స్వల్పకాల కోర్సులు... అదనపు అవకాశాలు
అదనపు కోర్సులు.. అనుబంధ సర్టిఫికెట్లు.. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రతి చోటా వినిపిస్తున్న మాటలివి.. కేవలం డిగ్రీతో ఉద్యోగాలు పొందడం కష్టమవుతున్న పరిస్థితుల్లో అకడెమిక్‌గా ఎన్ని అర్హతలున్నా.. ప్రత్యేక సర్టిఫికెట్ల అవసరం ఆ స్థాయిలోనే ఉంటోంది.దీంతో డిగ్రీ నుంచే వాటి దిశగా దృష్టి సారించాల్సిన పరిస్థితి.. ఏ గ్రూపైనా సంబంధిత అనుబంధ కోర్సుల్లో నైపుణ్యం సాధిస్తేనే భవిష్యత్తుకు భరోసా అనేది నిపుణుల అభిప్రాయం. ఈ నేపథ్యంలో.. విద్యార్థులకు ఉపకరించే అదనపు కోర్సులు.. కెరీర్‌కు మార్గం వేసే షార్ట్‌టర్మ్ కోర్సులపై విశ్లేషణ..
స్పోకెన్ ఇంగ్లిష్
‘నాలెడ్జ్ ఇన్ ఇంగ్లిష్ ఈజ్ యూన్ యూడెడ్ అడ్వాంటేజ్’.. ‘క్యాండిడేట్ మస్ట్ బి ఇంగ్లిష్ సేవీ’.. అంటూ.. రంగమేదైనా.. ఎంట్రీ లెవల్ పోస్టరనా.. ఉన్నత స్థానమైనా.. ఏ ఉద్యోగానికైనా తప్పనిసరవుతోంది ఇంగ్లిష్ పరిజ్ఞానం. అది లేకుంటే ఉద్యోగం అసాధ్యమనుకునే సందర్భాలూ ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో డిగ్రీ స్థాయిలోనే ఇంగ్లిష్ పరిజ్ఞానం దిశగా పునాదులు వేసుకోవాల్సిన అవసరం ఎంతో. అయితే చాలా మందికి ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఈ విషయంలో అవగాహన లేక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఇంగ్లిష్‌ను పరిగణిస్తున్నారు.
నేర్చుకోవడమెలా:
గ్రామర్‌పై ప్రాథమిక పరిజ్ఞానం, నేర్చుకో వాలనే ఆసక్తి ఉంటే స్పోకెన్ ఇంగ్లిష్ నేర్చుకోవడం ఏమంత కష్టం కాదనేది పలువురు ట్రైనర్ల అభిప్రాయం. ఇప్పుడిప్పుడే ఈ దిశగా దృష్టిసారిస్తున్న విద్యార్థులు ‘బేసిక్’ లెవల్ నుంచి శిక్షణ తీసుకుంటేనే ప్రయోజనం. దీనివల్ల భావాన్ని వ్యక్తం చేసే కనీస సామర్థ్యం సొంతమవుతుంది. లిజనింగ్, రీడింగ్, రైటింగ్ స్కిల్స్ అలవడతాయి. ఫలితంగా ఎదుటి వారు చెప్పే విషయూన్ని అర్థం చేసుకునే పరిజ్ఞానాన్ని సొంతం చేసుకోవచ్చు. ఈ దశను విజయవంతంగా పూర్తి చేసుకుంటే.. గ్రూప్ డిస్కషన్స్, స్పీచెస్, చిన్నపాటి సంభాషణల్లో నైపుణ్యం అందించే దశలో అడుగుపెట్టవచ్చు. ఇంగ్లిష్ పరిజ్ఞానం పొందే క్రమంలో విద్యార్థులు ముందుగా అలవర్చుకోవాల్సిన నైపు ణ్యాలు.. రీడింగ్, లిజనింగ్, రైటింగ్, స్పీకింగ్. వీటిలో లిజ నింగ్, స్పీకింగ్‌లో ఆరితేరాలంటే ఇంగ్లిష్ న్యూస్ ఛానెళ్ల పరిశీ లన ఎంతో మేలు చేస్తుంది. ఇక.. రీడింగ్, రైటింగ్ కోసం ఇంగ్లిష్ న్యూస్ పేపర్లను చదవడం, వాటిని సొంత శైలిలో తిరగరాయడమే పరిష్కారం.
శిక్షణ పొందాలంటే:
ఇప్పుడు పలు ఇన్‌స్టిట్యూట్‌లు స్పోకెన్ ఇంగ్లిష్ కోర్సులను అందుబాటులోకి తెస్తున్నాయి. ఈ విష యంలో హైదరాబాద్‌లోని రామకృష్ణ మఠం ఆధ్వర్యంలోని వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లాంగ్వేజెస్ అందించే కోర్సుల కు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు ఏర్పడింది. ఇక్కడ జనవరి, జూన్, సెప్టెంబర్ నెలల్లో కొత్త బ్యాచ్‌లు మొదలవుతాయి. అకడెమిక్‌గా ఇంగ్లిష్‌లో తక్కువ మార్కులు పొందిన వారికి ప్రవేశాల్లో ప్రథమ ప్రాధాన్యం కల్పించడం ఈ ఇన్‌స్టిట్యూట్ కున్న ప్రత్యేకత.
స్వీయ శిక్షణ:
స్వీయ శిక్షణ ద్వారా స్పోకెన్ ఇంగ్లిష్ నేర్చుకోవడం కూడా కొంత సులభమనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. ఈ క్రమంలో విద్యార్థులు కొన్ని ప్రామాణిక పుస్తకాలను చదవాల్సుంటుంది. అంతేకాక.. ఎలాంటి సంకోచం లేకుండా ఎదుటి వారితో ఇంగ్లిష్‌లో మాట్లాడటానికి ప్రయత్నిస్తే మరింత ముందుకు వెళ్లవచ్చు.
చదవాల్సిన పుస్తకాలు:
* కాంటెంపరరీ ఇంగ్లిష్: డేవిడ్ గ్రూ
* ప్రాక్టికల్ ఇంగ్లిష్ గ్రామర్: థామ్సన్ అండ్ మార్టినెట్
* కన్వర్జేషన్: గ్రాండ్ టేలర్
కాల్‌సెంటర్, బీపీఓ ట్రైనింగ్
కాసింత ఇంగ్లిష్ పరిజ్ఞానం, ఎదుటి వారి సంభాషణను అర్థం చేసుకునే నైపుణ్యం ఉంటే.. చక్కని ఉద్యోగాలు కల్పిస్తాయి కాల్‌సెంటర్, బీపీఓ రంగాలు. ఇంటర్మీడియెట్ మొదలు ఏ డిగ్రీ చదివిన వారికైనా ఈ రంగాలు స్వాగతం పలుకుతున్నా యి. ప్రపంచ వ్యాప్తంగా పలు విభాగాలకు చెందిన కస్టమర్లకు వారికి సంబంధించి సందేహాలను తీర్చడమే కాల్‌సెంటర్ ఉద్యోగుల ప్రధాన విధి. కస్టమర్ కేర్, టెక్‌సపోర్ట్‌గా వర్గీకరించి న కాల్‌సెంటర్ రంగంలో.. నిర్దేశిత ప్రొడక్ట్‌కు సంబంధించి టెక్ని కల్ నాలెడ్జ్, ఇంగ్లిష్ పరిజ్ఞానం ఉంటే టెక్ సపోర్ట్ విభాగంలో.. ఇంగ్లిష్ పరిజ్ఞానం, టైపింగ్ స్కిల్స్ ఉంటే కస్టమర్ కేర్ విభా గంలో నిలదొక్కుకోవచ్చు.
ప్రస్తుతం టెలికాం, ఇన్సూరెన్స్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాలదే కాల్‌సెంటర్ కార్యకలాపాల్లో ప్రధాన వాటా అని చెప్పవచ్చు. అవుట్‌సోర్సింగ్‌లో దాదాపు 80 శాతం ఈ రంగాలనుంచే సాగుతోంది. ఒకప్పుడు ప్రధాన నగరాలకే పరిమితమైన కాల్‌సెంటర్లు, బీపీఓలు ఇప్పుడు టయర్-2, 3 పట్టణాలకూ విస్తరించడం అందివచ్చిన అవకాశంగా పేర్కో వచ్చు.
కావాల్సిన అర్హతలు:
టైపింగ్ స్కిల్స్, లిజనింగ్ స్కిల్స్, ఇంగ్లిష్ పరిజ్ఞానం.. ఈ మూడూ కాల్‌సెంటర్ లేదా బీపీఓ రంగంలో నిలదొక్కుకో వడానికి కావాల్సిన ప్రధాన అర్హతలు. అంతేకాకుండా ఎదుటి వారిని ఒప్పించగలిగే నైపుణ్యం, ఓర్పు అదనపు అర్హతలుగా పేర్కోవచ్చు. ఈ అంశాలపై శిక్షణనిచ్చేందుకు పలు సంస్థలు ట్రైనింగ్‌ను అందిస్తున్నాయి. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకుంటే నెలకు కనీసం రూ. 8 వేలతో కెరీర్ ప్రారంభించ వచ్చు. బీపీఓ విభాగంలో ప్రత్యేకంగా కస్టమర్ సపోర్ట్ సర్వీసె స్, మార్కెటింగ్ సర్వీసెస్, హ్యూమన్ రిసోర్స్ సర్వీసెస్ సంబం ధిత విభాగాల్లో పలు అవకాశాలున్నాయి. అనుభవం, పనితీరు ఆధారంగా అతి తక్కువ వ్యవధిలో ఉన్నత స్థానాలకు ఎదగ వచ్చు. కేవలం రెండు, మూడేళ్లలో టీమ్ లీడర్, మేనేజర్ స్థాయి కి చేరుకోవచ్చు. ‘కాల్ సెంటర్ లేదా బీపీఓ రంగంలో నిలదొ క్కుకోవడానికి అసాధారణ అర్హతలు ఉండాల్సిన అవసరం లేదు.
ఏ డిసిప్లైన్‌కు చెందిన విద్యార్థులనైనా ఆదరించే రంగమి ది’ అంటున్నారు సింక్రోటెల్ గ్లోబల్ సొల్యూషన్స్ హైదరాబాద్ సెంటర్ హెడ్ డయూనా. ఇక.. ఈ రంగంలో స్థిరపడాలనుకునే వారికి సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌లపై ప్రాథమిక పరిజ్ఞానం ఉంటే మంచిది. వీటితోపాటు ఫైనాన్స్, అకౌంటింగ్, ఇంజినీరింగ్, ఆపరేషన్స్ తదితర విభాగాలకు సంబంధించిన కనీస పరిజ్ఞా నం తోడైతే కెరీర్‌లో ఎదగడానికి మరింత దోహదపడుతుంది.
సాఫ్ట్‌స్కిల్స్
సంప్రదాయ డిగ్రీ కోర్సులకు అనుబంధంగా మరెన్నో కోర్సులు చదివినా.. ప్రతి విద్యార్థి అలవర్చుకోవాల్సినది సాఫ్ట్‌స్కిల్స్. ఉద్యోగ సాధనలో, ఇంటర్వ్యూల్లో విజయూల్లో ఈ సాఫ్ట్‌స్కిల్స్ ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రస్తు తం చాలా ప్రైవేట్ కంపెనీలు అకడెమిక్ అర్హతలతో పాటు వీటికి కూడా ప్రాధాన్యమిస్తున్నాయి. ఈ క్రమంలో సాఫ్ట్‌స్కి ల్స్‌ను పెంచే పర్సనాలిటీ డెవలప్‌మెంట్, కాన్ఫిడెన్స్ బిల్డింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, మైండ్ మేనేజ్‌మెంట్ టెక్ని క్స్ వంటి అంశాల్లో తర్ఫీదు పొందడం వల్ల ప్రయోజనం ఎంతో. వీటి ద్వారా ఎదుటి వారిని మెప్పించే నైపుణ్యం, స్పష్టమైన వాక్చాతుర్యం వంటి లక్షణాలు అలవడతాయి. దీన్ని గుర్తించిన పలు ఇన్‌స్టిట్యూట్‌లు కోచింగ్ అంశాలకు అనుబంధంగా సాఫ్ట్‌స్కిల్స్‌లోనూ శిక్షణనిస్తున్నాయి. హైద రాబాద్‌లోని రామకృష్ణ మఠంలో ఈ సాఫ్ట్ స్కిల్స్‌కు సం బంధించిన పలు విభాగాల్లో షార్ట్‌టర్మ్ శిక్షణ సదుపాయం కూడా కల్పిస్తున్నారు. విద్యార్థులకే కాకుండా ఉద్యోగస్తు లకు, వృత్తి నిపుణులకూ ప్రత్యేక శిక్షణ కల్పిస్తోంది.
మెడికల్ ట్రాన్స్‌క్రిప్షన్
ఇటీవల కాలంలో పలు అవకాశాలకు వేదికగా మారుతున్న విభాగం మెడికల్ ట్రాన్స్‌క్రిప్షన్. అమెరికా, బ్రిటన్ తదితర దేశాల్లో రోగులకు సంబంధించిన కేస్ హిస్టరీని డాక్యుమెంట్ల రూపంలో పొందుపరిచి భవిష్యత్తులో మరింత మెరుగైన సేవ లందించేందుకు అక్కడి వైద్యులు ఎంతో శ్రద్ధ కనబరుస్తున్నా రు. ఈ నేపథ్యంలో వారు అవుట్ సోర్సింగ్‌కు ప్రాధాన్యం ఇస్తు న్నారు. అలా వెలుగులోకి వచ్చిందే.. మెడికల్ ట్రాన్స్‌క్రిప్షన్. ఈ విభాగంలో అవుట్‌సోర్సింగ్‌లో భారత్‌దే పైచేయి అని చెప్ప వచ్చు. ఇక్కడ మానవ వనరులు తక్కువ వేతనాలకు లభ్యమ వుతుండటం, నైపుణ్యం వంటి అంశాలే ఇందుకు కారణం. వైద్యులు వివరించే రోగుల సమాచారాన్ని రికార్డు రూపంలోకి మార్చడమే మెడికల్ ట్రాన్స్‌క్రిప్షన్‌లోని ప్రధాన విధి. ఈ క్రమంలో ఫోన్ ద్వారా, అనలాగ్ సిస్టమ్ ద్వారా వైద్యులు ఇచ్చే సమాచారాన్ని ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా నమోదు చేయూల్సిన నైపుణ్యం మెడికల్ ట్రాన్స్‌క్రిప్షనిస్ట్‌లకు అవసరమ వుతోంది. దీనికి సంబంధించి పలు సంస్థలు మెడికల్ ట్రాన్స్ క్రిప్షన్‌లో ట్రైనింగ్ ఇస్తున్నాయి.
అర్హతలివే:
గ్రూప్‌తో సంబంధం లేకుండా ఏ డిగ్రీ విద్యార్థులైనా మెడికల్ ట్రాన్స్‌క్రిప్షన్ రంగంలో అడుగుపెట్టవచ్చు. ఇంగ్లిష్ వ్యాకరణం, లిజనింగ్ స్కిల్స్‌లో పట్టు ప్రధానం. ప్రపంచంలోని పలు దేశా ల్లోని ఇంగ్లిష్ యూసను అర్థం చేసుకోగలిగే వారు ఈ రంగంలో రాణించడంలో మరో అడుగు ముందుంటారనేది నిస్సందేహం. హెల్త్‌కేర్ రంగానికి సంబంధించిన పదజాలంపై అవగాహన కూడా ఎంతో లాభిస్తుంది. మెడికల్ ట్రాన్స్‌క్రిప్షనిస్ట్‌ల పనిని కాసింత సులభతరం చేయడానికి ఇటీవల కాలంలో స్పీచ్ రికగ్నిషన్ టెక్నాలజీ కూడా అందుబాటులోకి వచ్చింది. వీటి ద్వారా.. వాయిస్ రికార్డులు వాటంతటవే టెక్స్ట్ రూపం లోకి మారతాయి. అయితే దీనివల్ల కొన్నిసార్లు తప్పులు దొర్లే ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి, స్వీయ పరిజ్ఞానంపై ఆధారపడటమే మంచిదని నిపుణుల అభిప్రాయం.
ఆకట్టుకునే వేతనాలు:
మెడికల్ ట్రాన్స్‌క్రిప్షన్‌లో విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ప్రారంభంలో కనీసం రూ. ఏడు వేల నుంచి తొమ్మిది వేల వరకు జీతం లభిస్తుంది. ఇక అనుభవం, నైపుణ్యం ప్రామాణికాలుగా.. రెండు, మూడేళ్లలో 25 వేల నుంచి 30 వేల జీతం పొందే స్థాయికి చేరుకోవచ్చు. అనుభవం ఆధారంగా పదోన్నతులు కూడా పొందవచ్చు. సూపర్‌వైజర్, ట్రైనర్, మేనేజర్ హోదాలకు చేరుకోవచ్చు.
శిక్షణ కేంద్రాలు:
సాధారణంగా మెడికల్ ట్రాన్స్‌క్రిప్షన్‌కు సంబంధించి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టులు పొందిన సంస్థలే.. శిక్షణనిచ్చి అభ్యర్థుల కు తమ పరిధిలోనే అవకాశాలు కల్పిస్తున్నాయి. మరికొన్ని శిక్షణనిచ్చి ప్లేస్‌మెంట్ అసిస్టెన్స్ అందిస్తున్నాయి. ‘ఇప్పుడు మెడికల్ ట్రాన్స్‌క్రిప్షన్‌కు మంచి రోజులున్నాయి. ఆర్థిక సంక్షోభం ప్రభావం అంతంతమాత్రమే. ఆసక్తి ఉంటే చక్కని అవకాశం కల్పించే రంగమిది. అయితే అభ్యర్థులకు విషయ పరిజ్ఞానంతోపాటు, ఇతరదేశాల సమయూల ప్రకారం పనిచేసే ఓర్పు, సామర్థ్యం తప్పనిసరి. మా దగ్గర శిక్షణకు వస్తున్న వారిలో దాదాపు 40 శాతం మంది ఆర్ట్స్ విద్యార్థులే. అందువల్ల ఇది కేవలం సైన్స్ విద్యార్థులకు మాత్రమే సరితూగే రంగమనే అపోహ పడక్కర్లేదు’ అంటున్నారు ట్రాన్స్‌డిన్ మెడికల్ ట్రాన్స్‌క్రిప్షన్ హైదరాబాద్ సెంటర్ ప్రతినిధి.
అకౌంటింగ్ ప్యాకేజ్‌లు
అడుగడుగునా ఆధునికత పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో.. సంప్రదాయ పద్దులు (అకౌంట్స్) కూడా ఆ దిశగానే అడుగులు వేస్తున్నాయి. ఈ క్రమంలో వెలుగులోకి వచ్చినవే అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్ ప్యాకేజ్‌లు. ఒక సంస్థ లేదా పరిశ్రమకు సంబంధించి రోజువారీ అకౌంటింగ్ వ్యవ హారాలు మొదలు.. ఫైనల్ అకౌంట్స్ వరకు అన్ని వ్యవహారాల కంప్యూటరైజేషన్‌కు ఈ ప్యాకేజ్ లు ఎంతో తోడ్పడుతున్నాయి. దాంతో ఒక మాదిరి వ్యాపార సంస్థ నుంచి అన్ని వ్యాపార కార్య కలాపాల్లో ఇప్పుడు అకౌంటింగ్ ప్యాకేజ్‌లదే కీలక పాత్ర. ఫలితంగా ఈ ప్యాకేజ్‌ల నిర్వహణలో నైపుణ్యం సాధించిన వారి అవసరం పెరుగుతోంది. ముఖ్యంగా ఈ ప్యాకేజ్‌లు బీకాం డిగ్రీ విద్యా ర్థులకు కచ్చితమైన అవకాశాలను అందిస్తాయని చెప్పవచ్చు. సాధారణంగా అకడెమిక్ స్థాయిలో అకౌంటింగ్ పద్ధతుల్ని నేర్చుకోవడానికి పుస్తక పఠనమే మార్గం. అందువల్ల బీకాం విద్యార్థులు తాము డిగ్రీ చదువుతున్నప్పుడే లేదా పూర్తై వెంటనే ఈ అకౌంటింగ్ ప్యాకేజ్‌లను కూడా నేర్చుకోవాలనేది నిపుణుల అభిప్రాయం. ఈ ప్యాకేజ్‌ల ద్వారా సేల్స్, ఫైనాన్స్, పర్చేజ్, ఇన్వెంటరీ, మ్యానుఫ్యాక్చరింగ్ కార్యకలాపాలన్నిటినీ కంప్యూటరీకరించవచ్చు.
అర్హతలేంటి?
సాధారణంగా అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్ శిక్షణ బీకాం విద్యార్థులకు అనుకూలం. అయితే కొన్ని ప్రైవే ట్ శిక్షణ సంస్థలు ఓరియెంటేషన్ ప్రోగ్రాం పేరుతో ఇతర గ్రూప్ విద్యార్థులను కూడా అనుమతి స్తున్నాయి. అయితే ఈ విషయంలో అలాంటి విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని.. ప్రాథమిక పరిజ్ఞానం లేకుండా దృష్టి సారిస్తే ఫలితం ఆశించిన విధంగా ఉండదని హైదరాబాద్‌లోని ఓ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ కోచింగ్ సెంటర్ డైరక్టర్ హెచ్చరిస్తున్నారు. ఇక.. క్రేజ్ ఉన్న సాఫ్ట్‌వేర్‌ల విషయూనికొస్తే.. ప్రస్తుతం ట్యాలీ 9.0, ఫోకస్, వింగ్స్, పీచ్‌ట్రీలు. పలు వ్యాపార సంస్థల్లో వీటి వినియోగమే ఎక్కువగా ఉంటోంది. ఈ సాఫ్ట్‌వేర్‌ల ద్వారా రోజువారీ అకౌంటింగ్ కార్యకలా పాలు మాత్రమే కాకుండా.. బ్యాంకింగ్, వ్యాట్, సెన్‌వ్యాట్ తదితర అనుబంధ విభాగాలకు సంబంధించిన వ్యవహారాలను కంప్యూటరైజ్ చేసే సామర్థ్యం లభిస్తుంది. సొంతగా ట్యాక్స్ ప్రాక్టీషనర్లుగా స్థిరపడాలనుకున్న వారికి కూడా ఈ ప్యాకేజ్‌లు ఎంతో ప్రయోజనం చేకూర్చుతా యి. బీకాం విద్యార్థులకు ఈ పరిజ్ఞానం కూడా తోడైతే జూనియర్ అకౌంటెంట్లు, ఎంఐఎస్ ఎగ్జిక్యూటివ్స్‌గా కెరీర్ ప్రారంభించ వచ్చు. అనుభవం, పనితీరు ఆధారంగా కొద్ది సమయంలోనే సీనియర్ అకౌంటెంట్, అకౌం ట్స్ మేనేజర్ స్థాయికి చేరుకోవచ్చు. ‘పలు అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్ ప్యాకేజ్‌లు అందుబాటులో ఉన్నాయి. శిక్షణతోపాటు సర్టిఫికేషన్ కూడా పొందితే తిరుగుండదు’ అంటున్నారు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రాక్టికల్ అకౌంటెన్సీ డెరైక్టర్ ప్రకాష్.
కంప్యూటర్ కోర్సులు
సాధారణ డిగ్రీ కోర్సు బీఏ మొదలు ప్రొఫెషనల్ బ్యాచిలర్ డిగ్రీ ఇంజినీరింగ్ వరకు ఏ విభాగం విద్యార్థులకైనా ఇప్పుడు కంప్యూటర్ కోర్సుల అవసరం ఎంతో. ఒక సంస్థలో రెండు విభాగాల మధ్య సమాచార పంపిణీకి సంబంధించిన డాక్యుమెంటేషన్ అంతా కంప్యూటర్ ద్వారానే. దీంతో విద్యార్థులకు, వాటికి సంబంధించిన కనీస పరిజ్ఞానం కావాలి. ఈ నేపథ్యంలో డిగ్రీ విద్యార్థులకు అందుబాటులో పలు షార్ట్ టర్మ్ కంప్యూటర్ కోర్సులు అందుబాటులో ఉంటున్నాయి. ఈ షార్ట్ టర్మ్ కోర్సుల్లో కూడా కొన్ని కోర్సులు కెరీర్‌లో స్థిరపడేందుకు కూడా దోహదం చేస్తున్నాయి.
ఏఏ కోర్సులు..
ముందుగా కామర్స్, ఆర్ట్స్, హ్యుమానిటీస్ విద్యార్థులను పరిగణనలోకి తీసుకుంటే.. వారికి యునిక్స్, లినక్స్, ఎంఎస్ ఆఫీస్, వెబ్ డిజైనింగ్, ఈ-కామర్స్, తదితర ఆపరేటింగ్ సిస్టమ్స్‌కు సంబంధించిన కోర్సులు భవిష్యత్తులో ఎంతో ఉపకరిస్తాయి. వీటి ద్వారా కరస్పాండెన్స్, డాక్యుమెంటేషన్, డేటా ఎనాలిసిస్ వంటి కార్యకలాపాలను నిర్వర్తించే సామర్థ్యం సొంతమవుతుంది. ఇవే కాక.. ఇంటర్నెట్ ఆపరేషన్స్, మల్టీ మీడియూ, వెబ్ డిజైనింగ్, యూనిమేషన్ కూడా ప్రస్తుతం క్రేజ్... కెరీర్ స్కోప్ ఉన్న షార్ట్‌టర్మ్ కోర్సులని చెప్పవచ్చు. ఇక సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ విద్యార్థులకు పై కోర్సులతోపాటు సి, సి++, డేటా స్ట్రక్చర్, ఆటో క్యాడ్, జావా వంటి కోర్సులు మరికొంత లాభిస్తాయి. వీటితోపాటు వేగంగా గ్రహించే శక్తి, విశ్లేషణ సామర్థ్యం ఉన్న విద్యార్థులకు ఒరాకిల్, జావా, టెస్టింగ్ టూల్స్.. శాప్, పీపుల్ సాఫ్ట్ వంటి ఈఆర్‌పీ సొల్యూషన్స్ అనుకూల కోర్సులని చెప్పవచ్చు.
‘ప్రస్తుత పోటీ పరిస్థితుల్లో విద్యార్థులు తమ డిగ్రీలకు అదనపు అర్హతలు సమకూర్చుకోవాలి. ఈ క్రమంలో వారు ముందుగా కంప్యూటర్ కోర్సులపై దృష్టి సారిస్తే.. పరిజ్ఞానంతోపాటు ఉద్యోగ సాధనలో కూడా అవి తోడ్పడతాయి.’ అనేది ఎన్.ఐ.ఐ.టి. లొకేషన్ హెడ్ దేబీ ప్రసాద్ అభిప్రాయం.