Skip to main content

గేట్-ప్రయోజనాలు, ప్రిపరేషన్ ప్రణాళిక

గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్) స్కోర్ సహాయంతో ప్రతిష్టాత్మక ఐఐఎస్‌సీ, ఐఐటీ, నిట్‌లు వంటి సంస్థల్లో ఎంఈ/ఎంటెక్, ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశించొచ్చు.
అంతేకాకుండా మెరుగైన గేట్ స్కోర్‌తో ఓఎన్‌జీసీ, ఐవోసీఎల్, ఎన్‌టీపీసీ వంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలనూ చేజిక్కించుకోవచ్చు. ఉన్నత విద్య, ఉద్యోగం... రెండిటికీ బాటలు వేసే గేట్-2016 షెడ్యూల్ విడుదలైంది. దీనిపై ప్రత్యేక కథనం...

గేట్‌తో ఉపయోగాలు:
  • ఐఐఎస్‌సీ, ఐఐటీ, నిట్ వంటి అత్యున్నత విద్యాసంస్థల్లో ఇంజనీరింగ్‌లో పీజీ, నేరుగా పీహెచ్‌డీ చేయొచ్చు.
  • ఉన్నత విద్యా సంస్థల్లో గేట్ స్కోర్ ద్వారా ఎంటెక్/ఎంఈ/ఎంఎస్ చేస్తున్న సమయంలో నెలకు రూ.12,400 ఉపకార వేతనం అందుతుంది.
  • బార్క్, భెల్, ఐవోసీఎల్, ఎన్‌టీపీసీ, పీసీఐఎల్, సెయిల్, గెయిల్, ఓన్‌జీసీ వంటి విభాగాల్లో గేట్ స్కోర్ ఆధారంగా ఉద్యోగాలు పొందొచ్చు.
  • గేట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు (ఇంజనీరింగ్ విభాగాల్లో) సీఎస్‌ఐఆర్ పరిధిలోని లాబొరేటరీల్లో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్‌లకు అర్హులు.
సన్నద్ధత:
  • గేట్-2016 సిలబస్‌కు సంబంధించి ప్రామాణిక పాఠ్యపుస్తకాల నుంచి స్టడీ మెటీరియల్‌ను సేకరించుకోవాలి. కాన్సెప్టులతో సొంతగా నోట్స్ రూపొందించుకోవాలి. ముఖ్యమైన ఫార్ములాలు, నిర్వచనాలను గుర్తుంచుకోవడం ముఖ్యం.
  • ప్రతి కాన్సెప్టు, ఫార్ములా ఆధారంగా సమస్యలను సాధన చేయాలి. వీలైనన్ని ఎక్కువ సమస్యలను సాధించాలి. ఒకసారి చేసిన తప్పు, మరోసారి చేయకుండా చూసుకోవాలి.
  • ప్రిపరేషన్ మొదటి దశలో బేసిక్ ఇంజనీరింగ్ సబ్జెక్టులను అధ్యయనం చేయాలి.
అవి...
ఈసీఈ:
నెట్‌వర్క్ థియరీ
ఈడీసీ- ఈఈఈ: నెట్‌వర్క్ థియరీ, ఎలక్ట్రికల్ మెషీన్స్
ఐటీ/సీఎస్‌ఈ: డిస్క్రీట్ మ్యాథమెటిక్స్, డిజిటల్ లాజిక్
మెకానికల్: ఇంజనీరింగ్ మెషీన్స్, థర్మోడైనమిక్స్
సివిల్: స్ట్రెంథ్ ఆఫ్ మెటీరియల్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్.
  • రెండో దశలో 2016, జనవరి 15లోపు సబ్జెక్టులను ప్రణాళిక ప్రకారం చదవడం పూర్తిచేయాలి. ఆ తర్వాత గత ప్రశ్నపత్రాలు,ఐఈఎస్ ప్రశ్నలను సాధన చేస్తూ, మోడల్ టెస్ట్‌లు రాయాలి. దీనివల్ల ఆత్మస్థైర్యం పెరుగుతుంది.
  • ఇద్దరు లేదా ముగ్గురు కలిసి ప్రిపరేషన్ కొనసాగిస్తే మంచిది. దీనివల్ల ఒక కాన్సెప్టు నుంచి భిన్నరూపాల్లో ప్రశ్నలు ఎలా వస్తాయో తెలుసుకొని, సాధన చేయొచ్చు. అయితే గ్రూప్‌లో ఉన్నవారికి ఆసక్తి, అంకితభావం, ర్యాంకు సాధించాలనే తపన ఉండాలి.

ప్రశ్నలు ఎలా వస్తాయి? గేట్ ప్రశ్నలను ఈ కింది అంశాల ప్రాతిపదికన రూపొందిస్తారు.
  • రీకాల్: సబ్జెక్టులోని నిర్వచనాలు, స్టేట్‌మెంట్లు, ఫార్ములాలు, లాస్‌ను ఆధారంగా చేసుకొని, ప్రశ్నలు రూపొందిస్తారు.
    Eg:
    Energy consumed by pure inductor is?
    a) ½ LI2
    b) LI2
    c) Zero
    d) Infinite
  • కాంప్రెహెన్షన్: ఈ రకం ప్రశ్నలు అభ్యర్థి సబ్జెక్టును ఏ మేరకు అర్థం చేసుకున్నాడనే దాన్ని పరీక్షించేలా ఉంటాయి.
    x1 + 2x2 + x3 + 4x4 = 2
    3x1 + 6x2 + 3x3 + 12x4 = 6.
    following statement is true?
    1) only trival solution x1 = x2 = x3 = x4 = 0
    2) No solution
    3) Unique non-trival solution is exist.
    4) Multiple non-trival solution exist
  • అప్లికేషన్: కాన్సెప్టుల పరిజ్ఞానాన్ని అప్లై చేసి, కంప్యుటేషన్ లేదా లాజికల్ రీజనింగ్ ద్వారా ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది. వీటిలోనే స్టేట్‌మెంట్/డేటా టైప్; కాంబినేషన్ ఆఫ్ ఆప్షన్ కోడ్ టైప్ ప్రశ్నలుంటాయి.

అనాలిసిస్, సింథసిస్:
ఈ ప్రశ్నలకు సమాధానం గుర్తించాలంటే ప్రశ్నలో ఇచ్చిన డేటా, డయాగ్రమ్స్‌లను విశ్లేషించి, పోల్చాల్సి ఉంటుంది.

బ్రాంచ్‌ల వారీగా గేట్-2015 కటాఫ్స్:

బ్రాంచ్

జనరల్

ఓబీసీ

ఎస్సీ/ఎస్టీ/పీడీ

ఈఈఈ

25

22.5

16.67

ఈసీఈ

25

22.5

16.67

సీఎస్ అండ్ ఐటీ

25

22.5

16.67

మెకానికల్

32.73

29.64

21.82

సివిల్

25

22.5

16.67


ప్రముఖ ఐఐటీలు, టాప్-5 బ్రాంచ్‌లు గేట్-2014 కటాఫ్ మార్కులు

ఐఐటీ

సీఎస్

ఈసీ

ఎంఈ

ఈఈ

సివిల్

ఢిల్లీ

890

860

830

770

820

ముంబై

622

768

702

768

588

ఖరగ్‌పూర్

826.5

863

792

784

702

కాన్పూర్

733

772

765

719

400

చెన్నై

833

870

783

773

813

రూర్కీ

734

729

668

584

586

గువహటి

785

795

733

751

714

హైదరాబాద్

789

--

--

674

631

పాట్నా

698

665

584

589

--

గాంధీనగర్

--

--

600

680

525

భువనేశ్వర్

--

743

730

--

--

వారణాసి

--

659

548

--

640


ఆరు వందలకుపైగా స్కోర్ లక్ష్యం:
గేట్ ద్వారా ప్రతిష్టాత్మక ఐఐటీల్లో సీటు ఆశించే విద్యార్థులు ఆరు వందలకు పైగా స్కోర్ సాధించేందుకు కృషి చేయాలి. దాదాపు అన్ని ఇన్‌స్టిట్యూట్‌లు కనీస కటాఫ్‌ను 600గా నిర్దేశిస్తున్నాయి. అప్పుడే మలిదశ ఎంపిక ప్రక్రియ అవకాశాలు మెరుగవుతాయి. ఐఐటీ-ఢిల్లీ, ముంబై వంటి ఇన్‌స్టిట్యూట్‌లలో గత రెండేళ్లుగా ఫైనల్ కటాఫ్ జనరల్ కేటగిరీలో తమ స్పెషలైజేషన్‌ను బట్టి 700 నుంచి 800కుపైగా ఉంటోంది.

అకడమిక్ పుస్తకాలే ఆయుధం
గేట్ గత ప్రశ్నలు, పరీక్ష తీరుతెన్నులను పరిశీలిస్తే.. అకడమిక్ పుస్తకాలే ఆయుధంగా విద్యార్థులు ప్రిపరేషన్‌కు ఉపక్రమించాలి. అందులోని అంశాల మూల భావనలు, కాన్సెప్ట్‌లు, అప్లికేషన్స్ అన్నిటిని క్షుణ్నంగా అవగాహన చేసుకోవాలి. పూర్తిస్థాయిలో గేట్ ప్రిపరేషన్ ప్రారంభించాక.. క్రమం తప్పకుండా రివ్యూ టెస్ట్‌లు, మాక్ టెస్ట్‌లు, మోడల్ టెస్ట్‌లకు హాజరవడం ఎంతో మేలు చేస్తుంది.
- ప్రశాంత్‌గౌడ్, గేట్-2015 65వ ర్యాంకు (ఈసీఈ).
Published date : 14 Aug 2015 01:50PM

Photo Stories