బీపీవో, కేపీవో...కెరీర్ ఆశాజనకమేనా?
Sakshi Education
భారత బిజినెస్ ప్రాసెస్ ఔట్‌సోర్సింగ్ (బీపీవో), నాలెడ్జ్ ప్రాసెస్ ఔట్‌సోర్సింగ్ (కేపీవో) రంగాలకు అమెరికా వెన్నెముక! ఒక విధంగా ఆయా రంగాల మనుగడకు ఆ దేశమే అధారం. అయితే అమెరికాలో ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ రంగాలకు కష్టాలు మొదలయ్యాయి. ట్రంప్ ప్రభుత్వంతీసుకొస్తున్న కఠిన నిబంధనల ఫలితంగా అమెరికా బహుళజాతి సంస్థలు ఔట్‌సోర్సింగ్‌ను తగ్గించుకునే చర్యలు ప్రారంభించాయి. దీంతో బీపీవో, కేపీవో రంగాల్లో ఉద్యోగ అవకాశాలపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో బీపీఓ, కేపీఓ రంగాల్లో తాజా పరిస్థితి, భవిష్యత్ కార్యకలాపాలు, కొలువుల తీరుతెన్నులపై విశ్లేషణ...
చక్కటి కమ్యూనికేషన్ స్కిల్స్, సోర్స్ కంట్రీ లాంగ్వేజ్‌పై పట్టున్నవారికి.. డిగ్రీ స్పెషలైజేషన్‌తో పనిలేకుండా బీపీవో రంగం అవకాశాలు అందిస్తుంది. బీపీవోతో పోల్చితే కేపీవో కాస్త భిన్నం. ఇది డేటా అనలిటిక్స్, రీసెర్చ్ అనాలిసిస్ తదితర నైపుణ్యాలతో ముడిపడిన రంగం. ఇందులో బీటెక్, ఎంటెక్, ఎంబీఏ వంటి ప్రొఫెషనల్ కోర్సుల విద్యార్థులు తేలిగ్గా కొలువులు అందుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ రెండు రంగాలూ అనిశ్చితిని ఎదుర్కొంటున్నాయి.
అమెరికా నిబంధనలే..
వాస్తవానికి భారత బీపీవో, కేపీవో సంస్థల అవసరం అమెరికా కంపెనీలకే ఎక్కువగా ఉంది. దేశంలోని బీపీవో, కేపీవో సంస్థల క్లయింట్లలో దాదాపు 50 శాతం మేర అమెరికా సంస్థలే ఉన్నాయి. అయితే అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ వచ్చీ రాగానే ఔట్‌సోర్సింగ్‌పై ఆధారపడుతున్న అమెరికా సంస్థలపై ఆంక్షలు విధించారు. ఇది మన దేశ సంస్థల పాలిట శరాఘాతంగా మారింది. అమెరికాకు చెందిన హెచ్‌ఎఫ్‌ఎస్ సర్వే 2016-17లో భారత బీపీవో, కేపీవో రంగాల విలువ దాదాపు 145 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా వేయగా.. అనూహ్యంగా తగ్గింది. ట్రంప్ ఆంక్షల నేపథ్యంలో ఇప్పటికే 30 శాతం అమెరికా కంపెనీలు తిరోగమనంలో ఉన్నాయి. ఇది సహజంగానే మన ఐటీఈఎస్ సంస్థలపై ప్రతికూల ప్రభావం చూపింది.
ఆటోమేషన్ ప్రభావం :
ఆటోమేషన్.. బీపీవో, కేపీవో రంగాల్లో అనిశ్చితికి మరో ముఖ్య కారణంగా నిలుస్తోంది. బీపీవో విషయంలో వాయిస్ సర్వీసెస్ పరంగా కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)కు ప్రాధాన్యమిస్తున్నాయి. అదేవిధంగా కేపీవో రంగంలో డేటా అనలిటిక్స్, రీసెర్చ్ అనాలిసిస్ వంటి కీలక కార్యకలాపాలకు రోబోటిక్ టెక్నాజీని ఉపయోగిస్తున్నాయి. దీంతో ఆయా రంగాల్లో ఉద్యోగ నియామకాలపై ప్రతికూల ప్రభావం పడుతోంది. గతేడాదితో పోల్చితే కొత్త కొలువుల పరంగా 35 శాతం మేర తగ్గుదల నమోదైంది. బీపీవో, కేపీవో రంగాల్లో నియామకాల పరంగా ఎంట్రీ లెవల్ ఉద్యోగాలపై ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంది. దీనికి కారణం ఎంట్రీ లెవల్‌లో కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, కస్టమర్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్ తదితర ఉద్యోగాల విషయంలో ఆటోమేషన్ విధానాలను అనుసరించడమే.
ఆన్‌లైన్ హైరింగ్ :
ఆన్‌లైన్ హైరింగ్‌ను బీపీవో, కేపీవో రంగాల్లో నియామకాల పరంగా సందిగ్ధతకు కారణంగా చెప్పొచ్పు. నేరుగా ఔట్‌సోర్సింగ్ సేవలు పొందడంపై ఆంక్షలు విధించిన నేపథ్యంలో అమెరికా కంపెనీలు ఆన్‌లైన్ హైరింగ్‌పై దృష్టిపెట్టాయి. ఇందులో భాగంగా నాన్-వాయిస్ ఔట్‌సోర్సింగ్ కార్యకలాపాల నిర్వహణకు ఫ్రీలాన్సింగ్ విధానాన్ని ఎంచుకుంటున్నాయి. గడచిన మూడు నెలల్లో ఐటీ, ఐటీఈఎస్ రంగాల్లో కనిష్టంగా 9 శాతం, గరిష్టంగా 15 శాతం మేర ఆన్‌లైన్ హైరింగ్స్ పెరిగినట్లు పలు స్టాఫింగ్ సంస్థల గణాంకాల ఆధారంగా తెలుస్తోంది.
భవిష్యత్ ఆశాజనకమా?
ప్రస్తుతం బీపీవో, కేపీవో రంగాల్లో ఒడిదొడుకులు ఎదురైనా భవిష్యత్‌లో మళ్లీ పుంజుకుంటాయని, దేశీయంగా బలోపేతమవుతాయని ప్రముఖ స్టాఫింగ్ సంస్థ టీమ్ లీజ్ అంచనా వేస్తోంది. వచ్చే ఆరు నెలల్లో కేపీవో విభాగంలో నియామకాల పరంగా ముంబై, హైదరాబాద్, పుణె, బెంగళూరు తదితర నగరాల్లో 4 శాతం చొప్పున పెరుగుదల ఉంటుందని టీమ్ లీజ్ పేర్కొంది. ముఖ్యంగా ఇ-కామర్స్ సంస్థల కార్యకలాపాలు విస్తరిస్తున్న నేపథ్యంలో బీపీవో, కేపీవో సంస్థలు.. నియామకాల పరంగా ముందుంటాయని ‘మాన్‌స్టర్’ అంచనా వేసింది. అదేవిధంగా మరో ప్రముఖ రీసెర్చ్ సంస్థ మ్యాన్ పవర్ గ్రూప్ సైతం రానున్న కాలంలో సర్వీస్ సెక్టార్ నియామకాల్లో 24 శాతం పెరుగుదల ఖాయమని పేర్కొంది.
అనుభవం ఉంటేనే..
‘ఒక వైపు ఒడిదొడుకులు.. మరోవైపు భవిష్యత్ ఆశాజనకం’ అనే అంచనాల నేపథ్యంలో నియామకాలకు సంబంధించి కంపెనీలు పూర్తిగా అనుభవజ్ఞులకే ప్రాధాన్యమిస్తున్నాయి. ముఖ్యంగా డేటా అనలిటిక్స్, రీసెర్చ్ అనాలిసిస్, ఫైనాన్షియల్ అనాలిసిస్ తదితర కీలక విభాగాల్లో కనీసం నాలుగేళ్ల అనుభవం ఉన్నవారినే నియమించుకుంటున్నాయి. బీపీఓ విభాగంలో ఫ్రంట్ ఆఫీస్ రోల్స్‌లో కమ్యూనికేషన్ స్కిల్స్ కీలకంగా మారాయి.
లభించే ఉద్యోగాలు..
బీపీవో రంగం:
కేపీవో రంగం :

- ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్
- వాయిస్ ఎక్స్‌పర్ట్
- కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్
- డాక్యుమెంటేషన్ ఎగ్జిక్యూటివ్
- టీమ్ మేనేజర్స్
కేపీవో రంగం :
- రిపోర్ట్ అనలిస్ట్
- ఫైనాన్షియల్ అనలిస్ట్
- కన్సల్టింగ్ ఎగ్జిక్యూటివ్
- డేటా అనలిస్ట్
- డేటా మేనేజ్‌మెంట్ ఎగ్జిక్యూటివ్
క్లయింట్స్ అంటే అమెరికానే కాదు! ఔట్‌సోర్సింగ్ అంటే మనం కేవలం అమెరికా గురించే ఆలోచిస్తున్నాం. ట్రం ప్ ఆంక్షలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. కానీ, అమెరికాతోపాటు యూరప్, ఆస్ట్రేలి యా తదితర దేశాల్లోనూ మన ఐటీ సంస్థలకు క్లయింట్లు ఉన్నారు. వాటిని పరిగణనలోకి తీసుకుంటే భారతఔట్‌సోర్సింగ్ విభాగానికి ఎలాంటి ముప్పు లేదని చెప్పొచ్చు. అయితే ఎక్కువ మంది అమెరికా గురించి ఆలోచిం చడం వల్ల అనవసర ఆందోళన తలెత్తెంది. ఔత్సాహికులు ఆటోమేషన్ నైపుణ్యాలు పెంచు కుంటే అవకాశాలకు ఎలాంటి ఢోకా ఉండదు. - ఆర్.శ్రీకాంత్, హెడ్, ఆర్‌పీఓ, మ్యాన్ పవర్ గ్రూప్. |
డిజిటల్ నైపుణ్యాలతో అవకాశాలు ప్రస్తుతం బీపీఓ, కేపీఓ రంగాల్లో నెలకొన్న పరిస్థితిని గమనిస్తే.. సంప్రదాయ డిగ్రీ కోర్సుల విద్యార్థులు మరిన్ని నైపుణ్యాలను సొంతం చేసుకోవాల్సిన అవసరముందని చెప్పొచ్చు. దీంతోపాటు కమ్యూనికేషన్ స్కిల్స్, డిజిటల్ నైపుణ్యాలను పెంపొందించుకోవాలి. అప్పుడే క్లిష్ట పరిస్థితుల్లోనూ ఉన్నత అవకాశాలు అందుకోవచ్చు. - ప్రియాంక శర్మ, హెడ్, పీఆర్, మాన్‌స్టర్ ఇండియా. |
Published date : 09 Jan 2018 01:10PM