ట్ మొదలైన సంస్థలున్నాయి.
వేతనాలు:
మిగిలిన రంగాలతో పోలిస్తే టూరిజం రంగంలో మొదట వేతనాలు అంత ఎక్కువగా ఉండవు. మన దేశంలో టూరిజం రంగం ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది. టూరిజం అండ్ ట్రావెల్ కోర్సులు పూర్తిచేసుకున్నవారికి ప్రారం భంలో నెలకు రూ.15000 నుంచి రూ.20000తో కెరీర్ మొదల వుతుంది. తర్వాత మూడు నుంచి ఐదేళ్ల అనుభవం ఉంటే మిగిలిన రంగాల కంటే ఎక్కువ వేతనాలు అందుకోవచ్చు. పనితీరు, అనుభవం ఆధారంగా ఏడాదికి ఏడు లక్షల రూపాయల వరకు సంపాదించవచ్చు.
కెరీర్:
కోర్సులు పూరె్తైన తర్వాత ముందుగా ఏదైనా సంస్థలో కనీసం ఐదేళ్లు విధులు నిర్వహించాలి. ఈ సమయంలో దేశ, విదేశాల్లో పర్యటించే అవకాశం కలుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొత్త ప్రదేశాలను, ప్రజలను, భాషా సంస్కృతులను పరిశీలించే అవకాశం ఉంటుంది. ఏదైనా విదేశీ భాష వచ్చి ఉంటే సంబంధిత సంస్థ తరపున విదేశాల్లోనే విధులు నిర్వహించే అవకాశం ఉంటుంది. టూరిజం రంగంపై మంచి అవగాహన వచ్చాక సొంతంగా ట్రావెల్ ఏజెన్సీని సైతం ప్రారంభించవచ్చు.
అభ్యర్థులకు సలహా:
ఈ రంగంలో ప్రవేశించాలనుకునేవారు పరిశ్రమ అవసరాలకు తగినట్లు స్కిల్స్‌ను పెంచుకోవాలి. సానుకూల దృక్పథం కలిగి ఉండటంతోపాటు కొత్త విషయాలను ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉండాలి. అప్పుడే టూరిజం రంగంలో మంచి అవకాశాలను పొందొచ్చు.
కోర్సులను అందిస్తున్న సంస్థలు
డాక్టర్ వైఎస్‌ఆర్ నిథిమ్, హైదరాబాద్.
వివరాలకు: www.nithm.ac.in
ఇగ్నో-న్యూఢిల్లీ డిస్టెన్స్ విధానంలో
వివరాలకు: www.ignou.ac.in
పాండిచ్చేరి యూనివర్సిటీ - పాండిచ్చేరి
వివరాలకు: www.pondi.edu.in
కురుక్షేత్ర యూనివర్సిటీ
కేరళ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ స్టడీస్
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ టూరిజం - భువనేశ్వర్
---------------------------------------------------------------------------------------------------------
కోర్సుతో అవకాశాలు మెండు
నేను ఐఐటీటీఎం నిర్వహించే ఎంట్రెన్స్ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధించి, ఢిల్లీ క్యాంపస్‌లో టూరిజం అండ్ లీజర్ కోర్సును అభ్యసించాను. కోర్సులో భాగంగా టూరిజం ప్యాకేజ్‌లు ఎలా చేస్తారు? టూరిస్టులకు సర్వీస్ ఎలా చేయాలి? హాస్పిటాలిటీ అడ్మినిస్ట్రేషన్, ఎయిర్ టికెటింగ్, కంప్యూటర్ సర్వీసెస్ వంటివాటిపై బోధన ఉంటుంది. కోర్సు పూర్తయ్యాక క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో ఉద్యోగం సాధించాను. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న వింటేజ్ రైడ్స్ కంపెనీలో పనిచేసు ్తన్నాను. ఉద్యోగ నిర్వహణలో భాగంగా కంపెనీ తరపున రాయల్ ఫీల్డ్ మోటార్ సైకిళ్ల టూర్లు నిర్వహిస్తాను. విధి నిర్వహణలో భాగంగా భూటాన్, మంగోలియా, నేపాల్ వంటి దేశాలతోపాటు మన దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో పర్యటించాను. ఈ కోర్సులు పూర్తిచేసినవారికి మంచి అవకాశాలున్నాయి. మన దేశంతోపాటు వివిధ దేశాలను సందర్శించే అవకాశం కలుగుతుంది. విభిన్న సంస్కృతులను దగ్గరగా పరిశీలించవచ్చు. ఈ కోర్సులు పూర్తిచేసినవారికి ప్రారంభంలో ఏడాదికి రూ.1,80,000 నుంచి పేప్యా కేజ్ ఉంటుంది. ఆ తర్వాత పనితీరు, అనుభవాన్ని బట్టి ఏడాదికి ఆరేడు లక్షల రూపాయల వరకు అందుకోవచ్చు. ఏదైనా యూరోపియన్ లాంగ్వేజెస్ వచ్చి ఉంటే అదనపు ప్రయోజనం ఉంటుంది.
వెంకట శ్రీనివాస్,వింటేజ్ రైడ్స్, న్యూఢిల్లీ

Published date : 11 Oct 2013 11:35AM