Skip to main content

Teacher After Inter: ఇంటర్ తర్వాత టీచర్ అవ్వాలా? అయితే డీఈఈ సెట్ మీకో గోల్డెన్ ఛాన్స్!

ఇంటర్మీడియట్ పూర్తి చేసిన అభ్యర్థులకు టీచింగ్ కెరీర్ ప్రారంభించేందుకు డీఈఈ సెట్ (DEECET) 2025 అత్యుత్తమ అవకాశాన్ని అందిస్తోంది. ఈ పరీక్ష ద్వారా అభ్యర్థులు రెండు సంవత్సరాల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (D.El.Ed) కోర్సులో ప్రవేశం పొందవచ్చు. ఈ కోర్సు ద్వారా టెట్, డీఎస్సీ ద్వారా ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలకు దారితీసే మార్గం ప్రారంభమవుతుంది.
Government teaching job opportunities after DEECET   teacher after intermediate   Diploma in Elementary Education (D.El.Ed) course details  DEECET 2025 exam for admission to D.El.Ed course

DEECET 2025 నోటిఫికేషన్ వివరాలు:
కోర్సు పేరు: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (D.El.Ed)

కాలవ్యవధి: 2 సంవత్సరాలు

ప్రవేశం: DEECET 2025 ర్యాంక్ ఆధారంగా ప్రవేశం లభిస్తుంది.

ప్రవేశ వ్యవస్థ: ఉమ్మడి కౌన్సెలింగ్ ద్వారా సీట్ల భర్తీ

డీఈఈ సెట్ అర్హతలు:
విద్యార్హత: ఇంటర్మీడియెట్ లేదా తత్సమాన కోర్సులో కనీసం 50% మార్కులతో ఉత్తీర్ణత (SC/ST/PH అభ్యర్థులకు 45%)

వయస్సు: 2025 సెప్టెంబర్ 1 నాటికి కనీస వయసు 17 ఏళ్లు. గరిష్ట వయోపరిమితి లేదు.

ప్రభుత్వ & ప్రైవేట్ కాలేజీలు:

  • ప్రభుత్వ డైట్ కళాశాలలు: 18
  • ప్రైవేట్ టీచర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్: సుమారు 900
  • కన్వీనర్ కోటా (A Category): 80% సీట్లు
  • మెనేజ్‌మెంట్ కోటా (B Category): 20% సీట్లు

డీఈఈ సెట్ పరీక్ష విధానం:
పరీక్ష రకం: ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్

పరీక్ష మొత్తం మార్కులు: 100

పరీక్ష కాలం: 2.5 గంటలు

పార్ట్ A (60 మార్కులు):

  • టీచింగ్ ఆప్టిట్యూడ్ – 5 మార్కులు
  • జనరల్ నాలెడ్జ్ – 5 మార్కులు
  • ఇంగ్లిష్ – 5 మార్కులు
  • తెలుగు/తమిళం/ఉర్దూ – 10 మార్కులు
  • మ్యాథ్స్ – 10 మార్కులు
  • జనరల్ సైన్స్ – 10 మార్కులు
  • సోషల్ స్టడీస్ – 10 మార్కులు

పార్ట్ B (40 మార్కులు):
అభ్యర్థి ఎంపిక చేసుకునే సబ్జెక్ట్ ఆధారంగా

  • మ్యాథ్స్
  • ఫిజికల్ సైన్స్
  • బయో సైన్స్
  • సోషల్ స్టడీస్

Note:

  • ఎంపీసీ విద్యార్థులు – ఫిజికల్ సైన్స్ / మ్యాథ్స్
  • బైపీసీ విద్యార్థులు – బయో సైన్స్
  • హెచ్ఈసీ విద్యార్థులు – సోషల్ స్టడీస్

ముఖ్య తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తు ముగింపు: 2025 మే 8
ఫీజు చెల్లింపు చివరి తేదీ: 2025 మే 7
హాల్ టికెట్ డౌన్‌లోడ్: 2025 మే 20
పరీక్ష తేదీలు: 2025 జూన్ 2, 3
ఫలితాల విడుదల: 2025 జూన్ 10
అధికార వెబ్‌సైట్: https://cse.ap.gov.in

చదవండి: ఇంటర్ అర్హతతో సీఎస్‌ఐఆర్‌–ఎన్‌ఏఎల్ లో 26 ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా!

ఉత్తమ స్కోర్ కోసం ప్రిపరేషన్ టిప్స్:

టీచింగ్ ఆప్టిట్యూడ్:

  • బోధన శైలులు, క్లాస్‌రూమ్ మేనేజ్‌మెంట్
  • విద్యా చట్టాలపై అవగాహన

జనరల్ నాలెడ్జ్:

  • ప్రస్తుత వ్యవహారాలు, స్టాటిక్ జీకే
  • ముఖ్యమైన అవార్డులు, వ్యక్తులు, చరిత్ర, భూగోళశాస్త్రం

లాంగ్వేజ్:

  • బోధన పద్ధతులు
  • తెలుగు, ఇంగ్లిష్ వ్యాకరణం, స్పీచ్, ఆర్టికల్స్

మ్యాథమెటిక్స్:

  • 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కాన్సెప్ట్స్
  • ఇంటర్ లెవల్ ప్రశ్నల క్లిష్టత

సైన్స్:

  • 3వ తరగతి నుంచి 10వ తరగతి పాఠ్యాంశాలు
  • కాన్సెప్ట్ క్లారిటీ, అప్లికేషన్ అవగాహన

సోషల్ స్టడీస్:

  • రాజ్యాంగం, ఆర్టికల్స్, చరిత్ర, సవరణలు

మాక్ టెస్ట్‌లు, ప్రాక్టీస్ పేపర్లు:

  • పాత ప్రశ్న పత్రాలు, మాక్ టెస్టులు ప్రాక్టీస్ చేయాలి
  • బలాలు, బలహీనతలు గుర్తించి మెరుగుపరచాలి
Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 06 May 2025 03:35PM

Photo Stories