ఎక్స్‌ఏటీలో గెలుపు వ్యూహాలు..
Sakshi Education
పీజీ మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ప్రతిష్టాత్మక పరీక్షల్లో జేవియర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (ఎక్స్‌ఏటీ) ఒకటి. క్యాట్ తర్వాత ఆ స్థాయిలో పేరున్న ఈ పరీక్ష స్కోర్ ద్వారా ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ, దాని అనుబంధ ఇన్‌స్టిట్యూట్లలో ప్రవేశం పొందొచ్చు. వీటితోపాటు వందకుపైగా ప్రముఖ సంస్థలు ఎక్స్‌ఏటీ స్కోర్‌తో పీజీ మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తున్నాయి. ఎక్స్‌ఏటీ- 2014 ప్రకటన వెలువడిన నేపథ్యంలో వివరాలు..
మన దేశంలో క్యాట్ తర్వాత అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు హాజరవుతున్న పరీక్ష జేవియర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (ఎక్స్‌ఏటీ). గతేడాది లక్షకుపైగా హాజరవగా ఈ ఏడాది ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది! ప్రణాళికబద్ధంగా సిద్ధమైతే మంచి స్కోర్ సాధించే అవకాశాలుంటాయి.
మన దేశంలో క్యాట్ తర్వాత అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు హాజరవుతున్న పరీక్ష జేవియర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (ఎక్స్‌ఏటీ). గతేడాది లక్షకుపైగా హాజరవగా ఈ ఏడాది ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది! ప్రణాళికబద్ధంగా సిద్ధమైతే మంచి స్కోర్ సాధించే అవకాశాలుంటాయి.
- అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ (కనీసం మూడేళ్లు) ఉత్తీర్ణత. జూన్ 10, 2014 నాటికి డిగ్రీ చివరి పరీక్షలు పూర్తిచేసుకునేవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
- పరీక్ష విధానం: పేపర్-పెన్సిల్ విధానంలో, మూడు గంటల వ్యవధిలో నిర్వహించే పరీక్షలో మొత్తం నాలుగు సెక్షన్స్ ఉంటాయి. అవి.. క్వాంటిటేటివ్ ఎబిలిటీ, ఇంగ్లిష్ లాంగ్వేజ్, లాజికల్ రీజనింగ్, డెసిషన్ మేకింగ్ అండ్ జనరల్ నాలెడ్జ్. ప్రతి ఏటా ప్రశ్నల సంఖ్యలో, కేటాయించే మార్కుల విషయంలో మార్పులుంటాయి.
- జనరల్ ఇంగ్లిష్: జనరల్ ఇంగ్లిష్‌లో రీడింగ్ కాంప్రెహెన్షన్, వర్డ్ బేస్డ్ కొశ్చన్స్, గ్రామర్ అండ్ యూసేజ్ అనే ప్రధాన విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇంగ్లిష్ లాంగ్వేజ్‌లో ప్రాథమిక పరిజ్ఞానాన్ని పరీక్షించేలా ప్రశ్నలుంటాయి. ఈ విభాగంలో అధిక మార్కులు సాధించడానికి రీడింగ్ కాంప్రహెన్షన్స్, వెర్బల్ రీజనింగ్, ఎర్రర్స్ ఇన్ యూసేజ్, గ్రామర్, వొక్యాబులరీ, కరెక్ట్ అండ్ ఇన్ కరెక్ట్ ఎర్రర్స్, సెంటెన్స్ కంప్లీషన్ వంటివాటిపై దృష్టి పెట్టాలి.
- క్వాంటిటేటివ్ ఎబిలిటీ: క్వాంటిటేటివ్ ఎబిలిటీ విభాగంలో ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్ అంశాలకు సంబంధించి అప్లికేషన్ బేస్డ్ కొశ్చన్స్‌తోపాటు డెసిషన్ మేకింగ్‌లో వాటి అనువర్తనాల ఉపయోగం వంటి ప్రశ్నలను ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ఇందులో అర్థమెటిక్, జామెట్రీ, మోడ్రన్ మ్యాథ్స్, డేటా ఇంటర్‌ప్రిటేషన్ అంశాల్లో నంబర్ ఆఫ్ థియరీ, రేషియో అండ్ ప్రపోర్షన్స్, పర్సంటేజెస్, టైం అండ్ డిస్టెన్స్ తదితరాలపై ఎక్కువ దృష్టి సారించాలి.
- లాజికల్ రీజనింగ్: లాజికల్ రీజనింగ్‌లోని ప్యాసేజ్ సెక్షన్‌లో పేరాగ్రాఫ్‌లు చిన్నగా ఉన్నప్పటికీ వాటికి సంబంధించి అడిగే ప్రశ్నలకు పేరాగ్రాఫ్‌లో ‘మూలం’ ఏంటో కనుక్కోవాలంటే తార్కిక ఆలోచన శక్తితోనే సాధ్యం. డెసిషన్ మేకింగ్‌లో ఇచ్చిన స్టేట్‌మెంట్స్, కేస్ స్టడీస్‌కు సంబంధించి సరైన నిర్ణయాన్ని తెలపాలి. ఇందులో డేటా ఇంటర్‌ప్రిటేషన్, లాజికల్ రీజనింగ్, క్రిటికల్ రీజనింగ్ వంటి విభాగాల్లో చార్ట్స్ అండ్ డయాగ్రమ్స్, టేబుల్స్ అండ్ కేస్‌లెట్స్, న్యూమరిక్ లాజిక్, లాజికల్ కండీషన్స్ అండ్ గ్రూపింగ్, విజువల్ రీజనింగ్ వంటి అంశాలను ఎక్కువగా ప్రిపేర్ కావాలి.
- జనరల్ అవేర్‌నెస్: జనరల్ అవేర్‌నెస్‌లో భాగంగా బిజినెస్, ఎకనమిక్స్‌కు సంబంధించి జాతీయ, అంతర్జాతీయ మ్యాగజైన్లను రిఫర్ చేయాలి. ఇందులో జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, వాణిజ్య రంగ సంబంధిత అంశాలు, కరెంట్ అఫైర్స్ వంటి అంశాలపై ప్రశ్నలుంటాయి. జనరల్ అవేర్‌నెస్ విభాగం కోసం ప్రతి రోజూ న్యూస్ పేపర్ లేదా ఫ్రంట్‌లైన్ వంటి మ్యాగజైన్‌ను చదవడం లాభిస్తుంది.
క్వాంటిటేటివ్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్, డెసిషన్ మేకింగ్ విభాగాల్లో రాణించడానికి ప్రాక్టీస్ కీలకం. ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే విజయానికి అంత దగ్గరవుతారు. గత ప్రశ్నపత్రాలను విశ్లేషించుకుంటూ.. సంబంధిత అంశాల్లోని బేసిక్స్‌పై పట్టు సాధించే విధంగా ప్రిపరేషన్ సాగించాలి. ఒక చాప్టర్‌లోని అంశాలను విభజించుకుని ప్రాక్టీస్ చేయడం సముచితం. ఒక నిర్ణీత అంశాన్ని వేగంగా విశ్లేషించే సామర్థ్యం సొంతం చేసుకోవాలి. నిర్ణీత సమస్యకు సంబంధించి ఫార్ములా ఆధారంగా దశలవారీగా సమాధానం పొందే విధంగా నైపుణ్యం సాధించాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు:
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం.
దరఖాస్తుల ప్రారంభం: ఆగస్టు 12, 2013
దరఖాస్తులకు చివరి తేదీ: నవంబర్ 22, 2013
పరీక్ష తేదీ: జనవరి 5, 2014
ఫలితాల ప్రకటన: జనవరి 31, 2014
వెబ్‌సైట్: www.xatonline.net.in/
రిఫరెన్స్ బుక్స్:
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు:
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం.
దరఖాస్తుల ప్రారంభం: ఆగస్టు 12, 2013
దరఖాస్తులకు చివరి తేదీ: నవంబర్ 22, 2013
పరీక్ష తేదీ: జనవరి 5, 2014
ఫలితాల ప్రకటన: జనవరి 31, 2014
వెబ్‌సైట్: www.xatonline.net.in/
రిఫరెన్స్ బుక్స్:
- క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఫర్ ఎంబీఏ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ - గుహా అభిజిత్
- లాజికల్ అండ్ వెర్బల్ రీజనింగ్ - ఆర్‌ఎస్ అగర్వాల్
- వర్డ్ పవర్ మేడ్ ఈజీ - నార్మన్ లూయిస్
- క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ - టాటా మెక్‌గ్రాహిల్
- ఎక్స్‌ఏటీ సాల్వ్‌డ్ పేపర్స్ - గౌతమ్ పురి
Published date : 16 Aug 2013 10:34AM