ఇంజనీరింగ్.. కొలువులకు కొదవలేదు
Sakshi Education
మన దేశంలో ఏటా 15 లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు బయటికి వస్తున్నారు.. అభివృద్ధి చెందుతోన్న మనలాంటి దేశంలో ఈ పరిణామం స్వాగతించదగిందే.. ఇంతటి భారీ స్థాయి మానవ వనరులను సద్వినియోగం చేసుకునే దిశగా మన పరిశ్రమలు పయనిస్తున్నాయా.. భవిష్యత్‌లో బ్రాంచ్‌ల వారీగా ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉన్న డిమాండ్.. ఏయే రంగాలు అవకాశాల గమ్యాలుగా మారనున్నాయి.. ప్రాచుర్యంలోకి వస్తున్న బ్రాంచ్‌లు.. తదితర అంశాలపై విశ్లేషణ..
ఐటీ రంగం
ఆర్థిక సరళీకృత విధానాలను ప్రవేశపెట్టిన తర్వాత ఐటీ- ఐటీ ఆధారిత పరిశ్రమకు భారత్ పర్యాయ పదంగా నిలిచింది. రెండు దశాబ్దాలలో ఈ రంగంలో 22 లక్షల ఉద్యోగాల సృష్టి జరిగింది. ఈ రంగంలో ప్రస్తుతం 108 అమెరికన్ బిలియన్ డాలర్ల వ్యాపారం జరుగుతోంది. ఇది 2020 నాటికి 220 బిలియన్ డాలర్లకు చేరుకోనుంది. తద్వారా మరో 80 లక్షల ఉద్యోగాల కల్పన జరిగే అవకాశం ఉంది.
టాప్ రిక్రూటర్స్: డీఆర్‌డీఓ, ఇస్రో, భెల్, డీఎంఆర్‌ఓ, సీమెన్స్, టెక్సాస్ ఇన్‌స్ట్రుమెంట్స్, ఇంటెల్, ఫిలిప్స్, మోటోరోలా, శాంసంగ్, ఫ్లెక్సోట్రోనిక్స్, ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, యాక్సెంచర్, హెచ్‌సీఎల్, టెక్ మహీంద్రా.
ఎలక్ట్రికల్
ఇంజనీరింగ్ అత్యధిక మంది ఎంచుకునే బ్రాంచ్. ఇందులో చక్కని భవిష్యత్‌ను సొంతం చేసుకోవాలంటే అప్లికేషన్లను డిజైన్ చేయడం, విద్యుత్ శక్తి సృష్టి, వినియోగం వంటి అంశాలను ఇంజనీరింగ్‌లోని మిగతా బ్రాంచ్‌లకు కూడా అన్వయించే సామర్థ్యాన్ని సొంతం చేసుకోవాలి.
టాప్ రిక్రూటర్స్: భెల్, డీఎంఆర్‌సీ, ఎన్‌హెచ్‌పీసీ, పవర్‌గ్రిడ్, రాష్ట్ర విద్యుత్ సంస్థలు, క్రాంప్టన్ గ్రీవ్స్, సీమెన్స్, హిటాచీ, జిందాల్ స్టీల్-పవర్, రిలయన్స్, ఎల్ అండ్ టీ, టాటా, శాంసంగ్.
అవస్థాపన రంగం
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అత్యంత ప్రాధాన్యతను పొందుతోన్న రంగం.. అవస్థాపన రంగం. ఈ క్రమంలో అవస్థాపన రంగంలో 2020 నాటికి ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు రానున్నాయి. దాంతో 103 మిలియన్ ఉద్యోగ అవకాశాలకు మార్గం ఏర్పడుతుంది. అంతేకాకుండా దీని అనుబంధ రంగాల ద్వారా 22 మిలియన్ల ఉద్యోగుల అవసరం ఏర్పడనుంది.
రసాయన పరిశ్రమ
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా రసాయన అమ్మకాలు 3.4 ట్రిలియన్ డాలర్లు. ఇందులో భారత్ వాటా108 బిలియన్ డాలర్లు. ఇది 2017 నాటికి 224 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చు. పెట్రోల్, రసాయన, పెట్రోకెమ్ పెట్టుబడులను ప్రోత్సహించడానికి ప్రత్యేక ఆర్థిక మండళ్లకు రూపకల్పన జరుగుతున్న తరుణంలో వచ్చే పదేళ్లలో భారతదేశానికి 14 వేల మంది కెమికల్ ఇంజనీర్లు అవసరం. దీని అనుబంధ రంగాలను కలుపుకుంటే వచ్చే ఎనిమిదేళ్లలో 1.9 మిలియన్ల ఉద్యోగుల అవసరం ఏర్పడనుంది.
బయోటెక్నాలజీ పరిశ్రమ
జీవ, సాంకేతికరంగాల సమన్వయమే బయోటెక్నాలజీ. బయోటెక్నాలజీ రంగంలో ప్రపంచంలో మన దేశం 12వస్థానంలోనూ, ఆసియా పసిఫిక్ ప్రాంతం పరిధిలో మూడోస్థానంలోనూ ఉంది. ఈ రంగంలో 2012లో జరిగిన వాణిజ్యం 4.3 బిలియన్ డాలర్లు. ఇది 2017లో 11.6 బిలియన్ డాలర్లకు చేరనుంది. ఫలితంగా అంతేస్థాయిలో మానవ వనరుల అవసరం ఏర్పడనుంది.
టాప్ రిక్రూటర్స్: బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, ఇండియన్ ఆయిల్, గెయిల్, పిరమిల్ హెల్త్‌కేర్, ర్యాన్‌బాక్సీ, హెచ్‌ఎల్‌ఎల్, నిర్మా.
ఆటోమొబైల్-మెకానికల్
దేశంలో ప్రతి ఏటా వృద్ధి కనబరుస్తున్న రంగాల్లో ఆటోమొబైల్ పరిశ్రమ ఒకటి. నూతన సాంకేతిక పరిజ్ఞానం, సరికొత్త డిజైన్లతో మార్కెట్లోకి శరవేగంగా దూసుకొస్తున్న వాహనాలు.. అంతేస్థాయిలో ఉద్యోగాల కల్పనను లిఫ్ట్ చేస్తున్నాయి.
టాప్ రిక్రూటర్స్: మారుతి సుజుకి, అశోక్ లేలాండ్, టాటా, బజాజ్, హీరో గ్రూప్, హ్యుందయ్, క్యాటర్ పిల్లర్, టొయోటా, జీఎం, ఎస్కార్ట్స్, యమహా.
మెకానికల్ ఇంజనీరింగ్
పారిశ్రామిక విప్లవంలో మెకానికల్ ఇంజనీర్ల పాత్ర వెలకట్టలేనిది. అన్ని రంగాలకు సంబంధించిన ఇంజన్ల డిజైనింగ్, తయారీ, నిర్వహణ వంటివి ఈ విభాగం కిందకు వస్తాయి. అలాగే రోబోటిక్స్, శీత లీకరణ కూడా ఇందులోని అంశాలే.
టాప్ రిక్రూటర్స్: భెల్, బీపీసీఎల్, డీఆర్‌డీఓ, ఇండియన్‌ఆయిల్, గెయిల్, ఎన్‌టీపీసీ, అశోక్‌లేలాండ్ హోండా, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతి సుజుకి, టాటామోటార్స్, ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, హెచ్‌సీఎల్, టెక్‌మహీంద్రా, ఎల్‌అండ్‌టీ.
ఎన్‌ఎస్‌డీసీ ప్రకారం వచ్చే ఎనిమిదేళ్లలో ఆటోమోటివ్ రంగంలో 35 మిలియన్ల మంది మానవ వనరులు అవసరం.
సివిల్ ఇంజనీరింగ్
మానవ నిర్మిత పరిసరాలను సృష్టించడంలోనూ, దాన్ని కాపాడటంలోనూ సివిల్ ఇంజనీర్ల పాత్ర ఎంతో కీలకమైనది. దేశంలో అవస్థాపన, మౌలిక రంగాలకు పెద్ద పీట వేస్తున్న తరుణంలో..సంబంధిత విధుల పర్యవేక్షణకు భారీ సంఖ్యలో సివిల్ ఇంజనీర్లు అవసరం. ఎన్‌ఎస్‌డీసీ అంచనా ప్రకారం వచ్చే ఎనిమిదేళ్లలో నిర్మాణ రంగంలో 33 మిలియన్ల మంది, అవస్థాపనా రంగంలో 103 మిలియన్ల మంది, రియల్ ఎస్టేట్ రంగంలో 4.6 మిలియన్ల మంది మానవ వనరులు కావాలి.
టాప్ రిక్రూటర్స్: డీఎంఆర్‌సీ, ఆర్‌ఐటీఈఎస్, జేపీ, జయప్రకాశ్ అసోసియేట్స్, రిలయన్స్ ఇన్‌ఫ్రా, ఎల్‌అండ్‌టీ లాంటి ఇన్ ఫ్రాస్ట్రక్చర్.
ప్రాచుర్యం పొందుతున్న బ్రాంచ్‌లు
ఏరోనాటికల్ /ఏరో స్పేస్ ఇంజనీరింగ్:
టాప్ రిక్రూటర్స్: హెచ్‌ఏఎల్, ఎన్‌ఏఎల్, పౌరవిమానయాన విభాగం, డీఆర్‌డీఓ, ఇస్రో, ఎయిర్ ఇండియా, జెట్.
వ్యవసాయ ఇంజనీరింగ్:
టాప్ రిక్రూటర్స్: అమూల్ డెయిరీ, ఐటీసీ, ఎస్కార్ట్స్, శ్రీరామ్ హోండా, నెస్లే ఇండియా, ప్రోయాగ్రో సీడ్స్, ఫ్రిగోరిఫిక్ అల్లాన.
ఆర్కిటెక్చర్:
టాప్ రిక్రూటర్స్: డీఎల్‌ఎఫ్, ఓమెక్స్, పార్శ్వనాథ్ డెవలపర్స్, యూనిటెక్, మార్ఫోజెనెసిస్, హఫీజ్ కాంట్రాక్టర్, జేపీ, సూపర్‌టెక్
ప్రోడక్షన్ ఇంజనీరింగ్:
టాప్ రిక్రూటర్స్: ఇండియన్ ఆయిల్ , ఓఎన్‌జీసీ, గెయిల్, ఎన్‌టీపీసీ, ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్, బీపీసీఎల్, ఆదిత్య బిర్లా గ్రూప్, అబన్ ఆఫ్‌షోర్ లిమిటెడ్, ఎల్ అండ్ టీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, సెరిలైట్ ఇండస్ట్రీస్.
మైనింగ్ ఇంజనీరింగ్:
టాప్ రిక్రూటర్స్: ఎన్‌ఎండీసీ, ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్, గెయిల్, హెచ్‌పీసీఎల్, కోల్ ఇండియా, ఆర్సెలార్ మిట్టల్, వేదాంత, జిందాల్ స్టీల్, బేకర్ హ్యూగ్స్.
టెక్స్‌టైల్ ఇంజనీరింగ్:
టాప్ రిక్రూటర్స్: ఎల్‌ఎన్‌జే భిల్వారా గ్రూప్, రిలయన్స్ టెక్స్‌టైల్స్, అరవింద్ మిల్స్, రేమండ్స్, బాంబే డైయింగ్ లిమిటెడ్, రాజస్థాన్ పెట్రో సింథటిక్స్.
అవకాశాలను దక్కించుకోవాలంటే
కమ్యూనికేషన్ స్కిల్స్, బృందంగా పనిచేసే సామర్థ్యం, ఇంగ్లిష్ భాషపై పట్టు, నాయకత్వ లక్షణాలు, సంబంధిత రంగంలో వస్తున్న మార్పులను దృష్టిలో ఉంచుకుని పరిస్థితులకనుగుణంగా మలుచుకోవడం వంటి నైపుణ్యాలు ఉంటేనే చక్కని కెరీర్‌ను అందుకోవచ్చు.

Published date : 30 Jan 2014 05:53PM