కెరీర్ గైడెన్స్.. జాబ్ ఓరియెంటెడ్ డిప్లొమా కోర్సులు
Sakshi Education
డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ మేనేజ్‌మెంట్
ప్రపంచీకరణ ఫలితంగా ఇటీవల కాలంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాల్లో ప్రముఖమైంది ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ మేనేజ్‌మెంట్. నిరంతరం ఎన్నో కొత్తకొత్త మోడళ్లు మార్కెట్లో రిలీజై సంచలనం సృష్టిస్తున్నాయంటే అందుకు కారణం ఫ్యాషన్ డిజైనర్లే. క్లాతింగ్, డిజైనింగ్, మార్కెట్ రీసెర్చ్, క్వాలిటీ, ప్రైస్, బ్రాండ్ ఇమేజ్ ఇలా ఎన్నో అంశాల్ని పరిగణనలోకి తీసుకుని మార్కెట్లో ఉత్పత్తులను విడుదల చేయడం; ఇతర సంస్థ ల ఉత్పత్తులను నిరంతరం నిశితంగా గమనిస్తూ.. పోటీ ప్రంపంచంలో తమ సంస్థ ముందుండేలా సరికొత్త డిజైన్లతో వినియోగదారులని ఆకర్షించే విధంగా వ్యవహరించడం ఈ కోర్సు పూర్తి చేసిన వారి ప్రధాన బాధ్యతలు.
కోర్సు ముఖ్యాంశాలు:
ఈకోర్సులో వివిధ రకాల వస్త్రాలు, వాటి డిజైన్లు, నాణ్యత, ఉత్పత్తి, డిజైన్ మేనేజ్‌మెంట్, ఫ్యాషన్ కోఆర్డినేషన్, గార్మెంట్ కనస్ట్రక్షన్, ఫ్యాషన్ మోడల్ డ్రాయింగ్, టెక్స్‌టైల్ గ్రేడింగ్, ప్యాట్రన్ డిజైనింగ్ ఇలా వివిధ అంశాలపై శిక్షణ ఇస్తారు. అనేక సంస్థలు ఈ కోర్సును అందిస్తున్నాయి. కాల వ్యవధి ఆయా సంస్థలను బట్టి వేర్వేరుగా ఉంటోంది.
ఉద్యోగావకాశాలు:
ఈ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులకు దేశవిదేశీ సంస్థలు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. ముఖ్యంగా Toomy Hilfiger, Gokaldas Images, Adigear international, Levis, Lifestyle, Shoppers stop తదితర సంస్థలు టాప్ రిక్రూటర్లగా ఉన్నాయి. .
కెరీర్ గ్రోత్ -వేతనాలు:
కెరీర్ ప్రారంభంలో నెలకు రూ. 10-15 వేల వరకూ వేతనం లభిస్తుంది. డిజైనింగ్ నైపుణ్యం, కమ్యూనికేషన్ స్కిల్స్, అనుభవం ఉంటే 1-2 సంవత్సరాల్లో నెలకు రూ. 30 వేలకు పైగా సంపాదించొచ్చు. అనుభవం ఆధారంగా డిజైనింగ్, ప్రొడక్షన్, ఫ్యాషన్ మార్కెటింగ్, ప్లానింగ్, కాన్సెప్ట్ మేనేజ్‌మెంట్ విభాగాల్లో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు. ఈ రంగంలో పేరు గడించాలంటే వ్యక్తిగత నైపుణ్యాలదే కీలక పాత్ర. టాప్ డిజైనర్‌గా పేరు గడిస్తే నెలవారీ సంపాదన వేల నుంచి రూ. లక్షల్లో ఉంటుంది.
ఫ్యాషన్ డిజైనింగ్ లో డిప్లొమా కోర్సుల్ని అందిస్తున్న సంస్థలు:
ఏఆర్‌కే ఇనిస్టిట్యూట్ ఆఫ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్, హైదరాబాద్
కోర్సు: సర్టిఫికెట్ కోర్స్ ఇన్ ఫ్యాషన్ డిజైన్ అండ్ బొటిక్ మేనేజ్‌మెంట్
వ్యవధి: ఏడాది
వోగ్యూ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, బెంగళూరు
కోర్సు: గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైన్
వ్యవధి: ఏడాది
పాలిటెక్నిక్ ఫర్ వుమెన్, న్యూఢిల్లీ
కోర్సు: అడ్వాన్స్‌డ్ డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైన్ అండ్ మర్కండైజింగ్
వ్యవధి: సంవత్సరం
-----------------------------------------------------------------------------------
డిప్లొమా ఇన్ ఇంటీరియర్ డిజైనింగ్
గృహాలు వాణిజ్య సముదాయాల్ని అత్యంత అద్భుతంగా, ఇతరులు ఇట్టే ఆకర్షితులయ్యే విధంగా తీర్చిదిద్దే నైపుణ్యాలను అందించే కోర్సు ఇంటీరియర్ డిజైనింగ్. ఇది సృజన, ఆసక్తి ఉన్న వారికి సరిపడే కోర్సు. అలంకరణకు ప్రాముఖ్యం పెరగడం, వాణిజ్య సముదాయాలు వ్యాప్తి చెందుతుండటంతో అంతే స్థాయిలో ఈ రంగంలో అవకాశాలు పెరుగుతున్నాయి. రెసిడెన్షియల్, కమర్షియల్ రంగాల్లో నిపుణులైన ఇంటీరియర్ డిజైనర్లకి దేశీయంగా ఎంతో డిమాండ్ ఉంది. రెసిడెన్షియల్ డిజైనింగ్‌లో భాగంగా కిచెన్ అండ్ బాత్‌రూమ్ డిజైన్, యూనివర్సల్ డిజైన్ తదితర స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి.
ఉద్యోగ అవకాశాలు:
ఇంటీరియర్ డిజైనర్లకు కమర్షియల్, ఇంటీరియల్ స్పేస్ డిజైనింగ్ కాంట్రాక్ట్ రంగాల్లో కెరీర్ ఉంటుంది. అంతేకాకుండా సొంతంగా ఇంటీరియర్ డెకరేటింగ్ స్టోర్లు, స్టూడియోలు ప్రారంభించుకోవచ్చు. లాండ్‌స్కేప్, రెసిడెన్షియల్, కమర్షియల్ ఇంటీరియర్ డిజైనర్‌గా ఉపాధి అవకాశాలు ఉంటాయి.
కెరీర్ గ్రోత్, జీత భత్యాలు:
ఈ రంగంలో జీతభత్యాలు పూర్తిగా నైపుణ్యం ఆధారంగా ఉంటాయని చెప్పొచ్చు. వాస్తవానికి ఇది స్వయం ఉపాధి రంగం కావడం వల్ల కనీసం నెలకు రూ. 10,000 నుంచి రూ. 20,000 వరకూ సంపాదించవచ్చు. ఆయా కాంట్రాక్ట్ కంపెనీల్లో ఉద్యోగం చేసే అభ్యర్థులకు ప్రారంభంలో రూ. 10 వేల నుంచి రూ. 15 వేల వరకు జీతభత్యాలు లభిస్తాయి.
ఇంటీరియర్ డిజైనింగ్‌లో డిప్లొమా కోర్సులు అందిస్తున్న సంస్థలు:
యూనివర్సిటీ ఆఫ్ మైసూర్, యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ డిజై న్
కోర్సు: డిప్లొమా ఇన్ ఇంటీరియర్ డిజైన్
వ్యవధి: రెండేళ్లు
వెబ్‌సైట్: www.unimysore.ac.in

హ్యామ్‌టెక్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ అండ్ ఇంటీరియర్ డిజైన్, హైదరాబాద్
కోర్సు: డిప్లొమా ఇన్ ఇంటీరియర్ డిజైన్
వ్యవధి: రెండేళ్లు,
సర్టిఫికెట్ కోర్స్ ఇన్ ఇంటీరియర్ డిజైన్
వ్యవధి: ఏడాది
వెబ్‌సైట్ : www.hamstech.com
----------------------------------------------------------------------------------------
ఆర్థిక రంగం
ప్రపంచీకరణ, డబ్ల్యూటీఓ ఒప్పందాలు, ఆయా దేశాల మధ్య విస్తరిస్తున్న వాణిజ్య ఒప్పందాల నేపథ్యంలో ఆర్థిక రంగం దినదిన ప్రవర్ధమానమవుతోంది. ఇక.. మన దేశం కోణంలో పరిశీలిస్తే పారిశ్రామిక అభివృద్ధి పెరగడం, బహుళ జాతి కంపెనీలకు కేంద్ర స్థానంగా నిలుస్తుం డటంతో ఆర్థిక వ్యవస్థ బలపడుతోంది. ఈ పరిణామా లతో ఆర్థిక వ్యవస్థకే తలమానికమైన బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల్లో విస్తృతంగా ఉద్యోగ అవకాశాలు ఏర్పడుతు న్నాయి. కానీ సుశిక్షితులైన నిపుణుల కొరత ఈ రంగాన్ని వేధిస్తోంది. దీంతో నిపుణులైన అభ్యర్థులకు ఆకర్షణీయ వేతనాలతో కార్పొరేట్ ఉద్యోగాలు అందించేందుకు బ్యాంకింగ్, ఫైనాన్స్ సంస్థలు పోటీ పడుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని పలు సంస్థలు ఈ విభాగాలకు సంబంధించి కోర్సులకు రూపకల్పన చేశాయి. అవి ఆఫర్ చేసే సర్టిఫికెట్ల ఆధారంగా అద్భుత కెరీర్‌ను ఆవిష్కరణ చేసుకోవచ్చు. వివరాలు..
డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్:
బ్యాంకింగ్ రంగంలో అద్భుతమైన ఉద్యోగావకాశాలు కల్పిస్తోన్న కోర్సు డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్. ఈ రంగాల్లో సుశిక్షితులైన నిపుణుల అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (ఐఐబీఎఫ్) ఈకోర్సును రూపొందించింది. దీనికి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) గుర్తింపు ఉంది.
కోర్సు ముఖ్యాంశాలు:
ఈ డిప్లొమా అకడెమిక్ కరిక్యులం ఆయా బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు, ఐటీ, బీపీవో రంగాల్లో ప్రాథమిక స్థాయి ఉద్యోగాలకు ఉపయోగపడే విధంగా రూపొందింది. బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాలపై సమగ్ర అవగాహన కల్పించడంతోపాటు, విధి నిర్వహ ణకు అవసరమైన సాంకేతిక సామర్థ్యాలను పెంపొం దించడమే కోర్సు ముఖ్యోద్దేశం.
ఉద్యోగావకాశాలు:
ఈ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులకు ఫైనాన్స్ సంస్థలు, బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీల్లో సులభంగా ఉద్యోగాలు దొరుకుతాయి. సాధారణ అభ్యర్థులతో పోలిస్తే ఈ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులు ఉద్యోగ సమయంలో అంతర్గత శిక్షణ అవసరం లేకుండానే సమర్థంగా విధులు నిర్వర్తించగలరు. ఇన్ని సానుకూల కారణాల వల్ల వీరికి ఉద్యోగం దొరకడం చాలా సులభం.
సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ (సీఎఫ్‌పీ) సర్టిఫికేషన్ ప్రోగ్రాం:
పెట్టుబడులు, బీమా, పన్నులు, పదవీ విరమణ ప్రణాళికలు, స్థిరాస్థి, సంబంధిత నిర్ణయాలు తదితర అంశాలపై ఆయా వ్యక్తులకు సమగ్ర సమాచారాన్ని ఇవ్వడం సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ ప్రత్యేకత. దీనికి సంబంధించి రూపొందించిన సర్టిఫికేషన్ ప్రోగ్రామే సీఎఫ్‌పీ.
కోర్సు ముఖ్యాంశాలు:
పర్సనల్ ఫైనాన్స్‌లో స్థిరమైన ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకునేందుకు కావల్సిన ప్రత్యేక సామర్థ్యాలపై శిక్షణ ఇస్తారు. క్లయింట్ల సమస్యల్ని పరిష్కరించేందుకు, వారికి సరిపడే సలహాలు ఇచ్చేందుకు అవసరమైన కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్‌పై ప్రత్యేక తరగతులు నిర్వహిస్తారు.
ఉద్యోగావకాశాలు:
ఈ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులకు ఫెనాన్స్ రంగంలోని అనేక విభాగాల్లో స్థిరపడేందుకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. సొంత ప్రాక్టీస్ ద్వారా స్వయం ఉపాధి పొందొచ్చు. ఫైనాన్షియల్ ప్లానింగ్ స్టాండర్డ్స్ బోర్డ్ ఇండియా (ఎఫ్‌పీఎస్‌బీఐ) ఈ కోర్సు ప్రమాణాలను పర్యవేక్షిస్తుంది. అమెరికాకు చెందిన ఎఫ్.పి.ఎస్.బి.ఎల్‌కు అనుబంధంగా ఎఫ్‌పీఎస్‌బీ ఇండియా పనిచేస్తుంది. కాబట్టీ వీరికి విదేశాల్లోనూ ఉద్యోగావకాశాలు ఉంటాయి. విదేశాల్లో ప్రాక్టీస్ చేయాలనుకునే సీఎఫ్‌పీలు ఆయా దేశాల సర్టిఫికేషన్ మార్గదర్శకాలను పాటించి తద్వారా ఉద్యోగం పొందొచ్చు.
వెబ్‌సైట్: www.iibf.org.in
----------------------------------------------------------------------------------------
డిప్లొమా ఇన్ జ్యుయలరీ డిజైనింగ్ అండ్ జెమ్మాలజీ
వినియోగదారుల అభిరుచులకనుగుణంగా పలు రకాల డిజైన్లలో వైవిధ్యంగా ఆభరణాల్ని రూపొందిచగలగడమే జ్యుయలరీ డిజైనింగ్. వివిధ రకాల రత్నాలు, ముత్యాలు, వ జ్రాలు, వైఢూర్యాలు మెదలైన విలువైన రాళ్లను వాటి నాణ్యత ఆధారంగా గుర్తించి కచ్చిత విలువను లెక్కించడం జెమ్మాలజీ. పెరుగుతున్న పోటీ కారణంగా వినియోగదారుడ్ని మెప్పించేందుకు తద్వారా తమ వ్యాపార సామర్థ్యాన్ని పెంపొందించుకునేందుకు ఆభరణాల సంస్థలు పోటీపడుతున్నాయి. కొన్నేళ్ల క్రితం వరకు దేశీయ సంస్థలకే పరిమితమైన ఈ రంగంలో విదేశీ సంస్థలూ ప్రవేశించడంతో పోటీ మరింత పెరిగింది. దీంతో నిపుణులైన ఆభరణాల డిజైనర్లకు, జెమ్మాలజిస్టులకు డిమాండ్ ఏర్పడింది. ప్రత్యేక అర్హతలేమీ లేకుండా కేవలం అభిరుచి, నైపుణ్యం మీద ఆధారపడి అభివృద్ధి సాధించేందుకు అవకాశం ఉన్న కెరీర్లో ఇది ప్రముఖమైంది.
కోర్సు ముఖ్యాంశాలు:
దేశ వ్యాప్తంగా వివిధ సంస్థలు వేరు వేరు వ్యవధుల్లో ఈ కోర్సును అందిస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా వివిధ రకాల రత్నాలు, ఆభరణాల రంగులు, నాణ్యత, డిజైన్లు, ఆభరణాల రూపకల్పన, మహిళలకు, పురుషులకు ప్రత్యేకంగా ఆభరణాలు డిజైన్ చేయడం, కాస్ట్యూమ్ జ్యుయలరీ, ఆభరణాలను విలువ లెక్కింపు మెదలైన అంశాలపై శిక్షణ ఇస్తారు.
ఉద్యోగ అవకాశాలు:
కోర్సు పూర్తిచేసిన అభ్యర్థులకు జ్యుయలరీ డిజైనింగ్, ఎక్స్‌పోర్ట్, ఫ్యాషన్ హౌసెస్‌లో ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ముఖ్యంగా ఖ్చీజీటజ్ఞి, ఠ్చీటఠిౌటజుజీ, ఈ్ఛఆ్ఛ్ఛటట ్చఛీ ఈ’ఛ్చీఝ్చట స్వయం సంస్థలు నిపుణులైన అభ్యర్థులకు చక్కని వేతనాలతో ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. అంతేకాక స్వయం ఉపాధికి కూడా వీలుంది. అంతేకాక ఫ్రీలాన్స్ డిజైనర్‌గానూ పనిచేయొచ్చు.
కెరీర్ గ్రోత్, జీతభత్యాలు:
ప్రాథమిక స్థాయి ఉద్యోగిగా జ్యుయలరీ డిజైనింగ్ హౌస్‌లో చేరినప్పుడు ప్రారంభ వేతనం నెలకు రూ.15 వేల వరకు లభిస్తుంది. అనుభవం, నైపుణ్యం ఆధారంగా స్వల్ప కాలంలోనే రూ. 30 వేల వరకూ సంపాదించవొచ్చు.
కోర్సుల్ని అందిస్తున్న సంస్థలు:
ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ డిజైన్
కోర్సు వివరాలు:
సర్టిఫికెట్ ప్రోగ్రాం ఇన్ జ్యుయలరీ డిజైన్
వ్యవధి: 2 సంవత్సరాలు
వెబ్‌సైట్: www.insd.edu.in
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ జ్యుయలరీ
కోర్సు వివరాలు:
సర్టిఫికెట్ ప్రోగ్రాం ఇన్ జ్యుయలరీ డిజైన్
వ్యవధి: 2 సంవత్సరాలు
వెబ్‌సైట్: www.iij.net.in/
సెయింట్ జేవియర్ కాలేజ్, జియాలజీ డిపార్ట్‌మెంట్, ముంబై
డిప్లొమా ఇన్ జెమ్మాలజీ
వెబ్‌సైట్: https://xaviers.edu/
డెక్కన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ జెమ్ అండ్ జ్యుయలరీ, హైదరాబాద్
వ్యవధి: మూడు నెలలు
వెబ్‌సైట్: www.digj.in/
ఇండియన్ డైమండ్ ఇనిస్టిట్యూట్, సూరత్
డిప్లొమా ఇన్ జెమ్మాలజీ
వ్యవధి: 16 వారాలు
వెబ్‌సైట్: www.diamondinstitute.net/
-----------------------------------------------------------------------------------------
మీడియా అండ్ కమ్యూనికేషన్స్
డిప్లొమా ఇన్ రేడియో జాకీయింగ్ అండ్ టి.వి న్యూస్ రీడిండ్:
రేడియో జాకీలుగా, టి.వి. న్యూస్ రీడర్లుగా స్థిరపడాలనుకునే విద్యార్థులకు గొప్ప అవకాశం ఈ డిప్లొమా. పార్ట్‌టైమ్ విధానంలో ఈ కోర్సును అభ్యసించే వీలుంది. జాతీయ స్థాయిలో స్థిరంగా పెరుగుతున్న మీడియా మార్కెట్, కొత్త ఛానళ్ల ఆవిర్భావంతో ఈ కోర్సు ప్రాధాన్యం సంతరించుకుంటోంది.
కోర్సు వివరాలు:
రేడియో జాకీయింగ్, న్యూస్‌రీడింగ్ అంశాలపై ప్రయోగాత్మక పద్ధతిలో సమగ్ర శిక్షణ లభిస్తుంది. కోర్సు చదువుతున్న సమయంలోనే వివిధ ప్రముఖ మీడియా హౌసెస్‌లో ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం ఉంటుంది. మీడియా రంగ ప్రము ఖులు/ నిపుణులతో గెస్ట్ లెక్చర్స్, ఆయా విభాగాల్లో ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటాయి.
ఉద్యోగావకాశాలు:
ఈ కోర్సు పూర్తిచేసిన అభ్యర్థులకు ఉద్యోగావకాశాలు సులభంగా దొరకుతాయి. వివిధ మీడియా హౌస్‌లు, అడ్వర్టైజింగ్ ఏజెన్సీలు, న్యూస్ ఛానల్స్, రేడియో స్టేషన్లు ఈ శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి.
కోర్సును అందిస్తున్న సంస్థ:
యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ అండ్ ఆర్కే ఫిల్మ్స్ అండ్ మీడియా అకాడెమీ.
వెబ్‌సైట్: www.rkfma.com
Published date : 21 Oct 2013 12:58PM