కెరీర్ గైడెన్స్..స్పెషల్ ఎడ్యుకేషన్... అవకాశాలు అపారం
Sakshi Education
మనం ప్రతి ఏటా డిసెంబర్ 3ను ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ డిజేబుల్డ్’ పర్సన్‌సగా నిర్వహించుకుంటాం. మన దేశంలో మానసిక, శారీరక వైకల్యం కలిగిన బాలల సంఖ్య లక్షల్లోనే ఉంది. అలాంటి వైవిధ్య సామర్థ్య బాలలకు.. వారి సామర్థ్యాలకు తగినట్లు శిక్షణనిచ్చి.. వారు కూడా ‘సమాజంలో భాగమే- సమాజానికి భారం కాదు’ అనేలా తీర్చిదిద్దడం చాలా అవసరం. అలా తీర్చిదిద్దేదే స్పెషల్ ఎడ్యుకేషన్. ఇందుకోసం ప్రత్యేక బోధన పద్ధతులు, నైపుణ్యాలు అవసరం. ఆ అవసరాలను తీర్చే కోర్సులే స్పెషల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ కోర్సులు. ఇటీవల కాలంలో క్రమేణా ప్రాధాన్యం సంతరించుకుంటూ పలు స్థాయిల్లో అందుబాటులోకి వచ్చిన స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సులు.. వాటి ద్వారా లభించే కెరీర్ అవకాశాలపై ప్రత్యేక ఫోకస్.
నేటి నేటి బాలలే రేపటి పౌరులు.. అనేది సూక్తి. కానీ ఆ బాలల్లో కొందరు కొన్ని వైకల్యాలతో బాధపడుతుంటారు. ముఖ్యంగా బుద్ధి మాంద్యం, వినికిడి లోపం, దష్టి లోపం, ఆటిజం, లెర్నింగ్ డిజేబిలిటీ వంటి సమస్యలతో బాధపడే వారి సంఖ్య అధికం. ఇలాంటి చిన్నారులకు విద్యా బోధన అందించేందుకు రూపకల్పన చేసిన కోర్సులే స్పెషల్ ఎడ్యుకేషన్ ట్రెనింగ్ కోర్సులు. ఇవి డీఈడీ మొదలు ఎంఈడీ వరకు అందుబాటులో ఉన్నాయి.
ఈ క్రమంలో ప్రభుత్వం ప్రత్యేకంగా రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనే సంస్థను నెలకొల్పింది. ఈ సంస్థ.. స్పెషల్ ఎడ్యుకేషన్ ట్రెనింగ్ కోర్సుల కరిక్యులం విధివిధానాలు, ట్రెనింగ్ సెంటర్లు లేదా ఇన్‌స్టిట్యూట్‌లకు అనుమతులు, పర్యవేక్షణ వంటి కార్యకలాపాలు నిర్వహిస్తుంది.
ఆత్మసంతప్తినిచ్చే.. స్పెషల్ ఎడ్యుకేషన్
సాధారణంగా స్పెషల్ ఎడ్యుకేషన్ అంటే చాలామందికి అవగాహన అంతంతమాత్రమే. కానీ ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ ట్రెనింగ్ పూర్తి చేస్తే.. అవకాశాలు పుష్కలమని చెప్పొచ్చు. ముఖ్యంగా గత దశాబ్ద కాలంలో క్రమేణా ప్రాధాన్యత సంతరించుకుంటోంది స్పెషల్ ఎడ్యుకేషన్ ట్రెనింగ్. బీఈడీ ఉత్తీర్ణులకు మాదిరిగానే అవకాశాలు అందిస్తోంది. అంతేకాకుండా.. వైవిధ్య సామర్థ్యమున్న బాలలకు బోధిస్తున్నామనే ఆత్మసంతప్తిని సైతం అందించే రంగమే స్పెషల్ ఎడ్యుకేషన్ టీచింగ్.
శిక్షణలోనే ‘స్పెషల్’గా..
స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో బోధన నైపుణ్యాలు అందించే శిక్షణ కూడా ప్రత్యేక పద్ధతుల్లో ఉంటుంది. వైవిధ్య సామర్థ్యం గల చిన్నారులను దష్టిలో ఉంచుకుని అందుకు తగిన విధంగా బోధన నైపుణ్యాలపై శిక్షణనిస్తారు. ఈ క్రమంలో ప్రత్యేక పరికరాలు, సూచనలు, పద్ధతుల ద్వారా బోధించే మెళకువలు అందిస్తారు. తద్వారా ఆయా సమస్యలు గల చిన్నారులు సైతం నిరాటంకంగా విద్యాభ్యాసాన్ని కొనసాగించేలా స్పెషల్ ఎడ్యుకేషన్ ట్రెనింగ్ కోర్సులు ఉంటాయి.
మన రాష్ట్రంలో
ఇక.. మన రాష్ట్రంలో రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన 25 సంస్థలు స్పెషల్ ఎడ్యుకేషన్ ట్రెనింగ్ కోర్సులను అందిస్తున్నాయి. కేంద్రప్రభుత్వ పరిధిలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మెంటల్లీ హ్యాండీక్యాప్డ్ క్యాంపస్ కూడా రాష్ట్రంలో ఉంది. ఇందులో పది కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఆంధ్రా యూనివర్సిటీ కూడా స్పెషల్ ఎడ్యుకేషన్‌లో విజువల్ ఇంపెయిర్‌మెంట్ విభాగంలో ఎంఈడీ, బీఈడీ కోర్సు; పద్మావతి మహిళా విశ్వ విద్యాలయం హియరింగ్ ఇంపెయిర్‌మెంట్‌లో బీఈడీ; దూర విద్యా విధానంలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మెంటల్లీ రిటార్డేషన్ స్పెషలైజేషన్‌తో బీఈడీ కోర్సులను అందిస్తున్నాయి. వీటితోపాటు పలు ప్రెవేటు ఇన్‌స్టిట్యూట్‌లు స్పెషల్ ఎడ్యుకేషన్ ట్రెనింగ్ కోర్సులనందిస్తున్నాయి.
విధులిలా
స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు.. వివిధ రకాల సమస్యలున్న విద్యార్థులతో పని చేయాల్సి ఉంటుంది. వీరిలో కొంత మంది మెంటల్ రిటార్డేషన్, ఆటిజంతో బాధపడే వారికి లైఫ్ స్కిల్స్, బేసిక్ లిటరసీ స్కిల్స్ పెంపొందించుకునే విధంగా చైతన్య పరుస్తారు. మరి కొంత మంది స్వల్ప స్థాయి అభ్యసన వైకల్యం గల వారికి సేవలందిస్తారు. అధిక శాతం మంది ఉపాధ్యాయులు ఎలిమెంటరీ, మిడిల్, సెకండరీ స్కూల్ స్థాయిలో బోధిస్తారు. కొంత మంది శిశువుల (infants and toddlers)కు కూడా శిక్షణనిస్తారు.
నిర్దిష్ట్ట అభ్యసన లోపాలు గల పిల్లలు, భాష వైకల్యం (speech or language impairments), బుద్ధి మాంద్యం, భావోద్వేగ సంక్షోభం (emotional disturbance), బహుళ వైకల్యత (multiple disabilities), వినికిడి లోపం, దష్టి లోపాలు, ఆటిజం, మెదడుకు తగిలిన గాయం వల్ల సరిగా ఎదగని పిల్లలు (traumatic brain injury), ఇతర వైకల్యాలతో బాధపడే పిల్లల కోసం స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు చేయూతనిస్తారు.
విద్యార్థులను ఈ విధంగా విభజించి.. వారి అవసరాలకనుగుణంగా ప్రత్యేక విద్యనందిస్తారు. విద్యార్థుల వైకల్యతను ప్రాథమిక స్థాయిలో గుర్తించడమే స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ విధుల్లో కీలకమైంది. ప్రాథమిక స్థాయిలో గుర్తింపు అనేది ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు విద్యను అందించడంలో ముఖ్య భాగమని పేర్కొనొచ్చు.
పలు పద్ధతుల్లో బోధన
స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు.. ప్రత్యేక అవసరాలు గల పిల్లల్లో సామర్థ్యాన్ని పెంపొందించడానికి పలు పద్ధతులను ఉపయోగిస్తారు. వైకల్యతను అనుసరించి వ్యక్తిగతంగా శిక్షణనివ్వడం (Individualized instruction), ప్రాబ్లమ్ సాల్వింగ్ అసైన్‌మెంట్, విద్యార్థులను చిన్న చిన్న సమూహాలుగా విభజించి శిక్షణనివ్వడం వంటి పద్ధతులను వినియోగిస్తారు. ఈ క్రమంలో స్పీచ్ థెరపిస్ట్‌లు, ఆక్యుపేషనల్ థెరపిస్ట్‌లు, ఫిజికల్ థెరపిస్ట్‌లు, స్కూల్ అడ్మినిస్ట్రేటర్లతోపాటు అవసరమైన సందర్భాల్లో సోషల్ వర్కర్స్ సహకారంతో ప్రత్యేక అవసరాలున్న చిన్నారుల అభ్యసన సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి సహాయపడతారు. ఇందుకోసం వారి సామర్థ్యం మేరకు లక్ష్యాలను నిర్దేశిస్తారు. అంతేకాక వారి తల్లిదండ్రులతో కూడా సమన్వయం చేస్తుంటారు.
కెరీర్ అవకాశాలు:
స్పెషల్ ఎడ్యుకేషన్ ట్రెనింగ్ కోర్సులు పూర్తి చేసిన వారికి కోర్సు స్థాయి ఆధారంగా.. ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ థెరపిస్ట్, క్లినికల్ సైకాలజిస్ట్, హియరింగ్ అండ్ ఇయర్ మౌల్డ్ టెక్నీషియన్స్, రిహాబిలిటేషన్ ఇంజనీర్స్ అండ్ టెక్నీషియన్స్, స్పెషల్ టీచర్స్ ఫర్ ఎడ్యుకేటింగ్ అండ్ ట్రెనింగ్ ది హ్యాండిక్యాప్డ్, ఒకేషనల్ కౌన్సిలర్స్, ఎంప్లాయిమెంట్/ ప్లేస్‌మెంట్ ఆఫీసర్స్, మల్టీ పర్పస్ రిహాబిలిటేషన్ థెరపిస్ట్, టెక్నీషియన్స్, స్పీచ్ పాథాలజిస్ట్, రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్, రిహాబిలిటేషన్ సోషల్ వర్కర్స్, రిహాబిలిటేషన్ ప్రాక్టీషనర్స్ ఇన్ మెంటల్ రిటార్డేషన్, ఓరియెంటేషన్ అండ్ మొబిలిటీ స్పెషలిస్ట్స్, కమ్యూనిటీ బేస్డ్ రిహాబిలిటేషన్ ప్రొఫెషనల్స్, రిహాబిలిటేషన్ కౌన్సిలర్స్, అడ్మినిస్ట్రేటర్స్, ప్రోసోథెటిక్స్ అండ్ ఆర్థోథెటిక్స్, రిహాబిలిటేషన్ వర్క్‌షాప్ మేనేజర్స్ వంటి హోదాలు లభిస్తాయి. అంతేకాకుండా విదేశాల్లోనూ అవకాశాలు లభిస్తాయి.
ఉపాధి వేదికలు:
ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, వివిధ స్వచ్ఛంధ సంస్థలు, ట్రస్టుల ఆధ్వర్యంలో నడిచే పాఠశాలలు, సర్వశిక్షా అభియాన్ పరిధిలోని పాఠశాలల్లో టీచర్లు; వివిధ ఆస్పత్రులు, రిహాబిలిటేషన్ సెంటర్లు, రెగ్యులర్ ప్రీస్కూళ్లు, వివిధ పాఠశాలల్లో ప్రత్యేక విద్యార్థుల కోసం కేటాయించిన విభాగాలు స్పెషల్ ఎడ్యుకేషన్ ట్రెనింగ్ పూర్తి చేసుకున్న వారికి ముఖ్య ఉపాధి వేదికలు. దీంతోపాటు ఈసీఎస్‌ఈ/సీఎస్‌ఈల్లో రీసెర్చ్ ప్రాజెక్ట్స్, అంగన్‌వాడీ పాఠశాలలు, ప్రెవేటు ప్రీ స్కూళ్లలో ప్రత్యేక శిక్షణ అవసరమైన చిన్నారులకు కోఆర్డినేటర్‌గా అవకాశాలు లభిస్తాయి. సొంతంగానూ ప్రీ స్కూల్‌ను నిర్వహించవచ్చు. జీతభత్యాలు ప్రారంభంలో నెలకు ’8000-12000 వరకు ఉంటాయి. రెండు, మూడేళ్ల అనుభవంతో నెలకు ’ 25000 వరకు అందుకోవచ్చు.
స్పెషల్ స్కిల్స్ కంపల్సరీ
కేవలం కెరీర్, ఆదాయం కోణంలో ఆలోచించి స్పెషల్ ఎడ్యుకేషన్ విభాగంలో రాణిస్తామనుకోవడం నిరాశే అవుతుంది. ఈ విభాగంలో కెరీర్ కోరుకునే వారికి తప్పనిసరిగా ప్రత్యేక లక్షణాలు ఉండాలి. ప్రధానంగా సహనం, ఓర్పు, సేవా దక్పథం ఈ రంగంలో అత్యంత ఆవశ్యకమైన అంశా లు. అంతేకాకుండా బుద్ధి మాంద్యం, మానసిక వైకల్యాలు గల విద్యార్థులు చెప్పే విషయాలను అవగతం చేసుకునే నైపుణ్యం ఉండాలి. అప్పుడే ఈ రంగంలో రాణించగలరు.
ప్రస్తుతం డిమాండ్ ఎక్కువగా ఉన్న కోర్సులు
ప్రస్తుతం దేశంలో వైవిధ్య సామర్థ్యాలు గల చిన్నారులను దష్టిలో పెట్టుకుంటే అధిక శాతం డిమాండ్ ఉన్న కోర్సులు
1. విజువల్ ఇంపెయిర్‌మెంట్
2. హియరింగ్ ఇంపెయిర్‌మెంట్
3. స్పీచ్ థెరపీ
4. ఆటిజం అండ్ స్పెక్ట్రమ్
5. రిహాబిలిటేషన్ సైకాలజీ
6. క్లినికల్ సైకాలజీ
చాలామంది చిన్నారులు ఈ సమస్యలతోనే బాధపడుతున్నారని, ఈ నేపథ్యంలో వారికి ప్రత్యేక పద్ధతుల్లో బోధించేందుకుగాను పై కోర్సులకు డిమాండ్ ఎక్కువగా ఉందని స్పెషల్ ఎడ్యుకేషన్ నిపుణులు పేర్కొంటున్నారు.
కోర్సులివే
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆయా విభాగాల్లో (విజువల్ ఇంపెయిర్‌మెంట్; హియరింగ్ ఇంపెయిర్‌మెంట్; బుద్ధి మాంద్యం; లెర్నింగ్ డిజేబిలిటీ; ప్రోస్థెటిక్స్ అండ్ ఆర్థోటిక్స్; కమ్యూనిటీ బేస్డ్ రిహాబిలిటేషన్; రిహాబిలిటేషన్ సైకాలజీ; క్లినికల్ సైకాలజీ; స్పీచ్ అండ్ హియరింగ్; లోకోమోటర్ అండ్ సెరెబ్రల్ పాల్సీ; ఆటిజం స్పెక్ట్రం అండ్ డిజార్డర్; ఒకేషనల్ కౌన్సెలింగ్ అండ్ రిహాబిలిటేషన్ సోషల్ వర్క్/ అడ్మినిస్ట్రేషన్; కేర్ గివర్స్) సర్టిఫికెట్ మొదలు ఎంఫిల్ వరకు 56 కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అదే విధంగా దూర విద్యా విధానంలో సర్టిఫికెట్, డిప్లొమా, పీజీ డిప్లొమా, బీఈడీ, ఎంఈడీ స్థాయిల్లో 8 కోర్సులు చదివే అవకాశం ఉంది. వీటిలో ప్రధానంగా విజువల్ ఇంపెయిర్‌మెంట్, హియరింగ్ ఇంపెయిర్‌మెంట్, ఆటిజం కోర్సు ఉత్తీర్ణుల అవసరం అధికంగా ఉంది.
అర్హతలు: డిప్లొమా స్థాయి కోర్సులకు ఇంటర్మీడియెట్; బీఈడీ కోర్సుకు బ్యాచిలర్ డిగ్రీ; మాస్టర్ కోర్సులకు సంబంధిత విభాగంలో స్పెషల్ బీఈడీ ఉత్తీర్ణతలు అర్హతలుగా ఉంటాయి.
ఆయా కోర్సులు, అర్హతలు, ప్రవేశాల వివరాలకోసం www.rehabcouncil.nic.in చూడండి.

Published date : 12 Feb 2013 01:53PM