Skip to main content

వీటిపై దృష్టి పెడితేనే.. జేఈఈ- అడ్వాన్స్‌డ్ సాధించడం సులువు!

అభ్యర్థులు ప్రిపరేషన్ సమయంలోనే ఒక ప్రాబ్లమ్ లేదా ప్రశ్నను సమాధానానికి అంచెల వారీ సాధనపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు.

గత ఏడాది పరీక్షలో మూడు సబ్జెక్ట్‌ల నుంచి మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలతోపాటు, ఇంటిగ్రల్ వాల్యూ ఆధారిత ప్రశ్నలు కూడా అడిగారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని కేవలం బిట్స్ సాధనకు పరిమితం కాకుండా..ప్రాబ్లమ్‌ను స్టెప్ వైజ్‌గా పరిష్కరించే విధంగా కృషి చేయాలని సూచిస్తున్నారు.

మెయిన్ తర్వాత రివిజన్..
అభ్యర్థులు మెయిన్ పరీక్షలు ముగిసిన తర్వాత అడ్వాన్స్‌డ్‌కు సన్నద్ధతలో అధిక శాతం పునశ్చరణకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఈ ఏడాది మెయిన్ చివరి సెషన్ మేలో ముగుస్తుంది. అప్పటి నుంచి జూలై 3న జరిగే అడ్వాన్స్‌డ్‌కు లభించే సమయం నెల రోజులు మాత్రమే. ఈ వ్యవధిలో కొత్త అంశాల సాధనకు బదులు అప్పటికే పూర్తి చేసిన టాపిక్స్ రివిజన్‌కు ఎక్కువ సమయం కేటాయించాలి. అలాగే మాక్ టెస్ట్‌లు, మోడల్ టెస్ట్‌ల ద్వారా ప్రిపరేషన్‌ను అంచనావేసుకోవాలి.

జేఈఈ-అడ్వాన్స్‌డ్ సమాచారం

  1. అడ్వాన్స్‌డ్ పరీక్ష తేదీ: జూలై 3, 2021.
  2. రెండు పేపర్లలో పరీక్ష జరుగుతుంది.
  3. జేఈఈ-మెయిన్ నుంచి 2.5 లక్షల మందికి అడ్వాన్స్‌డ్‌కు అర్హత లభిస్తుంది.
  4. అడ్వాన్స్‌డ్ పరీక్షలో ప్రతిభ ఆధారంగా 23 ఐఐటీల్లో ప్రవేశం పొందొచ్చు.
  5. ఐఐటీల్లో గత ఏడాది గణాంకాల ప్రకారం-నాలుగేళ్ల బీటెక్, ఇంటిగ్రేటెడ్ బీటెక్+ఎంటెక్ కోర్సుల్లో అందుబాటులో ఉన్న మొత్తం సీట్ల సంఖ్య14,770. వీటికి అదనంగా మహిళలకు ప్రత్యేకంగా సూపర్ న్యూమరరీ కోటా పేరుతో అదనంగా మరో 1,583 సీట్లు ఉన్నాయి.
  6. జేఈఈ-మెయిన్ ద్వారా అర్హత లభించే ఎన్‌ఐటీలు 32. వీటిలో అందుబాటులో ఉన్న సీట్లు 22,655. వీటికి అదనంగా మహిళలకు 851 సూపర్ న్యూమరరీ సీట్లు.
  7. జేఈఈ-మెయిన్ అర్హతగా 26 ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశం లభిస్తుంది. వీటిలో అందుబాటులో ఉన్న సీట్లు 5,404. మహిళలకు అదనంగా 239 సూపర్ న్యూమరరీ సీట్లు.
  8. జేఈఈ-మెయిన్ ర్యాంకు ఆధారంగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని మరో 29 ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రవేశం పొందొచ్చు. వీటిలో అందుబాటులో ఉన్న సీట్లు.. 5,620.


న్యూమరికల్ వాల్యూ..ప్రశ్నలకు ప్రాధాన్యం
ఫిజిక్స్‌లో అభ్యర్థులు న్యూమరికల్ వాల్యూ ఆధారిత ప్రశ్నలకు ప్రాధాన్యం ఇవ్వాలి. అదే విధంగా ఇంటర్ రిలేటెడ్‌గా ఉండే టాపిక్స్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించొద్దు. మెయిన్ తర్వాత కొత్త అంశాలు చదువుదాం అనే ధోరణి కూడా సరికాదు. ఇప్పటి నుంచే సిలబస్, గత ప్రశ్న పత్రాల ఆధారంగా ప్రిపరేషన్ సాగించడం వల్ల మంచి మార్కులు సొంతం చేసుకునే అవకాశం ఉంది.
- సీహెచ్.రామకృష్ణ, ఫిజిక్స్ సబ్జెక్ట్ నిపుణులు

ప్రాక్టీస్ + తులనాత్మక అధ్యయనం
అడ్వాన్స్‌డ్‌కు హాజరయ్యే అభ్యర్థులు ప్రాక్టీస్‌కు, తులనాత్మక అధ్యయనానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రతి సబ్జెక్ట్‌కు సంబంధించి ప్రాథమిక భావనలు, సూత్రాలు, సిద్ధాంతాలపై అవగాహన పెంచుకోవాలి. అదేవిధంగా ప్రాక్టీస్ సమయంలోనే అప్లికేషన్ అప్రోచ్‌తో సాధన చేస్తే.. పరీక్షలో ప్రశ్నను ఎలా అడిగినా సమాధానం ఇచ్చే సంసిద్ధత లభిస్తుంది.
- రవీంద్ర, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ నిపుణులు

ఇంకా చదవండి: part 1: ఈ ఏడాది జూలై 3న జేఈఈ-అడ్వాన్స్‌డ్-2021.. నిబంధనల్లో మినహాయింపులివే..

Published date : 18 Jan 2021 03:02PM

Photo Stories