విద్యార్థుల ప్రతిభకు పట్టం...ఒలింపియాడ్స్
Sakshi Education
ఒలింపియాడ్స్.. మ్యాథమెటిక్స్, సైన్స్ సబ్జెక్ట్ లలో స్కూల్ విద్యార్థుల్లో దాగున్న ప్రతిభను గుర్తించి, ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ప్రక్రియ! సెకండరీ, హయ్యర్ సెకండరీ స్థాయిలోని అత్యంత ప్రతిభావంతులైన విద్యార్థులు ప్రాంతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ వేదికల దాకా వెళ్లేందుకు ఒలింపియాడ్స్ దోహదపడుతుంది.
అంతేకాకుండా సైన్స్, మ్యాథమెటిక్స్‌లో కెరీర్ ప్రారంభించాలనుకునే విద్యార్థులు.. పాఠశాల స్థాయి నుంచే ఆ దిశగా సమాయత్త్తమయ్యేందుకు ఒలింపియాడ్స్ చక్కటి మార్గం. రాష్ట్ర స్థాయి నుంచి పలు దశల్లో ఉండే ఎంపిక ప్రక్రియలోవిజయం సాధిస్తే.. అంతర్జాతీయ ఒలింపియాడ్స్‌లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. 2018-19 సంవత్సరానికి సంబంధించి ఒలింపియాడ్స్ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో పూర్తి వివరాలు...
ప్రయోజనాలు...
ప్రస్తుతం మనదేశంలో.. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఆస్ట్రానమీ, జూనియర్ సైన్స్‌లో నేషనల్ ఒలింపియాడ్స్ నిర్వహిస్తున్నారు.
అర్హతలు..
మ్యాథమెటికల్ ఒలింపియాడ్: 8, 9, 10, 11, 12 తరగతుల విద్యార్థులు మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్‌కు హాజరయ్యేందుకు అర్హులు. 2018 మ్యాథ్స్ ఒలింపియాడ్‌కు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు 1999, ఆగస్టు 1 తర్వాత జన్మించి ఉండాలి.
సైన్స్ ఒలింపియాడ్ (ఆస్ట్రానమీ, బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్): ఈ సబ్జెక్టుల్లో సైన్స్ ఒలింపియాడ్‌కు దరఖాస్తు చేసుకునేందుకు 10+2/ఇంటర్ పూర్తికాని విద్యార్థులు మాత్రమే అర్హులు. 8, 9, 10, 11, 12 తరగతుల విద్యార్థులు మొదటి దశకు దరఖాస్తు చేసుకోవచ్చు. దాంతోపాటు జూలై 1, 1999, జూన్ 30, 2004 మధ్య జన్మించి ఉండాలి.
జూనియర్ సైన్స్ ఒలింపియాడ్: పదో తరగతి పూర్తిచేయని విద్యార్థులు మాత్రమే జూనియర్‌సైన్స్ ఒలింపియాడ్‌కు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఆరు నుంచి పదో తరగతి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే 2004, జనవరి 1; 2005, డిసెంబర్ 31 మధ్య జన్మించి ఉండాలి.
మ్యాథమెటికల్ ఒలింపియాడ్...
మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్‌కు దరఖాస్తు చేసుకునేందుకు వెబ్‌సైట్:
https://olympiads.hbcse.tifr.res.in/olympiads-2018-19/mathematical-olympiad/
సైన్స్ ఒలింపియాడ్.. 5 దశలు
తొలిదశగా పేర్కొనే నేషనల్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్ నుంచి తుది దశ ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ వరకూ... మొత్తం అయిదు దశల్లో ఈ ప్రక్రియ సాగుతోంది.
తొలి దశ: ముందుగా తొలి దశలో నేషనల్ స్టాండర్డ్ ఎగ్జామ్ (ఎన్‌ఎస్‌ఈ) జరుగుతుంది. ఈ పరీక్షను రీజనల్ ఒలింపియాడ్స్ పేరుతో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో నిర్దేశిత కోఆర్డినేటర్ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. 2018-19 సైన్స్ ఒలింపియాడ్‌కు సంబంధించి 2018 నవంబర్‌లో నేషనల్ స్టాండర్డ్ ఎగ్జామ్ జరుగుతుంది. ఇందులో ప్రతి రాష్ట్రం/కేంద్ర పాలిత ప్రాంతం నుంచి ప్రతి సబ్జెక్టు నుంచి గరిష్టంగా 300 మందిని జాతీయస్థాయిలో నిర్వహించే ఇండియన్ నేషనల్ ఒలింపియాడ్‌కు ఎంపిక చేస్తారు.
రెండో దశ: ఈ దశలో ఇండియన్ నేషనల్ ఒలింపియాడ్ జరుగుతుంది. ఎన్‌ఎస్‌ఈలో ఉత్తీర్ణత సాధించి మెరిట్ జాబితాలో నిలిచిన అభ్యర్థులకు నేషనల్ ఒలింపియాడ్ నిర్వహిస్తారు. 2018-19 సంవత్సరానికి సంబంధించి సైన్స్ ఒలింపియాడ్ రెండో దశ పరీక్షను 2019 జనవరిలో దేశవ్యాప్తంగా 18 కేంద్రాల్లో నిర్వహించనున్నారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా 300 నుంచి 500 మంది విద్యార్థులకు తదుపరి దశకు అవకాశం లభిస్తుంది.
మూడో దశ: దీన్ని ఓరియెంటేషన్ కమ్ సెలక్షన్ క్యాంప్ (ఓసీఎస్‌సీ) అని పిలుస్తారు. నేషనల్ ఒలింపియాడ్‌లో అత్యున్నత ప్రతిభ చూపిన వారికి ముంబైలోని హోమీబాబా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్‌లో ఓసీఎస్‌సీ ఉంటుంది. రెండో దశ నేషనల్ ఒలింపియాడ్ విజేతల్లో 35 నుంచి 50 మంది వరకు అవకాశం లభిస్తుంది. వీరికి ఈ దశలో హోమీబాబా రీసెర్చ్ సెంటర్‌లో థియరీ, ప్రాక్టికల్ తరగతుల్లో శిక్షణ ఇస్తారు. ఇది ఏప్రిల్/మే/జూన్ 2019లో జరుగుతుంది.
నాలుగో దశ: దీన్ని ప్రి డిపార్చర్ క్యాంప్ పేరుతో పిలుస్తారు. మూడో దశ ఓసీఎస్‌సీలో అత్యున్నత ప్రతిభ చూపిన విద్యార్థులు అంతర్జాతీయ ఒలింపియాడ్‌లో రాణించేందుకు శిక్షణ ఇచ్చే దశ ఇది. ఓసీఎస్‌సీలో ప్రతిభ ఆధారంగా గరిష్టంగా ఆరుగురు విద్యార్థులకు ప్రీ డిపార్చర్ క్యాంప్ పేరుతో శిక్షణనిస్తారు. ఇది జూలై/నవంబర్‌లో ఉంటుంది.
అయిదో దశ: ఇది ఇంటర్నేషనల్ ఒలింపియాడ్స్‌లో తుది దశ.. అంతర్జాతీయ వేదికపై.. ఇంటర్నేషనల్ ఒలింపియాడ్స్‌లో ప్రతిభను చూపే దశ. ప్రీ డిపార్చర్ క్యాంప్‌లో పొందిన శిక్షణ ఆధారంగా.. ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది. ఇందులో విజేతలకు గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ అందిస్తారు. ఈ చివరి దశ జూలై/డిసెంబర్‌లో జరుగుతుంది.
పరీక్ష- తీరుతెన్నులు...
ఎన్‌ఎస్‌ఈ (రీజనల్ ఒలింపియాడ్స్)
సైన్స్ సబ్జెక్ట్స్ పరీక్షలు..
ఆస్ట్రానమీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టులకు సంబంధించి.. ఒలింపియాడ్స్ ప్రక్రియలో తొలిదశగా భావించే నేషనల్ స్టాండర్డ్ ఎగ్జామ్ (రీజనల్ ఒలింపియాడ్)లో ప్రతి సబ్జెక్ట్‌లోనూ 80 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష సిలబస్ ఇంటర్మీడియెట్ స్థాయిలో ఉంటుంది. పరీక్ష వ్యవధి రెండు గంటలు.
నేషనల్ ఒలింపియాడ్స్ విభిన్నంగా...
మొదటి దశ దాటిన వారికి రెండో దశలో.. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఆస్ట్రానమీల్లో నిర్వహించే నేషనల్ ఒలింపియాడ్స్ పరీక్ష కొంత భిన్నంగా ఉంటుంది.
ఫిజిక్స్: ఆరు ప్రాబ్లమ్స్ ఇచ్చి పరిష్కరించమని అడుగుతారు. గరిష్టంగా 75 మార్కులకు పూర్తిగా డిస్క్రిప్టివ్ విధానంలోనే ఉంటుంది. ప్రతి ప్రశ్నకు క్లిష్టత స్థాయి ఆధారంగా మార్కులు నిర్ణయిస్తారు. అభ్యర్థుల్లోని ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, అప్లికేషన్ ఓరియెంటేషన్, క్రిటికల్ థింకింగ్ వంటి నైపుణ్యాలను పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉంటాయి.
కెమిస్ట్రీలో: ఇందులో అయిదు ప్రశ్నలు అడుగుతారు. గరిష్ట మార్కుల విధానం ఏటా వేర్వేరుగా ఉంటుంది. ఉదాహరణకు 2017లో 113 మార్కులకు నిర్వహించగా.. 2016లో 102 మార్కులకు నిర్వహించారు.
బయాలజీ: బయాలజీకి సంబంధించి రెండో దశ పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో రెండు విభాగాలుగా(సెక్షన్-ఎ, బి)గా ఉంటుంది. పరీక్ష వ్యవధి రెండు గంటలు. పాయింట్ల విధానంలో మూల్యాంకనం జరుగుతుంది. ఉదాహరణకు 2016లో సెక్షన్-ఎలో 29 ప్రశ్నలకు 29 పాయింట్లు; సెక్షన్-బిలో 29 ప్రశ్నలకు 71 పాయింట్లు కేటాయించారు. అదే విధంగా 2017లో సెక్షన్-ఎలో 21 ప్రశ్నలకు 21 పాయింట్లు; సెక్షన్-బిలో 32 ప్రశ్నలకు 79 పాయింట్లు కేటాయించారు.
ఆస్ట్రానమీ: ఈ పరీక్ష (ఒలింపియాడ్)కు సంబంధించి 2018-19 సంవత్సరానికిగాను విద్యార్థులను రెండు రకాలుగా (గ్రూప్-ఎ, గ్రూప్-బి) వర్గీకరించారు. ఈ ప్రక్రియను నేషనల్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్‌లో ప్రతిభ ఆధారంగా చేపడతారు. గ్రూప్-ఎ పరిధిలో 2018, నవంబర్ 30 నాటికి ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం; గ్రూప్-బి పరిధిలో 2018, నవంబర్ 30 నాటికి ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం లేదా ఆ లోపు తరగతులు చదువుతున్న విద్యార్థులు ఉంటారు. ఎన్‌ఎస్‌ఈలో పొందిన మార్కుల ఆధారంగా తర్వాత దశలో నిర్వహించే ఇండియన్ నేషనల్ ఒలింపియాడ్‌లో ప్రతి గ్రూప్ నుంచి 250 మందికి అవకాశం ఇస్తారు. ప్రశ్నల తీరుతెన్నులు ఎన్‌ఎస్‌ఈ మాదిరిగానే ఉంటాయని పేర్కొన్నారు.
జూనియర్ సైన్స్ ఒలింపియాడ్ :
జూనియర్ సైన్స్ ఒలింపియాడ్‌లోనూ మొదటగా విద్యార్థులు నేషనల్ స్టాండర్డ్ ఎగ్జామ్ జూనియర్ సైన్స్ రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్ష 80 ప్రశ్నలతో 240 మార్కులకు నిర్వహిస్తారు. లభించే సమయం రెండు గంటలు. ఈ పరీక్షలో టాప్-300 అభ్యర్థులను ఇండియన్ జూనియర్ సైన్స్ ఒలింపియాడ్ పరీక్షకు ఎంపిక చేస్తారు. అందులో ప్రతిభచూపిన 30 మంది అభ్యర్థులకు.. హోమీబాబా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ఓరియెంటేషన్ కమ్ సెలక్షన్ క్యాంప్ నిర్వహిస్తారు. ఈ శిక్షణలో టాప్-5లో నిలిచిన విద్యార్థులను ఇంటర్నేషనల్ జూనియర్ సైన్స్ ఒలింపియాడ్‌కు ఎంపిక చేస్తారు.
ఇంటర్నేషనల్ ఒలింపియాడ్స్.. ఎంతో క్లిష్టం సైన్స్ ఇంటర్నేషనల్ ఒలింపియాడ్స్‌లో విజేతలను నిర్ణయించే ప్రక్రియ చాలా క్లిష్టంగా ఉంటుంది. నాలుగైదు గంటల వ్యవధిలో అభ్యర్థులకు థియరీ, ప్రాక్టికల్ ఆధారిత సమస్యలు ఇస్తారు. వీటిని నిర్ణీత సమయంలో పరిష్కరించిన వారే విజేతలుగా నిలుస్తారు.
సైన్స్ ఒలింపియాడ్స్ 2018-19 సమాచారం :
అభ్యర్థుల నమోదు ప్రక్రియ: 2018, ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 15 వరకు.
ఫీజు చెల్లింపు చివరి తేదీ: సెప్టెంబర్ 19, 2018.
పరీక్ష తేదీ: నవంబర్ 25, 2018.
నేషనల్ ఒలింపియాడ్‌కు ఎంపికైన అభ్యర్థుల జాబితా: జనవరి 2, 2019.
వివరాలకు వెబ్‌సైట్: www.iapt.org.in
పూర్తి వివరాలకు వెబ్‌సైట్:
https://olympiads.hbcse.tifr.res.in/
సైన్స్ ఒలింపియాడ్‌కు దరఖాస్తు చేసుకునేందుకు వెబ్‌సైట్:
https://olympiads.hbcse.tifr.res.in/how-to-participate/enrollment/science-olympiad/
ప్రయోజనాలు...
- సైన్స్, మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్స్‌లో అంతర్జాతీయ స్థాయిలో విజయం సాధించిన విద్యార్థులు స్వర్ణం, రజతం, కాంస్య పతకాలతోపాటు ప్రశంసాపత్రం సైతం సొంతం చేసుకోవచ్చు.
- భవిష్యత్‌లో విదేశీ యూనివర్సిటీల్లో ఉన్నత విద్యలో ప్రవేశాల పరంగా ప్రాధాన్యం లభించే అవకాశం ఉంటుంది.
- మ్యాథమెటిక్స్‌కు సంబంధించి ఇండియన్ నేషనల్ ఒలింపియాడ్‌లో విజేతలుగా నిలిస్తే... చెన్నై మ్యాథమెటికల్ ఇన్‌స్టిట్యూట్‌లో బీఎస్సీ మ్యాథ్స్ ఆనర్స్ కోర్సులో నేరుగా ప్రవేశం పొందొచ్చు.
- అలాగే ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్‌లో బీఎస్సీ మ్యాథ్స్, బ్యాచిలర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశానికి నిర్వహించే రాత పరీక్ష నుంచి మినహాయింపు లభిస్తుంది.
- కేవైపీవై స్కాలర్‌షిప్ ఎంపికలో ప్రాధాన్యం ఉంటుంది.
- ఇంటర్మీడియెట్/10+2 తర్వాత రాసే జేఈఈ మెయిన్, నీట్ వంటి క్లిష్టమైన పరీక్షల్లో విజయానికి ఒలింపియాడ్స్ రాసిన అనుభవం ఉపయోగపడుతుంది.
- సైన్స్, మ్యాథ్స్ విభాగాల్లో కెరీర్ దిశగా స్కూల్ స్థాయిలో మంచి పునాది పడుతుంది.
- నేషనల్ సైన్స్ ఒలింపియాడ్‌కు జాతీయ స్థాయిలో దేశంలోనే పరిశోధనల పరంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన హోమీబాబా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్ నోడల్ సెంటర్‌గా పనిచేస్తోంది.
- మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్‌ను కూడా భారత ప్రభుత్వ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీకి చెందిన నేషనల్ బోర్డ్ ఫర్ హయ్యర్ మ్యాథమెటిక్స్ (ఎన్‌బీహెచ్‌ఎం) తరఫున హోమీబాబా సెంటర్ పర్యవేక్షిస్తోంది.
- ఒలింపియాడ్స్ నిర్వహణకు అవసరమైన నిధులను డిపార్ట్‌మెంట్ ఆప్ అటామిక్ ఎనర్జీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇస్రో, ఎంహెచ్‌ఆర్‌డీ ద్వారా భారత ప్రభుత్వమే సమకూరుస్తుంది.
ప్రస్తుతం మనదేశంలో.. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఆస్ట్రానమీ, జూనియర్ సైన్స్‌లో నేషనల్ ఒలింపియాడ్స్ నిర్వహిస్తున్నారు.
అర్హతలు..
మ్యాథమెటికల్ ఒలింపియాడ్: 8, 9, 10, 11, 12 తరగతుల విద్యార్థులు మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్‌కు హాజరయ్యేందుకు అర్హులు. 2018 మ్యాథ్స్ ఒలింపియాడ్‌కు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు 1999, ఆగస్టు 1 తర్వాత జన్మించి ఉండాలి.
సైన్స్ ఒలింపియాడ్ (ఆస్ట్రానమీ, బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్): ఈ సబ్జెక్టుల్లో సైన్స్ ఒలింపియాడ్‌కు దరఖాస్తు చేసుకునేందుకు 10+2/ఇంటర్ పూర్తికాని విద్యార్థులు మాత్రమే అర్హులు. 8, 9, 10, 11, 12 తరగతుల విద్యార్థులు మొదటి దశకు దరఖాస్తు చేసుకోవచ్చు. దాంతోపాటు జూలై 1, 1999, జూన్ 30, 2004 మధ్య జన్మించి ఉండాలి.
జూనియర్ సైన్స్ ఒలింపియాడ్: పదో తరగతి పూర్తిచేయని విద్యార్థులు మాత్రమే జూనియర్‌సైన్స్ ఒలింపియాడ్‌కు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఆరు నుంచి పదో తరగతి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే 2004, జనవరి 1; 2005, డిసెంబర్ 31 మధ్య జన్మించి ఉండాలి.
మ్యాథమెటికల్ ఒలింపియాడ్...
- మ్యాథమెటికల్ ఒలింపియాడ్‌ను ప్రత్యేకంగా నిర్వహిస్తారు. ఈ ప్రక్రియ కూడా సైన్స్ ఒలింపియాడ్ ఎంపికను పోలి ఉంటుంది. ఇందులో మొత్తం ఆరు దశలు దాటాల్సి ఉంటుంది.
- మొదటి దశలో అభ్యర్థులు ప్రీ రీజనల్ మ్యాథమెటికల్ ఒలింపియాడ్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. ఈ పరీక్ష మూడు గంటల వ్యవధిలో ఉంటుంది. ఈ పరీక్షలో మెరిట్ ఆధారంగా 300 మంది విద్యార్థులను తర్వాత దశలో నిర్వహించే రీజనల్ మ్యాథమెటికల్ ఒలింపియాడ్ (ఆర్‌ఎంవో)కు ఎంపిక చేస్తారు.
- ఆర్‌ఎంఓలో మెరిట్ జాబితాలో నిలిచిన అభ్యర్థులు (గరిష్టంగా 30) మూడో దశ ఇండియన్ నేషనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ (ఐఎన్‌ఎంవో) పరీక్షను ఎదుర్కోవాలి. ఈ పరీక్ష నాలుగు గంటల వ్యవధిలో నిర్వహిస్తారు. ఈ సమయంలో అభ్యర్థులు కనీసం ఆరు ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఐఎంవో ట్రైనింగ్ క్యాంప్, ప్రీ డిపార్చర్ ఉంటాయి.
- ఈ దశల్లో శిక్షణ సమయంలో అత్యున్నత ప్రతిభ చూపిన అయిదుగురు అభ్యర్థులను ఇంటర్నేషనల్ మ్యాథమెటికల్ ఒలింపియాడ్‌కు ఎంపిక చేస్తారు.
- ఇంటర్నేషనల్ మ్యాథమెటికల్ ఒలింపియాడ్ పరీక్ష రెండు దశల్లో రెండు రోజులపాటు నిర్వహిస్తారు. ఈ పరీక్షలు నాలుగున్నర గంటల వ్యవధిలో ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటాయి.
మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్‌కు దరఖాస్తు చేసుకునేందుకు వెబ్‌సైట్:
https://olympiads.hbcse.tifr.res.in/olympiads-2018-19/mathematical-olympiad/
సైన్స్ ఒలింపియాడ్.. 5 దశలు
తొలిదశగా పేర్కొనే నేషనల్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్ నుంచి తుది దశ ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ వరకూ... మొత్తం అయిదు దశల్లో ఈ ప్రక్రియ సాగుతోంది.
తొలి దశ: ముందుగా తొలి దశలో నేషనల్ స్టాండర్డ్ ఎగ్జామ్ (ఎన్‌ఎస్‌ఈ) జరుగుతుంది. ఈ పరీక్షను రీజనల్ ఒలింపియాడ్స్ పేరుతో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో నిర్దేశిత కోఆర్డినేటర్ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. 2018-19 సైన్స్ ఒలింపియాడ్‌కు సంబంధించి 2018 నవంబర్‌లో నేషనల్ స్టాండర్డ్ ఎగ్జామ్ జరుగుతుంది. ఇందులో ప్రతి రాష్ట్రం/కేంద్ర పాలిత ప్రాంతం నుంచి ప్రతి సబ్జెక్టు నుంచి గరిష్టంగా 300 మందిని జాతీయస్థాయిలో నిర్వహించే ఇండియన్ నేషనల్ ఒలింపియాడ్‌కు ఎంపిక చేస్తారు.
రెండో దశ: ఈ దశలో ఇండియన్ నేషనల్ ఒలింపియాడ్ జరుగుతుంది. ఎన్‌ఎస్‌ఈలో ఉత్తీర్ణత సాధించి మెరిట్ జాబితాలో నిలిచిన అభ్యర్థులకు నేషనల్ ఒలింపియాడ్ నిర్వహిస్తారు. 2018-19 సంవత్సరానికి సంబంధించి సైన్స్ ఒలింపియాడ్ రెండో దశ పరీక్షను 2019 జనవరిలో దేశవ్యాప్తంగా 18 కేంద్రాల్లో నిర్వహించనున్నారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా 300 నుంచి 500 మంది విద్యార్థులకు తదుపరి దశకు అవకాశం లభిస్తుంది.
మూడో దశ: దీన్ని ఓరియెంటేషన్ కమ్ సెలక్షన్ క్యాంప్ (ఓసీఎస్‌సీ) అని పిలుస్తారు. నేషనల్ ఒలింపియాడ్‌లో అత్యున్నత ప్రతిభ చూపిన వారికి ముంబైలోని హోమీబాబా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్‌లో ఓసీఎస్‌సీ ఉంటుంది. రెండో దశ నేషనల్ ఒలింపియాడ్ విజేతల్లో 35 నుంచి 50 మంది వరకు అవకాశం లభిస్తుంది. వీరికి ఈ దశలో హోమీబాబా రీసెర్చ్ సెంటర్‌లో థియరీ, ప్రాక్టికల్ తరగతుల్లో శిక్షణ ఇస్తారు. ఇది ఏప్రిల్/మే/జూన్ 2019లో జరుగుతుంది.
నాలుగో దశ: దీన్ని ప్రి డిపార్చర్ క్యాంప్ పేరుతో పిలుస్తారు. మూడో దశ ఓసీఎస్‌సీలో అత్యున్నత ప్రతిభ చూపిన విద్యార్థులు అంతర్జాతీయ ఒలింపియాడ్‌లో రాణించేందుకు శిక్షణ ఇచ్చే దశ ఇది. ఓసీఎస్‌సీలో ప్రతిభ ఆధారంగా గరిష్టంగా ఆరుగురు విద్యార్థులకు ప్రీ డిపార్చర్ క్యాంప్ పేరుతో శిక్షణనిస్తారు. ఇది జూలై/నవంబర్‌లో ఉంటుంది.
అయిదో దశ: ఇది ఇంటర్నేషనల్ ఒలింపియాడ్స్‌లో తుది దశ.. అంతర్జాతీయ వేదికపై.. ఇంటర్నేషనల్ ఒలింపియాడ్స్‌లో ప్రతిభను చూపే దశ. ప్రీ డిపార్చర్ క్యాంప్‌లో పొందిన శిక్షణ ఆధారంగా.. ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది. ఇందులో విజేతలకు గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ అందిస్తారు. ఈ చివరి దశ జూలై/డిసెంబర్‌లో జరుగుతుంది.
పరీక్ష- తీరుతెన్నులు...
ఎన్‌ఎస్‌ఈ (రీజనల్ ఒలింపియాడ్స్)
సైన్స్ సబ్జెక్ట్స్ పరీక్షలు..
ఆస్ట్రానమీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టులకు సంబంధించి.. ఒలింపియాడ్స్ ప్రక్రియలో తొలిదశగా భావించే నేషనల్ స్టాండర్డ్ ఎగ్జామ్ (రీజనల్ ఒలింపియాడ్)లో ప్రతి సబ్జెక్ట్‌లోనూ 80 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష సిలబస్ ఇంటర్మీడియెట్ స్థాయిలో ఉంటుంది. పరీక్ష వ్యవధి రెండు గంటలు.
నేషనల్ ఒలింపియాడ్స్ విభిన్నంగా...
మొదటి దశ దాటిన వారికి రెండో దశలో.. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఆస్ట్రానమీల్లో నిర్వహించే నేషనల్ ఒలింపియాడ్స్ పరీక్ష కొంత భిన్నంగా ఉంటుంది.
ఫిజిక్స్: ఆరు ప్రాబ్లమ్స్ ఇచ్చి పరిష్కరించమని అడుగుతారు. గరిష్టంగా 75 మార్కులకు పూర్తిగా డిస్క్రిప్టివ్ విధానంలోనే ఉంటుంది. ప్రతి ప్రశ్నకు క్లిష్టత స్థాయి ఆధారంగా మార్కులు నిర్ణయిస్తారు. అభ్యర్థుల్లోని ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, అప్లికేషన్ ఓరియెంటేషన్, క్రిటికల్ థింకింగ్ వంటి నైపుణ్యాలను పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉంటాయి.
కెమిస్ట్రీలో: ఇందులో అయిదు ప్రశ్నలు అడుగుతారు. గరిష్ట మార్కుల విధానం ఏటా వేర్వేరుగా ఉంటుంది. ఉదాహరణకు 2017లో 113 మార్కులకు నిర్వహించగా.. 2016లో 102 మార్కులకు నిర్వహించారు.
బయాలజీ: బయాలజీకి సంబంధించి రెండో దశ పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో రెండు విభాగాలుగా(సెక్షన్-ఎ, బి)గా ఉంటుంది. పరీక్ష వ్యవధి రెండు గంటలు. పాయింట్ల విధానంలో మూల్యాంకనం జరుగుతుంది. ఉదాహరణకు 2016లో సెక్షన్-ఎలో 29 ప్రశ్నలకు 29 పాయింట్లు; సెక్షన్-బిలో 29 ప్రశ్నలకు 71 పాయింట్లు కేటాయించారు. అదే విధంగా 2017లో సెక్షన్-ఎలో 21 ప్రశ్నలకు 21 పాయింట్లు; సెక్షన్-బిలో 32 ప్రశ్నలకు 79 పాయింట్లు కేటాయించారు.
ఆస్ట్రానమీ: ఈ పరీక్ష (ఒలింపియాడ్)కు సంబంధించి 2018-19 సంవత్సరానికిగాను విద్యార్థులను రెండు రకాలుగా (గ్రూప్-ఎ, గ్రూప్-బి) వర్గీకరించారు. ఈ ప్రక్రియను నేషనల్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్‌లో ప్రతిభ ఆధారంగా చేపడతారు. గ్రూప్-ఎ పరిధిలో 2018, నవంబర్ 30 నాటికి ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం; గ్రూప్-బి పరిధిలో 2018, నవంబర్ 30 నాటికి ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం లేదా ఆ లోపు తరగతులు చదువుతున్న విద్యార్థులు ఉంటారు. ఎన్‌ఎస్‌ఈలో పొందిన మార్కుల ఆధారంగా తర్వాత దశలో నిర్వహించే ఇండియన్ నేషనల్ ఒలింపియాడ్‌లో ప్రతి గ్రూప్ నుంచి 250 మందికి అవకాశం ఇస్తారు. ప్రశ్నల తీరుతెన్నులు ఎన్‌ఎస్‌ఈ మాదిరిగానే ఉంటాయని పేర్కొన్నారు.
జూనియర్ సైన్స్ ఒలింపియాడ్ :
జూనియర్ సైన్స్ ఒలింపియాడ్‌లోనూ మొదటగా విద్యార్థులు నేషనల్ స్టాండర్డ్ ఎగ్జామ్ జూనియర్ సైన్స్ రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్ష 80 ప్రశ్నలతో 240 మార్కులకు నిర్వహిస్తారు. లభించే సమయం రెండు గంటలు. ఈ పరీక్షలో టాప్-300 అభ్యర్థులను ఇండియన్ జూనియర్ సైన్స్ ఒలింపియాడ్ పరీక్షకు ఎంపిక చేస్తారు. అందులో ప్రతిభచూపిన 30 మంది అభ్యర్థులకు.. హోమీబాబా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ఓరియెంటేషన్ కమ్ సెలక్షన్ క్యాంప్ నిర్వహిస్తారు. ఈ శిక్షణలో టాప్-5లో నిలిచిన విద్యార్థులను ఇంటర్నేషనల్ జూనియర్ సైన్స్ ఒలింపియాడ్‌కు ఎంపిక చేస్తారు.
ఇంటర్నేషనల్ ఒలింపియాడ్స్.. ఎంతో క్లిష్టం సైన్స్ ఇంటర్నేషనల్ ఒలింపియాడ్స్‌లో విజేతలను నిర్ణయించే ప్రక్రియ చాలా క్లిష్టంగా ఉంటుంది. నాలుగైదు గంటల వ్యవధిలో అభ్యర్థులకు థియరీ, ప్రాక్టికల్ ఆధారిత సమస్యలు ఇస్తారు. వీటిని నిర్ణీత సమయంలో పరిష్కరించిన వారే విజేతలుగా నిలుస్తారు.
సైన్స్ ఒలింపియాడ్స్ 2018-19 సమాచారం :
అభ్యర్థుల నమోదు ప్రక్రియ: 2018, ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 15 వరకు.
ఫీజు చెల్లింపు చివరి తేదీ: సెప్టెంబర్ 19, 2018.
పరీక్ష తేదీ: నవంబర్ 25, 2018.
నేషనల్ ఒలింపియాడ్‌కు ఎంపికైన అభ్యర్థుల జాబితా: జనవరి 2, 2019.
వివరాలకు వెబ్‌సైట్: www.iapt.org.in
పూర్తి వివరాలకు వెబ్‌సైట్:
https://olympiads.hbcse.tifr.res.in/
సైన్స్ ఒలింపియాడ్‌కు దరఖాస్తు చేసుకునేందుకు వెబ్‌సైట్:
https://olympiads.hbcse.tifr.res.in/how-to-participate/enrollment/science-olympiad/
Published date : 04 Sep 2018 05:02PM