గ్రేట్ కెరీర్‌కు కేరాఫ్ ఎంపీసీ
Sakshi Education
జియాలజిస్టుగా విలువైన గనులను కనుక్కోవాలనుందా? ఐఫోన్ సృష్టికర్త స్టీవ్‌జాబ్స్‌ను మించిన గుర్తింపును కోరుకుంటున్నారా? ప్రపంచంలోనే అపర కుబేరుడిగా కీర్తికెక్కిన బిల్‌గేట్స్‌లా పేరు తెచ్చుకోవాలనుందా? లేదా సివి రామన్‌లా నోబెల్ బహుమతిని పొందాలనుందా? ఈ ప్రశ్నలకు మీ సమాధానం ‘ఎస్’ అయితే మీరు ఇంటర్‌లో ఎంపీసీ గ్రూపును ఎంచుకోవాలి.
పదో తరగతి తర్వాత... ఏంటి? అనే ప్రశ్న ఎదురైతే ఎన్నో కోర్సులు.. ఐటీఐ, పాలిటెక్నిక్, హోటల్ మేనేజ్‌మెంట్, సెట్విన్ కోర్సులు, స్వయం ఉపాధినందించే వివిధ కోర్సులు పదో తరగతి పాసైన విద్యార్థికి స్వాగతం పలుకుతున్నాయి. ఎక్కువ మంది చూపు మాత్రం ఇంటర్మీడియెట్‌లో చేరి ఎంపీసీ గ్రూప్‌ను ఎంచుకోవడం. ఈ గ్రూప్‌కు ఉన్నటువంటి ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలు మరే గ్రూప్‌కు లేవంటే అతిశయోక్తి కాదు! ఈ నేపథ్యంలో ఇంటర్‌లో ఎంపీసీ గ్రూప్‌ను తీసుకున్న విద్యార్థికి ఉండే అవకాశాల విశ్లేషణ..
ఎంపీసీ గ్రూప్ ప్రాధాన్యత:
ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరాలనే ఆసక్తి ఉంటే.. ఇంటర్‌లో ఎంపీసీ గ్రూప్‌లో చేరాలి. తద్వారా భవిష్యత్‌లో సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, మెట్లర్జీ, కంప్యూటర్స్.. ఇలా ఏ బ్రాంచ్‌లో చేరినా రాణించడానికి పునాది ఏర్పడుతుంది. ఇంటర్ ఎంపీసీతో ఐఐటీ-జేఈఈ, ఏఐఈఈఈ, బిట్‌శాట్.. తదితర ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు రాసి.. ప్రతిష్టాత్మక ఐఐటీలతోపాటు బిట్స్ పిలానీ వంటి ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీల్లో విద్యను అభ్యసించొచ్చు. ఎన్‌డీఏ ద్వారా డిఫెన్స్ రంగంలో ప్రవేశించవచ్చు. ఇంజనీరింగ్ పూర్తయ్యాక బ్రాంచ్‌ను బట్టి ఉద్యోగంలో చేరొచ్చు. లేదంటే.. గేట్ రాసి ఎంటెక్, క్యాట్‌తో ఐఐఎంలలో ఎంబీఏ, జీమ్యాట్‌తో ప్రముఖ బిజినెస్ స్కూళ్లలో మేనేజ్‌మెంట్ విద్యను అభ్యసించవచ్చు. బహుళజాతి కంపెనీల్లో కీలకమైన ఉద్యోగాలు సొంతం చేసుకునే వీలుంటుంది. ఇంజనీరింగ్‌లో సీటు రాకపోయినా, చేరడం ఇష్టంలేకపోయినా... బీఎస్సీలో చేరిపోవచ్చు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్స్, జియాలజీ, ఎలక్ట్రానిక్స్, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ వంటి సబ్జెక్టులతో బీఎస్సీ పూర్తిచేయడం ద్వారా.. మంచి జాబ్స్ సొంతం చేసుకోవచ్చు. గేట్, సీఎస్‌ఐఆర్-నెట్, జామ్ రాసి మరింత ఉన్నత విద్యను అభ్యసించవచ్చు. తర్వాత పీహెచ్‌డీ పూర్తిచేయడం ద్వారా అధ్యాపక వృత్తిలో ఉన్నతస్థాయికి చేరుకోవచ్చు. ఇవేకాకుండా వివిధ యూనివర్సిటీలు అందిస్తోన్న ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీలో చేరొచ్చు. ఆ తర్వాత పీహెచ్‌డీ పూర్తిచేసుకొని ప్రొఫెసర్‌గా, రీసెర్చ్ స్కాలర్‌గా ఎదగొచ్చు. ఫ్యాషన్ టెక్నాలజీ, లా, సీఏ, ఐసీడబ్ల్యూఏ, సీఎస్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, హోటల్ మేనేజ్‌మెంట్, టూరిజం మేనేజ్‌మెంట్, ఫొటోగ్రఫీ, ఇంటీరియర్ డిజైన్, పెయింటింగ్, ఫ్యాషన్ టెక్నాలజీ, ప్యాకేజింగ్, ఇండస్ట్రియల్ డిజైన్, పెలైట్, ఫైర్ ఇంజనీరింగ్ ఇలా అనేక ప్రత్యామ్నాయాలు ఎంపీసీ విద్యార్థుల సొంతం. డిగ్రీ పూర్తయ్యాక సివిల్స్, గ్రూప్స్, బ్యాంక్ జాబ్స్, రైల్వే జాబ్స్‌తోపాటు మరెన్నో ప్రభుత్వ, ప్రయివేట్ ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి.
ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ:
ఇంటర్మీడియెట్ ఎంపీసీ పూర్తిచేసిన విద్యార్థులు... ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీలో చేరొచ్చు. రాష్ట్రంలోని చాలా యూనివర్సిటీల్లో ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రతి ఏటా ఆయా వర్సిటీలు నిర్వహించే ప్రవేశ పరీక్షల ఆధారంగా వీటిలో చేరొచ్చు. ఐదేళ్ల కోర్సు వ్యవధిలో.. మొదటి మూడేళ్లు పూర్తయ్యాక బ్యాచిలర్ డిగ్రీ సర్టిఫికెట్ కూడా విద్యార్థుల చేతికందుతుండటం ఈ ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సుల ప్రత్యేకత.
బీఎస్సీ:
ఇంటర్ ఎంపీసీ విద్యార్థికి ఇంజనీరింగ్‌లో చేరడానికి వీలుకాకుంటే... తక్షణ ప్రత్యామ్నాయం... బీఎస్సీ! మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీతోపాటు కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్స్, స్టాటిస్టిక్స్, బయోటెక్నాలజీ, జియాలజీ, బయోకెమిస్ట్రీ వంటి పలు కాంబినేషన్లు బీఎస్సీలో అందుబాటులో ఉన్నాయి. మూడేళ్ల బీఎస్సీ పూర్తిచేయడం ద్వారా అనేక ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలు సొంతం చేసుకోవచ్చు.
ఎంఎస్సీ:
రాష్ట్రంలో ఆయా యూనివర్సిటీలు నిర్వహించే పీజీసెట్‌ల ద్వారా ఎంఎస్సీలో అడ్మిషన్ లభిస్తుంది. ఇందులో ఆర్గానిక్ కెమిస్ట్రీ, జియాలజీ, మెరైన్ జియాలజీ, స్టాటిస్టిక్స్, మైక్రోబయాలజీ, మెరైన్ బయాలజీ, ఆస్ట్రోఫిజిక్స్, స్పేస్ ఫిజిక్స్ వంటి అపార అవకాశాలున్న కోర్సులున్నాయి. ఇవి పూర్తయ్యాక టీచింగ్, లేదా రీసెర్చ్ రంగంవైపునకు వెళ్లొచ్చు. పీహెచ్‌డీ కూడా పూర్తిచేస్తే ఈ రెండు రంగాల్లోనూ ఎవరికీ తీసిపోసి అవకాశాలను సొంతం చేసుకోవచ్చు.
డీఈడీ, బీఈడీ:
ఉపాధ్యాయ వృత్తి పట్ల ఆసక్తి ఉంటే.. ఇంటర్ పూర్తికాగానే డైట్‌సెట్ రాసి డీఈడీ కోర్సులో ప్రవేశం పొందొచ్చు. కోర్సు పూర్తై తర్వాత డీఎస్సీ పరీక్షలో మంచి ర్యాంకు సాధించి వివిధ ప్రాథమిక పాఠశాలల్లో సెకండరీ గ్రేడ్ టీచర్‌గా జాబ్ సొంతం చేసుకోవచ్చు. బీఎస్సీ తర్వాత ఎడ్‌సెట్ రాసి బీఈడీలో చేరి డీఎస్సీ ద్వారా ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేయొచ్చు.
అపార అవకాశాల ‘లా’:
ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రపంచమే ఓ కుగ్రామంగా మారింది. ఇదే సందర్భంలో వివిధ కంపెనీలు తమ కార్యాలయాలను ఇతర దేశాల్లో సైతం ఏర్పాటు చేసుకుంటున్నాయి. వివిధ ఉత్పత్తుల తయారీ నుంచి పేటెంట్ హక్కుల వరకు ఎన్నో వివాదాలు. ఈ నేపథ్యంలో లా కోర్సులు అభ్యసించిన విద్యార్థులకు బహుముఖ రూపాల్లో అవకాశాలున్నాయి. ఈ కోర్సుల్లో ప్రవేశించాలంటే మన రాష్ట్రంలో లాసెట్ రాయాలి. జాతీయస్థాయిలో పేర్కొన్న లా స్కూల్స్‌లో ప్రవేశం పొందాలంటే జాతీయస్థాయిలో నిర్వహించే కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్)లో మంచి ర్యాంకు సొంతం చేసుకోవాలి. దీని ద్వారా వివిధ స్పెషలైజేషన్లతో లా కోర్సులు అభ్యసించి కెరీర్‌ను సుసంపన్నం చేసుకోవచ్చు. అర్హత: 10+2 లేదా తత్సమానం.
గేట్:
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్(గేట్)... ప్రతిష్టాత్మక ఐఐఎస్‌సీ, ఐఐటీలు, ఎన్‌ఐటీలు, యూనివర్సిటీలలో ఇంజనీరింగ్ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి రాజమార్గం. ఇంజనీరింగ్ రంగంలో ఉన్నత స్థానాలను అధిరోహించడానికి ఇది కీలక మెట్టు. అర్హత: నాలుగేళ్ల ఇంజనీరింగ్, లేదా తత్సమానం.
ఎంబీఏ
క్యాట్:
ఇంజనీరింగ్+మేనేజ్‌మెంట్... ఇక కార్పొరేట్ ప్రపంచంలో తిరుగుండదు..! కామన్ అడ్మిషన్ టెస్ట్.. క్యాట్‌తో ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఐఐఎం)లలో ప్రవేశం పొందొచ్చు.
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ.
వెబ్‌సైట్: www.catiim.in
ఎక్స్‌ఏటీ:
ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ-జేవియర్ లేబర్ రిలేషన్స్ ఇన్‌స్టిట్యూట్. ఇది మన దేశంలో ప్రతిష్టాత్మక బిజినెస్ స్కూల్. ఎక్స్‌ఏటీ ద్వారా ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐలో అడ్మిషన్ పొందొచ్చు. దీంతోపాటు దాదాపు మరో 70కిపైగా బిజినెస్ స్కూల్స్‌లో ఎక్స్‌ఏటీ ద్వారా అడ్మిషన్ లభిస్తుంది.
అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ, లేదా తత్సమానం
వెబ్‌సైట్: www.xlri.edu
మ్యాట్:
మేనేజ్‌మెంట్ అప్టిట్యూడ్ టెస్ట్-మ్యాట్‌ను ఆల్‌ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్ నిర్వహిస్తుంది. సంవత్సరానికి నాలుగుసార్లు ఈ పరీక్షను నిర్వహిస్తారు. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 200 మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రవేశం పొందొచ్చు.
వెబ్‌సైట్: www.aima-ind.org
ఇవే కాకుండా ఏటీఎంఏ, మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ (ఎండీఐ), ముద్రా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్స్, నిర్మా యూనివర్సిటీ వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు అందించే మేనేజ్‌మెంట్ కోర్సుల్లో చేరొచ్చు.
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ వయా ఎంసీఏ:
రాష్ట్రంలో ఎంసీఏలో చేరేందుకు మార్గం... ఐసెట్. ఇందులో ర్యాంకు సాధించడం ద్వారా మూడేళ్ల ఎంసీఏ పూర్తిచేసుకుని సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా స్థిరపడొచ్చు లేదా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీల్లో ప్రవేశానికి నిర్వహించే నిమ్‌సెట్ ద్వారా మూడేళ్ల ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు.
భవిష్యత్‌లో ప్రభుత్వ ఉద్యోగాలు
సివిల్స్:
ఇంటర్ ఎంపీసీ తర్వాత ఇంజనీరింగ్, లేదా బీఎస్సీ (డిగ్రీ) పూర్తికాగానే సివిల్ సర్వీసెస్ పరీక్షకు హాజరుకావచ్చు. కొన్ని ఇంజనీరింగ్ కోర్ సబ్జెక్టులు ఆఫ్షన్లుగా కూడా ఉన్నాయి. దాంతోపాటు మ్యాథ్స్‌పై పట్టు ఉన్న అభ్యర్థులు దాన్ని కూడా ఆఫ్షన్‌గా తీసుకొని విజయం సాధిస్తున్నారు.
బీఎస్సీ పాస్ కాగానే సివిల్స్‌పై దృష్టి సారించి సర్వీస్ సాధించినవాళ్లు ఎంతోమంది ఉన్నారు. సివిల్స్ ప్రతిఏటా డిసెంబర్‌లో నోటిఫికేషన్ విడుదలవుతుంది. ప్రిలిమ్స్ మేలో, మెయిన్స్ అక్టోబర్-నవంబర్‌లలో నిర్వహిస్తారు. సివిల్స్‌లో విజయం సాధించడం ద్వారా ఐఏఎస్, ఐఎఫ్‌ఎస్, ఐపీఎస్‌తోపాటు పలు సెంట్రల్ సర్వీసుల్లో ఛాలెంజింగ్ ఉద్యోగాలు లభిస్తాయి.
వెబ్‌సైట్: www.upsc.gov.in
ఏపీపీఎస్సీ గ్రూప్స్:
మన రాష్ట్రంలో ఇంజనీరింగ్, బీఎస్సీ అభ్యర్థులు పోటీ పడే జాబ్స్ ఏపీపీఎస్సీ గ్రూప్స్. డిప్యూటీ కలెక్టర్, డీఎస్‌పీ, కమర్షియల్ టాక్స్ ఆఫీసర్, ఆర్‌టీవోతోపాటు మరికొన్ని స్టేట్ సర్వీసు పోస్టులకు గ్రూప్-1 ద్వారా నియామకాలు చేస్తారు. అంతేకాకుండా గ్రూప్-2 ద్వారా డిప్యూటీ తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్, మున్సిపల్ కమిషనర్, ఎక్సైజ్ ఎస్‌ఐ వంటి పోస్టులను సాధించవచ్చు.
వెబ్‌సైట్: www.apspsc.gov.in
ఐఎఫ్‌ఎస్:
ఇంజనీరింగ్ పూర్తిచేసిన వాళ్లతోపాటు బీఎస్సీ సైన్‌స అభ్యర్థులు కూడా ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ పరీక్ష రాసేందుకు అర్హులు. ఈ పరీక్షను యూపీఎస్‌సీ ప్రతిఏటా నిర్వహిస్తోంది. నోటిఫికేషన్ ఫిబ్రవరి రెండో వారంలో విడుదలవుతుంది. పరీక్ష జూలై మొదటివారంలో నిర్వహిస్తారు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఐఎఫ్‌ఎస్‌కు ఎంపికలు పూర్తిచేస్తారు.
వెబ్‌సైట్: www.upsc.gov.in
సీడీఎస్:
యూపీఎస్‌సీ ప్రతిఏటా రెండుసార్లు కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ పరీక్ష నిర్వహిస్తోంది. దీనికి ఇంజనీరింగ్ అభ్యర్థులు హాజరుకావచ్చు. అదేవిధంగా సెంట్రల్ పోలీస్ ఫోర్సెస్ (అసిస్టెంట్ కమాండెంట్స్)లో కూడా చేరిపోవచ్చు.
వెబ్‌సైట్: www.upsc.gov.in
డిఫెన్స్:
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్, ఇండియన్ నావీ, ఇండియన్ ఆర్మీలో... షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్లు; ఎలక్ట్రికల్, ఏరోనాటికల్ విభాగాల్లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు; ఇస్రో, డీఆర్‌డీవో, ఎన్‌ఆర్‌ఎస్‌ఏ, ఎన్‌ఎఫ్‌సీ, డీఆర్‌డీఎల్ వంటి రక్షణ రంగ సంస్థల్లోనూ ఇంజనీర్లకు పలు ఉద్యోగాలు లభిస్తాయి.
జాబ్స్ ఇన్ పీఎస్‌యూ:
ఏయిర్ ఇండియా, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, బీఈఎంఎల్, బీఈఎల్, బీహెచ్‌ఈఎల్, బీపీసీఎల్, ఈసీఐఎల్, ఈఐఎల్, ఎఫ్‌సీఐ, గెయిల్, హెచ్‌ఏఎల్, ఎన్‌హెచ్‌పీసీ, ఓఎన్‌జీసీ, సెయిల్, పవర్ గ్రిడ్ వంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో ఇంజనీరింగ్ విద్యార్థులకు జాబ్స్ లభిస్తున్నాయి.
ఐఈఎస్:
ఇంజనీరింగ్ అభ్యర్థులు ప్రతిఏటా ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్ ద్వారా ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాలు కైవసం చేసుకోవచ్చు. ఐఈఎస్ నోటిఫికేషన్ జనవరి మొదటివారంలో విడుదలవుతుంది. పరీక్ష జూన్‌లో ఉంటుంది.

Published date : 07 Jun 2012 08:18PM