ఏఈఈ సన్నద్ధత మార్గాలు..
దీనిద్వారా గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య విభాగం (రూరల్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్– ఆర్‌డబ్ల్యూఎస్ అండ్ ఎస్)లో 277 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ (సివిల్) పోస్టులు భర్తీ చేయనుంది. వీటికి ఎంపికైనవారు రూ.37,100– 91,450 పే–స్కేల్‌తో వేతనాలు పొందుతారు. ఈ నేపథ్యంలో కీలకమైన పరీక్ష సిలబస్, చదవాల్సిన అంశాలు, అభ్యర్థుల ప్రిపరేషన్‌కు ఉపయుక్త సూచనలు..
పరీక్ష విధానం :
ఆబ్జెక్టివ్ పద్ధతిలో రెండు పేపర్లుగా ఉంటుంది.
రాత పరీక్ష | విభాగం | ప్రశ్నలు | వ్యవధి(ని‘‘ల్లో) | మార్కులు |
పేపర్ – 1 | జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అబిలిటీస్ | 150 | 150 | 150 |
పేపర్ – 2 | సివిల్ ఇంజనీరింగ్ | 150 | 150 | 300 |
ఇంటర్వ్యూ | 50 |
- పేపర్–1.. జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ 150 మార్కులకు
- పేపర్–2.. సివిల్ ఇంజనీరింగ్ (డిగ్రీ స్థాయి) 300 మార్కులకు ఉంటుంది.
- మొత్తం 450 మార్కుల రాతపరీక్షలో నిర్దేశిత మార్కులతో ఉత్తీర్ణులైన వారి నుంచి మెరిట్ జాబితా రూపొందించి 1:2 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ఇది 50 మార్కులకు ఉంటుంది. ఇందులోనూ నిర్దేశిత కనీస అర్హత మార్కులు సాధించడం తప్పనిసరి.
- మొత్తమ్మీద 500 మార్కులకు (450+50).. సాధించిన గరిష్ట మార్కుల ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక చేపడతారు.
గతంలో గెలుపునకు చేరువగా వచ్చి ఆగిపోయినవారు, కొత్తగా గ్రాడ్యుయేషన్ పూర్తయినవారు, ఉద్యోగ సాధనే లక్ష్యంగా ఉన్నవారు.. ఇప్పటినుంచే ప్రిపరేషన్ ప్రారంభిస్తే ఉద్యోగం చేజిక్కించుకోవచ్చు. ఈ నేపథ్యంలో పేపర్లవారీగా విశ్లేషణ..
పేపర్–1 : జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్
- ఇందులో జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్, ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ వంటి అంశాల మీద ప్రశ్నలు వస్తాయి. వీటితోపాటు తెలంగాణ చరిత్ర, ఎకానమీ సబ్జెక్టులపై ఎక్కువ దృష్టి సారించాలి. తెలంగాణలో జరుగుతోన్న డెవలప్‌మెంట్స్‌ను నిశితంగా పరిశీలించాలి. వాటికి సంబంధించి పూర్తి డేటా సేకరించుకుని చదవాలి. (ఉదాహరణకు.. ఇటీవల ఇమేజ్ సెంటర్‌కు శంకుస్థాపన చేశారు. దాన్ని ఎక్కడ స్థాపించనున్నారు?, ఈ ప్రాజెక్టు లక్ష్యం ఏమిటి? ప్రత్యేకతలు ఏమిటి? ఎప్పటికల్లా పూర్తి చేస్తారు?)
- అదేవిధంగా మెగా టెక్స్‌టైల్ పార్కు, జిల్లాల విభజన, జిల్లాల ప్రత్యేకతలపై అవగాహన ఏర్పరచుకోవాలి.
- తెలంగాణ కళలు, సంస్కృతి, వారసత్వం, తెలంగాణ ప్రభుత్వ విధానాలపై తప్పనిసరిగా ప్రశ్నలుంటాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని కీలక ప్రాజెక్టులు, పర్యాటక ప్రదేశాలు, చారిత్రక స్థలాలు, పండుగలు, విశిష్టతలు, ఆచార సంప్రదాయాలు, చారిత్రక కోటలపై ప్రశ్నలడిగే అవకాశముంది.
- వీటితోపాటు జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలపై దృష్టిసారించాలి. ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌లపై ప్రశ్నలు వస్తాయి.
- మరో కీలక విభాగం.. జనరల్ ఎబిలిటీస్‌లో లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్. వీటి ప్రిపరేషన్‌కు సంబంధించి ఇప్పటివరకు టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన గత పరీక్షల ప్రశ్నపత్రాలను పరిశీలించాలి. ఏ అంశం నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయో గమనించి వాటిపై ఎక్కువగా దృష్టిసారించాలి. ఇంగ్లిష్‌లో ప్రాథమిక పరిజ్ఞానాన్ని పరీక్షించే విధంగానే పేపర్ ఉంటుంది. కాబట్టి గ్రామర్‌పై పట్టు అవసరం.
- పేపర్–1లో మంచి మార్కులు సాధించేందుకు.. రోజూ పత్రికలు చదువుతూ ముఖ్యాంశాలు రాసుకోవాలి. సొంతంగా నోట్స్ తయారీతో అంశాలు సులువుగా గుర్తుంటాయి. జీఎస్‌పై పట్టు కోసం స్నేహితులతో చర్చించడం లాభిస్తుంది. పునశ్చరణకు తప్పనిసరిగా సమయం కేటాయించాలి.
రిఫరెన్స్ పుస్తకాలు...
ఇండియన్ జాగ్రఫీ : డి.ఆర్.ఖుల్లర్, ఇండియాస్ స్ట్రగుల్ ఫర్ ఫ్రీడం: బిపిన్ చంద్ర, ఇండియన్ ఎకానమీ:రమేష్‌సింగ్, ఇండియన్ పాలిటీ: లక్ష్మీకాంత్, తెలంగాణ హిస్టరీ: తెలుగు అకాడమీ పుస్తకం లేదా ప్రామాణిక పుస్తకాలు ఉపకరిస్తాయి. వీటితోపాటు ఏదైనా కరెంట్ ఎఫైర్స్ మ్యాగజైన్ చదవడం లాభిస్తుంది
పేపర్–2: సివిల్ ఇంజనీరింగ్
విజయావకాశాలను తేల్చే పేపర్ ఇది. ఇందులో ప్రశ్నల సంఖ్య 150. ప్రశ్నకు రెండు మార్కులు.. అంటే 300 మార్కులు ఈ పేపర్ కే కేటాయించారు. అభ్యర్థులు సివిల్ ఇంజనీ రింగ్ పేపర్‌కు సంబంధించి సరైన మెటీరి యల్ సేకరించుకుని ప్రిపరేషన్ సాగిం చాలి. నోటిఫికేషన్‌లో ఉన్న సిలబస్‌ను క్షుణ్నం గా పరిశీలించాలి. ఇప్పటికే గేట్ లాంటి పరీక్షలకు సన్నద్ధమవుతున్నవారికి కొంతమేర సులువవు తుంది. కొత్తగా ప్రారంభించేవారు సరైన ప్రణాళికతో చదివితే విజయం సాధించవచ్చు.
ముఖ్య సూచనలు...
- అభ్యర్థులు మొదట తమకు పట్టున్న టాపిక్స్‌ను తీసుకుని వాటికి సంబంధించిన వర్కింగ్ ప్రిన్సిపుల్స్, ఆపరేషన్స్, ఫార్ములా, అప్లికేషన్స్, ప్రయోజనాలు, రేటింగ్స్, ఉదాహరణలు మొదలైనవి చదవాలి.
- పాఠ్య పుస్తకాలతో పాటు గత ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్, గేట్ ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేయాలి.
- వీలైనన్ని మాక్ టెస్ట్‌లు రాయడం ఉపయోగపడుతుంది.
- పరీక్షలో ఎలాంటి రుణాత్మక మార్కులు లేవు.
- గత పరీక్షలో ఇచ్చిన ప్రశ్నలను జాగ్రత్తగా చదివి విశ్లేషించుకోవడం ముఖ్యం.
విద్యార్హత: సివిల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ లేదా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఇన్ సివిల్ నిర్వహించిన ఏఎంఐఈ పరీక్షలో సెక్షన్ ‘ఎ’, ‘బి’ ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తుల ప్రారంభం: నవంబర్ 24, 2017
దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబర్ 16, 2017
రిఫరెన్స్ పుస్తకాలు...
ఆర్‌ఎస్ కుర్మీ, గుప్తా అండ్ గుప్తా, ఆర్.అగోర్, డాక్టర్ పి.జయరాంరెడ్డి పుస్తకాలు ఉపయుక్తంగా ఉంటాయి.
– పి. శ్రీనివాసులు రెడ్డి, సీఎండీ, వాణి ఇన్‌స్టిట్యూట్