వీవీఎం విజేతలకు అవార్డులు.. ప్రైజ్ మనీ
విజేతలకు అవార్డులు..
నాలుగు స్థాయిల్లో విజేత లుగా నిలిచిన విద్యార్థులకు అవార్డులను ప్రదానం చేస్తారు.
పాఠశాల స్థాయి..
ప్రతి తరగతిలో టాప్‌లో నిలిచిన ముగ్గురిని స్కూల్ విజేతలుగా ప్రకటిస్తారు. ప్రతి తరగతి నుంచి 10 మంది దరఖాస్తు చేసుకోవడం తప్పనిసరి. దీని ప్రకారం ప్రతి స్కూల్ నుంచి 18 మంది విజేతలుగా నిలుస్తారు. ప్రతి క్లాస్‌లో ప్రతిభ కనబర్చిన మొదటి ముగ్గురికి మెరిట్ సర్టిఫికేట్స్ అందిస్తారు.
జిల్లా స్థాయి..
జిల్లాలోని అన్ని స్కూల్స్‌ను పరిగణనలోకి తీసుకుంటారు. ఒక్కో తరగతి నుంచి ముగ్గురిని జిల్లా విజేతలుగా ఎంపిక చేస్తారు. దీని ప్రకారం ప్రతి జిల్లా నుంచి మొత్తం 18 మంది ఎంపికైనట్లు ప్రకటిస్తారు. వీరికి మెరిట్ సర్టిఫికెట్స్ అందిస్తారు.
రాష్ట్రస్థాయి..
ప్రతి తరగతి నుంచి టాప్‌లో ఉన్న 20 మంది విద్యార్థులకు రాష్ట్రస్థాయి క్యాంప్‌లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. వీరిలో ఒక్కో తరగతి నుంచి ముగ్గురి చొప్పున మొత్తం 18 మందిని రాష్ట్ర విజేతలుగా ప్రకటిస్తారు. క్యాంప్‌లో పాల్లొన్న వారికి సర్టిఫికెట్‌తో పాటు మెమోంటోను కూడా ప్రధానం చేస్తారు. ప్రతి తరగతి నుంచి మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి వరుసగా రూ.5000, రూ.3000, రూ. 2000చొప్పున నగదు బహుమతి అందిస్తారు.
జాతీయ స్థాయి..
ప్రతి రాష్ట్రం నుంచి టాప్2లో నిలిచిన విద్యార్థులకు నేషనల్ క్యాంప్‌లో పాల్గొనే అర్హత దక్కుతుంది. ప్రతి తరగతి నుంచి ముగ్గురి చొప్పున మొత్తం 18మందిని జాతీయస్థాయి విజేతలుగా ప్రకటిస్తారు. దీనికి ఆదనంగా ప్రతి జోన్ స్థాయిలో తరగతి నుంచి ముగ్గురి చొప్పున మొత్తం 18మందిని జోనల్ విజేతలుగా ప్రకటిస్తారు. క్యాంప్‌లో పాల్గొన్న వారికి సర్టిఫికేట్, మెమోంటోలు అందిస్తారు. జాతీయస్థాయిలో ప్రతి తరగతి నుంచి విజేతలుగా నిలిచిన టాప్ ముగ్గురు విద్యార్థులకు వరుసగా రూ.25,000, రూ.15,000, రూ.10,000 నగదు బహుమతి అందిస్తారు. అలాగే జోనల్‌స్థాయి టాప్ ముగ్గురు విద్యార్థులకు వరుసగా రూ.5000, రూ.3000, రూ.2000 బహుమతి అందుతుంది.