Skip to main content

కెరీర్ గైడెన్స్.. రిటైల్ సెక్టర్

రిటైల్.. రిటైల్.. రిటైల్.. ఇప్పుడు ప్రతి నోటా వినిపిస్తున్న మాట. కారణం రిటైల్ రంగంలో సింగిల్ బ్రాండ్‌లో 100 శాతం, మల్టీ బ్రాండ్‌లో 51 శాతంవరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడమే. దీంతో సమీప భవిష్యత్తులో దేశంలో రిటైల్ రంగం శరవేగంగా విస్తరించి.. మల్టీ స్టోరీడ్ మాల్స్ మరెన్నో ఏర్పడే అవకాశం ఉంది. ఇలా.. మాల్స్ ఏర్పాటు దిశగా అడుగులు వేసే సంస్థలు అంతేస్థాయిలో మానవ వనరుల కోసం అన్వేషించడమూ జరుగుతుంది. ఇది.. కెరీర్ పరంగా చూస్తే ఉద్యోగార్థులకు కచ్చితంగా కలిసొచ్చే అంశం. ఈ నేపథ్యంలో రిటైల్ రంగంలో కోర్సులు, కెరీర్‌‌సపై ఫోకస్..

‘మేక్ హే వెన్ ద సన్ షైన్‌‌స’.. రిటైల్ రంగంలో కెరీర్ ఔత్సాహికులకు అన్వయించగలిగిన జాతీయం ఇది. ‘ప్రభుత్వం ఇప్పుడే కదా అనుమతిచ్చింది.. అవి ఏర్పాటయ్యేటప్పటికి ఏళ్లు పడుతుంది’ అనే ఆలోచనకు బదులు.. అవి ఏర్పడే సమయానికి అవసరమైన విధంగా నైపుణ్యాలను సొంతం చేసుకుంటే జాబ్ రేస్‌లో ముందంజలో నిలిచే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో విద్యార్థులకు రిటైల్ రంగంలో మెళకువలు, నిర్వహణ సామర్థ్యాలను నేర్పే కోర్సు రిటైల్ మేనేజ్‌మెంట్.

రిటైల్ మేనేజ్‌మెంట్ అంటే:
శాస్త్రీయ దృక్పథంతో సూపర్ మార్కెట్లు, హైపర్ మార్కెట్లను సమర్థంగా నిర్వహించడం; పోటీదారులకంటే ముందుండేలా సంస్థను నిలపడమే రిటైల్ మేనేజ్‌మెంట్. రిటైల్ రంగం అనే మాట ఇటీవల కొద్ది రోజులుగా బాగా వినిపిస్తున్నప్పటికీ..పదేళ్ల క్రితమే భారత్‌లో ఆర్గనైజ్డ్ రిటైలింగ్‌కు అంకురార్పణ జరిగింది. ప్రస్తుతం దేశంలో ట్రెడిషనల్ రిటైలింగ్‌తో పోల్చితే ఆర్గనైజ్డ్ రిటైలింగ్ వాటా 4 నుంచి 5 శాతం మాత్రమే. ఈ కొద్దిమొత్తానికే వేల సంఖ్యలో ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. ఇక.. 51 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి నేపథ్యంలో భవిష్యత్తులో హైపర్ మాల్స్ భారీగా విస్తరించనున్న పరిస్థితుల్లో ఉద్యోగావకాశాలు లక్షలకు చేరే అవకాశం ఉంది.

భవిష్యత్తు ఇలా:
రిటైల్ మేనేజ్‌మెంట్‌లో ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే రిటైల్ మేనేజ్‌మెంట్‌లో ఉజ్వల భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పొచ్చు. దేశ జీడీపీలో పది శాతం, ఉద్యోగ కల్పనలో ఎనిమిది శాతం వాటా ఈ రంగానిదే. దేశంలో ఆధునిక రిటైల్ పరిశ్రమ 2016 నాటికి 200 బిలియన్ డాలర్లకు చేరే అవకాశం కనిపిస్తోంది. అంతేకాకుండా ప్రపంచ స్థాయి కన్సల్టింగ్ సంస్థ ఎ.టి.కీర్నే సర్వే ప్రకారం భారత రిటైల్ పరిశ్రమ విలువ 435 బిలియన్ డాలర్లు. ప్రస్తుతానికి ఆర్గనైజ్డ్ రిటైల్ మార్కెట్స్ వాటా రెండు శాతంగానే ఉన్నప్పటికీ తాజాగా ఎఫ్‌డీఐల నిర్ణయంతో సమీప భవిష్యత్తులో ఆ వాటా మరింత పెరుగుతుందని నిపుణుల అంచనా. కేవలం ఆర్గనైజ్డ్ రిటైల్ సంస్థల ప్రవేశమే కాకుండా ఆ సెక్టార్ ఏటేటా వృద్ధి రేటు పెంచుకుంటోంది. రానున్న అయిదేళ్లలో 24 శాతం మేర వృద్ధి సాధించనుందని ఓ అంచనా. ప్రస్తుతం అన్-ఆర్గనైజ్డ్ రిటైల్ రంగంలో 35 మిలియన్ల మంది ఉపాధి పొందుతుండగా, ఈ ఏడాదిలో ఆర్గనైజ్డ్ రంగంలో రెండు మిలియన్ల మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.

ఏయే కోర్సులు:
విస్తరిస్తున్న రిటైల్ రంగం.. అందుకు అవసరమైన మానవ వనరులను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం పలు కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా ఇవి పీజీ స్థాయిలో ఉన్నాయి. పీజీ ఇన్ రిటైల్ మేనేజ్‌మెంట్, పీజీ డిప్లొమా ఇన్ రిటైల్ మేనేజ్‌మెంట్ పేరుతో ఈ కోర్సులను అందిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే కొన్ని యూనివర్సిటీలు ఎంబీఏలో రిటైల్ మేనేజ్‌మెంట్ స్పెషలైజేషన్‌ను అందిస్తున్నాయి. మన రాష్ట్రంలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్ (హైదరాబాద్) పీజీ డిప్లొమా ఇన్ రిటైల్ అండ్ మార్కెటింగ్ మేనేజ్‌మెంట్ కోర్సును అందిస్తోంది. అర్హత బ్యాచిలర్ డిగ్రీతోపాటు ఆయా సంస్థలు నిర్వహించే ప్రవేశ పరీక్షలో ప్రతిభ.

స్వీయ విశ్లేషణ అవసరం:
రిటైల్ మేనేజ్‌మెంట్ కోర్సు చదివి, భవిష్యత్తులో రిటైల్ రంగంలో స్థిరపడాలనుకునే విద్యార్థులు కోర్సులో చేరేముందే తమకుతాము విశ్లేషణ చేసుకోవాలి. రిటైల్ సంస్థ నిర్వహణతోపాటు క్షేత్రస్థాయిలోనూ పనిచేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ లక్షణాలు ఉన్నాయో? లేదో? విశ్లేషించుకోవాలి. అభిరుచి లేకున్నా.. కేవలం జాబ్ మార్కెట్ పొటెన్షియల్‌ను పరిగణనలోకి తీసుకుని కోర్సులో చేరితే ఆశించిన ఫలితం, వర్‌‌క శాటిస్ఫాక్షన్ ఉండకపోవచ్చు.

శిక్షణనిచ్చే అంశాలు:
రిటైల్ మేనేజ్‌మెంట్ కోర్సులో రిటైల్ మేనేజ్‌మెంట్ అండ్ కాన్సెప్ట్స్, రిటైలింగ్ ట్రెండ్‌‌స, రిటైల్ మార్కెటింగ్ సెగ్మెంటేషన్, రిటైల్ ప్రైసింగ్ అండ్ మర్కెండైజింగ్, రిలేషన్‌షిప్ ఇన్ రిటైలింగ్, రోల్ ఆఫ్ ఐటీ ఇన్ రిటైలింగ్ వంటి అంశాలపై శిక్షణనిస్తారు. ఈ క్రమంలో మార్కెటింగ్ వ్యూహాలు, అకౌంటింగ్, బిజినెస్ మ్యాథ్‌‌స, కస్టమర్ రిలేషన్ నైపుణ్యాలు అలవడతాయి.

కోర్సు పూర్తి చేశాక:
కోర్సు పూర్తి చేసిన వారికి అవకాశాలకు కొదవే లేదు. కస్టమర్ సేల్స్ అసోసియేట్, డిపార్‌‌టమెంట్ మేనేజర్/ఫ్లోర్ మేనేజర్/ కేటగిరీ మేనేజర్, స్టోర్ మేనేజర్, రిటైల్ ఆపరేషన్‌‌స మేనేజర్, రిటైల్ బయ్యర్‌‌స అండ్ మర్కండైజర్‌‌స, విజువల్ మర్కండైజర్‌‌స వంటి ఫ్రంట్ ఎండ్ జాబ్స్ లభిస్తాయి. బ్యాక్ ఎండ్ విభాగంలో మేనేజర్ బ్యాక్-ఎండ్ ఆపరేషన్‌‌స, లాజిస్టిక్స్ అండ్ వేర్‌హోస్ మేనేజర్, రిటైల్ కమ్యూనికేషన్ మేనేజర్ వంటి ఉద్యోగాలు లభిస్తాయి. ఈ హోదాలు, పేర్లు ఆయా సంస్థలను బట్టి వేర్వేరుగా ఉంటాయి.

ఇతర రంగాల్లో కూడా:
రిటైల్ మేనేజ్‌మెంట్ కోర్సుతో సూపర్ మార్కెట్లు, హైపర్ మార్కెట్లలోనే ఉద్యోగాలు లభిస్తాయనుకోవడం పొరపాటు. ఇతర పరిశ్రమల్లోనూ రిటైల్ మేనేజ్‌మెంట్ అర్హులకు అవకాశాలుంటున్నాయి. ముఖ్యంగా టెలికం, బ్యాంకింగ్, బెవరేజెస్, ఫ్యాషన్ డిజైనింగ్, ఫుట్‌వేర్ పరిశ్రమల్లోనూ అవకాశాలు లభిస్తున్నాయి. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్‌కు చెందిన విద్యార్థులను అలహాబాద్ బ్యాంక్ క్యాంపస్ రిక్రూట్‌మెంట్ ద్వారా నియమించుకుంది.

కావాల్సిన స్కిల్స్:
రిటైల్ రంగంలో స్థిరపడాలనుకునే అభ్యర్థికి ప్రొఫెషనల్ సర్టిఫికెట్‌తోపాటు కొన్ని పర్సనల్ స్కిల్స్ కూడా అవసరం. అవి.. అనలిటికల్ థింకింగ్; లీడర్‌షిప్; పాజిటివ్ ఆటిట్యూడ్; కమ్యూనికేషన్; ప్రాబ్లమ్ సాల్వింగ్; క్రియేటివిటీ. వీటితోపాటు రిటైల్ రంగం అంటే విభిన్న సంస్కృతులకు చెందిన వ్యక్తులతో సంప్రదింపులు చేయాల్సిన విభాగం. ఈ నేపథ్యంలో సహనం, ఎదుటి వారిని మెప్పించే తత్వం అలవర్చుకోవాలి. అప్పుడే ఈ రంగంలో ఉన్నత స్థానాలను అధిరోహించే అవకాశం ఉంటుంది.

మన రాష్ర్టంలో ఐపీఈ:
ఇక.. రిటైల్ మేనేజ్‌మెంట్ కోర్సు మన రాష్ర్టంలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్‌లో అందుబాటులో ఉంది. రెండేళ్ల వ్యవధిలో పీజీ డిప్లొమా ఇన్ రిటైల్ అండ్ మార్కెటింగ్ మేనేజ్‌మెంట్ పేరుతో నిర్వహిస్తున్న కోర్సుకు 2007లోనే రిటైల్ రంగంలో ఆనాటి పరిస్థితులను, భవిష్యత్తును అంచనా వేసి మార్కెట్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించారు. బ్యాచిలర్ డిగ్రీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులు అర్హులు. క్యాట్/మ్యాట్/ఏటీఎంఏ/ఎక్స్ ఏటీ/ సీమ్యాట్/ ఐసెట్ పరీక్షల్లో ర్యాంకు ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలి. తర్వాత మెరిట్ జాబితా ఆధారంగా నిర్వహించే గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తారు.

అర్హతను బట్టి అవకాశాలు:
రిటైల్ రంగంలో విద్యార్థుల అకడెమిక్ అర్హత ఆధారంగా అవకాశాలు లభిస్తాయి. కేవలం పీజీ ప్రోగ్రాం విద్యార్థులకే రిటైల్ రంగం ఆహ్వానం పలుకుతుందనుకోవద్దు. ఈ క్రమంలో పదో తరగతి, ఇంటర్మీడియెట్ అర్హతతో స్టోర్ ఆపరేషన్‌‌స (కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్‌‌స, రిలేషన్‌షిప్ అసిస్టెంట్ వంటి బాధ్యతలు), డిగ్రీ అర్హతతో సేల్స్ అండ్ మార్కెటింగ్ (కొత్త ఉత్పత్తులను వినియోగదారుల వద్ద విక్రయించే బాధ్యతలు), పీజీ అర్హతతో స్టోర్ మేనేజ్‌మెంట్ వంటి అవకాశాలు లభిస్తాయి.

కామన్ అడ్మిషన్ రిటైల్ టెస్ట్ (కార్‌‌ట)
రిటైలర్‌‌స అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఆర్‌ఏఐ).. దేశంలోని రిటైల్ రంగ ప్రముఖులతో ఏర్పడిన సంస్థ. ఈ సంస్థ రిటైల్ రంగ వ్యాపార విస్తరణ అంశాలతోపాటు, సుశిక్షితులైన మానవ వనరులను తీర్చిదిద్దేందుకు కూడా ఉపక్రమించింది. ఈ క్రమంలోనే ప్రతి ఏటా కామన్ అడ్మిషన్ రిటైల్ టెస్ట్ పేరుతో జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తోంది. అర్హత బ్యాచిలర్ డిగ్రీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఈ పరీక్షలో ర్యాంకు ద్వారా దేశంలోని 17 బి-స్కూల్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం ఇన్ రిటైల్ మేనేజ్‌మెంట్ కోర్సులో ప్రవేశం లభిస్తుంది.

వేతనాలు:
సాధారణంగా రిటైల్ మేనేజ్‌మెంట్ కోర్సు పూర్తి చేసిన వారిని ఎంట్రీ లెవల్‌లో సేల్స్ మేనేజర్ లేదా కస్టమర్ సేల్స్ అసోసియేట్‌గా నియమిస్తారు. ఈ దశలో నెలకు కనిష్టంగా రూ. 15 వేల వేతనం లభిస్తుంది. ఆ తర్వాత అనుభవం, పదోన్నతుల ఆధారంగా రూ. 8 లక్షల వార్షిక వేతనం లభించే అవకాశాలు కూడా ఉన్నాయి.

టాప్ రిక్రూటర్‌‌స:
ఫ్యూచర్ గ్రూప్, షాపర్‌‌స స్టాప్, వాల్‌మార్‌‌ట, టెస్కో, బిగ్ బజార్, రిలయన్‌‌స, టాటా వెస్ట్ సైడ్, టైటాన్.

సంబంధిత కోర్సులను ఆఫర్ చేస్తున్న ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లు:
ముద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ అడ్వర్టయిజింగ్
కోర్సు:
పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్ ప్రోగ్రాం ఇన్ రిటైల్ మేనేజ్‌మెంట్
వెబ్‌సైట్: www.mica.ac.in/

బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ
కోర్సు:
పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ (రిటైల్)
వెబ్‌సైట్: www.bimtech.ac.in

ఇండియన్ రిటైల్ స్కూల్ (ఢిల్లీ)
కోర్సులు
: పీజీ డిప్లొమా, ఎగ్జిక్యూటివ్, డిప్లొమా
వెబ్‌సైట్: www.indianretailschool.com

వెలింగ్‌కర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్
కోర్సు:
పీజీ డిప్లొమా ఇన్ రిటైల్ మేనేజ్‌మెంట్
వెబ్‌సైట్: https://www.welingkar.org

ఐఐఎల్‌ఎం గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (గ్రేటర్ నోయిడా)
కోర్సు:
పీడీ డిప్లొమా ఇన్ రిటైల్ మేనేజ్‌మెంట్
వెబ్‌సైట్: www.iilm.ac.in/gnoida

సింబయాసిస్ సెంటర్ ఫర్ డిస్టెన్‌‌స లెర్నింగ్
కోర్సు:
పీజీడీఎం (రిటైల్)
వెబ్‌సైట్: www.scdl.net

ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ
కోర్సు:
డిప్లొమా ఇన్ రిటైలింగ్
వెబ్‌సైట్: www.ignou.ac.in

ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిటైల్ మేనేజ్‌మెంట్ (ఢిల్లీ)
కోర్సు
: పీజీ డిప్లొమా (ఏడాది), యూజీ డిప్లొమా (రెండేళ్లు)
వెబ్‌సైట్: www.iirmindia.net

Published date : 19 Nov 2012 05:10PM

Photo Stories