విదేశాల్లో యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు.. చదవాలనుకునేవారి కోసం ఈ టెస్ట్..
ఈ పరీక్ష రెండు విభాగాల్లో జరుగుతుంది. అవి.. ఎవిడెన్స్ బేస్డ్ రీడింగ్ అండ్ రైటింగ్; మ్యాథమెటిక్స్. రీడింగ్ విభాగం నుంచి 52ప్రశ్నలు; రైటింగ్‌కు సంబంధించి 44ప్రశ్నలు; మ్యాథమెటిక్స్ నుంచి 58ప్రశ్నలుంటాయి. పరీక్షకు లభించే సమయం మూడు గంటలు. స్కోరింగ్ .. మొత్తం రెండు విభాగాలకు కలిపి 1600 పాయింట్లను గరిష్ట స్కోర్‌గా పేర్కొన్నారు. ఇందులో 800 పాయింట్లు మ్యాథమెటిక్స్‌కే కేటాయించడం గమనార్హం.
శాట్.. సబ్జెక్ట్ టెస్ట్‌లు కూడా: శాట్‌కు సంబంధించి సబ్జెక్ట్ టెస్ట్‌లు కూడా ఉంటాయి. అభ్యర్థులు తాము బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో చేరాలనుకుంటున్న కోర్సుకు అనుగుణంగా సబ్జెక్ట్ టెస్ట్‌కు హాజరవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ సబ్జెక్ట్ టెస్ట్‌లు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, సైన్స్, బయాలజీ తదితర 21 సబ్జెక్ట్‌లలో నిర్వహిస్తున్నారు. ప్రతి సబ్జెక్ట్ టెస్ట్‌కు గరిష్ట స్కోరింగ్ 800 పాయింట్లు.
రిజిస్ట్రేషన్: శాట్ పరీక్ష ప్రతి ఏటా ఏడుసార్లు జరుగుతుంది. అభ్యర్థులు పరీక్షకు హాజరు పరంగా పరిమితి లేదు. స్కోరు గుర్తింపు కాల పరిమితి అయిదేళ్లు ఉంటుంది.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.sat.collegeboard.org
ఇంకా చదవండి: part 4: విదేశాల్లో యూజీ కోర్సులు చదివేందుకు మరో మార్గం ఏసీటీ.. తెలుసుకోండిలా..