ఇంజనీరింగ్‌లో ఆ బ్రాంచ్‌లపైనే గురి !
Sakshi Education
ఇంజనీరింగ్‌లో బెస్ట్ కాలేజీలో సీటు రావాలంటే.. టాప్ ర్యాంకు సాధించాలి. కాబట్టి జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్, ఎంసెట్ వంటి ఎంట్రెన్స్ టెస్టుల్లో మంచి ర్యాంకు కోసం అహర్నిశలు కృషి చేయాల్సిందే!
ప్రవేశ పరీక్షల్లో సక్సెస్ సాధించాక.. బీటెక్ బ్రాంచ్‌ల ఎంపికలో ఆచితూచి అడుగులు వేయాల్సిన పరిస్థితి! ఎందుకంటే... ఐఐటీ, ఎన్‌ఐటీ, రాష్ట్ర స్థాయి కాలేజీలు... ఇలా ఇన్‌స్టిట్యూట్ ఏదైనా.. బెస్ట్ బ్రాంచ్‌లో చేరితేనే.. భవిష్యత్‌లో ఉజ్వల కెరీర్ సొంతమవుతుంది. గత రెండు మూడేళ్లుగా.. టాపర్ల దృష్టిలో ‘బెస్ట్’గా నిలుస్తున్న బ్రాంచ్‌ల గురించి తెలుసుకుందాం..
కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ :
గత మూడు, నాలుగేళ్లుగా జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో టాప్ ర్యాంక్ పొందిన విద్యార్థులు సీఎస్‌ఈలోనే చేరారు. దాదాపు అన్ని ఐఐటీల్లోనూ.. జనరల్ కేటగిరీలో 1500లోపు ర్యాంకుతోనే సీఎస్‌ఈ సీట్లు నిండిపోవడమే ఈ బ్రాంచ్‌పై విద్యార్థుల ఆసక్తికి నిదర్శనం. ఐఐటీలే కాకుండా.. ఎన్‌ఐటీలు, రాష్ట్రాల స్థాయిలో నిర్వహించే ఎంసెట్ ర్యాంకర్లది సైతం ఇదే ఆలోచన. యూనివర్సిటీ క్యాంపస్ కళాశాలలు, రాష్ట్రాల స్థాయిలోని టాప్-10, 20 కాలేజీల్లోనూ జనరల్ కేటగిరీలో అయిదు వేల లోపు ర్యాంకుతోనే ఈ బ్రాంచ్‌లో సీట్లు భర్తీ అవుతుండటం విశేషం. ఆటోమేషన్, ఐఓటీ వంటి సరికొత్త టెక్నాలజీ దూసుకొస్తున్న ప్రస్తుత తరుణంలో సీఎస్‌ఈలో చేరి కొత్త నైపుణ్యాలు సొంతం చేసుకొని, అత్యున్నత కెరీర్‌కు బాటలు వేసుకోవచ్చనే దృక్పథం కనిపిస్తోంది. అంతేకాకుండా ఆటోమేషన్ ఫలితంగా వచ్చే మూడేళ్లలో ఐటీ రంగంలో విభిన్న ఉద్యోగావకాశాలు పుట్టుకొస్తాయనే వార్తలు కూడా విద్యార్థులు సీఎస్‌ఈ పట్ల ఆసక్తి చూపడానికి ప్రధాన కారణంగా నిలుస్తోంది.
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ :
ఐఐటీల్లో జనరల్ కేటగిరీలో గత రెండేళ్లుగా సగటున మూడున్నర వేల లోపు ర్యాంకుతో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ (ఈసీఈ) బ్రాంచ్‌లో సీట్లు భర్తీ అవుతుండటం గమనార్హం. నిట్‌లు, రాష్ట్ర స్థాయిలోని ఇన్‌స్టిట్యూట్‌ల కౌన్సెలింగ్‌లలోనూ ఇదే ప్రతిబింబిస్తోంది. జాబ్ మార్కెట్ పరిస్థితులు, ఉన్నత విద్య కోణంలో లభిస్తున్న అవకాశాలే ఈసీఈ పట్ల విద్యార్థుల ఆసక్తి ప్రధాన కారణం. ఇంటర్నెట్, బ్రాడ్ బ్యాండ్, స్మార్ట్ టెక్నాలజీస్, ఐటీసీ అమలు వంటి విధానాలతోపాటు, 5-జి టెక్నాలజీ స్థాయికి టెలికం రంగం విస్తరిస్తోంది. అటు డిజిటల్ ఇండియా, డిజిటైజేషన్, డిజిటల్ లిటరసీ మిషన్ వంటి పలు పథకాలకు నాంది పడింది. దీంతో వచ్చే మూడేళ్లలో ఈ రంగంలో భారీ సంఖ్యలో ఉద్యోగాలు లభించడం ఖాయమని నిపుణుల అంచనా.
ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ :
ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ (ఈఈఈ) బ్రాంచ్ పూర్తిచేసిన విద్యార్థులకు భవిష్యత్తు పరంగా ఆశాజనక పరిస్థితి కనిపిస్తోంది. 2020 నాటికి లక్ష మెగావాట్ల సామర్థ్యం గల విద్యుదుత్పత్తి కేంద్రాల ఏర్పాటు లక్ష్యంగా పెట్టుకోవడం.. ఉజ్వల్ గ్రామ జ్యోతి యోజన వంటి పథకాలు.. ఈ రంగం విస్తరణ కారణంగా.. సమీప భవిష్యత్‌లో 1.5 లక్షల మంది నిపుణుల అవసరం ఏర్పడనుందని ఆయా వర్గాల అంచనా. 2020 నాటికి ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తిలో స్వదేశీ ఉత్పత్తులకు పెద్దపీట వేయాలనే దిశగా అడుగులు పడుతున్నాయి. ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల పరంగా.. స్వదేశీ ఉత్పత్తులను 40శాతం నుంచి 50 శాతం మేర ఉండేలా ప్రణాళికలు రూపొందుతున్నాయి.
సివిల్ ఇంజనీరింగ్ :
ఐఐటీలు, నిట్‌ల్లో మంచి ర్యాంకులు సాధించిన ఎంతో మంది సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్‌ను ఇష్టంగా ఎంచుకుంటున్నారు. ఈ రంగంలో కొత్త టెక్నాలజీ, విధానాలు అమలవుతూ సరికొత్త అవకాశాలు విద్యార్థుల ముంగిట నిలుస్తున్నాయి. మౌలిక రంగం, నిర్మాణ రంగంలో కట్టడాలు.. డిజైన్లకు సంబంధించి మూల భావనలు, నైపుణ్యాలు అందించడం సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ ప్రధాన స్వరూపం. ఇటీవల కాలంలో జీపీఎస్, అర్బన్ డెవలప్‌మెంట్ వంటి వాటి రూపకల్పనకు ఆధారం సివిల్ ఇంజనీరింగ్ మౌలిక సూత్రాలే. విస్తరిస్తున్న నిర్మాణం రంగం, భారీ ప్రాజెక్టులు, హౌసింగ్ ఫర్ ఆల్ బై 2022, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన వంటి పథకాలు... సివిల్ ఇంజనీరింగ్ అభ్యర్థులకు అవకాశాలను విస్తరించడం ఖాయంగా కనిపిస్తోంది. రియల్టీ రంగంలో కార్పొరేట్ సంస్థలు అడుగుపెట్టడం కూడా ఈ బ్రాంచ్ అభ్యర్థుల భవిష్యత్తుకు భరోసాగా నిలుస్తోంది. సివిల్ ఇంజనీరింగ్‌కు అనుబంధంగా పేర్కొనే ఆర్కిటెక్చర్, డిజైన్ విభాగాల్లో వేల మంది నిపుణుల అవసరం ఏర్పడనుంది. ఈ బ్రాంచ్‌లో రాణించాలంటే.. డిజైన్, ప్లానింగ్, కన్‌స్ట్రక్షన్, క్వాలిటీ కంట్రోల్, నిర్వహణ పరమైన అంశాలు నేర్పించే సివిల్ ఇంజనీరింగ్‌లో ఆయా అంశాలపై పట్టు సాధిస్తే.. భవిష్యత్తులో విస్తృత అవకాశాలు సొంతమవడం ఖాయమని అంచనా.
మెకానికల్ ఇంజనీరింగ్ :
రోబోటిక్స్ విభాగంలో వచ్చే అయిదేళ్లలో భారీ సంఖ్యలో ఉద్యోగాలు లభిస్తాయనే వార్తలు గత రెండేళ్లుగా విద్యార్థులు మెకానికల్ బ్రాంచ్ వైపు మొగ్గు చూపేలా చేస్తున్నాయి. మరోవైపు మేకిన్ ఇండియా, స్కిల్ ఇండియా, స్టార్టప్ ఇండియా తదితర పథకాల అమలు ఫలితంగా 2020 నాటికి దాదాపు లక్ష మంది మెకానికల్ ఇంజనీరింగ్ పట్టభద్రుల అవసరం ఏర్పడనుందని అంచనా. చిన్న, మధ్య తరహా సంస్థల నుంచి భారీ ఉత్పత్తి సంస్థల వరకు తమ ఉత్పత్తి కార్యకలాపాలు విస్తరించే అవకాశం కనిపిస్తోంది. అలాగే కొత్త సంస్థల ఏర్పాటు ఊపందుకుంటే మరిన్ని ఉద్యోగాలు పుట్టుకొస్తాయి. మెకానికల్ ఇంజనీరింగ్ రంగంలో అవకాశాలు అందిపుచ్చుకోవాలంటే.. అకడమిక్ స్థాయిలోనే బేసిక్ నైపుణ్యాలైన డిజైన్, డ్రాయింగ్, డ్రాఫ్టింగ్ వంటి వాటిపై పరిపూర్ణత అవసరం. వీటితోపాటు రోబోటిక్స్, క్యాడ్, క్యామ్, 3-డి డిజైన్ టెక్నాలజీస్ వంటి ఆధునిక సాఫ్ట్‌వేర్ ఆధారిత మెకానికల్ ఇంజనీరింగ్ నైపుణ్యాలు తప్పనిసరి. ఇలా కోర్+లేటెస్ట్ స్కిల్స్ పొందిన అభ్యర్థులకే సంస్థలు ప్రాధాన్యమిస్తున్నాయి.
ఇంజనీరింగ్ ఫిజిక్స్, కెమికల్ ఇంజనీరింగ్ :
ముఖ్యంగా భవిష్యత్తులో రీసెర్చ్‌వైపు అడుగులు వేయాలనుకునే విద్యార్థులు ఎంపిక చేసుకుంటున్న బ్రాంచ్‌లు ఇవి. ఈ బ్రాంచ్‌ల్లోనూ ఐఐటీల్లో ఆరు నుంచి ఏడు వేల లోపు ర్యాంకుతో సీట్లు భర్తీ అవుతున్నాయి. వీటిని అందించే ఐఐటీ క్యాంపస్‌లు కొంత తక్కువగా ఉన్నాయి. భవిష్యత్తు అవకాశాల కోణంలో విశ్లేషిస్తే.. రీసెర్చ్ ఔత్సాహికులకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, ఇందుకోసం అమలు చేస్తున్న పథకాలు అదే విధంగా స్వదేశీ ఉత్పత్తుల రూపకల్పన కోణంలో ఈ బ్రాంచ్‌ల విద్యార్థులకు అవకాశాలు మెండుగా ఉన్నాయి.

Published date : 22 May 2018 05:40PM