బీటెక్ తర్వాత దారులెన్నో...
Sakshi Education
మనదేశంలో ప్రతి ఏటా కొన్ని లక్షల మంది విద్యార్థులు నాలుగేళ్ల ఇంజనీరింగ్ కోర్సు పూర్తిచేసుకుంటున్నారు. వీరిలో చాలామందికి తమ భవిష్యత్ కెరీర్‌పై స్పష్టత ఉండటం లేదు.
ఉన్నత విద్యవైపు అడుగులు వేయాలా? ఉన్నతోద్యోగం వైపు దృష్టి సారించాలా? ఈ రెండింటిలో ఏది మంచిది అనే సందేహంతో ఉంటారు. ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్ పూర్తిచేసిన విద్యార్థులకు ఉండే ఉన్నత విద్యా, ఉద్యోగావకాశాలపై విశ్లేషణ..
ఉన్నత విద్య
ఎంటెక్
బీటెక్ పూర్తయ్యాక ఉన్నత విద్యనభ్యసించాలంటే మనదేశంలో, విదేశాల్లో అనేక అవకాశాలున్నాయి. మనదేశంలో గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్) రాసి ఐఐటీలు, ఎన్‌ఐటీలు, వివిధ కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో ఎంఈ/ఎంటెక్ కోర్సులు అభ్యసించొచ్చు. గేట్ ఉత్తీర్ణతతో ఎంఈ/ఎంటెక్‌లో చేరితే ప్రతి నెలా స్కాలర్‌షిప్ కూడా పొందొచ్చు. ఆర్థిక ఇబ్బందులతో ఉన్నత విద్యకు దూరమయ్యేవారికి కొన్ని కార్పొరేట్ సంస్థలు, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ), డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డీఎస్‌టీ) వంటి సంస్థలు చేయూతనందిస్తున్నాయి. భారీ మొత్తాల్లో స్కాలర్‌షిప్‌లు, ఫెలోషిప్‌లు అందిస్తున్నాయి.
మరిన్ని వివరాలకు www.ugc.ac.in , www.dst.gov.in చూడొచ్చు. వివిధ బ్యాంకులు కూడా విద్యా రుణాలను అందిస్తూ బాసటగా నిలుస్తున్నాయి.
విదేశీ విద్య
బీటెక్ పూర్తిచేసిన విద్యార్థుల్లో ఎక్కువ మంది లక్ష్యం విదేశాల్లో ఉన్నతవిద్యనభ్యసించడమే అంటే అతిశయోక్తి కాదు. విదేశాల్లో చదవాలంటే జీఆర్‌ఈ, టోఫెల్ వంటి పరీక్షలు రాసి అందులో మంచి స్కోర్ సాధించాలి. తర్వాత ఆసక్తి ఉన్న స్పెషలైజేషన్‌ను ఎంపిక చేసుకుని చేరాలనుకుంటున్న యూనివర్సిటీకి ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలి. ఈ క్రమంలో ముందుగానే పాస్‌పోర్ట్‌ను సిద్ధం చేసి ఉంచుకోవాలి. సంబంధిత యూనివర్సిటీలో ప్రవేశం ఖరారయ్యాక వీసాకు దరఖాస్తు చేసుకోవాలి.
మరిన్ని వివరాలకు www.ets.org/toefl , www.ets.org/gre చూడొచ్చు.
మేనేజ్‌మెంట్ కోర్సులు
బీటెక్ పూర్తిచేసిన విద్యార్థుల్లో ఎక్కువ మంది చూపు మేనేజ్‌మెంట్ కోర్సులపైనే ఉంటుంది! కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్), మేనేజ్‌మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (మ్యాట్), జేవియర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (ఎక్స్‌ఏటీ), కామన్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్ట్ (సీమ్యాట్) వంటి ప్రవేశ పరీక్షలు రాసి బీస్కూళ్లలో ఎంబీఏ/పీజీడీఎం కోర్సులు అభ్యసించొచ్చు. అయితే మిగతా మేనేజ్ మెంట్ ఎంట్రెన్స్ టెస్టుల కంటే క్యాట్‌కు ఎక్కువ మంది విద్యార్థులు హాజరవుతుంటారు. ఎందుకంటే ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)ల్లో పీజీ మేనేజ్‌మెంట్ కోర్సులు అభ్యసించాలంటే క్యాట్‌లో స్కోర్ తప్పనిసరి. మన రాష్ట్రంలో ఎంబీఏ కోర్సులు అభ్యసించాలంటే ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఐసెట్)లో ర్యాంకు సాధించాలి. దీని ద్వారా రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల పరిధిలో ఉన్న కళాశాలల్లో ఎంబీఏ చదవొచ్చు.
విదేశాల్లో మేనేజ్‌మెంట్ కోర్సులు అభ్యసించాలంటే గ్రాడ్యుయేట్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్ట్ (జీమ్యాట్) లాంటి పరీక్షల్లో మంచి స్కోరు సాధించాలి. విదేశాలనగానే చాలామందికి అమెరికా మాత్రమే గుర్తుకు వస్తుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా, యూరప్ దేశాల్లోనూ మంచి విశ్వవిద్యాలయాలున్నాయి. వాటిని కూడా విద్యార్థులు పరిశీలించి మంచి యూనివర్సిటీని ఎంపిక చేసుకోవాలి. ఇందుకోసం సంబంధిత యూనివర్సిటీల వెబ్‌సైట్లతోపాటు కెరీర్ ఓరియెంటెడ్ వెబ్‌పోర్టళ్లను చూడాలి.
పీహెచ్‌డీ
ఏ దేశమైనా అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్లాలంటే ఆవిష్కరణలు జరగాలి. ఈ అవసరాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పరిశోధనలకు భారీ మొత్తంలో నిధులను కేటాయిస్తోంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డీఎస్‌టీ), డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ (డీబీటీ), యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ), కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్‌ఐఆర్) వంటి వాటి ద్వారా పరిశోధనలకు పెద్దపీట వేస్తోంది. అంతేకాకుండా ఐఐటీలు, ఎన్‌ఐటీలు, వివిధ కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఫ్యాకల్టీ కొరతతో సతమతమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పీహెచ్‌డీ కోర్సులు అభ్యసిస్తే అద్భుతమైన కెరీర్‌ను సొంతం చేసుకోవచ్చు. వివిధ పరిశోధనశాలల్లో శాస్త్రవేత్తగా పనిచేయొచ్చు. అదేవిధంగా వర్సిటీల్లో ఫ్యాకల్టీగా విధులు నిర్వర్తించవచ్చు. ప్రతి ఏటా సీఎస్‌ఐఆర్ నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్)లో జేఆర్‌ఎఫ్ సాధించి దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ సంస్థల్లో పీహెచ్‌డీ చదువుతూ మొదటి రెండేళ్లు నెలకు * 25 వేల స్కాలర్‌షిప్ పొందొచ్చు. ఆ తర్వాత మూడో ఏడాది నుంచి సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ హోదా కల్పిస్తారు. అంతేకాకుండా ప్రతినెలా * 28,000 స్కాలర్‌షిప్ లభిస్తుంది. ఇతర ఖర్చులకోసం ప్రతి ఏటా కాంటిన్‌జెన్సీ గ్రాంట్‌ను చెల్లిస్తారు. జేఆర్‌ఎఫ్, ఎస్‌ఆర్‌ఎఫ్ కలిపి మొత్తం ఐదేళ్లపాటు స్కాలర్‌షిప్ అందిస్తారు.
ఉద్యోగాలు
ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ప్రముఖ విద్యా సంస్థల్లో బీటెక్ చదివినవారు మంచి ఉద్యోగావకాశాలు దక్కించుకుంటున్నారు. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఏడాదికి లక్షల జీతాలతో ఎంపికవుతున్నారు. కానీ అంతగా పేరులేని కళాశాలల్లో చదివిన విద్యార్థులు సరైన ఉద్యోగావకాశాలను దక్కించుకోలేకపోతున్నారు. కోరుకున్న ఉద్యోగం పొందాలంటే అభ్యర్థికి కంపెనీలు ఆశిస్తున్న స్కిల్స్ ఉండడం తప్పనిసరి. కాబట్టి ప్రతి విద్యార్థి కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, ఇంటర్‌పర్సనల్ స్కిల్స్ వంటివాటిని పెంపొందించుకోవాలి.
టీచింగ్
కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ఉన్నత విద్య అవసరాన్ని గుర్తించాయి. ఈ దిశగా ఎన్నో విశ్వవిద్యాలయాలను నెలకొల్పాయి. ప్రైవేటు రంగంలో అనుమతించిన విశ్వవిద్యాలయాలే కాకుండా, రానున్న ఐదేళ్లకాలంలో మరిన్ని విద్యా సంస్థలు ఏర్పాటు కానున్నాయి. వీటన్నింటిలో బోధన రంగంలో అపార అవకాశాలున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే రానున్న కాలంలో ఎక్కువ ఉద్యోగాలు బోధన రంగంలోనే ఉంటాయన్నది నిర్వివాదాంశం. ఎంఈ/ఎంటెక్/పీహెచ్‌డీ పూర్తిచేస్తే అపార అవకాశాలు దక్కించుకోవచ్చు.
ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్
ఇంజనీరింగ్ పట్టభద్రులకు.. చక్కటి అవకాశం ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) జాతీయ స్థాయిలో ప్రతి ఏటా నిర్వహించే.. ఈ పరీక్షలో విజయం సాధిస్తే.. ప్రభుత్వ రంగంలో గ్రూప్-ఏ, బీ ఆఫీసర్లుగా కెరీర్ ప్రారంభించే అద్భుత అవకాశం సొంతమవుతుంది. ఇంజనీరింగ్‌లో చేరిన మొదటి ఏడాది నుంచే ఈ పరీక్షకు సిద్ధమైతే సులువుగా విజయం సాధించొచ్చు. తద్వారా అత్యున్నత స్థాయికి చేరొచ్చు. ఈ పరీక్ష ద్వారా ఈ కింది విభాగాల్లో వివిధ పోస్టులను భర్తీ చేస్తారు.
భర్తీ చేసే విభాగాలు..

- ఇండియన్ రైల్వే సర్వీస్ అ ఇండియన్ రైల్వే స్టోర్ సర్వీస్
- సెంట్రల్ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ సర్వీస్
- ఇండియన్ నేవల్ ఆర్మమెంట్ సర్వీస్
- సెంట్రల్ పవర్ ఇంజనీరింగ్ సర్వీస్
- బోర్డర్ రోడ్స్ ఇంజనీరింగ్ అ ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్
అర్హత: సంబంధిత బ్రాంచ్‌లో బీటెక్/బీఈ ఉత్తీర్ణత.
వయోపరిమితి: ప్రకటనలో నిర్దేశించిన తేదీ నాటికి 21-30 ఏళ్లు. మొత్తం నాలుగు బ్రాంచ్‌ల్లో ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌ను నిర్వహిస్తారు. అవి.. సివిల్ (కేటగిరీ-1), మెకానికల్ (కేటగిరీ-2), ఎలక్ట్రికల్ (కేటగిరీ-3) ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ (కేటగిరీ-4).
ఎంపిక: రాత పరీక్ష, పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వ్యూ) అనే రెండు దశల ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.
వెబ్‌సైట్: upsc.gov.in
కొన్ని ప్రవేశ పరీక్షలు
గేట్
దేశంలో ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీలు), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సీ) -బెంగళూరు, నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (నిట్‌లు)లు సహా ఏ ఇన్‌స్టిట్యూట్‌లోనైనా.. గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్) స్కోర్‌తో ఎంటెక్/పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశించొచ్చు. ప్రభుత్వ రంగ కంపెనీలు ప్రాథమిక స్థాయి నియామకాలకు గేట్ స్కోర్‌ను ప్రాతిపదికగా తీసుకుంటున్నాయి. ఎంటెక్‌లో సీటు, ఉద్యోగం.. ఈ రెండు లక్ష్యాలను.. సాధించే అవకాశాన్ని గేట్ కల్పిస్తోంది. ఐఐఎస్‌సీ, ఏడు ఐఐటీలు కలిసి సంయుక్తంగా గేట్‌ను నిర్వహిస్తున్నాయి.
అర్హత: ఇంజనీరింగ్/టెక్నాలజీ/ఆర్కిటెక్చర్ (10+2 తర్వాత నాలుగేళ్లు)లలో బ్యాచిలర్స్ డిగ్రీ. లేదా మ్యాథ్స్/సైన్స్/ స్టాటిస్టిక్స్/కంప్యూటర్ అప్లికేషన్ లేదా తత్సమాన విభాగంలో మాస్టర్ డిగ్రీ/చివరి సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా నిర్దేశించిన విధంగా ఇంజనీరింగ్/టెక్నాలజీ విభాగంలో ఇంటిగ్రేటెడ్ మాస్టర్ డిగ్రీ లేదా ఏఎంఐఈ వంటి ప్రొఫెషనల్ ఇన్‌స్టిట్యూట్ నుంచి బీఈ/బీటెక్ పూర్తి చేసి ఉండాలి.
రిక్రూట్‌మెంట్‌కు కూడా: ప్రతిష్టాత్మక సంస్థ ఆధ్వర్యంలో.. పారదర్శకతతో కూడిన నిర్వహణ కావడంతో పలు పబ్లిక్ సెక్టార్ కంపెనీలు ఎంట్రీలెవల్ రిక్రూట్‌మెంట్ కోసం గేట్ స్కోర్‌ను ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. బార్క్, భారత అణుశక్తి శాఖలోని కొన్ని విభాగాలు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్‌లు.. గేట్ స్కోర్ ఆధారంగానే ఎంట్రీ లెవల్ ఉద్యోగులను భర్తీ చేసుకుంటున్నాయి. రిక్రూట్‌మెంట్స్ కోసం ఆయా సంస్థలకు వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవాలి. గేట్ స్కోరును ప్రామాణికంగా తీసుకున్నప్పటికీ.. పూర్తి స్థాయిలో ఆ స్కోరు ఆధారంగానే అపాయింట్‌మెంట్ ఆర్డర్లు ఇవ్వడం లేదు. అధిక శాతం వెయిటేజీ మాత్రం ఇస్తున్నాయి. దాదాపు 75 శాతం వెయిటేజీని గేట్ స్కోరుకు ఇచ్చి మిగతా 25 శాతం వెయిటేజీని ఇంటర్వ్యూ/ గ్రూప్ డిస్కషన్‌లకు కేటాయిస్తున్నాయి. నోటిఫికేషన్ సమయంలో ఆ వివరాలను వెబ్‌సైట్‌లో పేర్కొంటాయి.
వెబ్‌సైట్: gate.iitk.ac.in/GATE2015/
కామన్ అడ్మిషన్ టెస్ట్
నిర్వహణ:ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎంలు)
అర్హత: 50 శాతం మార్కులతో బ్యాచిలర్‌స డిగ్రీ ఉత్తీర్ణత. ఫైనల్ ఇయర్ చదువుతున్నవాళ్లూ అర్హులే.
ఎంపిక: ఆన్‌లైన్ పరీక్ష, రిటెన్ ఎబిలిటీ టెస్ట్/అకడమిక్ రికార్‌డ/పని అనుభవం/గ్రూప్ డిస్కషన్/ఇంటర్వ్యూల ద్వారా..
పరీక్ష: క్వాంటిటేటివ్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్‌ప్రిటేషన్, వెర్బల్ ఎబిలిటీ అండ్ లాజికల్ రీజనింగ్ అంశాలపై ప్రశ్నలుంటాయి.
ప్రవేశం: మనదేశంలో ఐఐఎంలే కాకుండా దాదాపు ప్రముఖ బిజినెస్ స్కూళ్లన్నీ క్యాట్ స్కోర్‌ను ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. ఐఐటీలు, ఎన్‌ఐటీలు, సెంట్రల్ యూనివర్సిటీల్లో ప్రవేశానికి ఈ స్కోరే ప్రామాణికం.
వెబ్‌సైట్: www.catiim.in
ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్.. స్టార్టప్స్
ఈ మధ్య కాలంలో అందరినోటా వినిపిస్తున్న పదాలు.. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, స్టార్టప్స్. దేశంలోని ప్రముఖ విద్యా సంస్థలైన ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో ప్రత్యేకంగా ఇంక్యుబేషన్ సెంటర్లు, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సెల్ (ఈ-సెల్)లు ఉన్నాయి. ఉద్యోగం కంటే సొంతంగా స్వయం ఉపాధిని పొందాలనుకునేవారికి ఇవి అండగా నిలుస్తున్నాయి. విద్యార్థుల ఆలోచనలు నచ్చితే వ్యాపారాభివృద్ధికి అవసరమైన ఫండింగ్‌ను కల్పిస్తున్నాయి. అంతేకాకుండా స్టార్టప్ ఏర్పాటుకు సహాయ సహకారాలు, విజయవంతం కావడానికి సూచనలు, సలహాలు అందించడంతోపాటు స్టార్టప్స్‌పై వర్‌కషాప్స్ కూడా నిర్వహిస్తున్నాయి. ఐఐటీలు, ఎన్‌ఐటీలే కాకుండా బిట్స్ పిలానీ క్యాంపస్‌లు, ఐఐఐటీ-హైదరాబాద్ వంటి ప్రముఖ విద్యా సంస్థలు కూడా స్టార్టప్స్‌కు మంచి ప్రోత్సాహం అందిస్తున్నాయి.

ప్రస్తుతం జాబ్ మార్కెట్ బాగుంది! ప్రస్తుతం జాబ్ మార్కెట్ ఎంతో బాగుంది. ఇంజనీరింగ్ తర్వాత ఉన్నత చదువులకు వెళ్లాలనుకునేవారు ఎంటెక్ లేదా ఎంబీఏ కోర్సులను అభ్యసించొచ్చు. ఎంటెక్ చేయాలనుకుంటే ఇంజనీరింగ్ పూర్తికాగానే చేయడం మంచిది. ఎంబీఏ చేయాలనుకునేవారు కనీసం రెండేళ్లు ఉద్యోగం చేసి అనుభవం పొందిన తర్వాత తమ చదువును కొనసాగించొచ్చు. దేశంలో ప్రముఖ బీ-స్కూల్స్ సైతం వర్క్‌ఎక్స్‌పీరియన్స్ ఉన్నవారి కోసం ప్రత్యేక మేనేజ్‌మెంట్ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. కోర్సులో భాగంగా కేస్ స్టడీస్‌కు వారి పని అనుభవం ఎంతగానో ఉపయోగపడుతుంది. ‘గేట్’ రాయడం ద్వారా ఉన్నత విద్య అవకాశాలతోపాటు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలకూ దరఖాస్తు చేసుకోవచ్చు. వి. ఉమామహేశ్వర్, ప్లేస్‌మెంట్ అండ్ ట్రైనింగ్ ఆఫీసర్, ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, హైదరాబాద్ |
ఉన్నత విద్యతో మరిన్ని అవకాశాలు! ప్రస్తుత పోటీ ప్రపంచంలో బీటెక్ పూర్తి చేసిన తర్వాత ఉన్నత విద్యనభ్యసిస్తే విస్తృత అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. బీటెక్‌తో ఉద్యోగాల్లో చేరితే కెరీర్‌లో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. ఎంటెక్/ఎంఈ లేదా ఎంబీఏ, ఇతర మేనేజ్‌మెంట్ కోర్సులు అభ్యసిస్తే మరిన్ని అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. పరిశోధనలపై ఆసక్తి ఉన్నవారు ఎంఎస్ కోర్సులనభ్యసించొచ్చు. ప్రఖ్యాత విద్యాసంస్థలు, యూనివర్సిటీల్లో ఉన్నత విద్యనభ్యసిస్తే స్కాలర్‌షిప్స్ కూడా పొందొచ్చు. బీటెక్ పూర్తవగానే స్కిల్స్‌కు పదును పెట్టి లక్ష్య సాధనకు ప్రయత్నించాలి. ప్రొఫెసర్ ఇ. శ్రీనివాస రెడ్డి, డీన్, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, గుంటూరు |
Published date : 02 Feb 2015 12:03PM