Skip to main content

విదేశాల్లో మెడిసిన్ చేసి స్వదేశంలో ప్రాక్టీస్ చేయాలనుకునే వారు సాధించాల్సిన ఎఫ్‌ఎంజీఈ పరీక్ష విధానం తెలుసుకోండిలా..!

మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ (ఎన్‌బీఈ) ఏటా రెండుసార్లు(జూన్/ డిసెంబర్‌ల్లో) ఎఫ్‌ఎంజీఈ స్క్రీనింగ్ టెస్ట్‌ను నిర్వహిస్తుంది.
ఎఫ్‌ఎంజీఈ-2020 డిసెంబర్ సెషన్‌కు నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో.. (ఎఫ్‌ఎంజీఈ) పరీక్ష విధానంఇలాసమగ్ర సమాచారం...

పరీక్షా విధానం..
  • కంప్యూటర్ ఆధారితంగా నిర్వహించే ఈ పరీక్ష.. రెండు పార్ట్ (పార్ట్-1, పార్ట్- 2)లుగా 300 మార్కులకు ఇంగ్లిష్‌లో మాత్రమే ఉంటుంది. ప్రతి పార్ట్ 150 ప్రశ్నలు-150 మార్కులకు జరుగుతుంది.
  • ఈ పరీక్షలో అర్హత సాధించాలంటే.. మొత్తం 300 మార్కులకుగాను కనీసం 150 మార్కులు సాధించాల్సి ఉంటుంది. నెగెటివ్ మార్కులు ఉండవు. ఒక్కో సెక్షన్‌కు రెండున్నర గంటల సమయం కేటాయిస్తారు.
సిలబస్, మార్కులు..
  • పీ అండ్ పారా క్లినికల్ సబ్జెక్ట్‌లకు సంబంధించి 100 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు. ఇందులో అనాటమీ-17, ఫిజియాలజీ-17, బయో కెమిస్ట్రీ-17, పాథాలజీ-13, మైక్రోబయాలజీ-13, ఫార్మకాలజీ- 13, ఫోరెన్సిక్, మెడిసిన్-10 మార్కులకు ప్రశ్నలు ఎదురవుతాయి.
  • క్లినికల్ సబ్జెక్టులకు సంబంధించి మొత్తం 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. అవి.. మెడిసిన్ అలైడ్ సబ్జెక్ట్స్‌లో.. మెడిసిన్-33, సైకియాట్రీ-5, డెర్మటాలజీ-5, రెడియోథెరపి-5 మార్కులకు ఉంటాయి.
  • జనరల్ సర్జరీ అలైడ్ సబ్జెక్ట్స్‌లో.. జనరల్ సర్జరీ-32, అనెస్తేషియా లజీ-5, ఆర్థోపెడిక్స్-5, రేడియో డయాగ్నోసిస్-5, పెడియా ట్రిక్స్-15, ఆప్తమాలజీ-15, ఓటోలారింగాలజీ- 15, ఆబ్సెటట్రిక్స్, గైనకాలజీ-30, కమ్యూనిటీ మెడిసిన్-30 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు.
ఇంకా తెలుసుకోండి: part 3: విదేశాల్లో మెడిసిన్ చేసి స్వదేశంలో ప్రాక్టీస్ చేసేందుకు ఉపయోగపడే ఎఫ్‌ఎంజీఈ.. ప్రిపేరేష‌న్ ఏలాగో తెలుసుకోండి..!
Published date : 16 Oct 2020 01:10PM

Photo Stories