కెరీర్ గైడెన్స్.. .ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్
Sakshi Education
డెస్క్‌టాప్ టు టాబ్లెట్.. ఆర్గనైజేషన్స్ టు ఇండివిడ్యువల్స్.. కిండర్ గార్టెన్ టు పోస్ట్ గ్రాడ్యుయేషన్.. ఇలా.. ఆధునిక యుగంలో కంప్యూటర్ల వినియోగం శరవేగంగా విస్తరిస్తోంది. మరోవైపు అంతే స్థాయిలో దుర్వినియోగం జరుగుతోంది. ప్రధానంగా నెట్‌వర్క్, ఇన్ఫర్మేషన్ వంటి విషయాల్లో హ్యాకింగ్, ఇతర సమస్యలు అధికమవుతున్నాయి.ఈ సమస్యలకు పరిష్కారంగా.. ఆశాజనక భవిష్యత్తుకు మార్గంగా రూపొందిన సరికొత్త కోర్సు ‘ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్’.
ఇటీవల కాలంలో ప్రతి రోజు ఎక్కడో ఒక ప్రాంతంలో వినిపిస్తున్న మాట హ్యాకింగ్. అంటే.. ఒకరి సొంత వెబ్‌సైట్లోకి చొరబడటం.. అందులోని అసలు సమాచారాన్ని తొలగించి తప్పుడు సమాచారాన్ని పొందుపర్చడం వంటి అక్రమాలకు పాల్పడటమే.మరి దీనికి పరిష్కారం లేదా? అంటే... సమాధానం..ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్.
ఆధునిక యుగంలో అనునిత్యం ఎన్నో వెబ్‌సైట్స్, వ్యక్తిగత ఈ-మెయిల్స్ హ్యాకింగ్ గురవుతున్నాయి. ఫేస్‌బుక్, ట్విటర్ వంటి సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో సైతం ప్రముఖుల పేరుతో నకిలీ ఐడీలు ప్రత్యక్షమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అనే మాటకు ప్రాధాన్యం సంతరించుకుంది. అటు ప్రభుత్వం, ఇటు నాస్‌కామ్ వంటి సంస్థలు సైతం ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీపై ప్రత్యేక దష్టి సారిస్తున్నాయి. దీనికి సంబంధించి ప్రత్యేక నైపుణ్యాలు అందించే దిశగా యత్నిస్తున్నాయి. అకడెమిక్ స్థాయిలోనే శిక్షణనిప్పించే దిశగా యత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇటీవల కాలంలో ఐటీ, కంప్యూటర్ సైన్స్ అనుబంధ కోర్సుగా ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ కోర్సు రూపొందింది.
ఉద్దేశమిదే:
ఒక వెబ్‌సైట్‌కు సంబంధించి నెట్‌వర్క్, సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌ల పరిరక్షణ.. వైరస్‌లు, హ్యాకింగ్‌ల బారినుంచి తప్పించడమే ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ప్రాథమిక, ప్రధాన ఉద్దేశం. తద్వారా సదరు వెబ్‌సైట్ ఆధారంగా నిర్వహించే కార్యకలాపాలు, వెబ్‌సైట్ వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా చూడటమే ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్. ముఖ్యంగా ఐటీ, ఐటీ అనుబంధ సంస్థల్లో ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ వెన్నెముక వంటిదని చెప్పొచ్చు.
అకడెమిక్ స్థాయిలో ఇలా:
హ్యాకింగ్‌లు, వైరస్‌లు, వెబ్‌సైట్ల భధ్రత నేపథ్యంలో ప్రాధాన్యం పెరిగిన ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్ విషయంలో అకడెమిక్ పరంగా కూడా అవగాహన పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పలు విద్యా సంస్థలు అకడెమిక్ స్థాయిలో ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్ కోర్సును అందిస్తున్నాయి. ఇవి డిప్లొమా, పీజీ డిప్లొమా, సర్టిఫికెట్ స్థాయిల్లో ఆరు నెలల నుంచి ఏడాది వ్యవధిలో ఉంటున్నాయి.
మరికొన్ని యూనివర్సిటీలు ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్ స్పెషలైజేషన్‌తో ఎం.టెక్ లేదా ఎంఎస్సీ కోర్సులను అందిస్తున్నాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వ పరిధిలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్-కాలికట్ సెంటర్ ఆరు నెలల వ్యవధి గల డిప్లొమా ఇన్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్ అండ్ ఆడిట్ కోర్సును అందిస్తుంది.
సెంట్రల్ గవర్నమెంట్.. స్పెషల్ స్కీం:
ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్ ఆవశ్యకతను కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా పరిగణిస్తోంది. ఈ నేపథ్యంలో మానవ వనరుల విభాగంలో ప్రత్యేకంగా ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ ప్రాజెక్ట్‌కు 2005లోనే రూపకల్పన చేసింది. ఈ మేరకు ఎం.టెక్./ బి.టెక్ బోధనాంశాలలో ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్ కోర్సును చేర్చాలని, ప్రత్యేకంగా డిప్లొమా కోర్సులను, సర్టిఫికెట్ కోర్సులను ప్రారంభించాలని పేర్కొంది. ఈ క్రమంలో ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఎస్‌సీ-బెంగళూరు వంటి ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లను రిసోర్స్ సెంటర్లుగా నిర్ణయించి.. వాటి ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఇంజనీరింగ్, డిగ్రీ కళాశాలల్లో సైన్స్, ఇంజనీరింగ్ కోర్సుల్లో ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్ కోర్సును ఆవిష్కతం చేయాలని నిర్ణయించింది.
శిక్షణనిచ్చే అంశాలు:
ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్ కోర్సులో సెక్యూర్ కోడింగ్, ఫౌండేషన్స్ టు కంప్యూటర్ సెక్యూరిటీ, డిజిటల్ అండ్ సైబర్ ఫోరెన్సిక్స్, మొబైల్ అండ్ సెల్యులర్ నెట్ వర్క్ సెక్యూరిటీ, ఇంటర్నెట్ సెక్యూరిటీ, లాన్ సెక్యూరిటీ, సర్వర్ సెక్యూరిటీ, రూటర్ సెక్యూరిటీ, ఇంట్రూషన్ డిటెన్షన్ అండ్ ప్రివెన్షన్ వంటి నెట్‌వర్క్ సంబంధిత భద్రతపరమైన అంశాలతోపాటు.. సైబర్ నేరాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ క్రెమ్, సైబర్ ‘లా’స్, క్యాచింగ్ క్రిమినల్స్, సెక్యూరిటీ లీడ్ ఆడిటర్ వంటి సైబర్ క్రెమ్స్ సంబంధిత అంశాలపై శిక్షణనిస్తారు. వీటితోపాటు నిర్దిష్ట నెట్‌వర్క్‌కు సంబంధించి ప్రాథమిక అవసరాలైన సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్, డాట్ నెట్ వంటి అంశాలపైనా నైపుణ్యాలు కల్పించే విధంగా ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్ కోర్సు బోధన సాగుతుంది. మొత్తంగా చూస్తే.. కోర్సు పూర్తయ్యేనాటికి ఒక విద్యార్థికి ఒక నెట్‌వర్క్ లేదా వెబ్‌సైట్‌కు సంబంధించిన భద్రతపరమైన అంశాలపై పరిపూర్ణ అవగాహన లభిస్తుంది.
అర్హత :
ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్ కోర్సులో చేరాలనుకుంటే కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ నేపథ్యం ఉండక్కర్లేదు. బీఎస్సీ/బీఏ విద్యార్థులు కూడా ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్ కోర్సులో అడుగుపెట్టొచ్చు. ఎం.టెక్‌లో ఈ స్పెషలైజేషన్‌ను ఎంచుకోవాలంటే మాత్రం బి.టెక్‌లో కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బ్రాంచ్‌లో ఉత్తీర్ణత సాధించాలి. కంప్యూటర్ సైన్స్‌లో ప్రాథమిక పరిజ్ఞానం ఉన్న విద్యార్థులు ఈ కోర్సులో మరింత చురుగ్గా రాణించగలరని నిపుణుల అభిప్రాయం.
అవకాశాలేంటి?
కోర్సు పూర్తి చేస్తే అవకాశాలేంటి? సాధారణంగా ఏ కోర్సు విషయంలోనైనా ఎదురయ్యే సందేహమిదే. ముఖ్యంగా కొత్తగా వినిపిస్తున్న ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్ కోర్సు విషయంలో ఇది కొంచెం ఎక్కువే. కారణం.. కోర్ ఐటీ కోర్సు పూర్తి చేసిన వారే ఉద్యోగాన్వేషణ చేయాల్సిన ప్రస్తుత పరిస్థితుల్లో ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్ కోర్సు పూర్తి చేస్తే వచ్చే అదనపు ప్రయోజనం ఏంటి? అనేది సాధారణంగా తలెత్తే సందేహం. అయితే.. ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్ ప్రొఫెషనల్స్ విషయంలో డిమాండ్-సప్లయ్ వ్యత్యాసాలను గణాంకాల సహితంగా చూపుతూ.. అవకాశాల విషయంలో అలాంటి సందేహాలు అసలు అక్కర్లేదని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా ఈ కోర్సు లేదా స్పెషలైజేషన్ ఉత్తీర్ణులకు ప్రధానంగా ఐటీ, ఐటీ అనుబంధ సంస్థలు రెడ్ కార్పెట్ వెల్‌కం చెబుతున్నాయి.
‘గ్లోబల్’గా అవకాశం.. లక్షల్లో డిమాండ్:
ఇక.. ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్‌లో సుశిక్షితులైన మానవ వనరుల కోసం ప్రపంచవ్యాప్తంగా సంస్థలు అన్వేషణ సాగిస్తున్నాయి. ఇంటర్నేషనల్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ సర్టిఫికేషన్ కన్సార్టియం అంచనాల ప్రకారం ఆసియా పసిఫిక్ దేశాల్లో 2013 నుంచి 2015 మధ్య కాలంలో పది లక్షల నుంచి 15 లక్షల మధ్యలో ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్ ప్రొఫెషనల్స్ అవసరం ఉంటుంది.
వేదికలివే:
ఈ కోర్సు పూర్తి చేసిన వారికి ప్రధమ ఉపాధి వేదికలుగా ఐటీ, సాఫ్ట్‌వేర్ సంస్థలను పేర్కొనొచ్చు. వీటితోపాటు కంప్యూటరీకరణ జరిగి ఇంటర్నెట్, నెట్‌వర్క్ ఆధారంగా నడిచే అన్ని సంస్థలు అంటే.. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూట్స్; ఈ-కామర్స్; టెలికాం; గేమింగ్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్; బీపీఓ, ఎడ్యుకేషన్ వంటి అనేక రంగాలు ఉపాధి వేదికలుగా నిలుస్తాయి. ప్రారంభంలో కనీసం రూ. 3 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం ఖాయం. సెక్యూరిటీ అనలిస్ట్, కంప్యూటర్ క్రెమ్ ఇన్వెస్టిగేటర్, ఫోరెన్సిక్ అనలిస్ట్, సిస్టమ్/నెట్‌వర్క్/వెబ్ పెనెట్రేషన్ టెస్టర్, సెక్యూరిటీ ఆర్కిటెక్ట్ నెట్‌వర్క్, సెక్యూరిటీ ఇంజనీర్ వంటి హోదాలు లభిస్తాయి. అనుభవం, పనితీరు ఆధారంగా చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ స్థాయికి చేరుకోవచ్చు.
కోర్సును అందిస్తున్న ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లు:
జేఎన్‌టీయూ - హైదరాబాద్
వెబ్‌సైట్: www.jntuh.ac.in
ఐఐటీ- అలహాబాద్
వెబ్‌సైట్: www.iiita.ac.in
సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్
వెబ్‌సైట్: www.cdac.in
విశ్వేశ్వరాయ టెక్నలాజికల్ యూనివర్సిటీ
వెబ్‌సైట్: www.vtu.ac.in/
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ
వెబ్‌సైట్: www.iisecurity.in/
యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్
వెబ్‌సైట్: www.unom.ac.in/
ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ
వెబ్‌సైట్: www.srmunic.ac.in
ఈ ఇన్‌స్టిట్యూట్‌లు ఎం.టెక్ కంప్యూటర్ సైన్స్‌లో ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ స్పెషలైజేషన్‌ను అందిస్తున్నాయి. వీటితోపాటు ఇటీవల బిట్స్-హైదరాబాద్ క్యాంపస్‌లోనూ పీజీ ఇంజనీరింగ్‌లో స్పెషలైజేషన్‌గా ఈ కోర్సును ప్రారంభించారు.
డిప్లొమా కోర్సులు:
ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ
కోర్సు:పీజీ డిప్లొమా ఇన్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ.
వ్యవధి: ఏడాది
వెబ్‌సైట్: www.ignou.ac.in
డీఓఈఏసీసీ-కాలికట్
కోర్సు: పీజీ డిప్లొమా ఇన్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అండ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్.
వెబ్‌సైట్: www.doeacccalicut.ac.in

కోర్సులు: సర్టిఫైడ్ ప్రొఫెషనల్ ఫోరెన్సిక్స్ కన్సల్టెంట్; సర్టిఫైడ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ కన్సల్టెంట్.
వెబ్‌సైట్: www.iisecurity.in

Published date : 04 Mar 2013 02:29PM