అవకాశాల వేదిక...అంతరిక్ష రంగం
Sakshi Education
ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాలనుకునే వారికి అంతరిక్ష రంగం సరైన వేదిక. ఈ రంగంలో మన దేశం ఇప్పటికే ఎన్నో ప్రయోగాలు చేపట్టింది.
అంతరిక్ష రంగ కోర్సులకు ప్రసిద్ది.. ఐఐఎస్‌టీ
అంతరిక్ష రంగానికి సంబంధించిన కోర్సులను అందించడంలో కేరళలోని తిరువనంతపురంలో ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఐఐఎస్‌టీ) ప్రసిద్ధిగాంచింది. పూర్తిస్థాయిలో అంతరిక్ష కోర్సులను ఆఫర్ చేస్తున్న ఈ సంస్థ 2007లో ఏర్పడింది. ఆసియాలోనే ఈ తరహా కోర్సులను అందిస్తున్న తొలి ఇన్‌స్టిట్యూట్‌గా ఐఐఎస్‌టీ గుర్తింపు సాధించింది. ఇందులో యూజీ నుంచి డాక్టోరల్ వరకు వివిధ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. బీటెక్‌లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఏవియానిక్స్ కోర్సులు అందిస్తోంది. వీటి కాల వ్యవధి నాలుగేళ్లు. 75% మార్కులతో (ఎస్సీ, ఎస్టీ, పీడీ అభ్యర్థులకు 65 శాతం) ఇంటర్ (ఎంపీసీ) ఉత్తీర్ణులైన వారు ఈ కోర్సులకు అర్హులు. జేఈఈ అడ్వాన్స్ డ్ స్కోర్ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. అయిదేళ్ల వ్యవధి గల డ్యూయల్ డిగ్రీ (బీటెక్+మాస్టర్ ఆఫ్ సైన్స్ /మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ) కోర్సు కూడా అందుబాటులో ఉంది. పీజీ స్థాయిలో ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రో ఫిజిక్స్; ఎర్‌త సిస్టమ్ సైన్స్ ; సోలిడ్ స్టేట్ ఫిజిక్స్; ఆిప్టికల్ ఇంజనీరింగ్ తదితర స్పెషలైజేషన్లు ఉన్నాయి. మంచి అకడమిక్ రికార్డ్‌తో కోర్సులు పూర్తిచేసుకున్న విద్యార్థులు ఇస్రోలో ఇంజనీర్లుగా, సైంటిస్టులుగా ఉద్యోగావకాశాలు పొందవచ్చు.
కోర్సుల వివరాలు..
బీటెక్ - ఏవియానిక్స్ :
ఇందులో ప్రాథమికంగా ఎలక్ట్రికల్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సిస్టమ్స్‌లో శిక్షణ అందిస్తారు. ఏరోస్పేస్ అప్లికేషన్స్, ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో ప్రాథమిక పరిజ్ఞానం పొందేలా కోర్సు కరిక్యులం ఉంటుంది. కోర్సులో భాగంగా కంట్రోల్ సిస్టమ్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, కంప్యూటర్ సిస్టమ్‌తో పాటు అనుబంధ సబ్జెక్టులను అభ్యసించాలి. శాటిలైట్ సిస్టమ్స్, కంట్రోల్ సిస్టమ్స్, నావిగేషన్ సిస్టమ్స్, లాంచ్ వెహికల్ కంట్రోల్, వీఎల్‌ఎస్‌ఐ సిస్టమ్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్ విభాగాలుంటాయి.
బీటెక్ - ఏరోస్పేస్ ఇంజనీరింగ్ :
ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌కు సంబంధించిన ప్రాథమిక విభాగాల్లో అడ్వాన్డ్స్ నాలెడ్జ్‌ను నేర్చుకునేలా కోర్సును రూపొందించారు. లాంచ్ వెహికల్స్, ఎయిర్ క్రాప్ట్స్, స్పేస్ క్రాప్ట్స్‌ల డిజైన్, డెవలప్‌మెంట్‌పై బోధన ఉంటుంది. ప్రాథమిక స్థాయిలో మెకానిక్స్, సాలిడ్ మెకానిక్స్, థియరీ ఆఫ్ మెషీన్స్, ఏరోస్పేస్ స్ట్రక్చర్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్, ఆటోమేటిక్ కంట్రోల్ గురించి అధ్యయనం చేయాలి.
కెరీర్..
స్పేస్ సైన్స్ కోర్సులు పూర్తిచేసిన వారికి ఇస్రోతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతరిక్ష పరిశోధన సంస్థలు, రాకెట్ ప్రయోగ కేంద్రాల్లో అపార అవకాశాలుంటాయి. కొన్ని ప్రైవేటు సంస్థలు కూడా అంతరిక్ష రంగంలో అడుగుపెడుతున్నాయి. ఇవి అంతరిక్ష పర్యటనలను నిర్వహిస్తున్నాయి. వీటిలోనూ శాస్త్రవేత్తలుగా పనిచేయొచ్చు. అలాగే అమెరికా అంతరిక్ష సంస్థ నాసాలో, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలో కూడా అవకాశాలు పొందొచ్చు. మనదేశంలో ఇస్రో, షార్, డీఆర్‌డీవో తదితర సంస్థల్లో వివిధ విభాగాల్లో శాస్త్రవేత్తలుగా అవకాశాలుంటాయి. మొదట జూనియర్ శాస్త్రవేత్తగా పనిచేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత పనితీరు, అనుభవం బట్టి సీనియర్ శాస్త్రవేత్తగా పదోన్నతి లభిస్తుంది.
పూర్తిస్థాయి అంకితభావంతో పనిచేసేవారు సంబంధిత విభాగం చీఫ్, డెరైక్టర్ స్థాయికి చేరుకోవచ్చు. ఇంకా సైన్స్ మ్యూజియం, ప్లానెటోరియాల్లో, అబ్జర్వేటరీ, స్పేస్ రీసెర్చ్ ఏజెన్సీల్లో, పరిశోధన, అభివృద్ధి కేంద్రాల్లో వివిధ స్థాయిల్లో అవకాశాలుంటాయి.
ఉపాధి వేదికలు..
1. ఐఐటీ-మద్రాస్
వెబ్‌సైట్: www.iitm.ac.in
2. ఐఐటీ-బాంబే
వెబ్‌సైట్: www.iitb.ac.in
3. ఐఐటీ-కాన్పూర్
వెబ్‌సైట్: www.iitk.ac.in
4. ఐఐటీ- ఖరగ్‌పూర్
వెబ్‌సైట్: www.iitkgp.ac.in
గమనిక: ఐఐటీ-ఖరగ్‌పూర్, మద్రాస్.. ఐదేళ్ల బీటెక్-ఎంటెక్ డ్యూయల్ డిగ్రీ కోర్సులను ప్రవేశపెట్టాయి.
తెలుగు రాష్ట్రాల్లో..
ఈ క్రమంలో అంతరిక్ష శాస్త్రం అవకాశాలకు ఆలంబనగా మారింది. స్పేస్‌సైన్స్ కోర్సులు పూర్తిచేస్తే కెరీర్ రాకెట్ వేగంతో దూసుకెళ్లడం ఖాయం. అంతరిక్షానికి సంబంధించిన వివిధ అంశాలను అధ్యయనం చేసేదే స్పేస్ సైన్స్. ఇందులో ఆస్ట్రానమీ, ఆస్ట్రోఫిజిక్స్, గెలాక్టిక్ సైన్స్, స్టెల్లార్ సైన్స్, స్పేస్ డిఫెన్స్, స్పేస్ కొలనైజేషన్, జీఐఎస్, శాటిలైట్ మెటియొరాలజీ, గ్లోబల్ క్లైమేట్, అట్మాస్ఫియరిక్ సెన్సైస్, శాటిలైట్ కమ్యూనికేషన్స్ తదితర స్పెషలైజేషన్లు ఉన్నాయి. ఆస్ట్రోనాట్స్, రాకెట్ సైంటిస్టులు, మెటియోరాలజిస్టులు తదితరులను స్పేస్ సైంటిస్టులుగా వ్యవహరిస్తారు.
రాకెట్ రూపకల్పన నుంచి అంతరిక్షంలోకి ఉపగ్రహాన్ని పంపే వరకూ ఉపగ్రహ వాహక నౌక/రాకెట్ నమూనా డిజైనింగ్ నుంచి తయారీ వరకూ ఎన్నో ప్రక్రియలుంటాయి. అదే విధంగా రాకెట్‌లో వాడే వివిధ యంత్ర పరికరాలు, విడి విభాగాలు ప్రతిదీ కీలకమే. రాకెట్ మండించడానికి ఎంత ఇంధనం కావాలి? కక్ష్యలో ప్రవేశపెట్టడానికి అనుసరించాల్సిన విధివిధానాలు తెలిసి ఉండాలి. తర్వాత ఆ ఉపగ్రహాన్ని సంబంధిత వ్యవస్థలకు అనుసంధానించడం, ఉపగ్రహ పనితీరును పరిశీలించడం ఇలా ప్రతి అంశం కత్తిమీద సామే. ఈ నేపథ్యంలో ప్రతి విభాగంలో సంబంధిత నిపుణుల అవసరం ఏర్పడుతోంది. ఆయా విభాగాలకు తగ్గట్టుగానే రకరకాల కోర్సులనూ యూనివర్సిటీలు అందిస్తున్నాయి.
కెరీర్‌కు మార్గాలు..
ఫిజిక్స్, మ్యాథ్స్ సూత్రాలపై పట్టుండి, ఇంటర్‌లో ఫిజిక్స్, మ్యాథ్స్‌లను ప్రధాన సబ్జెక్టులుగా చదివుండాలి. తర్వాత బీఎస్సీలో మ్యాథ్స్, ఫిజిక్స్, ఎంఎస్సీలో స్పేస్ ఫిజిక్స్, ఆస్ట్రానమీ, ఆస్ట్రో ఫిజిక్స్ తదితర స్పెషలైజేషన్లు ఎంపిక చేసుకోవాలి. ఇంజనీరింగ్ విద్యార్థులైతే బీటెక్‌లో ఏరోనాటికల్/ ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఏవియానిక్స్ తదితర కోర్సులు అభ్యసించాలి. ఆ తర్వాత స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్పెషలైజేషన్‌తో ఎంటెక్ పూర్తిచేయాలి. పీహెచ్‌డీ కూడా పూర్తిచేస్తే అత్యున్నత ఉపాధి అవకాశాలు చేతికందుతాయి. స్పేస్ సైంటిస్టులుగా కూడా ఎదగొచ్చు.
అవసరమైన నైపుణ్యాలు..

- ఫిజిక్స్, మ్యాథ్స్ సూత్రాలపై పట్టు.
- విశ్లేషణాత్మక నైపుణ్యాలు.
- తార్కిక పరిజ్ఞానం.
- కష్టపడి పనిచేయడం, అంకిత భావం.
- ధైర్యసాహసాలు, సహనం.
- సవాళ్లను ఎదుర్కోగల సామర్థ్యం
- నిరంతర అధ్యయనం.
అంతరిక్ష రంగ కోర్సులకు ప్రసిద్ది.. ఐఐఎస్‌టీ
అంతరిక్ష రంగానికి సంబంధించిన కోర్సులను అందించడంలో కేరళలోని తిరువనంతపురంలో ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఐఐఎస్‌టీ) ప్రసిద్ధిగాంచింది. పూర్తిస్థాయిలో అంతరిక్ష కోర్సులను ఆఫర్ చేస్తున్న ఈ సంస్థ 2007లో ఏర్పడింది. ఆసియాలోనే ఈ తరహా కోర్సులను అందిస్తున్న తొలి ఇన్‌స్టిట్యూట్‌గా ఐఐఎస్‌టీ గుర్తింపు సాధించింది. ఇందులో యూజీ నుంచి డాక్టోరల్ వరకు వివిధ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. బీటెక్‌లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఏవియానిక్స్ కోర్సులు అందిస్తోంది. వీటి కాల వ్యవధి నాలుగేళ్లు. 75% మార్కులతో (ఎస్సీ, ఎస్టీ, పీడీ అభ్యర్థులకు 65 శాతం) ఇంటర్ (ఎంపీసీ) ఉత్తీర్ణులైన వారు ఈ కోర్సులకు అర్హులు. జేఈఈ అడ్వాన్స్ డ్ స్కోర్ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. అయిదేళ్ల వ్యవధి గల డ్యూయల్ డిగ్రీ (బీటెక్+మాస్టర్ ఆఫ్ సైన్స్ /మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ) కోర్సు కూడా అందుబాటులో ఉంది. పీజీ స్థాయిలో ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రో ఫిజిక్స్; ఎర్‌త సిస్టమ్ సైన్స్ ; సోలిడ్ స్టేట్ ఫిజిక్స్; ఆిప్టికల్ ఇంజనీరింగ్ తదితర స్పెషలైజేషన్లు ఉన్నాయి. మంచి అకడమిక్ రికార్డ్‌తో కోర్సులు పూర్తిచేసుకున్న విద్యార్థులు ఇస్రోలో ఇంజనీర్లుగా, సైంటిస్టులుగా ఉద్యోగావకాశాలు పొందవచ్చు.
కోర్సుల వివరాలు..
బీటెక్ - ఏవియానిక్స్ :
ఇందులో ప్రాథమికంగా ఎలక్ట్రికల్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సిస్టమ్స్‌లో శిక్షణ అందిస్తారు. ఏరోస్పేస్ అప్లికేషన్స్, ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో ప్రాథమిక పరిజ్ఞానం పొందేలా కోర్సు కరిక్యులం ఉంటుంది. కోర్సులో భాగంగా కంట్రోల్ సిస్టమ్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, కంప్యూటర్ సిస్టమ్‌తో పాటు అనుబంధ సబ్జెక్టులను అభ్యసించాలి. శాటిలైట్ సిస్టమ్స్, కంట్రోల్ సిస్టమ్స్, నావిగేషన్ సిస్టమ్స్, లాంచ్ వెహికల్ కంట్రోల్, వీఎల్‌ఎస్‌ఐ సిస్టమ్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్ విభాగాలుంటాయి.
బీటెక్ - ఏరోస్పేస్ ఇంజనీరింగ్ :
ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌కు సంబంధించిన ప్రాథమిక విభాగాల్లో అడ్వాన్డ్స్ నాలెడ్జ్‌ను నేర్చుకునేలా కోర్సును రూపొందించారు. లాంచ్ వెహికల్స్, ఎయిర్ క్రాప్ట్స్, స్పేస్ క్రాప్ట్స్‌ల డిజైన్, డెవలప్‌మెంట్‌పై బోధన ఉంటుంది. ప్రాథమిక స్థాయిలో మెకానిక్స్, సాలిడ్ మెకానిక్స్, థియరీ ఆఫ్ మెషీన్స్, ఏరోస్పేస్ స్ట్రక్చర్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్, ఆటోమేటిక్ కంట్రోల్ గురించి అధ్యయనం చేయాలి.
కెరీర్..
స్పేస్ సైన్స్ కోర్సులు పూర్తిచేసిన వారికి ఇస్రోతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతరిక్ష పరిశోధన సంస్థలు, రాకెట్ ప్రయోగ కేంద్రాల్లో అపార అవకాశాలుంటాయి. కొన్ని ప్రైవేటు సంస్థలు కూడా అంతరిక్ష రంగంలో అడుగుపెడుతున్నాయి. ఇవి అంతరిక్ష పర్యటనలను నిర్వహిస్తున్నాయి. వీటిలోనూ శాస్త్రవేత్తలుగా పనిచేయొచ్చు. అలాగే అమెరికా అంతరిక్ష సంస్థ నాసాలో, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలో కూడా అవకాశాలు పొందొచ్చు. మనదేశంలో ఇస్రో, షార్, డీఆర్‌డీవో తదితర సంస్థల్లో వివిధ విభాగాల్లో శాస్త్రవేత్తలుగా అవకాశాలుంటాయి. మొదట జూనియర్ శాస్త్రవేత్తగా పనిచేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత పనితీరు, అనుభవం బట్టి సీనియర్ శాస్త్రవేత్తగా పదోన్నతి లభిస్తుంది.
పూర్తిస్థాయి అంకితభావంతో పనిచేసేవారు సంబంధిత విభాగం చీఫ్, డెరైక్టర్ స్థాయికి చేరుకోవచ్చు. ఇంకా సైన్స్ మ్యూజియం, ప్లానెటోరియాల్లో, అబ్జర్వేటరీ, స్పేస్ రీసెర్చ్ ఏజెన్సీల్లో, పరిశోధన, అభివృద్ధి కేంద్రాల్లో వివిధ స్థాయిల్లో అవకాశాలుంటాయి.
ఉపాధి వేదికలు..
- విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్- తిరువనంత పురం.
- ఇస్రో శాటిలైట్ సెంటర్ - బెంగళూరు.
- స్పేస్ అప్లికేషన్ సెంటర్ - అహ్మదాబాద్.
- షార్ - శ్రీహరికోట.
- లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ - తిరువనంతపురం, బెంగళూరు, మహేంద్రగిరి.
- నేషనల్ ఏరోస్పేస్ లేబొరేటరీలు, ఇస్రో శాటిలైట్ ట్రాకింగ్ సెంటర్- బెంగళూరు.
- హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్.
- ఏరోస్పేస్ సిస్టమ్స్.
1. ఐఐటీ-మద్రాస్
వెబ్‌సైట్: www.iitm.ac.in
2. ఐఐటీ-బాంబే
వెబ్‌సైట్: www.iitb.ac.in
3. ఐఐటీ-కాన్పూర్
వెబ్‌సైట్: www.iitk.ac.in
4. ఐఐటీ- ఖరగ్‌పూర్
వెబ్‌సైట్: www.iitkgp.ac.in
గమనిక: ఐఐటీ-ఖరగ్‌పూర్, మద్రాస్.. ఐదేళ్ల బీటెక్-ఎంటెక్ డ్యూయల్ డిగ్రీ కోర్సులను ప్రవేశపెట్టాయి.
తెలుగు రాష్ట్రాల్లో..
- యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్
- ఆంధ్రా యూనివర్సిటీ
- శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ
- జేఎన్‌టీయూ-హైదరాబాద్
- ఉస్మానియా యూనివర్సిటీ
- జేఎన్‌టీయూ-కాకినాడ
Published date : 17 Apr 2018 06:41PM