Skip to main content

NETతో బోధన, పరిశోధన.. పరీక్ష ప్రయోజనాలు, ఎంపిక విధానం, ప్రిపరేషన్ టిప్స్ ఇలా!

ఉన్నత విద్య రంగంలో అధ్యాపక, పరిశోధనా అవకాశాలను అందించే యూజీసీ నెట్ (UGC-NET) 2025 జూన్ నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. పీజీ అర్హతతో దేశవ్యాప్తంగా అభ్యర్థులు ఈ పరీక్ష ద్వారా జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF), అసిస్టెంట్ ప్రొఫెసర్ పదవులకు అర్హత పొందవచ్చు. అలాగే ప్రఖ్యాత విద్యాసంస్థల్లో పీహెచ్‌డీ అడ్మిషన్ కోసమూ ఈ పరీక్ష కీలకంగా నిలుస్తుంది.
Teaching and research with the net

పరీక్ష ముఖ్యాంశాలు

పరీక్ష తేదీలు: జూన్ 21–30, 2025

దరఖాస్తు చివరి తేదీ: మే 7, 2025

సబ్జెక్టులు: మొత్తం 85, వీటిలో హ్యూమానిటీస్, సైన్స్, మేనేజ్‌మెంట్, కంప్యూటర్ సైన్స్, క్రిమినాలజీ, నూతనంగా హిందూ స్టడీస్

వెబ్‌సైట్: ugcnet.nta.nic.in

అర్హత వివరాలు

అకడెమిక్ అర్హత: పీజీలో కనీసం 55% మార్కులు (SC/ST/OBC/EWS/PwD అభ్యర్థులకు 5% రాయితీ)

వయస్సు పరిమితి: JRF కోసం గరిష్టంగా 30 ఏళ్లు (రిజర్వ్‌డ్‌ కేటగిరీలకు 5 ఏళ్ల సడలింపు); అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు వయో పరిమితి లేదు

చదవండి: New Courses in IITs: మెషిన్‌ లెర్నింగ్‌, క్వాంటం టెక్నాలజీ, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌.. ప్రవేశం విధానం, కెరీర్‌ అవకాశాలు ఇవే..

పరీక్ష విధానం

మూడు కేటగిరీలు:

  • JRF + అసిస్టెంట్ ప్రొఫెసర్
  • అసిస్టెంట్ ప్రొఫెసర్ + పీహెచ్‌డీ అడ్మిషన్
  • కేవలం పీహెచ్‌డీ అడ్మిషన్

పేపర్ 1: టీచింగ్/రిసెర్చ్ ఆప్టిట్యూడ్ (50 ప్రశ్నలు – 100 మార్కులు)

పేపర్ 2: సంబంధిత సబ్జెక్ట్‌ (100 ప్రశ్నలు – 200 మార్కులు)

మొత్తం మార్కులు: 300

పరీక్ష కాలవ్యవధి: 3 గంటలు

కనీస అర్హత మార్కులు: జనరల్ కేటగిరీకి 40%, రిజర్వ్‌డ్ కేటగిరీలకు 35%

ఎంపిక శాతం: కేవలం 6% అభ్యర్థులనే ఉత్తీర్ణులుగా ప్రకటిస్తారు (నార్మలైజేషన్ విధానం వర్తించుతుంది)

వెయిటేజీ విధానం (పీహెచ్‌డీ అడ్మిషన్‌కు)

70%: నెట్ స్కోర్

30%: యూనివర్సిటీలు నిర్వహించే ఇంటర్వ్యూ స్కోర్

స్కోర్‌ వాలిడిటీ: 1 సంవత్సరం మాత్రమే

నెట్ విజయంతో లభించే ప్రయోజనాలు

JRF ఎంపికైతే: మూడేళ్లపాటు నెలకు ₹37,000 స్టైఫెండ్

SRFగా కొనసాగితే: నెలకు ₹42,000

పీహెచ్‌డీ పూర్తయ్యాక: సైంటిస్ట్‌గా ప్రభుత్వ విభాగాల్లో చేరే అవకాశాలు

అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం: ప్రారంభ బేసిక్ పే ₹67,000 (7వ పీఆర్‌సీ ప్రకారం)

ప్రిపరేషన్ స్ట్రాటజీ

పేపర్–1లో టాపిక్స్: టీచింగ్, రీసెర్చ్ ఆప్టిట్యూడ్, కమ్యూనికేషన్, డేటా ఇంటర్‌ప్రిటేషన్, టెక్నాలజీ, ఎన్విరాన్‌మెంట్ తదితర అంశాలు

పేపర్–2: పీజీ సబ్జెక్ట్‌పై ఆధారపడి, ప్రాక్టికల్ అప్రోచ్‌తో సిద్ధమవ్వాలి

టిప్స్: సబ్జెక్ట్‌పై గంభీర అవగాహన, అనలిటికల్ థింకింగ్, అప్లికేషన్ ఓరియంటేషన్ కలిగితే ఉత్తీర్ణత సాధించడం సాధ్యమే

Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 30 Apr 2025 04:33PM

Photo Stories