సైబర్ సెక్యూరిటీ..భద్రమైన కెరీర్‌కు కేరాఫ్!
Sakshi Education
సైబర్ దాడులు పెరుగుతున్నకొద్దీ వ్యక్తిగత సమాచారం, విలువైన డేటాను సురక్షితంగా కాపాడుకోవడం తప్పనిసరిగా మారుతోంది. సాఫ్ట్‌వేర్ ఉపయోగించి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధారిత ఆన్‌లైన్ కార్యకలాపాల భద్రతను పర్యవేక్షించడమే సైబర్ సెక్యూరిటీ. దీనికి సంబంధించిన విధానాలతో కంప్యూటర్లు, నెట్‌వర్క్ సిస్టమ్స్, సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్స్, విలువైన డేటాలు తస్కరణకు; హ్యాకింగ్‌కు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు.
ప్రస్తుతం ఆన్‌లైన్ విధానంలో కార్యకలాపాలు నిర్వహించే చిన్నస్థాయి ప్రైవేటు సంస్థల నుంచి బహుళజాతి సంస్థల వరకు.. సైబర్ నిపుణులపై ఆధారపడక తప్పని పరిస్థితి. దీంతో సైబర్ నిపుణులకు డిమాండ్ పెరగడంతోపాటు ఆకర్షణీయ వేతనాలు లభిస్తున్నాయి.
భారత్‌లో పరిస్థితి
దేశంలో డేటాసెక్యూరిటీ, నెట్‌వర్క్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సెక్యూరిటీ రెగ్యులేషన్ అండ్ కంప్లియన్స్‌కి సంబంధించిన సమస్యలు పెరుగుతున్నాయి. ఫలితంగా దేశ వ్యాప్తంగా డేటాసెక్యూరిటీ సొల్యూషన్స్, సర్వీసులకు డిమాండ్ పెరుగుతోంది. కన్సల్టెన్సీ సంస్థలు, బ్యాంకులు, ప్రభుత్వాలు, రిటైల్, బీఎఫ్‌ఎస్‌ఐ, ఐటీ కంపెనీలను సైబర్ సెక్యూరిటీ నిపుణుల కొరత వేధిస్తోంది. ప్రధానంగా బ్యాంకులు, పేమెంట్ గేట్‌వేలు, ఈ-కామర్స్ సంస్థల్లో సైబర్ సెక్యూరిటీ నిపుణులు అవసరం చాలా ఎక్కువగా ఉంది. భారత సైబర్ సెక్యూరిటీ మార్కెట్ ఏటా 19 శాతం మేర వృద్ధి నమోదు చేస్తోంది.
సైబర్ సెక్యూరిటీ నిపుణులు-విధులు
వాస్తవానికి సైబర్ సెక్యూరిటీ నిపుణులు రకరకాల బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఎథికల్ హ్యాకర్‌గా మారి.. సంస్థ డిజిటల్ ఇంటర్‌ఫేస్, ఐటీ నెట్‌వర్క్‌లో ప్రవేశించి... భద్రతపరమైన లోపాలను గుర్తించి.. వాటిని అధిగమించే మార్గాలు సిద్ధం చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా సంస్థ సైబర్ సెక్యూరిటీ విధానాన్ని రూపొందించాల్సిన బాధ్యత కూడా సైబర్ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్‌దే! ఫైర్‌వాల్ లాంటి సెక్యూరిటీ ప్రొడక్ట్స్ నిర్వహణ, సైబర్ మోసం జరగకుండా నిరోధించడం, సైబర్ దాడులు జరిగినప్పుడు నష్టనివారణ.. ఇలాంటి ఎన్నో కీలక బాధ్యతలను సైబర్ సెక్యూరిటీ నిపుణులు సమర్థవంతంగా నిర్వహించాల్సి ఉంటుంది.
విభిన్న జాబ్ ప్రొఫైల్స్
సైబర్ సెక్యూరిటీ రంగంలో ఇన్ఫర్మేషన్ రిస్క్ ఆడిటర్స్, ఫైర్‌వాల్ అండ్ సెక్యూరిటీ డివైస్ డెవలప్‌మెంట్ ప్రొఫెషనల్స్, సెక్యూరిటీ అనలిస్ట్‌లు, ఇంట్రూషన్ డిటెక్షన్ స్పెషలిస్ట్‌లు, కంప్యూటర్ సెక్యూరిటీ ఇన్స్‌డెంట్ రెస్పాండర్స్, క్రిప్టాలజిస్ట్‌లు, వల్నరబిలిటీ అసెసర్స్, లీడ్ సెక్యూరిటీ ఆర్కిటెక్స్, చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మేనేజర్స్, సైబర్ సెక్యూరిటీ కన్సల్టెంట్స్, డిజిటల్ ఫొరెన్సిక్ ఎక్స్‌పర్ట్స్, ఎస్‌ఓసీ ఇంజనీర్, ఎథికల్ హ్యాకర్, థ్రెట్ మేనేజ్‌మెంట్ స్పెషలిస్ట్‌లు, మాల్వేర్ అనలిస్ట్‌లు, థ్రెట్ అనాలసిస్ మేనేజర్ వంటి పలు జాబ్ ప్రొఫైల్స్ ఉన్నాయి.
అర్హత లు
సైబర్ సెక్యూరిటీ నిపుణుడిగా మారేందుకు ఏదైనా డిగ్రీతోపాటు సంబంధిత ఐటీ నైపుణ్యాలుండాలి. కొన్ని కంపెనీలు మాత్రం సీఎస్‌ఈ (కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్) నేపథ్యం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. అయితే జాబ్ మార్కెట్‌లో హాట్‌కేక్‌లుగా నిలుస్తున్న పలు ఐటీ సర్టిఫికేషన్లు పూర్తిచేయడం ద్వారా సైబర్ సెక్యూరిటీ రంగంలో కెరీర్ అవకాశాలు మెరుగుపరచుకోవచ్చు.
పీజీ స్పెషలైజేషన్
సైబర్ సెక్యూరిటీ/ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీకి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో పూర్తిస్థాయి కోర్సులు అందుబాటులో లేవు. కాగా, పీజీ స్థారుులో మాత్రం ఎంటెక్, ఎంసీఏలలో ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్ స్పెషలైజేషన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
వేతనం
నైపుణ్యాలు కలిగిన వారికి రూ.10 లక్షల వార్షిక వేతనాన్ని కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయి. సైబర్ సెక్యూరిటీ విభాగంలో ప్రారంభంలో నెలకు 25 వేలకు పైగా అందుకునే అవకాశం ఉంది.
సర్టిఫికేషన్లు తప్పనిసరి
కీలక విభాగాలు
సైబర్ సెక్యూరిటీకి సంబంధించి ఐటీ సెక్యూరిటీ, డేటాసెక్యూరిటీ, ఇన్సిడెంట్ మేనేజ్‌మెంట్ అండ్ సెక్యూరిటీ మానిటరింగ్, అప్లికేషన్ సెక్యూరిటీ కీలక విభాగాలుగా ఉంటాయి. సంస్థలు/ప్రొడక్స్/ప్రాజెక్టులకు సంబంధించిన కీలక సమాచార భద్రత, మార్పిడిలో ఈ విభాగాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఎంఎన్‌సీ కంపెనీల నుంచి స్కేల్-3 ఆన్‌లైన్ ఆధారిత సంస్థల వరకు ఆయా సంస్థల ఆర్థిక వ్యవహారాల భద్రతా పర్యవేక్షణకు (మానిటరింగ్) సైబర్ సెక్యూరిటీ అత్యవసరం. దీంతో ఈ విభాగాల్లో సర్టిఫికేషన్లు చేసిన వారికి జాబ్ మార్కెట్లో మంచి అవకాశాలు లభిస్తున్నాయి.
ఐటీ సెక్యూరిటీ
సైబర్ సెక్యూరిటీలో ఇది కీలక విభాగంగా ఉంది. ఐటీ సెక్యూరిటీ నిపుణులు ఆన్‌లైన్ మోసాలను అరికట్టడం, సెక్యూర్డ్ అప్లికేషన్ల రూపకల్పన తదితర విధులు నిర్వర్తిస్తారు.
డేటా సెక్యూరిటీ
డేటాకు సంబంధించి పటిష్ట నిర్వహణ నైపుణ్యాలను అందించే విభాగం.. డేటా సెక్యూరిటీ. ఆన్‌లైన్ సేవల్లో డేటామేనేజ్‌మెంట్‌కు అధిక ప్రాధాన్యం ఉంటుంది. ఆన్‌లైన్ సేవలు అందించే సంస్థలు తుది వినియోగదారుల వివరాలు, ప్రొడక్ట్స్/సర్వీసుల వివరాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ సమయంలో చిన్న పొరపాటు జరిగినా వెబ్‌సైట్ హ్యాకింగ్‌కి గురయ్యే ప్రమాదం ఉంది. అదే గనుక జరిగితే సంస్థ వివరాలు క్షణాల్లో హ్యాకర్లకు చేతికి చేరతాయి.
సైబర్ సెక్యూరిటీ రంగం - ముఖ్యాంశాలు
కొలువులకు సర్టిఫికేషన్లు
సైబర్ సెక్యూరిటీ కెరీర్ పరంగా బ్లాక్‌చైన్ టెక్నాలజీ చక్కటి ఉద్యోగ అవకాశాలను అందిస్తోంది. స్కాడా అనే సైబర్ సెక్యూరిటీ సర్టిఫికేషన్‌ను పూర్తిచేయడం ద్వారా ఎయిర్‌పోర్టులు; అణువిద్యుత్; జల విద్యు త్ కేంద్రాలకు సంబంధించిన సమాచారాన్ని భద్రపరిచే కార్య కలాపాల్లో ఉద్యోగ అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. సైబర్ సెక్యూరిటీలో వివిధ స్పెషలైజేషన్ల ద్వారా ఫోరెన్సిక్, నార్కోటిక్స్; ఇంటెలిజెన్స్; ఆర్మీ; నేవీ తదితర ప్రభుత్వ విభాగాల్లో కొలువులు అందుకోవచ్చు.
- డా. కన్నెగంటి రమేష్‌బాబు, ఫౌండర్ అండ్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్, సీహెచ్‌ఎస్‌ఎస్.

- సైబర్ సెక్యూరిటీ రంగంలో కెరీర్‌లో స్థిరపడాలనుకునేవారికి పలు సర్టిఫికేషన్లు అందుబాటులో ఉన్నాయి. సంప్రదాయ గ్రాడ్యుయేట్ల నుంచి ఐటీ ప్రొఫెషనల్స్ వరకు ఎవరైనా వీటిని పూర్తి చేయొచ్చు.
- సిస్కో.. ఎంట్రీ, అసోసియేట్, ప్రొఫెషనల్ స్థాయి ల్లో మూడేళ్ల కాలానికి; ఎక్స్‌పెర్ట్, స్పెషలిస్ట్ స్థాయి ల్లో ఐదేళ్ల కాలానికి సర్టిఫికేషన్స్ అందిస్తోంది. దీంతోపాటు ఐదేళ్ల కాలానికి సిస్కో సర్టిఫైడ్ ఆర్కిటెక్ట్ సర్టిఫికేషన్‌ను అందిస్తోంది.
వెబ్‌సైట్: www.cisco.com
- ఈసీ కౌన్సిల్.. అడ్వాన్స్‌డ్, కోర్, ఫండమెం టల్స్, మేనేజ్‌మెంట్, సెక్యూరిటీ అవేర్‌నెస్, స్పెష లిస్ట్ కేటగిరీల్లో పలు సైబర్ సెక్యూరిటీ కోర్సులను అందిస్తోంది.
వెబ్‌సైట్: www.eccouncil.org
- డేటా సెక్యూరిటీ కౌన్సిల్ పలు సైబర్ సెక్యూరిటీ సర్టిఫికేషన్లు అందిస్తోంది.
వెబ్‌సైట్: www.dsci.in
కీలక విభాగాలు
సైబర్ సెక్యూరిటీకి సంబంధించి ఐటీ సెక్యూరిటీ, డేటాసెక్యూరిటీ, ఇన్సిడెంట్ మేనేజ్‌మెంట్ అండ్ సెక్యూరిటీ మానిటరింగ్, అప్లికేషన్ సెక్యూరిటీ కీలక విభాగాలుగా ఉంటాయి. సంస్థలు/ప్రొడక్స్/ప్రాజెక్టులకు సంబంధించిన కీలక సమాచార భద్రత, మార్పిడిలో ఈ విభాగాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఎంఎన్‌సీ కంపెనీల నుంచి స్కేల్-3 ఆన్‌లైన్ ఆధారిత సంస్థల వరకు ఆయా సంస్థల ఆర్థిక వ్యవహారాల భద్రతా పర్యవేక్షణకు (మానిటరింగ్) సైబర్ సెక్యూరిటీ అత్యవసరం. దీంతో ఈ విభాగాల్లో సర్టిఫికేషన్లు చేసిన వారికి జాబ్ మార్కెట్లో మంచి అవకాశాలు లభిస్తున్నాయి.
ఐటీ సెక్యూరిటీ
సైబర్ సెక్యూరిటీలో ఇది కీలక విభాగంగా ఉంది. ఐటీ సెక్యూరిటీ నిపుణులు ఆన్‌లైన్ మోసాలను అరికట్టడం, సెక్యూర్డ్ అప్లికేషన్ల రూపకల్పన తదితర విధులు నిర్వర్తిస్తారు.
డేటా సెక్యూరిటీ
డేటాకు సంబంధించి పటిష్ట నిర్వహణ నైపుణ్యాలను అందించే విభాగం.. డేటా సెక్యూరిటీ. ఆన్‌లైన్ సేవల్లో డేటామేనేజ్‌మెంట్‌కు అధిక ప్రాధాన్యం ఉంటుంది. ఆన్‌లైన్ సేవలు అందించే సంస్థలు తుది వినియోగదారుల వివరాలు, ప్రొడక్ట్స్/సర్వీసుల వివరాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ సమయంలో చిన్న పొరపాటు జరిగినా వెబ్‌సైట్ హ్యాకింగ్‌కి గురయ్యే ప్రమాదం ఉంది. అదే గనుక జరిగితే సంస్థ వివరాలు క్షణాల్లో హ్యాకర్లకు చేతికి చేరతాయి.
సైబర్ సెక్యూరిటీ రంగం - ముఖ్యాంశాలు
- ప్రస్తుతం ఇండియన్ ఐటీ మార్కెట్ విలువ 150 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇందులో సైబర్ సెక్యూరిటీ సేవల వాటా 3 బిలియన్ డాలర్లు.
- 2025 నాటికి భారత ఐటీ మార్కెట్ 350 బిలియన్ డాలర్లకు; సైబర్ సెక్యూరిటీ సేవల వాటా 10 శాతానికి చేరుతుందని అంచనా.
- గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ మార్కెట్ 2025 నాటికి 200 బిలియన్ డాలర్లకు చేరనుందని అంచనా. ఇందులో సైబర్ రంగం వాటా 120 బిలియన్ డాలర్లు.
- భారత్‌లో 2019 నాటికి 60 లక్షల మంది సైబర్ సెక్యూరిటీ నిపుణులు అవసరమని అంచనా.
- ప్రపంచవ్యాప్తంగా 2025 నాటికి 5 కోట్ల మంది సైబర్ సెక్యూరిటీ నిపుణుల అవసరం ఉంటుందని అంచనా.
- జేఎన్‌టీయూ - హైదరాబాద్
వెబ్‌సైట్: www.jntuh.ac.in
- ఐఐఐటీ - అలహాబాద్
వెబ్‌సైట్: www.clis.iiita.ac.in
- సీడాక్ వెబ్‌సైట్: www.cdac.in
- ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ
వెబ్‌సైట్: www.srmuniv.ac.in
- అమిటీ యూనివర్సిటీ
వెబ్‌సైట్: www.amity.edu
- ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ టెక్నాలజీ వెబ్‌సైట్: www.imt.edu
కొలువులకు సర్టిఫికేషన్లు
సైబర్ సెక్యూరిటీ కెరీర్ పరంగా బ్లాక్‌చైన్ టెక్నాలజీ చక్కటి ఉద్యోగ అవకాశాలను అందిస్తోంది. స్కాడా అనే సైబర్ సెక్యూరిటీ సర్టిఫికేషన్‌ను పూర్తిచేయడం ద్వారా ఎయిర్‌పోర్టులు; అణువిద్యుత్; జల విద్యు త్ కేంద్రాలకు సంబంధించిన సమాచారాన్ని భద్రపరిచే కార్య కలాపాల్లో ఉద్యోగ అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. సైబర్ సెక్యూరిటీలో వివిధ స్పెషలైజేషన్ల ద్వారా ఫోరెన్సిక్, నార్కోటిక్స్; ఇంటెలిజెన్స్; ఆర్మీ; నేవీ తదితర ప్రభుత్వ విభాగాల్లో కొలువులు అందుకోవచ్చు.
- డా. కన్నెగంటి రమేష్‌బాబు, ఫౌండర్ అండ్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్, సీహెచ్‌ఎస్‌ఎస్.
Published date : 17 Sep 2018 06:39PM