ఎస్‌బీఐ పీవో..జీడీ & ఇంటర్వ్యూ
Sakshi Education
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ).. ప్రొబేషనరీ ఆఫీసర్ మెయిన్ ఫలితాలు వెలువడ్డాయి. మూడంచెల ఎంపిక ప్రక్రియలో రెండో దశ మెయిన్ ఎగ్జామినేషన్‌లో విజయం సాధించిన వారు ఇప్పుడు తుది దశ ఎంపిక ప్రక్రియ గ్రూప్ డిస్కషన్ (జీడీ), పర్సనల్ ఇంటర్వ్యూ(పీఐ)లో విజయంపై దృష్టిసారించాలి. సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభం కానున్న జీడీ, పీఐల్లో రాణించడానికి నిపుణుల సలహాలు, సూచనలు...
ఎస్‌బీఐ.. దేశవ్యాప్తంగా 2,200 ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో) ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన మెయిన్ ఎగ్జామినేషన్ ఫలితాలను విడుదల చేసింది. ఎంపిక ప్రక్రియలో చివరి దశ అయిన గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూలకు అభ్యర్థుల జాబితా ప్రకటించింది. ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్‌కు దాదాపు 48 వేల మంది ఉత్తీర్ణత సాధించారు. వారిలోంచి 4,767 మందిని చివరి దశకు ఎంపిక చేసింది. జాబితాలో నిలిచిన అభ్యర్థులు తుది మెట్టును అధిరోహించాలంటే.. అన్ని రకాలుగా అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకోవాలి.
గ్రూప్ డిస్కషన్
గ్రూప్ డిస్కషన్‌లో 10-12 మంది అభ్యర్థులను ఒక బృందంగా ఏర్పాటు చేస్తారు. ఏదైనా ఒక అంశం ఇచ్చి, దానిపై బృంద చర్చ నిర్వహిస్తారు. గ్రూప్ డిస్కషన్‌లోని అంశాలు అధిక శాతం సమకాలీన అంశాలకు సంబంధించి ఉంటాయి. అభ్యర్థులకు నిర్దిష్టంగా ఒక టాపిక్ ఇచ్చాక దానిపై చర్చకు సన్నద్ధమయ్యేలా రెండు నిమిషాల సమయం ఇస్తారు. జీడీ అయిదు నుంచి పది నిమిషాలు కొనసాగుతుంది. బృంద సభ్యులందరూ సదరు అంశంపై తమ అభిప్రాయాలు చెప్పాల్సి ఉంటుంది. జీడీ సందర్భంగా అభ్యర్థుల సబ్జెక్ట్ నాలెడ్జ్‌తోపాటు ప్రవర్తన శైలిని గమనిస్తారు. కాబట్టి అభ్యర్థులు వ్యక్తిగతంగా కొన్ని ముఖ్యమైన అంశాలపై శ్రద్ధ తీసుకోవాలి. జీడీ నిర్వాహకులను మెప్పించే విధంగా వ్యవహరించాలి. బాడీ లాంగ్వేజ్‌లో సమతుల్యత పాటించడం ఎంతో అవసరం. బృందంలోని ఇతరులకు మాట్లాడే అవకాశం ఇవ్వాలి. ఎక్కువ సేపు మాట్లాడటం కంటే సదరు టాపిక్‌పై వ్యక్తం చేసిన అభిప్రాయంలో స్పష్టత, అవగాహనకు ప్రాధాన్యం ఉంటుందని గుర్తించాలి.
సమయస్ఫూర్తి అవసరం
గ్రూప్ డిస్కషన్‌లో ఒక్కోసారి అభ్యర్థులకు ఏ మాత్రం అవగాహన లేని టాపిక్ ఎదురుకావచ్చు. అలాంటప్పుడు ఆందోళన చెందకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. టాపిక్‌పై ఇద్దరు, ముగ్గురు అభ్యర్థులు చర్చించే వరకు వేచి చూడాలి. వారు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలతోపాటు, వారు పేర్కొంటున్న ఫ్యాక్ట్స్, ఫిగర్స్‌ను నోట్ చేసుకోవాలి. ఫలితంగా టాపిక్‌పై విషయ పరిజ్ఞానంతోపాటు, తాము వ్యక్తం చేయదగ్గ అభిప్రాయంపైనా స్పష్టత వస్తుంది. గ్రూప్ డిస్కషన్ సమయంలో అభ్యర్థులు తమ అభిప్రాయాన్ని స్పష్టంగా, నిర్దిష్టంగా చెప్పాలి. గ్రూప్ డిస్కషన్‌లో అభ్యర్థులు పాటించాల్సిన మరో ప్రధాన విషయం స్వీయ నియంత్రణ, అనవసర ఆవేశకావేశాలు ప్రదర్శించకూడదు.
జీడీలో పట్టు కోసం
జీడీకి సిద్ధమయ్యే అభ్యర్థులు సమకాలీన అంశాలపై సమగ్ర అవగాహన పెంపొందించుకోవాలి. ముఖ్యంగా బ్యాంకింగ్, వర్తక, వాణిజ్య రంగాల్లో తాజా పరిణామాలు, వాటిపై నిపుణుల అభిప్రాయాల గురించి సమాచారం సేకరించుకోవాలి. ఇందుకు సరైన మార్గం దినపత్రికలు చదవడం. పత్రికల్లో వచ్చే వ్యాసాలు, కథనాల నుంచి ముఖ్యమైన పాయింట్లు రాసుకోవాలి. గ్రూప్ డిస్కషన్‌లో రాణించేందుకు అభ్యర్థులు వొకాబ్యులరీని పెంపొందించుకోవడం కూడా చాలా అవసరం. ఫలితంగా జీడీ సమయంలో ఎలాంటి తడబాటు లేకుండా మాట్లాడే సంసిద్ధత లభిస్తుంది.
జీడీలో వచ్చేందుకు అవకాశమున్న అంశాలు
ఎస్‌బీఐలో ఇతర అనుబంధ బ్యాంకుల విలీనం, జీఎస్‌టీ బిల్లు, ఒలింపిక్స్‌లో భారత ప్రదర్శన.. క్రీడల విషయంలో ప్రభుత్వ విధానాలు, జమ్ము- కశ్మీర్ అంశంపై భారత్ అనుసరిస్తున్న వైఖరి, ఎన్‌ఎస్‌జీలో భారత సభ్యత్వం, అమెరికా అధ్యక్ష ఎన్నికలు, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న డెరైక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ స్కీం..
పర్సనల్ ఇంటర్వ్యూలో ప్రతిభకు..
గ్రూప్ డిస్కషన్‌లో ఎంపికైన అభ్యర్థులు చివరిగా ఎదుర్కోవాల్సిన ప్రక్రియ.. పర్సనల్ ఇంటర్వ్యూ. అయిదుగురు సభ్యుల బోర్డ్ నిర్వహించే ఇంటర్వ్యూలో అధిక శాతం ప్రశ్నలు అకడమిక్ ప్రొఫైల్, ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్, పర్సనల్ ప్రొఫైల్, ఫ్యూచర్ గోల్స్ గురించే ఉంటాయి. అభ్యర్థులకు భిన్నమైన ప్రశ్నలు ఎదురయ్యే అవకాశముంది. టెక్నికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న అభ్యర్థులు బ్యాంకింగ్ కెరీర్ వైపు ఎందుకు రావాలనుకుంటున్నారు? భవిష్యత్తులో మీ లక్ష్యాలేంటి? ఒకవేళ ఎంపిక కాకపోతే ఏం చేస్తారు? వంటి ప్రశ్నలు ఎదురవుతాయి. వీటికి సంబంధించి స్పష్టంగా సమాధానం ఇచ్చేలా సన్నద్ధమవ్వాలి. జాబ్ సెక్యూరిటీ, ఆకర్షణీయమైన వేతనాలు వంటి కారణాలతో ఈ రంగాన్ని ఎంపిక చేసుకున్నామనే సమాధానాలు సరికాదు. తమ అకడమిక్ నైపుణ్యాలను విధుల్లో అన్వయించగలిగేందుకు ఉన్న మార్గాలను, తద్వారా సంస్థ టార్గెట్ కస్టమర్లకు సంతృప్తికరంగా సేవలందించే సామర్థ్యాన్ని వివరించేలా సమాధానాలు ఇవ్వాలి.

గ్రూప్ డిస్కషన్‌లో అభ్యర్థులు చర్చను తామే ప్రారంభించే విధంగా వ్యవహరించాలి. ఆ మేరకు సన్నద్ధమవాలి. జీడీ సమయంలో సహచర అభ్యర్థులు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇచ్చే నేర్పు, వారి సందేహాలను నివృత్తి చేసే నైపుణ్యం, తమ అభిప్రాయాలతో విభేదించే వారిని మెప్పించే తత్వం ఎంతో అవసరం. అప్పుడే నిర్వాహకులకు అభ్యర్థిపై సానుకూల అభిప్రాయం ఏర్పడుతుంది. గ్రూప్ డిస్కషన్ నిర్వహించిన నిపుణులే ఇంటర్వ్యూ బోర్డ్‌లో ఉంటారు. అందువల్ల అంతకుముందు జీడీలో వచ్చిన టాపిక్ గురించి క్షుణ్నంగా చెప్పమని అడిగే అవకాశముంది. కాబట్టి జీడీ అంశం ఇంటర్వ్యూలోనూ కీలకమవుతుందని గుర్తించాలి. ఇంటర్వ్యూలో అధిక శాతం ప్రొఫైల్ ఆధారిత ప్రశ్నలు అడుగుతారు. హాబీలకు సంబంధించిన ప్రశ్నలు సైతం ఎదురయ్యే అవకాశముంది. వీటిపై సన్నద్ధంగా, ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తే విజయం ఖాయం. - రాకేశ్ పెండ్యాల, ఎస్‌బీఐ పీవో-2015 విజేత (ఎస్‌బీఐ తిరుపతి మెయిన్ బ్రాంచ్ పీవో) |
Published date : 29 Aug 2016 02:17PM