అద్భుత అవకాశాలకు నిలయం... ఆతిధ్య రంగం
Sakshi Education
శరవేగంగా విస్తరిస్తున్న ఆతిథ్య రంగం.. అద్భుత అవకాశాలకు బాటలు వేస్తోంది.
సందర్శించే పర్యాటకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో అదే స్థాయిలో.. హాస్పిటాలిటీ రంగంలో వూనవ వనరులకు విపరీతమైన డివూండ్ ఏర్పడుతోంది.. దాంతో హాస్పిటాలిటీ అండ్ హోటల్ మేనేజ్‌మెంట్‌ను కెరీర్‌గా ఎంచుకునే వారి సంఖ్య కూడా అధికమవుతోంది. ఈ నేపథ్యంలో హాస్పిటాలిటీ కోర్సులు, వాటిని అందించే సంస్థల వివరాలపై స్పెషల్ ఫోకస్.
కోర్సులు
హోటల్ మేనేజ్‌మెంట్‌లో డిప్లొమా, పీజీ డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. దేశంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని పలు ఇన్‌స్టిట్యూట్‌లు హోటల్ మేనేజ్‌మెంట్‌లో సర్టిఫికెట్ నుంచి గ్రాడ్యుయేషన్ వరకు పలు రకాల కోర్సులను అందిస్తున్నాయి. కోర్సులను బట్టి అర్హతలు ఉంటాయి. సర్టిఫికెట్/డిప్లొమా కోర్సులకు పదో తరగతి, బ్యాచిలర్ కోర్సులకు ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన వారు అర్హులు.
అందిస్తున్న సంస్థలు
హైదరాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ కేటరింగ్ టెక్నాలజీ అండ్ అప్లైడ్ న్యూట్రిషన్ (ఐహెచ్‌ఎం).. అకామిడేషన్ ఆపరేషన్స్ అండ్ మేనేజ్‌మెంట్‌లో పీజీ డిప్లొమా కోర్సును ఆఫర్ చేస్తోంది.
వ్యవధి: ఏడాదిన్నర
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా గ్రాడ్యుయేషన్ పూర్తిచేసినవారు ఈ కోర్సుకు అర్హులు.
ప్రవేశం: జాతీయ స్థాయి ప్రవేశపరీక్ష, కేంద్రీకృత కౌన్సెలింగ్ ఆధారంగా.
వెబ్‌సైట్: www.ihmhyd.org
డాక్టర్ వైఎస్‌ఆర్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ - హైదరాబాద్.. బేకరీ అండ్ కన్ఫెక్షనరీ, కలినరీ ఆర్ట్స్‌లో డిప్లొమా కోర్సులను అందిస్తోంది.
వ్యవధి: ఆరు నెలలు.
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత.
వెబ్‌సైట్: www.nithm.ac.in
మన రాష్ట్రంలో సెట్విన్.. హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీలో అడ్వాన్స్‌డ్ డిప్లొమా (వ్యవధి: మూడేళ్లు), పీజీ డిప్లొమా (వ్యవధి:ఏడాది), హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ టూరిజంలో పీజీ డిప్లొమా (వ్యవధి: ఏడాది) అందిస్తోంది. వివిధ ఉన్నత స్థాయి కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి.
వెబ్‌సైట్: www.setwinapgov.org
నైపుణ్యాలు
వేతనాలు
మేనేజ్‌మెంట్ ట్రైనీగా అయితే నెలకు రూ.15 నుంచి రూ.18 వేలు, ట్రైనీ సూపర్‌వైజర్‌కైతే రూ. 10 నుంచి రూ. 14 వేలు, మిగతా విభాగాల వారికి రూ. 10 వేలు వర కూ వేతనం లభిస్తుంది. తర్వాత అనుభవం, ప్రతిభ ఆధారంగా రూ. 30,000 నుంచి రూ. లక్ష వరకు సంపాదించవచ్చు.
కెరీర్
హోటల్ మేనేజ్‌మెంట్‌లో ప్రధానంగా నాలుగు విభాగాలు ఉంటాయి. అవి.. ఫుడ్ ప్రొడక్షన్, ఫుడ్ అండ్ బేవరేజ్ సర్వీస్(ఎఫ్ అండ్ బీ), ఫ్రంట్ ఆఫీస్, హౌస్ కీపింగ్. వీటిల్లో ఏదైనా ఒకదాన్ని ఎంచుకుని కెరీర్‌లో స్థిరపడొచ్చు. ఈ క్రమంలో హోటల్/హాస్పిటాలిటీ సంబంధిత పరిశ్రమలో మేనేజ్‌మెంట్ ట్రైనీ, కిచెన్ మేనేజ్‌మెంట్/హౌస్ కీపింగ్ మేనేజ్‌మెంట్, మార్కెటింగ్ సేల్స్, గెస్ట్/కస్టమర్ రిలేషన్ ఎగ్జిక్యూటివ్ వంటి హోదాల్లో ఉద్యోగాలు లభిస్తాయి. ఇంటర్నేషనల్ ఫుడ్ చైన్స్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీ/ఎగ్జిక్యూటివ్‌గా ఉద్యోగాలు పొందొచ్చు.
రెండు కోణాలు
ఆతిథ్య రంగంలో ప్రవేశించడానికి చక్కని వేదిక.. ఎన్‌సీహెచ్‌ఎంసీటీ
ఎన్‌సీహెచ్‌ఎంసీటీ (నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీ).. భారత పర్యాటక శాఖ ఆధ్వర్యంలో పని చేసే స్వయంప్రతిపత్తి సంస్థ. బీఎస్సీ (హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్)తోపాటు ఈ విభాగానికి సంబంధించిన మరో తొమ్మిది కోర్సుల మార్గదర్శకాలను, నాణ్యత ప్రమాణాలను ఎన్‌సీహెచ్‌ఎంసీటీ రూపొందిస్తుంది. ఇందులో ప్రవేశాలకు నిర్వహించే పరీక్ష జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ). దీన్ని ఏటా ఎన్‌సీహెచ్‌ఎంసీటీనే నిర్వహిస్తోంది. ఈ పరీక్ష ద్వారా 21 కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో, 16 రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో, 15 ప్రైవేటు ఇన్‌స్టిట్యూట్‌లలో మూడేళ్ల వ్యవధి ఉన్న బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సును అభ్యసించొచ్చు. ఈ సంస్థల్లో మొత్తం 7,454 సీట్లున్నాయి.
వివరాలు..
అర్హత:ఇంగ్లిష్ ఒక సబ్జెక్ట్‌గా 10+2/ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత. ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు 22 ఏళ్లు మించరాదు. ఎస్సీ, ఎస్టీలకు గరిష్ట వయోపరిమితి 25 ఏళ్లు.
పరీక్ష విధానం:
మూడు గంటల వ్యవధిలో నిర్వహించే రాత పరీక్షలో న్యూమరికల్ ఎబిలిటీ అండ్ సైంటిఫిక్ ఆప్టిట్యూడ్ (30 ప్రశ్నలు), రీజనింగ్ అండ్ లాజికల్ డిడక్షన్ (30 ప్రశ్నలు), జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ (30 ప్రశ్నలు), ఇంగ్లిష్ లాంగ్వేజ్ (60 ప్రశ్నలు), ఆప్టిట్యూడ్ ఫర్ సర్వీస్ సెక్టార్ (50 ప్రశ్నలు) ఉంటాయి. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీల్లో ఉంటుంది. సరైన సమాధానానికి ఒక మార్కు. తప్పు సమాధానాలకు నెగెటివ్ మార్కులుంటాయి.
న్యూమరికల్ ఎబిలిటీ సైంటిఫిక్ ఆప్టిట్యూడ్
ఈ విభాగంలో మ్యాథమెటిక్స్, సెన్సైస్‌లోని అంశాలపై విద్యార్థుల ప్రాథమిక అవగాహన స్థాయిని పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నల క్లిష్టత హైస్కూల్ స్థాయిలో ఉంటుంది. మ్యాథమెటిక్స్‌లో రాణించాలంటే పని-కాలం, వడ్డీ, సగటు, దూరం-కాలం, నిష్పత్తి, కసాగు, గసాభా, సూక్ష్మీకరణ వంటి అంశాలపై పట్టు ఉండాలి. సెన్సైస్ విభాగానికి సంబంధించి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఈ విభాగం నుంచి దాదాపు 10 వరకు ప్రశ్నలు రావచ్చు. ఇందులో అడిగే ప్రశ్నలు మరీలోతుగా కాకుండా మధ్యస్తంగా ఉంటాయి.
రీజనింగ్ అండ్ లాజికల్ డిడక్షన్
విద్యార్థుల్లోని విశ్లేషణాత్మక, తార్కిక సావుర్థ్యాన్ని పరీక్షించడానికి ఉద్దేశించిన విభాగమిది. ఈ క్రమంలో వెర్బల్, నాన్ వెర్బల్ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. వెర్బల్ విభాగంలో రీజనింగ్ నుంచి డెరైక్షన్-డిస్టెన్స్, క్లాసిఫికేషన్, కోడింగ్-డీ కోడింగ్, సిరీస్ టెస్ట్, రిలేషన్స్, ఆల్ఫాబెట్ టెస్ట్, కండిషన్స్ అండ్ గ్రూపింగ్, నంబర్-ర్యాంకింగ్- టైమ్-సీక్వెన్సెస్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, క్యూబ్స్, డేటా అరేంజ్‌మెంట్, డేటా సఫిషియన్సీ, స్టేట్‌మెంట్స్ వంటి అంశాలపై దృష్టిసారించాలి. నాన్ వెర్బల్ విభాగంలో మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్, పేపర్ ఫోల్డింగ్, పేపర్ కటింగ్, విజువల్ ఎబిలిటీ, అనాలజీ వంటి అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్
ఈ విభాగంలో ప్రశ్నలు స్టాండర్డ్ జీకే, కరెంట్ అఫైర్స్ సమ్మిళితంగా ఉంటాయి. జీకేకి సంబంధించి దేశాలు-రాజధానులు-కరెన్సీ, ప్రముఖ వ్యక్తులు-ప్రదేశాలు, అవార్డులు, జాతీయ చిహ్నాలు, పుస్తకాలు- రచయితలు, కళలు, సాహిత్యం వంటి అంశాల నుంచి ప్రశ్నలు ఎదురవుతాయి. ఆయా అంశాలను భారతదేశం, ప్రపంచాన్ని నేపథ్యంగా తీసుకుని ప్రిపేర్ కావాలి. కరెంట్ అఫైర్స్ కోసం.. పరీక్ష జరిగే తేదీకి ముందు సంవత్సర కాలంలో జరిగిన ప్రధాన అంశాలను (సదస్సులు, సమావేశాలు, ఒప్పందాలు, వ్యక్తు లు, విజయాలు, అవార్డులు వంటివి) తెలుసుకోవాలి.
ఇంగ్లిష్
మొత్తం ఐదు విభాగాల్లో ఇంగ్లిష్‌కు అత్యధిక వెయిటేజీ కేటారుుంచారు. ఈ విభాగంలో ఎక్కువ స్కోరు చేసే అభ్యర్థులే మెరుగైన ర్యాంకు సాధించే అవకాశం ఉంది. కాబట్టి ఇంగ్లిష్ విభాగంపై ఎక్కువ దృష్టి సారించాలి. ఇందుకోసం పదో తరగతి వరకు బేసిక్ గ్రావుర్‌పై పట్టు సాధించాలి. టెన్సెస్, రూల్స్ ఆఫ్ కరె క్ట్ యూసేజ్, రూల్స్ ఆఫ్ కంజెక్షన్, ప్రిపోజిషన్స్, స్పాటింగ్ ఎర్రర్స్, ఇం్రపూవ్‌మెంట్ ఆఫ్ సెంటెన్సెస్, వన్‌వర్డ్ సబ్‌స్టిట్యూషన్, సెంటెన్స్ కంప్లిషన్, సీక్వెన్స్ ఆఫ్ వర్డ్స్ తదితర అంశాలపై ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. ఇందులో రాణించాలంటే.. పదాలపై పట్టు సాధించాలి. ప్రతిరోజూ కొన్ని కొత్త పదాలను నేర్చుకోవాలి. కేవలం పదాలను తెలుసుకోవడానికే పరిమితం కాకుండా.. వాటి ఉపయోగంపై కూడా అవగాహన పెంచుకోవాలి. ప్రతిరోజూ ఇంగ్లిష్ న్యూస్ పేపర్లు, మేగజైన్లను విశ్లేషణాత్మక దృష్టితో చదవాలి. వాటిలో ఉపయోగించిన పదాలు, వాక్యనిర్మాణ క్రవూన్ని జాగ్రత్తగా పరిశీలించాలి.
ఆప్టిట్యూడ్ ఫర్ సర్వీస్ సెక్టార్
అన్నిటిలోకి కీలకమైన విభాగం ఆప్టిట్యూడ్ ఫర్ సర్వీస్ సెక్టార్. ఈ రంగంలో కీలక పాత్ర పోషించే ఇంటర్ పర్సనల్ స్కిల్స్‌ను పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. వివిధ సందర్భాల్లో వ్యవహరించే విధానం? పనిచేసే ప్రదేశాల్లో ఎలా వ్యవహరించాలి? తరహా ప్రశ్నలు అడుగుతారు. వ్యక్తిగత విచ క్షణ ఆధారంగా నిర్ణయం తీసుకోవాల్సిన ఈ విభాగంలో ఇచ్చిన ఆప్షన్లన్నీ సరైనవే అనిపించే రీతిలో ఉంటాయి. అందుకే ఈ విభాగంలోని ప్రశ్నలకు నిర్ణీత మార్కు అని నిర్దేశించలేదు. 0.25. 0.5, 0.75, 1 అని ప్రతి ప్రశ్నకు మార్కులను విభజించారు. అభ్యర్థి ఇచ్చిన ఆప్షన్, నిర్దేశిత సమాధానం మధ్య సమతుల్యత ఆధారంగా మార్కులు కేటాయిస్తారు. అంటే.. ఎంచుకున్న ఆప్షన్ నిర్ణీత సమాధానానికి సరితూగకపోతే 0.25, పూర్తిస్థాయిలో సరితూగితే ఒకమార్కు కేటాయిస్తారు. వీటికి ఎటువంటి అకడెమిక్ ఓరియెంటేషన్ అవసరం లేదు. మనలోని స్కిల్స్ ఇందులో ఎక్కువ స్కోర్ చేయడానికి దోహదం చేస్తాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
ప్రతిభావంతులకు నేరుగా
ఎన్‌సీహెచ్‌ఎంసీటీ కేవలం రాతపరీక్ష ద్వారానే కాకుండా ప్రతిభావంతులకు నేరుగా ప్రవేశం కల్పిస్తుంది. ఇంటర్‌లో ఆర్ట్స్, సైన్స్, కామర్స్ గ్రూప్‌ల్లో 1 నుంచి 200 స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు.. ఆయా గ్రూప్‌ల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఐహెచ్‌ఎంలలో నేరుగా అడ్మిషన్ కల్పిస్తుంది. కోర్సులో చేరిన తర్వాత మెరిట్ స్టూడెంట్స్‌కు స్కాలర్‌షిప్స్‌ను కూడా ప్రదానం చేస్తుంది. వార్షిక పరీక్షల్లో జాతీయ స్థాయిలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు ఎన్‌సీహెచ్‌ఎంసీటీ మెరిట్ బేస్డ్ స్కాలర్‌షిప్స్‌ను కూడా అందజేస్తుంది.

- కమ్యూనికేషన్ స్కిల్స్.
- నిర్వహణా నైపుణ్యాలు.
- సాఫ్ట్ స్కిల్స్.
- సేల్స్ అండ్ మార్కెటింగ్ స్కిల్స్.
- ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం.
వేతనాలు
మేనేజ్‌మెంట్ ట్రైనీగా అయితే నెలకు రూ.15 నుంచి రూ.18 వేలు, ట్రైనీ సూపర్‌వైజర్‌కైతే రూ. 10 నుంచి రూ. 14 వేలు, మిగతా విభాగాల వారికి రూ. 10 వేలు వర కూ వేతనం లభిస్తుంది. తర్వాత అనుభవం, ప్రతిభ ఆధారంగా రూ. 30,000 నుంచి రూ. లక్ష వరకు సంపాదించవచ్చు.
కెరీర్
హోటల్ మేనేజ్‌మెంట్‌లో ప్రధానంగా నాలుగు విభాగాలు ఉంటాయి. అవి.. ఫుడ్ ప్రొడక్షన్, ఫుడ్ అండ్ బేవరేజ్ సర్వీస్(ఎఫ్ అండ్ బీ), ఫ్రంట్ ఆఫీస్, హౌస్ కీపింగ్. వీటిల్లో ఏదైనా ఒకదాన్ని ఎంచుకుని కెరీర్‌లో స్థిరపడొచ్చు. ఈ క్రమంలో హోటల్/హాస్పిటాలిటీ సంబంధిత పరిశ్రమలో మేనేజ్‌మెంట్ ట్రైనీ, కిచెన్ మేనేజ్‌మెంట్/హౌస్ కీపింగ్ మేనేజ్‌మెంట్, మార్కెటింగ్ సేల్స్, గెస్ట్/కస్టమర్ రిలేషన్ ఎగ్జిక్యూటివ్ వంటి హోదాల్లో ఉద్యోగాలు లభిస్తాయి. ఇంటర్నేషనల్ ఫుడ్ చైన్స్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీ/ఎగ్జిక్యూటివ్‌గా ఉద్యోగాలు పొందొచ్చు.
రెండు కోణాలు
- కెరీర్ పరంగా వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుంటే ఆతిథ్య రంగం ఒక ఆకర్షణీయ కెరీర్ ఆప్షన్.
- కార్యకలాపాల విస్తరణకు అవకాశమున్న రంగం ఆతిథ్యం. ఈ రంగంలో పదోన్నతులు త్వరగా లభిస్తాయి. కొత్త శాఖల ఏర్పాటు ద్వారా ఈ అవకాశం దొరుకుతుంది.
- ఆర్థిక సంక్షోభం కారణంగా పర్యాటకుల సంఖ్య తగ్గినప్పుడు ఆతిథ్య రంగం కొంత ఒడిదుడుకులకు గురవుతుంది.
- అధిక పనివేళలతో పాటు ఒక్కోసారి అతిథుల (కస్టమర్స్) ప్రవర్తన ఇబ్బంది కలిగిస్తుంది.
- ఆతిథ్య రంగంలో మేనేజ్‌మెంట్; ఫుడ్ అండ్ బేవరేజ్ సర్వీసెస్; హౌస్ కీపింగ్; ఫ్రంట్ ఆఫీస్ ఆపరేషన్స్; సేల్స్ అండ్ మార్కెటింగ్; అకౌంటింగ్ తదితర విభాగాల్లో పనిచేయాల్సి ఉంటుంది. ఒక్కో విభాగంలో ఒక్కోలా పని ఉంటుంది.
కమ్యూనికేషన్ స్కిల్స్ కీలకం మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, కష్టపడే తత్వం, విశాల దృక్పథంతో వ్యవహరించే గుణం ఉన్న వారు హోటల్ మేనేజ్‌మెంట్‌ను కెరీర్‌గా ఎంచుకోవచ్చు. జాతీయ స్థాయి ఇన్‌స్టిట్యూట్‌లలో హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సులను చదవాలంటే ఎన్‌సీహెచ్‌ఎంసీటీజేఈఈ ఒక్కటే మార్గం. ఈ పరీక్ష ద్వారా బీఎస్సీ (హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్) కోర్సులో ప్రవేశం పొందొచ్చు. తర్వాత ఆసక్తి ఉంటే సంబంధిత విభాగంలో ఎంబీఏ, ఎంఎస్సీ, విదేశాల్లో ఎంఎస్ చేయవచ్చు. అవకాశాల పరంగా చూస్తే.. ఎన్‌సీహెచ్‌ఎం అనుబంధ ఇన్‌స్టిట్యూట్‌లలో 100 శాతం ప్లేస్‌మెంట్ లభిస్తుంది. కోర్సు పూర్తికాకముందే ఆఫర్ లెటర్ చేతిలో ఉంటుంది. ఉద్యోగాల విషయంలో ఈ రంగంలో డిమాండ్-సప్లై మధ్య భారీగా వ్యత్యాసం ఉంటోంది. ఆరు లక్షల ఉద్యోగాలు అవసరం ఉంటే.. ఒక శాతం మేర మాత్రమే మానవ వనరులు లభ్యమవుతున్నాయి. అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాల్లో కూడా హోటల్ మేనేజ్‌మెంట్ అభ్యర్థులకు చక్కని అవకాశాలు లభిస్తున్నాయి. వేతనాల విషయానికొస్తే.. ఐదంకెల జీతంతో కె రీర్ ప్రారంభించవచ్చు. -సుధా కుమార్, ప్రిన్సిపల్,డాక్టర్‌వైఎస్‌ఆర్ ఎన్‌ఐటీహెచ్‌ఎం, హైదరాబాద్. |
ఆతిథ్య రంగంలో ప్రవేశించడానికి చక్కని వేదిక.. ఎన్‌సీహెచ్‌ఎంసీటీ
ఎన్‌సీహెచ్‌ఎంసీటీ (నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీ).. భారత పర్యాటక శాఖ ఆధ్వర్యంలో పని చేసే స్వయంప్రతిపత్తి సంస్థ. బీఎస్సీ (హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్)తోపాటు ఈ విభాగానికి సంబంధించిన మరో తొమ్మిది కోర్సుల మార్గదర్శకాలను, నాణ్యత ప్రమాణాలను ఎన్‌సీహెచ్‌ఎంసీటీ రూపొందిస్తుంది. ఇందులో ప్రవేశాలకు నిర్వహించే పరీక్ష జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ). దీన్ని ఏటా ఎన్‌సీహెచ్‌ఎంసీటీనే నిర్వహిస్తోంది. ఈ పరీక్ష ద్వారా 21 కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో, 16 రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో, 15 ప్రైవేటు ఇన్‌స్టిట్యూట్‌లలో మూడేళ్ల వ్యవధి ఉన్న బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సును అభ్యసించొచ్చు. ఈ సంస్థల్లో మొత్తం 7,454 సీట్లున్నాయి.
వివరాలు..
అర్హత:ఇంగ్లిష్ ఒక సబ్జెక్ట్‌గా 10+2/ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత. ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు 22 ఏళ్లు మించరాదు. ఎస్సీ, ఎస్టీలకు గరిష్ట వయోపరిమితి 25 ఏళ్లు.
పరీక్ష విధానం:
మూడు గంటల వ్యవధిలో నిర్వహించే రాత పరీక్షలో న్యూమరికల్ ఎబిలిటీ అండ్ సైంటిఫిక్ ఆప్టిట్యూడ్ (30 ప్రశ్నలు), రీజనింగ్ అండ్ లాజికల్ డిడక్షన్ (30 ప్రశ్నలు), జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ (30 ప్రశ్నలు), ఇంగ్లిష్ లాంగ్వేజ్ (60 ప్రశ్నలు), ఆప్టిట్యూడ్ ఫర్ సర్వీస్ సెక్టార్ (50 ప్రశ్నలు) ఉంటాయి. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీల్లో ఉంటుంది. సరైన సమాధానానికి ఒక మార్కు. తప్పు సమాధానాలకు నెగెటివ్ మార్కులుంటాయి.
న్యూమరికల్ ఎబిలిటీ సైంటిఫిక్ ఆప్టిట్యూడ్
ఈ విభాగంలో మ్యాథమెటిక్స్, సెన్సైస్‌లోని అంశాలపై విద్యార్థుల ప్రాథమిక అవగాహన స్థాయిని పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నల క్లిష్టత హైస్కూల్ స్థాయిలో ఉంటుంది. మ్యాథమెటిక్స్‌లో రాణించాలంటే పని-కాలం, వడ్డీ, సగటు, దూరం-కాలం, నిష్పత్తి, కసాగు, గసాభా, సూక్ష్మీకరణ వంటి అంశాలపై పట్టు ఉండాలి. సెన్సైస్ విభాగానికి సంబంధించి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఈ విభాగం నుంచి దాదాపు 10 వరకు ప్రశ్నలు రావచ్చు. ఇందులో అడిగే ప్రశ్నలు మరీలోతుగా కాకుండా మధ్యస్తంగా ఉంటాయి.
రీజనింగ్ అండ్ లాజికల్ డిడక్షన్
విద్యార్థుల్లోని విశ్లేషణాత్మక, తార్కిక సావుర్థ్యాన్ని పరీక్షించడానికి ఉద్దేశించిన విభాగమిది. ఈ క్రమంలో వెర్బల్, నాన్ వెర్బల్ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. వెర్బల్ విభాగంలో రీజనింగ్ నుంచి డెరైక్షన్-డిస్టెన్స్, క్లాసిఫికేషన్, కోడింగ్-డీ కోడింగ్, సిరీస్ టెస్ట్, రిలేషన్స్, ఆల్ఫాబెట్ టెస్ట్, కండిషన్స్ అండ్ గ్రూపింగ్, నంబర్-ర్యాంకింగ్- టైమ్-సీక్వెన్సెస్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, క్యూబ్స్, డేటా అరేంజ్‌మెంట్, డేటా సఫిషియన్సీ, స్టేట్‌మెంట్స్ వంటి అంశాలపై దృష్టిసారించాలి. నాన్ వెర్బల్ విభాగంలో మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్, పేపర్ ఫోల్డింగ్, పేపర్ కటింగ్, విజువల్ ఎబిలిటీ, అనాలజీ వంటి అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్
ఈ విభాగంలో ప్రశ్నలు స్టాండర్డ్ జీకే, కరెంట్ అఫైర్స్ సమ్మిళితంగా ఉంటాయి. జీకేకి సంబంధించి దేశాలు-రాజధానులు-కరెన్సీ, ప్రముఖ వ్యక్తులు-ప్రదేశాలు, అవార్డులు, జాతీయ చిహ్నాలు, పుస్తకాలు- రచయితలు, కళలు, సాహిత్యం వంటి అంశాల నుంచి ప్రశ్నలు ఎదురవుతాయి. ఆయా అంశాలను భారతదేశం, ప్రపంచాన్ని నేపథ్యంగా తీసుకుని ప్రిపేర్ కావాలి. కరెంట్ అఫైర్స్ కోసం.. పరీక్ష జరిగే తేదీకి ముందు సంవత్సర కాలంలో జరిగిన ప్రధాన అంశాలను (సదస్సులు, సమావేశాలు, ఒప్పందాలు, వ్యక్తు లు, విజయాలు, అవార్డులు వంటివి) తెలుసుకోవాలి.
ఇంగ్లిష్
మొత్తం ఐదు విభాగాల్లో ఇంగ్లిష్‌కు అత్యధిక వెయిటేజీ కేటారుుంచారు. ఈ విభాగంలో ఎక్కువ స్కోరు చేసే అభ్యర్థులే మెరుగైన ర్యాంకు సాధించే అవకాశం ఉంది. కాబట్టి ఇంగ్లిష్ విభాగంపై ఎక్కువ దృష్టి సారించాలి. ఇందుకోసం పదో తరగతి వరకు బేసిక్ గ్రావుర్‌పై పట్టు సాధించాలి. టెన్సెస్, రూల్స్ ఆఫ్ కరె క్ట్ యూసేజ్, రూల్స్ ఆఫ్ కంజెక్షన్, ప్రిపోజిషన్స్, స్పాటింగ్ ఎర్రర్స్, ఇం్రపూవ్‌మెంట్ ఆఫ్ సెంటెన్సెస్, వన్‌వర్డ్ సబ్‌స్టిట్యూషన్, సెంటెన్స్ కంప్లిషన్, సీక్వెన్స్ ఆఫ్ వర్డ్స్ తదితర అంశాలపై ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. ఇందులో రాణించాలంటే.. పదాలపై పట్టు సాధించాలి. ప్రతిరోజూ కొన్ని కొత్త పదాలను నేర్చుకోవాలి. కేవలం పదాలను తెలుసుకోవడానికే పరిమితం కాకుండా.. వాటి ఉపయోగంపై కూడా అవగాహన పెంచుకోవాలి. ప్రతిరోజూ ఇంగ్లిష్ న్యూస్ పేపర్లు, మేగజైన్లను విశ్లేషణాత్మక దృష్టితో చదవాలి. వాటిలో ఉపయోగించిన పదాలు, వాక్యనిర్మాణ క్రవూన్ని జాగ్రత్తగా పరిశీలించాలి.
ఆప్టిట్యూడ్ ఫర్ సర్వీస్ సెక్టార్
అన్నిటిలోకి కీలకమైన విభాగం ఆప్టిట్యూడ్ ఫర్ సర్వీస్ సెక్టార్. ఈ రంగంలో కీలక పాత్ర పోషించే ఇంటర్ పర్సనల్ స్కిల్స్‌ను పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. వివిధ సందర్భాల్లో వ్యవహరించే విధానం? పనిచేసే ప్రదేశాల్లో ఎలా వ్యవహరించాలి? తరహా ప్రశ్నలు అడుగుతారు. వ్యక్తిగత విచ క్షణ ఆధారంగా నిర్ణయం తీసుకోవాల్సిన ఈ విభాగంలో ఇచ్చిన ఆప్షన్లన్నీ సరైనవే అనిపించే రీతిలో ఉంటాయి. అందుకే ఈ విభాగంలోని ప్రశ్నలకు నిర్ణీత మార్కు అని నిర్దేశించలేదు. 0.25. 0.5, 0.75, 1 అని ప్రతి ప్రశ్నకు మార్కులను విభజించారు. అభ్యర్థి ఇచ్చిన ఆప్షన్, నిర్దేశిత సమాధానం మధ్య సమతుల్యత ఆధారంగా మార్కులు కేటాయిస్తారు. అంటే.. ఎంచుకున్న ఆప్షన్ నిర్ణీత సమాధానానికి సరితూగకపోతే 0.25, పూర్తిస్థాయిలో సరితూగితే ఒకమార్కు కేటాయిస్తారు. వీటికి ఎటువంటి అకడెమిక్ ఓరియెంటేషన్ అవసరం లేదు. మనలోని స్కిల్స్ ఇందులో ఎక్కువ స్కోర్ చేయడానికి దోహదం చేస్తాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
ప్రతిభావంతులకు నేరుగా
ఎన్‌సీహెచ్‌ఎంసీటీ కేవలం రాతపరీక్ష ద్వారానే కాకుండా ప్రతిభావంతులకు నేరుగా ప్రవేశం కల్పిస్తుంది. ఇంటర్‌లో ఆర్ట్స్, సైన్స్, కామర్స్ గ్రూప్‌ల్లో 1 నుంచి 200 స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు.. ఆయా గ్రూప్‌ల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఐహెచ్‌ఎంలలో నేరుగా అడ్మిషన్ కల్పిస్తుంది. కోర్సులో చేరిన తర్వాత మెరిట్ స్టూడెంట్స్‌కు స్కాలర్‌షిప్స్‌ను కూడా ప్రదానం చేస్తుంది. వార్షిక పరీక్షల్లో జాతీయ స్థాయిలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు ఎన్‌సీహెచ్‌ఎంసీటీ మెరిట్ బేస్డ్ స్కాలర్‌షిప్స్‌ను కూడా అందజేస్తుంది.
Published date : 02 Jun 2015 02:25PM