డిజాస్టర్ మేనేజ్‌మెంట్.. ఫర్ బెస్ట్ ఎంప్లాయ్‌మెంట్
Sakshi Education
విరుచుకు పడుతున్న పై-లిన్ తుఫాన్, హడలెత్తిస్తున్న హెలిన్, జపాన్‌లో భూకంపం, ఇండోనేషియా తీరంలో సునామీ... ఇలా గత కొన్నాళ్లుగా, కొన్నేళ్లుగా తరచుగా వినిపిస్తున్న ప్రకృతి వైపరీత్యాలు. వీటి వల్ల ఏర్పడుతున్న నష్టం అంచనాలకతీతం. ఈ ప్రకృతి వైపరీత్యాలను అరికట్టే అద్భుతాలు అరచేతుల్లో లేకున్నా.. వాటిని ముందుగానే గుర్తించి.. ప్రభావిత ప్రాంతాలను, అక్కడి ప్రజలను రక్షించడం ఎంతో అవసరం. ఇందుకు ప్రత్యేక శిక్షణ తప్పనిసరి. ఆ శిక్షణనిచ్చే కోర్సు డిజాస్టర్ మేనేజ్‌మెంట్. ఇటీవల కాలంలో ప్రకృతి విపత్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సంబంధిత శిక్షణ కోర్సుల పట్ల అవగాహన పెరిగింది. ఫలితంగా సమీప భవిష్యత్తులో ఇది చక్కటి ఉపాధి అవకాశాలకు వేదిక కానుంది.
భారత్‌లో బహుళ అవకాశాలు:
ప్రకృతి విపత్తులు.. లేదా మానవ ప్రేరిత విపత్తులు ఏవైనా వాటి నుంచి తక్షణమే ఉపశమనం కల్పించే దిశగా నైపుణ్యాలను అందించే కోర్సు డిజాస్టర్ మేనేజ్‌మెంట్. ప్రధానంగా ప్రపంచంలో జనాభా పరంగా రెండో పెద్ద దేశంగా నిలిచిన భారత్‌లో క్రమం తప్పకుండా విపత్తులు సంభవిస్తున్నాయి. వీటిని సమర్థంగా నిర్వహించేందుకు భారత ప్రభుత్వం 2004లో ఏర్పడిన సునామీ తర్వాత.. విపత్తుల నిర్వహణ కోసం ప్రత్యేకంగా నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీని నెలకొల్పింది. వాస్తవానికి దేశంలో 60 శాతం భూ భాగం భూకంప ప్రభావిత ప్రాంతంగా, 12 శాతం భూభాగాన్ని వరదల ప్రభావిత ప్రాంతంగా, 8 శాతం భూభాగాన్ని తుఫాను ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించారు. ఈ తరుణంలో డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కోర్సు పూర్తి చేస్తే అవకాశాలు ఖాయం. ఈ విపత్తులను ముందుగానే గుర్తించడం, క్షతగాత్రులకు ఆపన్నహస్తం అందించడం, తక్షణం పునరావాస చర్యలు చేపట్టడం వంటివి నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ప్రధాన ఉద్దేశం. ఇందుకోసం సుశిక్షితులైన నిపుణుల ఆవశ్యకత ఎంతో. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు దేశవ్యాప్తంగా పలు ఇన్‌స్టిట్యూట్‌లు విపత్తు నిర్వహణ సంబంధిత కోర్సులకు శ్రీకారం చుట్టాయి.
డిప్లొమా నుంచి పీహెచ్‌డీ వరకు:
అకడెమిక్ స్థాయిలో విపత్తు నిర్వహణ కోర్సులు డిప్లొమా నుంచి పీహెచ్‌డీ స్థాయి వరకు అందుబాటులో ఉన్నాయి. సాధారణ ఇన్‌స్టిట్యూట్‌లే కాకుండా ఐఐటీ వంటి ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లు కూడా డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సంబంధిత కోర్సులను అందిస్తున్నాయి. అయితే నిపుణుల సలహా ప్రకారం.. జాగ్రఫీ, జియాలజీ, సోషియాలజీ, సోషల్ వర్క్ వంటి నేపథ్యం గల వారికి ఈ కోర్సు మరింత మెరుగైన అవకాశాలు కల్పిస్తుంది.
నేర్పించే నైపుణ్యాలు:
డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కోర్సులో విపత్తు బాధిత ప్రజలను ఆదుకోవడం, పునరావాస కార్యక్రమాలను సమర్థంగా నిర్వహించడం, ఆరోగ్య సంబంధ సేవలను అందించడం వంటి అంశాలను బోధిస్తారు.
24X7 స్వభావంతో ఉంటేనే:
కేవలం ప్రస్తుత అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ కోర్సును ఎంచుకోవడం సరికాదు. 24X7 (అనుక్షణం) అప్రమత్తంగా వ్యవహరించే లక్షణం, ఆ స్థాయిలో మానసిక సంసిద్ధత ఉంటేనే ఈ కెరీర్‌లో రాణించడం సాధ్యం. సామాజిక సేవా దృక్పథం ఉన్నవారికి చక్కగా సరితూగే కోర్సు విపత్తు నిర్వహణ.
ఉపాధి అవకాశాలు:
డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు బహుళ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ఇటు ప్రభుత్వ రంగంలో.. ఇటు ప్రైవేటు విభాగంలోనూ ఇవి లభిస్తున్నాయి. ప్రైవేటు రంగంలో ఎమర్జెన్సీ శాఖలో ఎక్కువ అవకాశాలున్నాయి. వీటితోపాటు స్వచ్ఛంద సంస్థలు, యూఎన్‌ఓ అనుబంధ సంస్థల్లోనూ ఉపాధి ఖాయం. వీరికి ప్రారంభంలో సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ లేదా ఆపరేషన్ అనలిస్ట్, సోషల్ వర్కర్స్, సేఫ్టీ ఇంజనీర్స్, మెడికల్ హెల్త్ ఎక్స్‌పర్ట్స్, ఎన్విరాన్‌మెంటల్ ఎక్స్‌పర్ట్స్, రిహాబిలిటేషన్ ఎక్స్‌పర్ట్స్, డిజాస్టర్ రికవరీ ఎనలిస్ట్, డిజాస్టర్ రికవరీ టెక్నీషియన్, డిజాస్టర్ రిస్టోరేషన్ మేనేజర్ వంటి హోదాలు లభిస్తాయి. ఈ హోదాలు.. తాము అకడెమిక్ స్థాయిలో ఎంచుకున్న ఎలక్టివ్స్ ఆధారంగా ఉంటాయి. ఎంట్రీ లెవల్‌లో నెలకు కనీసం రూ. పది వేల నుంచి పదిహేను వేల జీతం ఖాయం. అంతేకాకుండా బోధన రంగంలో కూడా అవకాశాలు లభిస్తాయి. పీహెచ్‌డీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ విభాగంలో అధ్యాపకులుగా కెరీర్ ప్రారంభించే వీలుంది.
విదేశాల్లోనూ అవకాశాలు:
డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌లో ఉన్నత విద్య (పీజీ, పీహెచ్‌డీ తదితర) కోర్సులు పూర్తి చేసిన వారికి విదేశాల్లోనూ విస్తృత అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతం ఎక్కువగా గల దేశాలు, భూకంప ప్రభావిత దేశాల్లో డిజాస్టర్ మేనేజ్‌మెంట్ నిపుణుల అవసరం ఏర్పడి పలు అవకాశాలు లభిస్తున్నాయి. ప్రారంభంలోనే నెలకు రూ. లక్షల వేతనంతో ఉపాధినందుకునే వీలుంది.
డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కెరీర్అనుకూలతలు, ప్రతికూలతలు
అనుకూలతలు
డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌కు సంబంధించి ఏదైనా ఒక సంస్థలో ఉద్యోగంలో చేరిన వారికి సాధారణ రోజుల్లో పనివేళలు ఇతర ఉద్యోగాల మాదిరిగానే ఉంటాయి. అవి..
- క్షణాల్లో స్పందించే నైపుణ్యం..
- ఎంతటి విపత్తులోనైనా బాధితులను సంరక్షించే సాహసం..
- సదరు బాధితులకు ఉపశమనం కల్పించే తత్వం..

- ఆపదలో ఉన్న వ్యక్తులను ఆదుకున్నామనే సంతృప్తి
- ఇటీవల కాలంలోనే దీనికి గుర్తింపు పెరుగుతున్న నేపథ్యంలో సదరు కోర్సు పూర్తి చేసిన వారికి అవకాశాలు ఖాయం.
- విపత్తులు సంభవించిన సమయంలో నిర్ణీత వేళలు అనే పరిమితి లేకుండా పనిచేయాల్సి ఉండటం.
- కేవలం తమ ప్రాంతంలోనే కాకుండా.. వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వర్తించడం.
- ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎకాలజీ అండ్ ఎన్విరాన్‌మెంట్-న్యూఢిల్లీ; కోర్సు: ఎమ్మెస్సీ
- ఐఐటీ-రూర్కీ; కోర్సు: పీజీ డిప్లొమా ఇన్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్
- ఐఐటీ-కాన్పూర్; కోర్సు: ఎర్త్‌క్వేక్ ఇంజనీరింగ్‌లో ఎంటెక్, పీహెచ్‌డీ
- టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్; కోర్సు: డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌లో ఎంఏ/ఎమ్మెస్సీ
- నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్-న్యూఢిల్లీ.. స్వల్పకాలిక వ్యవధిలో పలు కోర్సులను అందిస్తోంది.
- మద్రాస్ యూనివర్సిటీ; కోర్సు: పీజీ డిప్లొమా ఇన్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్.
- ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్-డెహ్రాడూన్; కోర్సు: జియోహజార్డ్స్‌లో సర్టిఫికెట్, పీజీ డిప్లొమా, ఎమ్మెస్సీ.
- తాజాగా ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ కూడా డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌లో సర్టిఫికెట్, పీజీ డిప్లొమా కోర్సులను ప్రవేశ పెట్టింది.
- మన రాష్ట్రంలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌లో ఎం.ఫిల్, పీహెచ్‌డీ కోర్సులను అందిస్తోంది.
డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌కు సంబంధించి ఏదైనా ఒక సంస్థలో ఉద్యోగంలో చేరిన వారికి సాధారణ రోజుల్లో పనివేళలు ఇతర ఉద్యోగాల మాదిరిగానే ఉంటాయి. అవి..
- ఉదయం 9 గంటలు: ఆఫీస్‌కు చేరుకోవడం
- పది గంటలు: అప్పటికే పలు అంశాలకు సంబంధించిన ఫైళ్లను, సంస్థ విధి విధానాలపై చర్చలు సాగించడం.
- 1:30: లంచ్ బ్రేక్
- 2 గంటలు: మళ్లీ విధుల్లోకి
- 5:30: ఆ రోజు సాగించిన కార్యకలాపాలు, వాటికి సంబంధించిన ఫైళ్లు, ఇతర నోట్స్‌లను ఒక క్రమ పద్ధతిలో అమర్చుకోవడం.
- 6:00: ఆ రోజు విధులు ముగించుకోవడం.
- కానీ విపత్తులు, ఇతర ప్రమాదాలు సంభవించినప్పుడు ఈ పనివేళలకు మించి విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. అవసరమైతే కార్యక్షేత్రానికి వెళ్లేందుకు కూడా సిద్ధమై ఉండాలి.
- సహనం, ఓర్పు
- దీర్ఘ దృష్టి
- ఎదుటి వారిని మెప్పించే తత్వం
- అన్ని సంస్కృతులు, నేపథ్యాలతో ఇమడగలిగే లక్షణం.
- డేటా అనలిటికల్ స్కిల్స్
- ప్రారంభంలో నెలకు రూ. పది వేల నుంచి రూ. పదిహేను వేల జీతం లభిస్తుంది.
- మూడు, నాలుగేళ్ల అనుభవంతో రెట్టింపు జీతం అందుకునే అవకాశం.
- అంతర్జాతీయ సంస్థల్లో ప్రారంభంలోనే నెలకు దాదాపు రూ. లక్ష జీతం లభించే అవకాశం.
సాహస యువతకు సరైన కోర్సు.. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కోర్సు.. సాహసం, ధైర్యం వంటి లక్షణాలు గలిగిన యువతకు సరిపడే కోర్సు. అంతేకాకుండా అరుదైన, ప్రత్యేక సాంకేతిక నైపుణ్యాలు అవసరమైన కోర్సు. అకడెమిక్‌గా, కెరీర్ పరంగా ప్రస్తుతం అంతగా అవగాహన, అవకాశాలు లేకున్నప్పటికీ.. విపత్తుల నిర్వహణ, నివారణ దిశగా ప్రభుత్వాలు పలు చర్యలు, పథకాలు చేపడుతున్న నేపథ్యంలో సమీప భవిష్యత్తులో డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఒక చక్కటి కెరీర్‌గా రూపుదిద్దుకోవడం ఖాయం. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఔత్సాహిక విద్యార్థులు ఇప్పట్నుంచే ఈ దిశగా ప్రణాళిక రూపొందించుకుంటే చక్కటి భవిష్యత్తుకు బాట వేసుకున్నట్లే. |
Published date : 11 Jul 2014 11:32AM