ఐఐటీల్లో ప్రవేశానికి ఆప్టిట్యూడ్ టెస్ట్!
Sakshi Education
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ).. ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ సాంకేతిక విద్యా సంస్థల్లో ప్రవేశాలకు అమలవుతున్న పరీక్ష విధానం.
మెయిన్, అడ్వాన్స్‌డ్ దశల్లో ఉండే జేఈఈకి ఏటా లక్షల మంది విద్యార్థులు హాజరవుతారు!
జేఈఈ ర్యాంకు కోసం లక్షలు ఖర్చు చేసి, శిక్షణ తీసుకుంటున్న వారెందరో!
వీటన్నిటికీ ఫుల్‌స్టాప్ పెట్టేలా సమూల మార్పులకు కేంద్ర మానవ వనరుల శాఖ శ్రీకారం చుట్టింది. మెయిన్, అడ్వాన్స్‌డ్‌ల స్థానంలో ఒకే పరీక్ష నిర్వహించాలని.. దీనికి అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ప్రామాణిక పరీక్ష (Standardised Aptitude Test) నిర్వహించే యోచనలో ఉంది. ఈ నేపథ్యంలో ప్రతిపాదిత అప్టిట్యూడ్ టెస్ట్, తదుపరి దశ జేఈఈకి ఉపయోగపడే అంశాలపై విశ్లేషణ...
ప్రస్తుతం విద్యార్థులు, తల్లిదండ్రులకు సుపరిచితమైన పదం ‘జేఈఈ’! ఇందులో ఉన్నత ర్యాంకు కోసం ఆరో తరగతి నుంచే పిల్లలకు కోచింగ్ ఇప్పిస్తున్న రోజులివి! ఇలాంటి పరిస్థితుల్లోనే దేశ వ్యాప్తంగా జేఈఈ విధానంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కోచింగ్ తీసుకున్న వారికే ఉపయోగపడే విధంగా పరీక్ష విధానం ఉందని, దీన్ని ఆసరాగా తీసుకొని కోచింగ్ సంస్థలు రూ.కోట్ల వ్యాపారం సాగిస్తున్నాయంటూ నిరసనలు పెల్లుబుకుతున్నాయి. అన్నీ కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఇన్‌స్టిట్యూట్‌లే అయినప్పుడు మెయిన్స్, అడ్వాన్స్‌డ్ పేరుతో రెండు పరీక్షలు ఎందుకన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఇవి విద్యార్థులను ఒత్తిడికి గురిచేస్తున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకున్న కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ.. నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. జేఈఈ విధానంలో మార్పులు, విద్యార్థులకు అనువైన విధానాలు, ప్రతిభావంతులు, నిజమైన ఆసక్తి ఉన్న విద్యార్థులకే ప్రవేశం కల్పించేందుకు అనుసరించాల్సిన విధివిధానాలపై కమిటీ పరిశీలన చేసింది. ఈ కమిటీ ప్రతిపాదనల మేరకు తాజాగా తెరపైకి వచ్చిన పరీక్ష... స్టాండర్డయిజ్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (ఎస్‌ఏటీ).
ఆసక్తిని, అభిరుచిని పరీక్షించేలా
ఎస్‌ఏటీ ప్రధాన ఉద్దేశాలు.. విద్యార్థుల్లో ఇంజనీరింగ్ విద్యను అభ్యసించేందుకు ఉన్న నిజమైన ఆసక్తిని పరీక్షించడం. అదే విధంగా సృజనాత్మక ఆలోచన స్థాయిని, సాంకేతిక విద్యలో ఆవశ్యకమైన ఆవిష్కరణలపై అభిరుచిని పరిశీలించడం. వీటన్నిటికంటే ముఖ్యంగా కోచింగ్‌లతో ర్యాంకులు తెచ్చుకొని, సీట్లు పొందే విధానానికి ఫుల్‌స్టాప్ పెట్టేందుకు ఎస్‌ఏటీ ఉపయోగపడుతుందన్నది నిపుణుల కమిటీ అభిప్రాయం. ఈ క్రమంలో ఎస్‌ఏటీలో పొందుపరిచే అంశాలు/ప్రశ్నలు నాన్-సబ్జెక్ట్ ఓరియెంటేషన్‌తో ఉండాలని కూడా కమిటీ సూచించింది.
కమిటీ సూచనలు
ఎస్‌ఏటీలో ప్రతిభతో
ప్రతిపాదిత ఎస్‌ఏటీలో చూపిన ప్రతిభ, పొందిన స్కోర్లు ఆధారంగా మలి దశలో జేఈఈ (జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్)కు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దాదాపు నాలుగు లక్షల మందిని ఎస్‌ఏటీలో స్కోరు ఆధారంగా జేఈఈకి ఎంపిక చేయాలని కమిటీ సూచించింది. నిపుణుల కమిటీ ప్రతిపాదించిన ఎస్‌ఏటీ తొలి పరీక్ష ఈ ఏడాది ద్వితీయార్థంలోనే జరగొచ్చని చెబుతున్నారు. ఎస్‌ఏటీ నిర్వహణకు ప్రత్యేకంగా నేషనల్ అథారిటీ ఫర్ టెస్టింగ్ సంస్థను నెలకొల్పాలనే ప్రతిపాదన కేబినెట్ ముందుంది. దీనికి కేబినెట్ ఆమోదం తెలిపితే ఈ ఏడాది అక్టోబర్ తర్వాత ఎప్పుడైనా ఎస్‌ఏటీ తొలి పరీక్ష నిర్వహించే అవకాశముంది.
జేఈఈ.. 2017 నుంచి సింగిల్ ఎంట్రన్స్!
ప్రతిపాదిత ఎస్‌ఏటీ ఈ ఏడాది నుంచి అమలైతే 2017 నుంచి జేఈఈ ఒకే పరీక్షగా జరగనుంది. ప్రస్తుతం ఎన్‌ఐటీ, ట్రిపుల్ ఐటీ, ఇతర కేంద్ర ప్రభుత్వ ఇన్‌స్టిట్యూట్‌ల ఔత్సాహికులు జేఈఈ మెయిన్‌కు, ఐఐటీ ఔత్సాహికులు మెయిన్ స్కోరు ఆధారంగా నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు హాజరవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఎస్‌ఏటీకి ఆమోదం లభిస్తే 2017 నుంచి అభ్యర్థులు మెయిన్, అడ్వాన్స్‌డ్ స్థానంలో జేఈఈ పేరుతో ఒకటే పరీక్షకు హాజరయ్యే వెసులుబాటు లభిస్తుంది. ‘సింగిల్ ఎంట్రన్స్’ నిర్వహించాలంటూ చాలా కాలంగా ఉన్న డిమాండ్‌కు పరిష్కారం లభిస్తుంది.
సింగిల్ ఎంట్రన్స్ స్వరూపం
ప్రతిపాదిత సింగిల్ ఎంట్రన్స్ జేఈఈ స్వరూపం అభ్యర్థుల్లోని సబ్జెక్ట్ నాలెడ్జ్‌ను పరీక్షించే విధంగా ఉంటుంది. ఈ క్రమంలో ప్రస్తుత జేఈఈ అడ్వాన్స్‌డ్ మాదిరిగానే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో పేపర్-1, పేపర్-2 పేరుతో రెండు పేపర్లలో పరీక్ష నిర్వహిస్తారు. ఒక్కో పేపర్‌కు 360 మార్కులు చొప్పున మొత్తం 720 మార్కులకు పరీక్ష ఉంటుంది.
మార్పులపై ముందస్తుగా
ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ప్రవేశాలకు సంబంధించి నిపుణుల కమిటీ సూచించిన మార్పులు, ప్రతిపాదనలపై వీలైనంత ముందుగా కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ స్పష్టత ఇవ్వాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. ఫలితంగా విద్యార్థులు తాము సన్నద్ధం కావల్సిన తీరుపై స్పష్టత పొందుతారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2016 ప్రవేశాలకు సంబంధించి చివరి నిమిషం వరకు సింగిల్ ఎంట్రన్స్ అని చెబుతూ... చివరికి యథాతథంగా మెయిన్, అడ్వాన్స్‌డ్‌లను నిర్వహించాలని నిర్ణయించడం వల్ల ఎందరో విద్యార్థులు మానసికంగా ఇబ్బందులకు గురయ్యారనే విషయాన్ని గుర్తుచేస్తున్నారు.
నిపుణుల కమిటీ ఇతర సిఫార్సులు
జేఈఈ ప్రస్తుత విధానం.. మార్పుల తర్వాత
జేఈఈకి సంబంధించి ప్రస్తుతం అమలవుతున్న విధానం.. మార్పులకు ఆమోదం లభించాక అమలవనున్న విధానాలు..
ప్రస్తుత విధానం
కొత్త విధానం

- అమల్లోకి తెచ్చిన సంవత్సరం(తొలి ఏడాది)లో 2 సార్లు. ఆ తర్వాత నుంచి ఏటా నాలుగు సార్లు నిర్వహించాలి.
- పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో ఆప్టిట్యూడ్, ఆటిట్యూడ్, ఇన్నోవేషన్, సైంటిఫిక్ థింకింగ్‌లను పరీక్షించేలా ప్రశ్నలు రూపొందించాలి.
- తొమ్మిదో తరగతి నుంచి పన్నెండో తరగతి (ఇంటర్మీడియెట్) వరకు అన్ని తరగతుల విద్యార్థులు హాజరయ్యేందుకు అవకాశం కల్పించాలి. ఫలితంగా పదో తరగతి పూర్తయ్యేసరికి ఇంజనీరింగ్ విద్యపై ఆసక్తికి సంబంధించి స్పష్టమైన ఆలోచన వస్తుందని అభిప్రాయపడుతున్నారు.
- ఎస్‌ఏటీ స్కోర్ ఆధారంగా నాలుగు లక్షల మందికి జేఈఈ దరఖాస్తులకు అవకాశం కల్పించడం.
- జేఈఈలో ప్రతిభ ఆధారంగా నలభై వేల మందికి ర్యాంకుల కేటాయింపు.
ఎస్‌ఏటీలో ప్రతిభతో
ప్రతిపాదిత ఎస్‌ఏటీలో చూపిన ప్రతిభ, పొందిన స్కోర్లు ఆధారంగా మలి దశలో జేఈఈ (జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్)కు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దాదాపు నాలుగు లక్షల మందిని ఎస్‌ఏటీలో స్కోరు ఆధారంగా జేఈఈకి ఎంపిక చేయాలని కమిటీ సూచించింది. నిపుణుల కమిటీ ప్రతిపాదించిన ఎస్‌ఏటీ తొలి పరీక్ష ఈ ఏడాది ద్వితీయార్థంలోనే జరగొచ్చని చెబుతున్నారు. ఎస్‌ఏటీ నిర్వహణకు ప్రత్యేకంగా నేషనల్ అథారిటీ ఫర్ టెస్టింగ్ సంస్థను నెలకొల్పాలనే ప్రతిపాదన కేబినెట్ ముందుంది. దీనికి కేబినెట్ ఆమోదం తెలిపితే ఈ ఏడాది అక్టోబర్ తర్వాత ఎప్పుడైనా ఎస్‌ఏటీ తొలి పరీక్ష నిర్వహించే అవకాశముంది.
జేఈఈ.. 2017 నుంచి సింగిల్ ఎంట్రన్స్!
ప్రతిపాదిత ఎస్‌ఏటీ ఈ ఏడాది నుంచి అమలైతే 2017 నుంచి జేఈఈ ఒకే పరీక్షగా జరగనుంది. ప్రస్తుతం ఎన్‌ఐటీ, ట్రిపుల్ ఐటీ, ఇతర కేంద్ర ప్రభుత్వ ఇన్‌స్టిట్యూట్‌ల ఔత్సాహికులు జేఈఈ మెయిన్‌కు, ఐఐటీ ఔత్సాహికులు మెయిన్ స్కోరు ఆధారంగా నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు హాజరవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఎస్‌ఏటీకి ఆమోదం లభిస్తే 2017 నుంచి అభ్యర్థులు మెయిన్, అడ్వాన్స్‌డ్ స్థానంలో జేఈఈ పేరుతో ఒకటే పరీక్షకు హాజరయ్యే వెసులుబాటు లభిస్తుంది. ‘సింగిల్ ఎంట్రన్స్’ నిర్వహించాలంటూ చాలా కాలంగా ఉన్న డిమాండ్‌కు పరిష్కారం లభిస్తుంది.
సింగిల్ ఎంట్రన్స్ స్వరూపం
ప్రతిపాదిత సింగిల్ ఎంట్రన్స్ జేఈఈ స్వరూపం అభ్యర్థుల్లోని సబ్జెక్ట్ నాలెడ్జ్‌ను పరీక్షించే విధంగా ఉంటుంది. ఈ క్రమంలో ప్రస్తుత జేఈఈ అడ్వాన్స్‌డ్ మాదిరిగానే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో పేపర్-1, పేపర్-2 పేరుతో రెండు పేపర్లలో పరీక్ష నిర్వహిస్తారు. ఒక్కో పేపర్‌కు 360 మార్కులు చొప్పున మొత్తం 720 మార్కులకు పరీక్ష ఉంటుంది.
మార్పులపై ముందస్తుగా
ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ప్రవేశాలకు సంబంధించి నిపుణుల కమిటీ సూచించిన మార్పులు, ప్రతిపాదనలపై వీలైనంత ముందుగా కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ స్పష్టత ఇవ్వాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. ఫలితంగా విద్యార్థులు తాము సన్నద్ధం కావల్సిన తీరుపై స్పష్టత పొందుతారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2016 ప్రవేశాలకు సంబంధించి చివరి నిమిషం వరకు సింగిల్ ఎంట్రన్స్ అని చెబుతూ... చివరికి యథాతథంగా మెయిన్, అడ్వాన్స్‌డ్‌లను నిర్వహించాలని నిర్ణయించడం వల్ల ఎందరో విద్యార్థులు మానసికంగా ఇబ్బందులకు గురయ్యారనే విషయాన్ని గుర్తుచేస్తున్నారు.
నిపుణుల కమిటీ ఇతర సిఫార్సులు
- ఐఐటీలు జేఈఈ మాక్ పరీక్షల నిర్వహణ వ్యవస్థను ఏర్పాటు చేయాలి.
- విద్యార్థుల్లో ఇంజనీరింగ్, సైన్స్‌పై ఆసక్తి పెరిగేలా పాఠశాల స్థాయి నుంచి చర్యలు తీసుకోవాలి.
- ఎస్‌ఏటీ విధానాన్ని భవిష్యత్తులో మెడికల్ సెన్సైస్, సెన్సైస్, లిబరల్ ఆర్ట్స్ వంటి కోర్సులు, ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రవేశాల విషయంలోనూ అనుసరించాలి.
- కోచింగ్ సెంటర్ల ప్రాధాన్యం తగ్గేలా ఎస్‌ఏటీ పరీక్ష విధానాన్ని రూపొందించాలి.
- ప్రతిపాదిత జేఈఈ (సింగిల్ ఎంట్రన్స్)ని ఆన్‌లైన్లో నిర్వహణకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలి.
జేఈఈ ప్రస్తుత విధానం.. మార్పుల తర్వాత
జేఈఈకి సంబంధించి ప్రస్తుతం అమలవుతున్న విధానం.. మార్పులకు ఆమోదం లభించాక అమలవనున్న విధానాలు..
ప్రస్తుత విధానం
- ఇంటర్మీడియెట్ అర్హతగా జేఈఈ మెయిన్‌కు అవకాశం.
- జేఈఈ మెయిన్‌లో ఉత్తీర్ణత ఆధారంగా రెండు లక్షల మందికి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అవకాశం.
- జేఈఈ అడ్వాన్స్‌డ్ తర్వాత ఆన్‌లైన్ విధానంలో ఉమ్మడి కౌన్సెలింగ్ ద్వారా సీట్ల కేటాయింపు.
- ఐఐటీల్లో దాదాపు 10 వేల మందికి, ఎన్‌ఐటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ ఇన్‌స్టిట్యూట్‌లలో 30 వేల మందికి లభిస్తున్న ప్రవేశం.
కొత్త విధానం
- ఏటా మూడు లేదా నాలుగు సార్లు స్టాండర్డయిజ్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ నిర్వహణ. (తొలి ఏడాది ఒకసారి)
- ఎస్‌ఏటీలో నిర్దేశిత కటాఫ్ స్కోర్ ఆధారంగా సింగిల్ ఎంట్రన్స్ విధానంలో ఉండే జేఈఈకి 4 లక్షల మంది అభ్యర్థుల ఎంపిక.
- జేఈఈలో చూపిన ప్రతిభ ఆధారంగా 40 వేల మందికి ర్యాంకుల కేటాయింపు.
- ఆ ర్యాంకుల ఆధారంగా ఉమ్మడి కౌన్సెలింగ్ ద్వారా ఐఐటీలు, ఇతర ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రవేశం.
- 2017 నుంచే అమలు. ఇందుకోసం 2016 ద్వితీయార్థంలో ఎస్‌ఏటీ తొలి పరీక్ష నిర్వహణకు ప్రయత్నాలు సాగుతున్నాయి.
ఒత్తిడి తగ్గుతుంది ప్రతిపాదిత ఎస్‌ఏటీ విధానం, ఆ తర్వాత దశలో జేఈఈ ఫలితంగా విద్యార్థుల్లో కచ్చితంగా ఒత్తిడి తగ్గుతుంది. ముఖ్యంగా ఎస్‌ఏటీ విధానం వల్ల అటు తల్లిదండ్రుల్లో కూడా తమ పిల్లలకు ఇంజనీరింగ్ విద్యపై ఏ మేరకు ఆసక్తి ఉందనే విషయంపై స్పష్టత వస్తుంది. ప్రస్తుతం ఇంజనీరింగ్ విద్యలో సబ్జెక్ట్ నాలెడ్జ్ కంటే ఇన్నోవేషన్ థింకింగ్‌కు ప్రాధాన్యం పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రతిపాదిత మార్పులతో కచ్చితంగా సత్ఫలితాలు సాధించొచ్చు. - ప్రొఫెసర్ ఆర్.వి.రాజ్‌కుమార్, డెరైక్టర్, ఐఐటీ-భువనేశ్వర్ |
ఎస్‌ఏటీ ప్రతిపాదన మంచిదే, కానీ.. నిపుణుల కమిటీ ప్రతిపాదించిన ఎస్‌ఏటీ విధానం మంచిదే. అభ్యర్థుల్లో ఇంజనీరింగ్, సాంకేతిక విద్యపై ఉన్న ఆసక్తిని పరీక్షించేలా ఎస్‌ఏటీ ఉండాలనే సిఫార్సు, ఫలితంగా బట్టీ పద్ధతులకు స్వస్తి పలకొచ్చు అనే ఆలోచన ఆహ్వానించదగినదే. కానీ.. ఏటా మూడు, నాలుగు సార్లు నిర్వహించాలనే ప్రతిపాదన ఉన్న నేపథ్యంలో ప్రశ్నల్లో నూతనత్వం ఉండేలా చూడాలి. అది లేకుంటే ప్రతిపాదిత ఎస్‌ఏటీకి కూడా కోచింగ్ సెంటర్లు పుట్టుకు రావడం ఖాయం. ఇది మరో పరిశ్రమగా మారుతుంది. అంతేకాకుండా ఎస్‌ఏటీ స్కోరు వ్యాలిడిటీ పీరియడ్, ఇతర విధి విధానాలపై వచ్చే అకడమిక్ సంవత్సరం ప్రారంభానికి ముందు స్పష్టత ఇస్తే 2017 ఔత్సాహికులు అందుకు తగిన విధంగా సన్నద్ధం కావడానికి అవకాశం లభిస్తుంది. - ఆనంద్ కుమార్, సూపర్ 30 వ్యవస్థాపకులు |
Published date : 22 Jan 2016 11:42AM