Skip to main content

మేనేజ్‌మెంట్ కెరీర్‌కు.. మరో మార్గం

మేనేజ్‌మెంట్... ప్రస్తుత కార్పొరేట్ ప్రపంచంలో ఎవర్‌గ్రీన్ సబ్జెక్ట్. సంప్రదాయ బీఏ/ బీకామ్/బీఎస్సీ వంటి కోర్సుల నుంచి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల వరకు విద్యార్థుల తదుపరి లక్ష్యంగా మేనేజ్‌మెంట్ కోర్సులు నిలుస్తున్నాయి..జాబ్ రెడీగా తీర్చిదిద్దడంలో మేనేజ్‌మెంట్ కోర్సులది ప్రత్యేక ఒరవడి.. అందుకే ఈ కోర్సుల పట్ల యువతలో ఎంతో ఆదరణ ..మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశానికి క్యాట్‌కు) ప్రత్యామ్నాయంగా నిలుస్తున్న ప్రవేశపరీక్షలకు ప్రకటన వెలువడిన నేపథ్యంలో సంబంధిత వివరాలు...

ఏఐసీటీఈ-సీమ్యాట్ (కామన్ మేనేజ్‌మెంట్ సెట్)
ఈ పరీక్షను ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) నిర్వహిస్తుంది. ఏటా దాదాపు 1.50 లక్షల మంది విద్యార్థులు సీమ్యాట్ పరీక్షకు హాజరవుతారు. ఈ పరీక్ష స్కోర్ ఆధారంగా ఏఐసీటీఈ గుర్తింపు ఉన్న అన్ని మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లు ప్రవేశం కల్పిస్తున్నాయి. ఇందులో జమ్నాలాల్ బజాజ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ (ముంబై), బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (మెస్రా), పుణే యూనివర్సిటీ, కేజీ సోమయ ఇన్‌స్టిట్యూట్ మేనేజ్‌మెంట్ స్టడీస్ అండ్ రీసెర్చ్ (ముంబై) వంటి సంస్థలు ఉన్నాయి. కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించే పరీక్షలో నాలుగు విభాగాలు ఉంటాయి. మూడు గంటల్లో సమాధానాలు గుర్తించాలి.

వివరాలు..
విభాగం ప్రశ్నలు సమయం
క్వాంటిటేటివ్ టెక్నిక్స్ అండ్ డేటా ఇంటర్‌ప్రిటేషన్ 25 100
లాజికల్ రీజనింగ్ 25 100
లాంగ్వేజ్ కాంప్రెహెన్షన్ 25 100
జనరల్ అవేర్‌నెస్ 25 100
మొత్తం 100 400
టాప్ బిజినెస్ స్కూల్లోప్రవేశం పొందాలంటే 160- 285 మధ్య స్కోర్ సాధించాలి.
అర్హత: ఏదైనా డిగ్రీ లేదా చివరి సంవత్సరం విద్యార్థులు.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: ఆగస్ట్ 25, 2014.
రాత పరీక్షలు: సెప్టెంబర్ 25-29 వరకు.
వివరాలకు: www.aicte-cmat.in

ఏఐఎంఏ-మ్యాట్
ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ), మ్యాట్ (మేనేజ్‌మెంట్ ఆప్టిట్యూడ్) పరీక్షను నిర్వహిస్తుంది. ఈ పరీక్ష స్కోర్ ఆధారంగా దేశ వ్యాప్తంగా ఉన్న 200 బీ-స్కూల్స్‌లో ప్రవేశం పొందొచ్చు.
పేపర్, కంప్యూటర్ ఆధారంగా రెండు విధాలుగా ఈ పరీక్షను నిర్వహిస్తారు. పరీక్ష ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఉంటుంది. ఇందులో ఐదు విభాగాలు ఉంటాయి. వీటికి 150 నిమిషాల్లో సమాధానాలు గుర్తించాలి.
విభాగం ప్రశ్నలు
లాంగ్వేజ్ కాంప్రెహెన్షన్ 40
మ్యాథమెటికల్ స్కిల్స్ 40
డేటా అనాలిసిస్ అండ్ సఫిషీయన్సీ 40
ఇంటెలిజెన్స్ అండ్ క్రిటికల్ రీజనింగ్ 40
ఇండియన్ అండ్ గ్లోబల్ ఎన్విరాన్‌మెంట్ 40
మొత్తం 200
అర్హత: ఏదైనా డిగ్రీ లేదా చివరి సంవత్సరం విద్యార్థులు.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: ఆగస్ట్ 23, 2014.
పేపర్ ఆధారిత పరీక్ష: సెప్టెంబర్ 7, 2014.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష: సెప్టెంబర్ 13, 2014.
వివరాలకు: www.aima.in

ఎన్‌మ్యాట్
నార్సీమోంజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్, ముంబై, హైదరాబాద్, బెంగళూరుల్లోని క్యాంపస్‌లలో ఎంబీఏ/పీజీడీఎం కోర్సుల్లో ప్రవేశం కోసం ఎన్‌మ్యాట్ నిర్వహిస్తుంది.
అర్హత : 50 శాతం మార్కులతో ఏదైనా గ్రాడ్యుయేషన్.
ప్రవేశం: ఎన్‌మ్యాట్ స్కోర్, కేస్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్ విధానంలో నిర్వహించే రాత పరీక్షలో మూడు విభాగాలు ఉంటాయి. ప్రతి విభాగానికి నిర్ణీత సమయం కేటాయించారు. రెండు గంటల్లో సమాధానాలు గుర్తించాలి. వివరాలు..
విభాగం ప్రశ్నలు సమయం
లాంగ్వేజ్ స్కిల్స్ 32 22 ని.
క్వాంటిటేటివ్ స్కిల్స్ 48 60 ని.
లాజికల్ రీజనింగ్ 40 38 ని.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: అక్టోబర్ 4, 2014
రాత పరీక్షలు: అక్టోబర్ 7 నుంచి డిసెంబర్ 20 వరకు.
వివరాలకు: www.nmims.edu

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ (ఐఐఎఫ్‌టీ)
ఐఐఎఫ్‌టీ న్యూఢిల్లీ, కోల్‌కతా క్యాంపస్‌లో ఎంబీఏ (ఇంటర్నేషనల్ బిజినెస్) కోర్సులో ప్రవేశం కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
ప్రవేశం: రాత పరీక్ష ఆధారంగా కుదించిన విద్యార్థులకు నిర్వహించే గ్రూప్ డిస్కషన్, ఎస్సే రైటింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా.
రాత పరీక్ష మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటుంది. ఇందులో ఇంగ్లిష్ కాంప్రెహెన్షన్, జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్‌నెస్, లాజికల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ అనాలిస్ వంటి నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. రెండు గంటల్లో సమాధానాలు గుర్తించాలి. ప్రశ్నల సంఖ్య ఏటా మారుతూ ఉంటుంది. అదేవిధంగా ఆయా విభాగాలకు కేటాయించే మార్కుల్లో తేడా కనిపిస్తుంది.
అర్హత : ఏదైనా గ్రాడ్యుయేషన్
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తును పూర్తి చేయాలి. పూర్తి చేసిన దరఖాస్తును ప్రింట్ తీసి నిర్దేశిత చిరునామాకు పంపాలి.
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: సెప్టెంబర్ 3, 2014
రాత పరీక్ష తేదీ: నవంబర్ 23, 2014.
వివరాలకు: www.iift.edu

ప్రిపరేషన్
దాదాపు అన్ని పరీక్షల సిలబస్ ఒక్కటే. కాకపోతే, సంస్థలను బట్టి ప్రాధమ్యాల క్రవుం వూరుతోంది. కాబట్టి అన్ని విభాగాలపై కాకుండా కొన్ని సెక్షన్లపై ప్రత్యేక దృష్టి సారిస్తే సదరు పరీక్షల్లో విజయుం సాధించవచ్చు.
  • సీమ్యాట్‌లోక్వాంటిటేటివ్ టెక్నిక్స్ అండ్ డేటా ఇంటర్‌ప్రిటేషన్‌లో అర్థమెటిక్ కాన్సెప్ట్స్, కోఆర్డినేట్ జామెట్రీ, ట్రిగ్నామెట్రీ (ప్రధానంగా ఎత్తులు-దూరాలు), స్టాటిస్టిక్స్, క్వాడ్రియాటిక్ ఈక్వేషన్స్, ప్రోగ్రెషన్స్, పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్, ప్రాబబులిటీ, నంబర్ సిస్టమ్ మొదలైన అంశాలను అధ్యయనం చేయాలి. లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ ప్రశ్నలు క్యాట్ పరీక్ష స్థాయిలోనే ఉంటున్నాయి. కాబట్టి సంబంధిత కాన్సెప్ట్‌లను ఆయా చాప్టర్ల నుంచి, క్యాట్ మెటీరియల్ నుంచి అధ్యయనం చేయాలి. లాజికల్ రీజనింగ్‌లో అన్ని అంశాల నుంచి ప్రశ్నలు ఎదురవుతాయి. నంబర్ సిరీస్, కోడింగ్-డీకోడింగ్, గుర్తులు-సమీకరణాలు, బ్లడ్ రిలేషన్స్, డెరైక్షన్ సెన్స్, ఇన్‌పుట్-అవుట్‌పుట్, క్యాలెండర్స్ అండ్ క్లాక్స్ మొదలైన అంశాలనూ అధ్యయనం చేయాలి. జనరల్ అవేర్‌నెస్‌కు సంబంధించి వివిధ బ్యాంకులు, కంపెనీలు- ప్రారంభించిన సంవత్సరాలు, ఆయా కంపెనీల అధినేతలు, రిజర్వ్ బ్యాంక్, ఐఎంఎఫ్, వరల్డ్‌బ్యాంక్ సంబంధిత అంశాలు, ముఖ్యమైన ఆర్థిక సమావేశాలకు సంబంధించిన అంశాలను చదవాలి.
  • ఐఐఎఫ్‌టీ ఎంట్రన్స్ ఇతర ప్రవేశ పరీక్షలకు భిన్నమైంది. ప్రశ్నల సంఖ్య, విభాగాలు తదితర అంశాలు ఒక నిర్ణీత విధానంలో ఉండవు. ఏటా వీటి స్వరూపం మారుతుంటుంది. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌లో బిజినెస్, సాటిస్టిక్స్, ట్రిగ్నామెట్రీకి సంబంధించి అప్లికేషన్ ప్రశ్నలు, క్యాలిక్యులేషన్ ఆధారిత సమస్యలను ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. లాజికల్ రీజనింగ్‌లో ఇన్‌పుట్, అవుట్ పుట్ అంశాలాధారంగా వచ్చే ప్రశ్నల్లో క్యాలిక్యులేషన్ ఆధారిత ప్రశ్నలకు ప్రాధాన్యం ఇవ్వాలి. వెర్బల్ ఎబిలిటీలో వొకాబ్యులరీ విభాగంపై ప్రధానంగా దృష్టి సారించాలి.
  • ఎన్‌మ్యాట్: ఇతర మేనేజ్‌మెంట్ పరీక్షలకు భిన్నంగా ఎన్‌మ్యాట్‌లో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, డేటా ఇంటర్‌ప్రిటేషన్ అంశాలకు ప్రాధాన్యతనిస్తారు. కాబట్టి ఈ అంశాలపై ఎక్కువ దృష్టి సారించడం లాభిస్తుంది. ఎక్కువ ప్రాక్టీస్ చేయాల్సిన విభాగాలు: కోడింగ్- డీకోడింగ్, నెంబర్ సిరీస్, డెసిషన్ మేకింగ్ స్కిల్స్‌కు సంబంధించి వివిధ ప్రశ్నలు, ఇన్‌పుట్-అవుట్ పుట్ అంశాలాధారంగా అడిగే డేటా ఇంటర్‌ప్రిటేషన్.
  • మ్యాట్ ప్రశ్నపత్రం శైలి ఏటా వూరుతోంది. కాబట్టి విద్యార్థులు ప్రతి అంశానికి సవుప్రాధాన్యం ఇవ్వడం తప్పనిసరి. అనలిటికల్ రీజనింగ్ స్కిల్స్ విభాగంలో స్టేట్‌మెంట్ ఆధారిత ప్రశ్నలది అగ్ర భాగం. డేటా, స్టాటిస్టిక్స్ ఆధారంగా కూడా ప్రశ్నలు ఉంటారుు. ఈ విభాగంలో వుంచి వూర్కులు సొంతం చేసుకోవాలంటే స్వీయు విశ్లేషణ శక్తి, ఆయూ స్టేట్‌మెంట్లలో ‘కీ’లక అంశాలను గుర్తించే నేర్పు అవసరం.వెర్బల్ స్కిల్స్‌లో భావ వ్యక్తీకరణను పరిశీలించే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. కాబట్టి ప్రెజెంటేషన్ స్కిల్స్ అలవర్చుకోవాలి. ఈ విభాగంలో రాణించాలంటే ఇంగ్లిష్ గ్రావుర్, వొకా బ్యులరీలపై పట్టు ఉంటేనే సాధ్యం. టెన్సెస్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, యూక్టివ్ అండ్ పాసివ్ వారుుస్, ప్రెసిస్ రైటింగ్‌లపై కసరత్తు చేయూలి. క్వాంటిటేటివ్ రీజనింగ్ స్కిల్స్ లో కాలం-దూరం, పర్సంటేజ్‌లు, ప్రాఫిట్ అండ్ లాస్, రేషియో, ప్రాబబిలిటీ, కో ఆర్డినేట్ జామెట్రీ, డేటా సఫీషియెన్సీ, అల్‌జీబ్రా, ఇంటీజర్స్, సెట్స్ అండ్ రిలేషన్స్, యూవరేజ్‌లకు సంబంధించిన ప్రశ్నలదే కీలక పాత్ర. పదో తరగతి స్థారుు సిలబస్‌లోని అంశాలపై పట్టు సాధిస్తే ఈ సెక్షన్‌లో సులువుగానే గట్టెక్కవచ్చు.
టిప్స్:
  • వెర్బల్ స్కిల్స్‌ను తక్కువ సవుయుంలో పూర్తి చేసే విధంగా సన్నద్ధం కావాలి.
  • పరీక్ష సవుయుంలో ఆయూ సబ్జెక్టులకు లభించే వెరుుటేజీ, వ్యక్తిగత ఆసక్తుల ఆధారంగా అందుబాటులోని సమయాన్ని విభజించుకుని చదవాలి.
  • పరీక్షకు వుుందు పది లేదా పదిహేను రోజులు క్రవుం తప్పకుండా వూక్‌టెస్ట్‌లు రాసి స్వీయు విశ్లే షణ చేసుకోవాలి.
  • కేవలం సిలబస్ బుక్స్‌కు పరిమితం కాకుండా ఇంగ్లిష్ న్యూస్ పేపర్లను చదవాలి. ఫలితంగా వెర్బల్ స్కిల్స్ విభాగంలో ఆశించిన మేరకు రాణించే వీలుంటుంది.
  • డేటా సఫిషియన్సీ కోసం ఫైనాన్షియల్ మ్యాగజీన్స్, న్యూస్ పేపర్లలో ప్రచురితమయ్యే స్టాక్ మార్కెట్ గ్రాఫ్‌లు, విశ్లేషణలు పరిశీలించడం లాభిస్తుంది..
Published date : 08 Aug 2014 12:33PM

Photo Stories