Skip to main content

విద్యార్థులు ఆన్‌లైన్‌లో నైపుణ్యాలు పెంచుకునేలా కేంద్ర విద్యాశాఖ ప్రత్యేక విధానం.. నీట్‌ 2.0 గురించి తెలుసుకోండిలా..

ఆన్‌లైన్‌ లెర్నింగ్‌.. ఎడ్‌టెక్‌ ప్లాట్‌ఫామ్స్‌.. ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్న మాటలు! విద్యార్థులు, ఉద్యోగార్థులు.. తమ అకడమిక్‌ బోధనకు అదనంగా.. తాజా నైపుణ్యాల కోసం ఆన్‌లైన్‌ బాట పడుతున్న పరిస్థితి.

కాని ఎడ్‌టెక్‌ సంస్థలు అందించే కోర్సుల ఫీజు అందరికీ అందుబాటులో ఉండటం లేదు. దీనికి పరిష్కారంగా.. అన్ని నేపథ్యాల విద్యార్థులకు ఆన్‌లైన్‌ కోర్సులను అందుబాటులోకి తెచ్చేలా కేంద్ర విద్యాశాఖ ప్రత్యేక విధానాన్ని రూపొందించింది. ఆ విధానమే.. నేషనల్‌ ఎడ్యుకేషనల్‌ అలయన్స్‌ ఫర్‌ టెక్నాలజీ (నీట్‌)! దీనికి ఏఐసీటీఈ పర్యవేక్షణ సంస్థగా వ్యవహరిస్తోంది. ఈ నీట్‌ విధానం గతేడాది అందుబాటులోకి వచ్చింది. తాజాగా నీట్‌ 2.0 పేరిట మరికొన్ని ఎడ్‌టెక్‌ సంస్థలతో ఒప్పందం చేసుకొని.. విద్యార్థులకు మరెన్నో కోర్సులను అందుబాటులోకి తెచ్చారు. ఈ నేపథ్యంలో... నీట్‌ విధానాలు, విద్యార్థులకు కలిగే ప్రయోజనాలు, సద్వినియోగం చేసుకోవడానికి మార్గాల గురించి తెలుసుకుందాం...

ప్రస్తుతం దేశంలో వందల సంఖ్యలో ఎడ్‌టెక్‌ సంస్థలు.. వేలకొద్దీ ఆన్‌లైన్‌ కోర్సులు. వాటిలో చేరాలంటే ఎంతో కొంత ఫీజు చెల్లించాల్సిందే. ఐటీ, లేటెస్ట్‌ టెక్నాలజీ వంటి కోర్సులకు ఫీజు రూ.వేలల్లోనే ఉంటోంది. దీంతో విద్యార్థులు అంతమొత్తం చెల్లించుకోలేకపోతున్నారు. ఫలితంగా ఎంతోమంది కొత్త నైపుణ్యాలకు దూరమవుతున్నారు. దీనికి పరిష్కారంగా తెచ్చిన విధానమే.. నేషనల్‌ ఎడ్యుకేషనల్‌ అలయన్స్‌ ఫర్‌ టెక్నాలజీ(నీట్‌)!!

విద్యార్థులకు ఆన్‌లైన్‌ నైపుణ్యాలు..
దేశంలోని ఎడ్‌టెక్‌ (ఆన్‌లైన్‌ లెర్నింగ్‌) సంస్థలతో ఒప్పందం చేసుకొని.. అవి అందించే కోర్సులను విద్యార్థులకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచడమే నీట్‌ ప్రధాన లక్ష్యం! గతేడాది జనవరిలో నీట్‌ 1.0 పేరుతో తొలి దశలో 13 ఎడ్‌టెక్‌ కంపెనీలతో ఒప్పందం చేసుకొని.. 45 కోర్సులు,సేవలను విద్యార్థులకు అందుబాటులో ఉంచారు. తాజాగా కొద్దిరోజుల క్రితం నీట్‌ 2.0 పేరుతో మరో 48 కంపెనీలతో ఒప్పందం చేసుకున్నారు. దీనిద్వారా 79 కోర్సులు, సేవలను అందుబాటులోకి తెచ్చారు. వీటితోపాటు సదరు ఒప్పందం చేసుకున్న ఎడ్‌టెక్‌ కంపెనీలు.. విద్యార్థులకు ఆన్‌లైన్‌ లెర్నింగ్, ప్లేస్‌మెంట్స్, ఇంటర్న్‌షిప్‌ అవకాశాలు అందేలా సహకరించాల్సి ఉంటుంది.
 
Published date : 02 Mar 2021 03:10PM

Photo Stories